ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాశారు. ప్రకాశం జిల్లా ఓడరేవులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రపంచస్థాయి సౌకర్యాలున్న పోర్టు ఏర్పాటు చేద్దామని లేఖలో సూచించారు. దీని కోసం ఎస్పీవీని ఏర్పాటు చేయాలని గడ్కరీ కోరారు. రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు వస్తే అన్ని అనుమతులు తీసుకోవచ్చని సూచన చేశారు. ఓడరేవులో పోర్టు ఏర్పాటుకు సౌకర్యాలు అనువుగా ఉన్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుంటే బాగుంటుందని సూచించారు. అయితే ప్రభుత్వ వర్గాలు, అధికార తెలుగు దేశం పార్టీ మాత్రం, ఈ లేఖ పై భగ్గు మంటుంది..
విభజన చట్టంలో ఉన్న నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో పోర్టు కుదరదు అని ఇప్పటికే కేంద్రం చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి అన్ని రకాల ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఈ తరుణంలో ఓడరేవులో పోర్టు ఏర్పాటుకు కేంద్రం నుంచి వచ్చిన లేఖను ప్రభుత్వ వర్గాలు పరిశీలిస్తున్నాయి. ఓడరేవులో పెట్టటానికి మాకు ఇబ్బంది లేదని, ఇక్కడ ప్రధాన సమస్య అక్కడ భూములే అని ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే, ఇక్కడ భూమిలో అన్నీ మన ప్రతిపక్ష నేత కబంధ హస్తాలలో ఉన్నాయి. వాన్పిక్ ప్రాజెక్టుకు వైఎస్ ప్రభుత్వం అక్కడున్న ప్రభుత్వ భూమి సుమారు అయిదు వేల ఎకరాలకు పైగా, అలాగే ప్రైవేటు భూమి 1,825 ఎకరాల భూమిని అప్పగించింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఈ ప్రాజెక్టుకు చేసిన భూకేటాయింపు కూడా ఉంది.
ఆ భూములు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పరిధిలో ఉన్నాయి. గడ్కరీ ప్రతిపాదిస్తున్న నౌకాశ్రయానికి భూమి ఇవ్వాలంటే.. దీన్నుంచే కేటాయించాలి. ఈడీ పరిధిలోనున్న భూమిని ఇప్పటికిప్పుడు కేటాయించటం సాధ్యం కాకపోవచ్చని ఉన్నతాధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. విభజన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయ్యాక... ఆ భూముల స్వాధీనానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. కానీ... కేసుల నేపథ్యంలో అది కుదరలేదు. మొత్తానికి... ఎప్పుడో ముగిసిందనుకున్న ‘వాడరేవు’ కథ గడ్కరీ ప్రకటనతో మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే.. పోర్టు ఏర్పాటు కోసం ఎలాంటి వివాదంలేని భూములు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నొక్కి మరీ చెప్తున్న గడ్కరీకి, అక్కడ జగన్ అక్రమాస్తుల కేసులో ఈ భూమి అంతా ఉందని తెలిసే ఇలా ప్రకటన చేసారా, లేక అక్కడ భూములు జగన్ ముఠాకు ఉన్నాయి కాబట్టి, వాళ్లకి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారా, అనే అనుమానాలు కలుగుతున్నాయి. అలాంటప్పుడు, కేంద్ర ప్రభుత్వం, జగన్ అక్రమాస్తుల కేసుని ఒక కొలిక్కి తెస్తే, 3 వేల ఎకరాలు ఏమి ఖర్మ, 30 వేల ఎకరాలు ఇస్తామని అధికార పక్షం అంటుంది.