చైనా ప‌ర్య‌ట‌న‌కు లోకేష్‌ని ఎవ‌రూ పిల‌వ‌లేద‌ని, రూ.30 కోట్లు ఖ‌ర్చు పెట్టి స్లాట్‌ కొనుక్కున్నాడు అంటున్న క‌న్నా..! ఈ విష‌యాలు ఒక్క‌సారి ప‌రిశీలించు. అప్పుడు తేల్చుకో అజ్ఞాని ఎవ‌రో నీ``క‌న్నా``? తేదీ 06-06-2018న వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం మంత్రి నారా లోకేష్ కి పంపిన ఆహ్వానం ఇది. దీని సారాంశం ఏంటంటే! పెద్ద‌లు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ గారూ! వ‌రల్డ్ ఎక‌నామిక్ ఫోరం ఆధ్వ‌ర్యంలో న్యూ చాంపియ‌న్స్ 12వ వార్షిక స‌మావేశాలు చైనాలోని టియాంజిన్‌లో సెప్టెంబ‌ర్ 18,19,20 తేదీల‌లో జ‌ర‌ప‌త‌ల‌పెట్టామ‌ని దీని సారాంశం. చైనా ప్ర‌భుత్వం, చైనా నేష‌న‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ రిఫార్మ్ క‌మిష‌న్ స‌హ‌కారంతో జ‌ర‌గ‌నున్న ఈ స‌మావేశాలలో నాలుగో పారిశ్రామిక విప్ల‌వానికి సంబంధించిన కీల‌క‌మైన చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టాన్ని ఐటీ, ఎల‌క్ర్టానిక్స్ రంగాల అభివృద్ధిలో ప‌రుగులు పెట్టిస్తున్న మీ ఆలోచ‌న‌లు పంచుకునేందుకు స‌మావేశాల‌కు రావాల‌ని ఆహ్వానించారు.

lokesh 25092018 1

ప్ర‌పంచ‌వ్యాప్తంగా, 2000 మంది వివిధ‌రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతార‌ని పేర్కొన్నారు. ఇదండి క‌న్నాగారు వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం ఆహ్వానంలోని సారాంశం. మీకు ఇంగ్లీష్ స‌మ‌స్య ఉంద‌ని తెలిసి అనువ‌దించి ఇచ్చాం. ఇందులోనూ త‌ప్పుగా మేం అనువ‌దించామ‌ని మీరు అనుకుంటే మీ కేంద్రానికి పంపించి చెక్ చేయండి. అనువాదం స‌రిపోయిందా? వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం ఇన్విటేష‌న్ యేనా? అనేవి కూడా నిర్ధారించుకోండి. ఆహ్వానం రాలేదు..స్లాట్ కొనుక్కున్నార‌నే విష‌యంపై ఇప్ప‌టికే మీకో క్లారిటీ వ‌చ్చింద‌నుకుంటా! రూ.30 కోట్లు వృథా చేశారంటున్నారు క‌దా! వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం వేదిక‌గా నారా లోకేష్ చేసిన ప్ర‌సంగం..ఓ సారి వినండి. అయ్యో సారీ అండి. మీకు ఇంగ్లీష్ స‌మ‌స్య క‌దా! ఇది కూడా తెలుగులో పారాడ‌బ్ చేయించి పంపుతున్నాం చ‌దువుకోండి..

lokesh 25092018 1

వరల్డ్ ఎకనామిక్ ఫోరం మూడో రోజు మంత్రి నారా లోకేష్ ఎమర్జింగ్ టెక్నాలజిస్,నాలుగోవ పారిశ్రామిక విప్లవం, తదితర అంశాలపై జరిగిన సమావేశాల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి,అమలు చేస్తున్న టెక్నాలజీ,టెక్నాలజీ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడం వంటి అంశాలను ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా మంత్రి నారా లోకేష్ వివరించారు. దాదాపు వంద ప్ర‌ముఖ ఎల‌క్ర్టానిక్స్ త‌యారీ, ఐటీ సేవ‌లు అందిస్తున్న కంపెనీల ప్ర‌తినిధుల‌తో లోకేష్ భేటీ అయ్యారు. తిరుప‌తిలో టీసీఎల్ కంపెనీ వెయ్యి కోట్ల‌కు పైగా పెట్టుబ‌డి పెట్టి సంస్థ కార్య‌క‌లాపాలు ప్రారంభించ‌నుంది. అస్ర్త‌మ్‌తోపాటు మ‌రో 3 కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఎల‌క్ర్టానిక్స్ త‌యారీలో రారాజుల్లాంటి సంస్థ‌లు ఏపీకొచ్చేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేశాయి. రియ‌ల్‌టైమ్ గ‌వ‌ర్నెన్స్‌కు హువావే స‌హ‌కారం అందించేందుకు ఒప్పించారు. ఆహ్వానం డౌట్‌, రూ.30 కోట్ల లెక్క అన్నీ తీరిపోయాయా?

lokesh 25092018 1

నిన్న జీవీఎల్‌..నేడు మీరు..మీ అజ్ఞానాన్ని బ‌య‌ట‌పెట్టుకుని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రువు తీస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఐక్య‌రాజ్య‌స‌మితిలోనూ, ఏపీ మంత్రి నారా లోకేష్ వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం వేదిక‌పైనా ప్ర‌సంగించ‌డం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ద‌క్కిన అరుదైన గౌర‌వం. ప్ర‌శంసించాల్సిన త‌రుణంలో ఏపీపై అక్క‌సును ఇలా అవాస్త‌వాల‌తో వెళ్ల‌గ‌క్క‌డం న్యాయ‌మేనా? కేంద్రం నిధులిస్తోంద‌ని అంటున్నారు. ఏం ఏం నిధులిస్తోంద‌య్యా? వెన‌క‌బ‌డిన జిల్లాల‌ల‌కు ఇచ్చిన నిధులు వెన‌క్కి తీసుకున్న సంగ‌తా? ఉపాధి హామీ నిధుల‌కు అడ్డంకులు సృష్టిస్తూ ఆపేసిన విష‌య‌మా? ప్ర‌త్యేక హోదా ఎత్తేసిన కేంద్ర‌మేనా నిధులు ఇస్తోంది? చ‌ట్టంలో ఉన్న రైల్వేజోన్ పై మాట తిర‌గేసిన కేంద్ర‌మేనా మీరు చెబుతున్న నిధులిస్తోంది? అయ్యా మీరు చెబుతున్న కేంద్రం నిధులు ఎప్పుడు ఇచ్చింది? ఎంత ఇచ్చిందో ఒక్క‌సారి లెక్క‌లు చెప్పండ‌య్యా? ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తీర‌ని అన్యాయం చేసిన కేంద్రాన్ని..ఒక ఏపీ వాసిగా, ఏపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడిగా ఖండించాల్సింది పోయి..కేంద్రం ఆడించిన‌ట్టు ఆడుతూ స్వ‌రాష్ర్టానికే ద్రోహం చేస్తున్న మీరు..

lokesh 25092018 1

దార్శ‌నికుడు, ప్ర‌గ‌తికార‌కుడు అయిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఐటీలో జీరో నుంచి హీరో స్థాయికి ఏపీని చేర్చిన యువ‌నాయ‌కుడు లోకేష్‌ని విమ‌ర్శించేది? ప్ర‌తీసారి కేంద్రం నిధులిచ్చిందీ అంటున్నారు. కేంద్రంలోని మీ మంత్రులేమో అన్ని రాష్ర్టాల‌తోపాటు వ‌చ్చే వాటాగానూ, చ‌ట్ట‌ప‌రంగానే నిధులిస్తున్నాం అని చెబుతున్నారు. మ‌రి ప‌న్నులు రూపంలో ఆదాయం తీసుకుంటున్న కేంద్రం రాష్ర్టాల‌కు నిధులు ఇవ్వ‌డం విత‌ర‌ణా? విరాళ‌మా? ఒక సీనియ‌ర్ నాయ‌కుడిగా, చాలా పార్టీలు మారిన నేత‌గా మీ అనుభ‌వంతో మాట్లాడి చెప్పండి.. ఒక చైనా ప‌ర్య‌ట‌న‌కు వృథాగా రూ.30 కోట్లు ఖ‌ర్చు చేశారా? లెక్క‌లు ఇవ్వండి. వారంరోజులు తిండీ, నిద్రాలేకుండా ప్ర‌ముఖ కంపెనీల సీఈవోల‌తో భేటీలు, చ‌ర్చ‌లు..తిర‌గ‌ని ప‌రిశ్ర‌మ లేదు. వేల కోట్ల పెట్టుబ‌డుల‌తో వ‌చ్చేందుకు కంపెనీల‌ను ఒప్పించిన యువ‌చాతుర్యం, దార్శ‌నిక‌త‌ని విమ‌ర్శించ‌డానికి కొత్త స‌ల‌హాదారుల‌ను పెట్టుకోండి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై క‌క్ష‌తో వ్య‌వ‌హ‌రించ‌డం మానండి. మీ పాత‌కాల‌పు కుయుక్త‌, కుట్ర‌పూరిత‌, నేర‌పూరిత అవాస్త‌వ పంథాను వీడండి.

అమరావతి పరిధిలోని రాయపూడి సమీపంలో అఖిల భారత సర్వీసు అధికారుల కోసం నిర్మిస్తున్న నివాస భవనాల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దీనిలోభాగంగా తొలివిడతలో ఓ పన్నెండు అంతస్తుల భవనాన్ని 85 రోజుల్లోనే పూర్తిచేశారు. మలేసియాలో ప్రాచుర్యం పొందిన ‘షీర్‌వాల్‌’ సాంకేతిక పరిజ్ఞానాన్ని దీని నిర్మాణంలో వినియోగించారు. సిమెంట్‌, కంకర మిశ్రమాన్ని ఉపయోగించి.. శ్లాబ్‌తో పాటు సంబంధిత గోడలను కూడా ఒకేసారి పూర్తిచేయడం ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రత్యేకత. ఒక్కో అంతస్తులో నాలుగు పడకగదులతో కూడిన రెండు ఫ్లాట్లు చొప్పున.. 12 అంతస్తుల్లో కలిపి మొత్తం 24 ఫ్లాట్లు నిర్మించారు. 

amaravati 25092018 2

పూర్తిగా సిద్ధమైన ఈ భవనంలో.. అలంకరణ తదితర పనులనూ సాధ్యమైనంత త్వరలోనే పూర్తిచేసి ప్రభుత్వానికి అందజేయాలని గుత్తేదారు సంస్థ భావిస్తోంది. మరో పక్క, రాజధానిలోని నేలపాడు వద్ద నిర్మాణంలో ఉన్న జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌ను రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ పరిశీలించారు. సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఈ కాంప్లెక్స్‌ వివరాలను, పనుల ప్రణాళికను ఆయనకు వివరించారు. ఇందులోని 6 భాగాలకుగాను ఒక భాగానికి సంబంధించిన మొదటి శ్లాబ్‌ పూర్తయిందని, మరో భాగపు శ్లాబ్‌ పనులకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.

amaravati 25092018 3

మిగిలిన 4 భాగాలకు సంబంధించిన కాలమ్స్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఈ ఏడాది డిసెంబర్‌ 15వ తేదీకల్లా అన్ని పనులు పూర్తి చేసి, హైకోర్టు నిర్వహణకు వీలుగా ఈ కాంప్లెక్స్‌ను సిద్ధం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం శ్రీనివాస్‌ రాయపూడి వద్ద నిర్మాణంలో ఉన్న ఏఐఎస్‌ అధికారుల నివాసాలను కూడా చూశారు. అక్కడి నమూనా ఫ్లాట్‌ను సందర్శించారు. ఈ పర్యటనలో సీఆర్డీయే సీఈ ఎం.జక్రయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఎంపీ కేశినేని నాని నివాసంలో ఏపీ ఎంపీలు మంగళవారం సమావేశమయ్యారు. ఎంపీలు మురళీమోహన్‌, అవంతి శ్రీనివాస్‌, మాగంటి బాబు, కనకమేడల, నిమ్మల కిష్టప్ప, బుట్టా రేణుక సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా జీఎం సమావేశంలో ఏపీ రైల్వేజోన్‌పై రైల్వే అధికారులను నిలదీయాలని ఎంపీలు నిర్ణయించారు. చట్టంలో ఉన్న రైల్వే జోన్‌ను ఎందుకు అమలుచేయరని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల ప్రతిపాదనలు రైల్వే జీఎంకు ఇవ్వాలని ఎంపీలు నిర్ణయించారు. ఆ తర్వాత జోన్‌పై రైల్వే అధికారులను ఎంపీలు నిలదీయనున్నారు.

kesineni 25092018 2

జోన్‌పై సంతృప్తికర సమాధానం రాకపోతే రైల్వే జీఎంతో సమావేశాన్ని బహిష్కరిస్తామని టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. గతంలో అనేక సార్లు మేము ఇచ్చిన ప్రతిపాదనలను కూడా పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని కక్ష సాధిస్తున్నారని ఎంపీలు ఆరోపించారు. వీరికి మద్దతుగా, తెలుగుదేశం పార్టీ శ్రేణుల నిరశన కార్యక్రమం చేపట్టాయి. దక్షిణ మధ్య రైల్వే సమస్యలు మరియు కొత్త ప్రాజెక్టుల ఫై జనరల్ మేనేజర్ ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యుల సమావేశం ఎలక్ట్రికల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్, బి.ఆర్.టి.ఎస్. రోడ్, సత్యనారాయణపురంలో జరుగుతుంది.

kesineni 25092018 3

దీంతో ఇక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. కేంద్రం నుంచి వచ్చిన రైల్వే అధికారులకి తీవ్ర నిరసన తెలియచేయటానికి తెలుగుదేశం ఎంపీలు కూడా సిద్ధమయ్యారు. సమావేశం ప్రారంభం అయిన కొద్ది సేపటికే, రైల్వే జనరల్ మేనేజర్ తో పార్లమెంటు సభ్యుల సమావేశం రసాభాస అయ్యింది. నాలుగేళ్ల నుంచి, ఎదో పెట్టాలని సమావేశం పెట్టటం, ఒక్క ప్రతిపాదన కూడా కేంద్రం ఆమోదం చెయ్యకపోవటం, కీలకమైన రైల్వే జోన్ పక్కన పడేయటం వంటి వాటి పై, ఎంపీలు నిలదియ్యటంతో, రైల్వే అధికారులు చేతులు ఎత్తేసారు. స్పష్టమైన సమాధానం రాకపోవటంతో, రైల్వే బోర్డు సమావేశం హాలు బయట, తెలుగుదేశం పార్టీ యంపీల నిరసన తెలుపుతున్నారు.

నిన్నటి నుంచి జగన్ పాదయత్ర చేస్తున్న క్యాంప్ లో ఒకటే టెన్షన్.. దానికి కారణం, తన వెనుక ఉన్న 11 సిబిఐ, 5 ఈడీ కేసులు... అన్నిట్లో ఒకరు A1, మరొకరు A 2.. కేవలం కండీషన్ బెయిల్ పైనే బయట తిరుగుతున్నారు. ఇవన్నీ తెలిసినవే కదా టెన్షన్ ఎందుకు అంటారా... ఇలాంటి ఆర్దిక ఉగ్రవాదుల పై, ఈ రోజు సుప్రీం కోర్ట్ కీలక తీర్పు ఇవ్వనుంది అనే సమాచారంతో, జగన్ ముఠా అంతా అలెర్ట్ అయ్యింది. తీర్పు కనుక వ్యతిరేకంగా వస్తే, ఇక జగన్ కు రాజకీయ సమాధే. అందుకే టెన్షన్.. కాని, సుప్రీం కోర్ట్ మాత్రం, భిన్నమైన తీర్పు ఇవ్వటంతో, జగన్, విజయసాయి రెడ్డి ఊపిరి పీల్చుకున్నారు.

jagan 25092018 2

ఇక విషయానికి వస్తే, వచ్చే నెల 2న పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, కొద్దిసేపటి క్రితం కీలక కేసులో తీర్పును వెలువరించారు. నేరారోపణలు, ఆర్థిక నేరాభియోగాలు నమోదైన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించే అంశంలో తాము ఎటువంటి ఆదేశాలనూ ఇవ్వలేమని, అభ్యర్థుల అనర్హతపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోలేదని అన్నారు. నేతల అవినీతి జాతీయ ఆర్థిక ఉగ్రవాదమేనని అభిప్రాయపడ్డ ధర్మాసనం, ఈ విషయంలో పార్లమెంటులో కఠిన చట్టాలను తేవాల్సివుందని పేర్కొంది. రాజ్యాంగ సవరణ, కొత్త చట్టాలు తెస్తేనే, నేర చరితులను రాజకీయాలకు, ఎన్నికలకు దూరంగా పెట్టవచ్చని తెలిపింది. ఇదే సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరూ తమపై ఉన్న పెండింగ్ కేసులను తప్పనిసరిగా వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసింది.

jagan 25092018 3

క్రిమినల్‌ విచారణ ఎదుర్కొంటున్న చట్టసభ సభ్యులు.. అభియోగాల నమోదు దశ నుంచే ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులను చేయాలా అన్న ప్రశ్నను లేవదీస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 28న తన తీర్పును వాయిదా వేసింది. ప్రస్తుతం ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఒక క్రిమినల్‌ కేసులో దోషిగా తేలాకే సదరు చట్టసభ సభ్యుడిపై అనర్హత వేటు పడుతుంది. పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థతో పాటు భాజపా నేత అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ్‌లు ఈ పిటిషన్లను దాఖలు చేశారు.

Advertisements

Latest Articles

Most Read