ఎంపీ కేశినేని నాని నివాసంలో ఏపీ ఎంపీలు మంగళవారం సమావేశమయ్యారు. ఎంపీలు మురళీమోహన్, అవంతి శ్రీనివాస్, మాగంటి బాబు, కనకమేడల, నిమ్మల కిష్టప్ప, బుట్టా రేణుక సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా జీఎం సమావేశంలో ఏపీ రైల్వేజోన్‌పై రైల్వే అధికారులను నిలదీయాలని ఎంపీలు నిర్ణయించారు. చట్టంలో ఉన్న రైల్వే జోన్‌ను ఎందుకు అమలుచేయరని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల ప్రతిపాదనలు రైల్వే జీఎంకు ఇవ్వాలని ఎంపీలు నిర్ణయించారు. ఆ తర్వాత జోన్‌పై రైల్వే అధికారులను ఎంపీలు నిలదీయనున్నారు.
జోన్‌పై సంతృప్తికర సమాధానం రాకపోతే రైల్వే జీఎంతో సమావేశాన్ని బహిష్కరిస్తామని టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. గతంలో అనేక సార్లు మేము ఇచ్చిన ప్రతిపాదనలను కూడా పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని కక్ష సాధిస్తున్నారని ఎంపీలు ఆరోపించారు. వీరికి మద్దతుగా, తెలుగుదేశం పార్టీ శ్రేణుల నిరశన కార్యక్రమం చేపట్టాయి. దక్షిణ మధ్య రైల్వే సమస్యలు మరియు కొత్త ప్రాజెక్టుల ఫై జనరల్ మేనేజర్ ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యుల సమావేశం ఎలక్ట్రికల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్, బి.ఆర్.టి.ఎస్. రోడ్, సత్యనారాయణపురంలో జరుగుతుంది.
దీంతో ఇక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. కేంద్రం నుంచి వచ్చిన రైల్వే అధికారులకి తీవ్ర నిరసన తెలియచేయటానికి తెలుగుదేశం ఎంపీలు కూడా సిద్ధమయ్యారు. సమావేశం ప్రారంభం అయిన కొద్ది సేపటికే, రైల్వే జనరల్ మేనేజర్ తో పార్లమెంటు సభ్యుల సమావేశం రసాభాస అయ్యింది. నాలుగేళ్ల నుంచి, ఎదో పెట్టాలని సమావేశం పెట్టటం, ఒక్క ప్రతిపాదన కూడా కేంద్రం ఆమోదం చెయ్యకపోవటం, కీలకమైన రైల్వే జోన్ పక్కన పడేయటం వంటి వాటి పై, ఎంపీలు నిలదియ్యటంతో, రైల్వే అధికారులు చేతులు ఎత్తేసారు. స్పష్టమైన సమాధానం రాకపోవటంతో, రైల్వే బోర్డు సమావేశం హాలు బయట, తెలుగుదేశం పార్టీ యంపీల నిరసన తెలుపుతున్నారు.