రాష్ట్రంలో సముద్ర సంబంధిత పరిశోధన-అభివృద్ధి విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ రంగంలో అంతర్జాతీయంగా పేరొందిన ‘డోయెర్’ ముందుకొచ్చింది. రెండోరోజు తన అమెరికా పర్యటనలో భాగంగా తొలుత డోయెర్ (డీప్ ఓషన్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్) సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారి లిజ్ టేలర్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుదీర్ఘ కోస్తాతీరం గల ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై ఆమెతో కూలంకుశంగా చర్చించారు. సముద్ర సంబంధిత సాంకేతిక పరిశోధనలపై శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు శిక్షణ అందించడానికి ఆరంభంలో రూ.200 కోట్లు వెచ్చించడానికి సిద్దంగా వున్నట్టు డోయెర్ సీఈవో లిజ్ టేలర్ ప్రకటించారు. ఏపీని సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ముఖ్య స్థావరంగా తీర్చిదిద్దడానికి డోయెర్ సహకారిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి హామీఇచ్చారు.

doer 25092018 2

తూర్పుతీరంలో వ్యూహాత్మక వాణిజ్య స్థావరంగా వున్న ఆంధ్రప్రదేశ్‌లో తమ సంస్థ వ్యాపార, పరిశోధన కార్యకలపాలను ఆరంభించడానికి సంసిద్ధంగా వున్నట్టు తెలిపారు. ఏపీ నుంచి అనేక దేశీయ సంస్థలకు సముద్ర సంబంధిత సేవలను అందించడానికి ఆసక్తిని కనబరచారు. ఏపీలో 974 కిలోమీటర్ల మేర గల కోస్తాతీరంలో అపార వాణిజ్య, వ్యాపార, పరిశోధనలకు పుష్కలంగా అవకాశాలు వున్నాయని ముఖ్యమంత్రి తొలుత డోయెర్ సీఈవోకు వివరించారు. సముద్ర పరిశోధనా రంగంలో డోయెర్ అభివృద్ధి చేసిన శాస్త్ర సాంకేతికతను ఏపీకి అందించడం ద్వారా ఉభయులూ కలిసి అద్భుతాలు సృష్టించవచ్చునని అభిప్రాయపడ్డారు. దేశంలో సుదీర్ఘ తీరప్రాంతంగా వున్న ఏపీలో ప్రస్తుతం నౌకాశ్రయ అభివృద్ధి కార్యకలాపాలపై దృష్టి నిలిపామని చెప్పారు. ఏపీలో ఆక్వా రంగ అభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకోవడానికి వెంటనే ఒక బృందాన్ని పంపించాలని ముఖ్యమంత్రి సూచించారు.

doer 25092018 3

1992లో ప్రఖ్యాత ఓషనోగ్రాఫర్, సముద్ర జీవ శాస్త్రవేత్త డాక్టర్ సిల్వియా ఈరీ నెలకొల్పిన డోయెర్ సంస్థను ప్రస్తుతం ఆయన కుమార్తె లిజ్ టేలర్ కొనసాగిస్తున్నారు. మెరైన్ అభివృద్ధి, మార్కెట్, లీజు కార్యకలాపాలనే కాకుండా సబ్ సీ రోబోటిక్స్, సబ్ మెర్సిబుల్ సిస్టమ్‌ల లీజు, జలాంతర్గత వ్యవస్థల ఇంటిగ్రేషన్, డిజైన్ ఇంజనీరింగ్ సేవలను ఈ సంస్థ అందిస్తోంది. సముద్ర పరిశోధనకు ఉపకరించేందుకు రిమోట్ ద్వారా నిర్వహించే ప్రత్యేక వాహనాలను డోయెర్ నిర్మించి నిర్వహిస్తుంది. సముద్రం లోపల పరిశోధన, పైప్‌లైన్ పనుల తనిఖీలను జరపడానికి ఈ ప్రత్యేక వాహనాలు దోహదపడతాయి. ‘డోయెర్’తో భాగస్వామ్యం ఏపీలో చిన్నతరహా ఓడరేవుల ఆధునీకరణ, అభివృద్ధికి ఎంతగానో ప్రయోజనకారిగా వుంటుందని అధికారులు చెబుతున్నారు. సముద్ర తీరంలో మౌలిక సదుపాయాల కల్పనకు, ఓడరేవు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఉపకరిస్తుందని అంటున్నారు. జాతీయస్థాయిలో ఏర్పాటు చేయనున్న మొత్తం 1095 కిలోమీటర్ల జలరవాణా అభివృద్ధిలో 895 కిలోమీటర్ల మేర ఏపీలోనే వుండటం విశేషం. రానున్న కాలంలో సరకు రవాణాకు ఈ జల రవాణా మార్గాలే కీలకం కానున్నాయి. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంతో జలరవాణా పరిధి మరింత విస్తృతం అయినట్టుగా ప్రభుత్వం భావిస్తోంది.

జీరో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త ఒరవడి సృష్టిస్తుందని ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఐ సి ఆర్ ఏ ఎఫ్ కి చెందిన ప్రపంచ అగ్రోఫారెస్ట్రీ సెంటర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టోనీ సైమెన్స్ ప్రశంసించారు. ఆయనతో పటు ఆ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రవి ప్రభు న్యూయార్క్ లో ముఖ్యమంత్రి తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ముప్ఫయి దేశాల్లో వ్యవసాయ-అటవీ రంగంలో పరిశోధనలు, అభివృద్ధి చేస్తున్న తమ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సేంద్రీయ సేద్యాన్ని ఆసక్తికరంగా పరిగణిస్తుందని డాక్టర్ టోనీ సైమెన్స్ అన్నారు. అభివృద్ధిలోనే పరిశోధన ఉంటుందని.. ముఖ్యమంత్రి ఆలోచన విధానంలో అది స్పష్టంగా కనిపిస్తోందని ఐ సి ఆర్ ఏ ఎఫ్ అధిపతులు అభిప్రాయపడ్డారు.

cbn 250920108

ఆంధ్రప్రదేశ్ లో కూడా తమ పరిశోధనలు చేయడానికి ఆసక్తిని వారు వ్యక్తం చేసారు. క్షేత్ర స్థాయిలో సవివరమైన, లోతైన వాస్తవ లెక్కలను, వివరాలను ఏపీ లో సంగ్రహించాలని వారు అన్నారు. దీని ఆధారంగా మరింత లోతైన పరిశోధనలు నిర్వహించి ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయవచ్చని ఐ సి ఆర్ ఏ ఎఫ్ అభిప్రాయపడింది. రైతులకు ఇచ్చే శిక్షణ కూడా దీనిలో కీలకమని, ఆ దిశగా ముఖ్యమంత్రి ఆలోచన విధానం సాగడం ఆహ్వానించదగ్గదని ఆ సంస్థ ప్రతినిధులు అన్నారు. పరిశోధన, పరిజ్ఞానాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకుని ప్రకృతి సేద్యాన్ని పెద్ద ఎత్తున చేపట్టే ఆంధ్రప్రదేశ్ ప్రయత్నంలో తాము భాగస్వామ్యం అవ్వడానికి సిద్దమే అని అగ్రోఫారెస్ట్రీ డీజీ ఆసక్తి వ్యక్తం చేసారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఒక గ్లోబల్ సెంటర్ ఏర్పాటైన ఆశ్చర్య పడనవసరం లేదనితెలిపారు.

cbn 250920108

మరో పక్క, ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున రిసార్టులను ఏర్పాటు చేయడానికి ప్రతిష్టాత్మకమైన వి-రిసార్ట్ సంస్థ ముందుకొచ్చింది. ఆ సంస్థ సీఈవో అదితి బల్బీర్, మాసివ్ ఎర్త్ ఫండ్ సీఈవో శైలేష్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ప్రకృతి వ్యవసాయం ప్రతిబించేలా ఈ రిసార్టులను వినూత్న రీతిలో ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యాన్ని ప్రొత్సహిస్తున్న ప్రస్తుత తరుణంలో అందుకు తగ్గ రిసార్టులను కూడా అభివృద్ధి చేయవచ్చని ముఖ్యమంత్రి వి-రిసార్ట్ సంస్థకు సూచించారు. ఈ రిసార్టులలో వెల్ నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ విధానంలో రిసార్టులను ఏర్పాటు చేసి, వాటిని విజయవంతంగా నిర్వహించడానికి శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించాలని సమావేశంలో చర్చించారు.

ఒక పక్క రాఫెల్ కుంబకోణం పై, దేశం దద్దరిల్లిపోతుంది. కొన్ని వేల కోట్ల రూపాయల స్కాంతో, బీజేపీ అడ్డంగా, నిలువుగా కూడా దొరికిపోయి, దేశ ప్రజల ముందు దోషిగా నిలబడింది. ఇలాంటి దాని పై దేశానికి సమాధానం చెప్పే వాడు బీజేపీలో ఒక్కరు కూడా లేరు. అదేమంటే, హిందుత్వ వాదం తీసుకువస్తారు, రాహుల్ గాంధీ పాకిస్తాన్ తో కలిసి కుట్ర పన్నుతున్నాడు అంటారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎలాంటిదో ఈ దేశానికి అనవసరం. నువ్వు చేసిన స్కాం పై వివరణ ఇవ్వండి అంటే, ఒక్కరు కూడా అడ్రెస్స్ ఉండరు. ఇలాంటి వాళ్ళలో బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా ఒకరు.

gvl 24092018 3

ఆయన జాతీయ స్థాయిలో స్పోక్స్ పర్సన్. అక్కడ ఉంటే ఢిల్లీ మీడియా వెంట పడుతుంది అని, అమిత్ షా కొన్ని రోజులు అమరావతి పోయి, చంద్రబాబు పై విషం చిమ్మమని చెప్పారో ఏమో కాని, రెండు రోజుల నుంచి ఒకటే నస. చంద్రబాబుకి ఐక్యరాజ్య సమితి నుంచి వచ్చిన ఆహ్వానం చూసిన తరువాత, పాపం ఈ ఆపరేషన్ గారుడ బ్యాచ్ అంతా, కడుపు మంటతో ఇబ్బంది పడుతున్నారు. మొన్నటికి మొన్న జీవీఎల్ మాట్లాడుతూ, చంద్రబాబు చెప్పేది అంతా అబద్ధం, సొంత పనులు మీద అమెరికా వెళ్తున్నారు, మీకు దమ్ము ఉంటే చంద్రబాబుకి వచ్చిన ఇన్విటేషన్ చూపించండి అని విమర్శ చేసారు.

gvl 24092018 2

దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం, అరగంటలో, చంద్రబాబుకి ఐక్యరాజ్య సమితి ఇచ్చిన ఇన్విటేషన్ చూపించింది. అప్పటి నుంచి రెండు రోజుల పాటు అడ్రస్ లేని జీవీఎల్ ఈ రోజు మరో వింత వాదనతో, వెటకారంగా ట్వీట్ చేసారు. "ఇంతకూ మన గ్లోబల్ లీడర్ ఏ సదస్సులో మాట్లాడుతున్నారు? ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 313 కార్యక్రమాలు జరుగుతున్నాయనీ, అందులో బాబు ప్రసంగించబోయే కార్యక్రమం లేనేలేదు' అంటూ ట్వీట్ చేసారు. అయితే, చంద్రబాబు వెళ్ళే ఈవెంట్ గురించి యునైటెడ్ నేషన్స్ వెబ్సైటులో స్పష్టంగా ఉంటే, ఈయనకు అది కనిపించలేదు. http://webtv.un.org/live/ , ఇక్కడ స్పష్టంగా చంద్రబాబు పాల్గునే కార్యక్రమం గురించి ఉంది. అమెరికా టైమింగ్స్ ప్రకారం, 24 sept 6:30 PMకి ఇది మొదలవుతుంది. అంటే, మన టైమింగ్స్ ప్రకారం, షుమారుగా రేపు తెల్లవారు జామున 3 గంటలకు. ఇంత స్పష్టంగా ఇక్కడ ఉన్నా, జీవీఎల్ మాత్రం ఫూల్ అయిపోయారు. ఈ ఈవెంట్ ఇక్కడ లైవ్ చూసుకుంటూ, రేపు ఇంకా ఎంత కడుపు మంట చూపిస్తాడో..

అది ప్రపంచంలోనే నెంబర్ వన్ అంతర్జాతీయ వేదిక... ఐక్యరాజ్యసమితి చెప్తే, అమెరికా కూడా వినాల్సిందే. అలాంటి వేదిక పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గున్నారు. ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాకం, అంతర్జాతీయంగా ఎగరవేశారు. ఇది ఒక్కటే కాదు, అప్పటి దాక, ఆ వేదిక పై ఇంగ్లీష్ లో అందరూ దంచి కొడుతుంటే, చంద్రబాబు టర్న్ రాగానే, స్వచ్చమైన తెలుగులో ప్రసంగం మొదలు పెట్టారు. "భారతీయలు అందరి తరుపున, తెలుగు వారి అందరి తరుపున నన్ను ఇక్కడకు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకృతి వ్యవసాయంలో ప్రపంచానికి ఆదర్శం" అని తెలుగులో సంభోదించి, ఇలాంటి అరుదుగే, ప్రపంచ వేదిక పై ప్రసంగించే అవకాసం నాకు, నా రాష్ట్రానికి రావటంతో, నేను ఒక రెండు నిమషాలు నా మాతృ భాషలో మాట్లాడాను అని చెప్పి, ఆయన ప్రసంగం మొదలు పెట్టారు.

cbn un 25092018 2

చంద్రబాబు ఐక్యరాజ్య సమితిలో పలికిన తొలి పలుకులు వింటుంటే, అంతర్జాతీయ వేదికల మీద దేశదేశాల దిగ్గజాల మధ్య మన తెలుగు వింటుంటే ఒక అనిర్వచనీయమైన ఆనందం. ఆ సమయంలో పార్టీలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా, ప్రతి తెలుగు వాడి ఛాతీ గర్వంతో ఉప్పొంగే క్షణాలు అవి, ‘జీవితం సార్ధకం’ అనిపించే సంఘటన ఈ సన్నివేశం. 'సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత...అంతర్జాతీయ సవాళ్లు- అవకాశాలు' అనే అంశంపై చంద్రబాబు ప్రసంగం కొనసాగింది. కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ భారతీయుల తరపున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ నేడు ప్రకృతి వ్యవసాయానికి కేంద్రంగా మారిందని, ఇది ప్రపంచానికే ఆదర్శం అని బాబు తన ప్రసంగాన్ని ఆరంభించారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యం అమలుతీరును సీఎం చంద్రబాబు వివరించారు.

cbn un 25092018 3

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఇప్పటికే లక్షల ఎకరాల్లో సాగయ్యేలా చేయడం, 2029 నాటికి 20 లక్షల ఎకరాలకు ఈ విస్తీర్ణాన్ని పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించారు. పైసా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి అమెరికన్‌ సాంకేతికత, మేథో పరిజ్ఞానాన్ని జోడించేందుకు పరస్పర సహాయ సహకారాలపై ఆయన చర్చించారు. ఇప్పటికే దేశంలో ప్రకృతి సేద్యంలో నవ్యాంధ్ర అగ్రగామిగా ఎదిగి సాధిస్తున్న విజయాలను వివరించారు. ఈ సమావేశంలో కీలక ప్రసంగాలు చేసిన తొమ్మిది మందిలో చంద్రబాబు ఒకరు కావడం విశేషం.

Advertisements

Latest Articles

Most Read