ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంచి పేరు ఉంది. 90'ల్లో ఆయన ఐటికి ఇచ్చిన ప్రాధాన్యత చూసి, అమెరికా అధ్యక్షుడే ముగ్ధుడు అయ్యాడు అంటే, ఆయన సత్తా ఏంటో చెప్తుంది. ఆయన విజన్ చూసి, మైక్రోసాఫ్ట్ వచ్చింది, సైబరాబాద్ అనే సిటీ నిర్మాణం జరిగింది. అయితే, ఎక్కువగా ఆయన ఐటి వైపు వెళ్ళటం కూడా, ఆయనకు ఎన్నికల్లో ఇబ్బంది అయ్యేలా చేసింది. అది గతం.. ఇప్పుడు 2018లో ఉన్నాం.. 20 ఏళ్ళ నాడు ఐటికి ప్రాధాన్యత ఇచ్చి, దేశానికే మార్గదర్శం అయితే, ఇప్పుడు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ మొదలు పెట్టి, దేశంలో మిగతా రాష్ట్రాల వారికే కాదు, ప్రపంచానికే ఆదర్శం అయ్యింది ఆంధ్రప్రదేశ్.

unletter 15092018 2

ఇదే విషయం ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించింది. ‘‘ఫైనాన్సింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్: గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్’’ అనే అంశంపై ఐక్యరాజ్య సమితిలో ప్రంసంగించాల్సిందిగా సీఎంను యూఎన్ఓ ఆహ్వానించింది. దీనికి సమబందించి, ఐక్యరాజ్య సమితి ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్హెం, చంద్రబాబుకి లెటర్ రాసారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ 24 నుంచి జరుగుతుందని, ‘‘ఫైనాన్సింగ్ సస్టైనబుల్ అగ్రికల్చర్: గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్’’ టాపిక్ మీద మీరు ప్రసంగించాలి అంటూ లెటర్ రాసారు.

unletter 15092018 1

మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో మార్పులు చోటు చేసుకుంటుంది. సామాజికంగా, ఆర్ధికంగా, ఎన్విరాన్మెంట్ పరంగా, మీరు తీసుకుంటున్న చర్యలు అమోఘం. ముఖ్యంగా, మీరు మీ రాష్ట్రంలో, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కి ఇస్తున్న ప్రాధాన్యత, వాటి ఫలితాలు మమ్మల్ని ఆకట్టుకున్నాయి. ఈ ప్రపంచం, మీ నుంచి, మీ అనుభవాలు వినాలని అనుకుంటుంది. మీ అనుభవాలు మాతో వచ్చి పంచుకుంటారని ఆశిస్తున్నా అంటూ, ఐక్యరాజ్య సమితి ఎక్జిక్యూటివ్ డైరెక్టర్, చంద్రబాబుకి లేఖ రసారు. ఇది చంద్రబాబు చేస్తున్న విధానాల వల్ల, మన రాష్ట్రానికి ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న గుర్తింపు... జయహో ఆంధ్రప్రదేశ్...

కడప అంటే వైఎస్ ఫ్యామిలీ అనే దగ్గర నుంచి, జగన్ చేస్తున్న విధానాలతో, కడప కూడా వైఎస్ ఫ్యామిలీ నుంచి పోయే సూచనలు కనిపిస్తున్నాయి. సొంత బాబాయ్ ని కూడా గెలిపించుకోలేక జగన్ చతికిల పడ్డాడు. మరో వైపు చంద్రబాబు పోజిటివ్ క్యంపైన్ తో, నీళ్ళు ఇస్తూ, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తూ, ప్రజలను తన వైపు తిప్పుకుంటున్నారు. దీంతో, కడప జిల్లాలో తన పట్టు నిలపెట్టుకోవాలని వైసిపి అధినేత జగన్ భావిస్తున్నారు. కడప జిల్లాలో ‘నవరత్నాల’ అస్త్రంతో మళ్లీ వైసీపీ గడప గడపకూ ప్రచారానికి శ్రీకారం చుడుతోంది.

jagan 15092018

ఈ నెల 17 నుంచి కార్యక్రమం మొదలు కానుంది. నవరత్నాల పేరుతో ఈ కార్యక్రమం మొదలుపెట్టి రోజుకు రెండు బూత్‌లలో పర్యటించేలా కార్యాచరణను రూపొందించుకున్నారు. ఎన్నికల కోసమే తాము ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నామని వైసీపీ నేతలు చెపుతున్నారు. ఈ కార్యక్రమం లో భాగంగానే జగన్‌ నవంబరులో మళ్ళి కడప జిల్లాలో పర్యటిస్తారని, వారు చెపుతున్నారు. కాగా ఐదు నియోజకవర్గాల్లో జగన్‌ పాదయాత్ర జరిగే అవకాశాలు ఉన్నాయని, మిగత నియిజక వర్గాల్లో జగన్‌ బస్సు యాత్ర ఉండే అవకాశం ఉంది.

jagan 15092018

పార్టీ అధినేత జగన్‌ ఈ కార్యకమ్రం పెద్ద ఎత్తున చేపట్టాలని కేడరును కోరారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలు పార్టీ ముఖ్యనేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల్లోకి తీసుకె ళ్లాలి. అయితే పార్టీ నేతలలో మాత్రం వాదనలు దీనికి భిన్నంగా వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడు నెలలు పైనే ఉన్నాయి . ఇప్పటినుంచే ప్రచారం ప్రారంభిస్తే కేడరు, కార్యకర్తలను నడపడం పార్టీ నేతలకు చాలా భారమని వారు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఎన్నికల ఖర్చు తలుచుకుంటేనే భయమేస్తున్న నేపధ్యంలో నవరత్నాలతో ప్రజల్లోకి వెళ్లడం, అదనంగా ఈ భారాన్ని కూడా మోయాల్సి రావడం, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ఆందోళన చెందుతున్నారు. మరో పక్క చంద్రబాబు పోజిటివ్ క్యంపైన్ తో ప్రజలను ఆకట్టుకుంటున్నారని అంటున్నారు. మొత్తమ్మీద గడప గడపకూ వైసీపీ నవరత్నాలు కార్యక్రమం నేతలకు అగ్నిపరీక్షగా మారనుంది.

నాలుగు రోజుల క్రితం ఒక తెలుగు న్యూస్ ఛానల్ లో, పవన్ కళ్యాణ్, జనసేన భాగోతం బయట పెట్టిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో కలవటానికి, ఒకే సామజిక వర్గానికి చెందిన వారిని ఒక మీటింగ్ పెట్టి, ITC కాకతీయ హోటల్ కి రప్పించారు. దీనికి ఎంట్రీ ఫీజు 10 లక్షలు. లోపాలకి వెళ్ళిన తరువాత, మన శక్తి కొద్దీ ఇంకా సమర్పించాలి. ఇలా 150 మంది దాకా హాజరయ్యారు. అంటే గంటలో 15 కోట్లు కలెక్షన్. ఇదంతా ఆ న్యూస్ ఛానల్ వీడియో తియ్యటం, ఆ న్యూస్ ఛానల్ లో మూర్తి ప్రసారం చెయ్యటం జరిగింది. అయితే, 10 నిమషాల్లోనే ఆ ప్రోగ్రాం ఆపేశారు. కొన్ని ఒత్తిడులు రావటంతో, ఈ ప్రోగ్రాం ఆపేశారు.

mahaa 14092018 1

దీంతో మనస్తాపం చెందిన మూర్తి రాజీనామా చేసి వచ్చేశారు. అయితే, పవన్ పై ఏ నెగటివ్ న్యూస్ వచ్చినా, పవన్ కు ఉండే కొంత మంది ఉన్మాద అభిమానులు, ఎలా ప్రవర్తిస్తారో అందరికీ తెలిసిందే. అదే విధంగా, మూర్తి పై కూడా దాడి ప్రారంభించారు. మూర్తి కమ్మ సామాజిక వర్గం అంటూ, తను ఆ కులం కాకపోయినా, అంటకట్టి, చంద్రబాబు డబ్బులు ఇచ్చి చేపించారు అంటూ హడావిడి చేసారు. కొంత మంది, మా పవన్ కి భయపడి, మూర్తి ఆపేసాడు, మా పవన్ గ్రేట్ అంటూ పోస్ట్ లు పెట్టారు. అయితే, ఇవన్నీ నాలుగు రోజుల నుంచి చూస్తున్న మూర్తి, ఒక వీడియో రూపంలో తన సందేశం ఇచ్చారు.

mahaa 14092018 1

మూర్తి మాటల్లో... "నేను వెన్ను చూపి పారిపోయే వ్యక్తిని కాదు. ప్రశ్నించటం కోసమే జనసేన అన్నారు, జనసేనను ప్రశ్నించే అధికారం మాకు లేదా ? మూర్తి జర్నలిజాన్ని నమ్ముకున్నాడు, అమ్ముకోడు. కాపు ప్రముఖలతో జనసేన పెట్టింది సీక్రెట్ మీటింగే. ఆ సమావేశం దగ్గరలోనే నేనూ ఉన్నా. అక్కడే పీ టు సీ కూడా చెప్పా. సీక్రెట్ మీటింగ్ కాకపొతే మీడియాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు ? కనీసం మీ ఛానల్ 99లో న్యూస్ ఎందుకు వేసుకోలేదు ? ఆహ్వానితుల ఫోన్లు ఎందుకు లాక్కున్నారు ? పార్టీ పేరుతో కాకుండా illusion మీడియా పేరుతో మీటింగ్ ఎందుకు పెట్టారు ? పవన్ ను నేను అభిమానించా, కొత్త స్వచ్చమైన రాజకీయ శక్తి అవుతుందని ఆశించా."

mahaa 14092018 1

"కత్తి మహేష్ వివాదంలో పవన్ తో రాజీ చేశా. అప్పుడు పవన్ అభిమాలనులకు నేను దేవుడిలా కనిపించా. ఇప్పుడు మాత్రం దెయ్యం అయ్యానా ? జనసేన కులాలను కలుపుతుందని అన్నారు. కాని ఒక కులాన్ని మాత్రమే కలుపుతున్నారు. అమరావతి ఓ సామాజిక వర్గానిదే అని పుస్తకం వేసారు, మరి జనసేన చేస్తుంది ఏమిటి ? నేను కమ్మ కులం అంటున్నారు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అధికార, ప్రతిపక్ష కులాల్లో నేను పుట్టలేదు. జర్నలిస్టులు ప్రభుత్వాలు అధికారికంగా ఇచ్చే ప్రయోజనాలేవీ తీసుకోలేదు. లంచగొండిని అయితే, ఈ వీడియో తీసుకుని, పవన్ దగ్గరే బేరం పెట్టె వాడిని. నా వార్తను అర్ధాంతరంగా ఆపేసారని చానెల్ కు రాజీనమా చేసాను. నేను జర్నలిజం కోసమే పుట్టా, జర్నలిజం కోసమే చస్తా.. జనసేన అన్ని పదవుల్లో కాపులే ఉన్నది నిజం కాదా ? నాకు చానెల్ లేకపోవచ్చు, నేనే ఒక ఛానల్. జనసేన సమాచారం చాలా నా దగ్గర ఉంది. నాలుగు రోజులగా పవన్ ఫాన్స్ నా పై దుష్ ప్రచారం చేస్తున్నారు. నేను వెన్ను చూపి పారిపోయే వాడిని కాదు." పూర్తి వీడియో ఇక్కడ చూడవచ్చు... https://youtu.be/lDKp3aWhpwc

ఎనిమిదేళ్ల క్రితం జరిగిన బాబ్లీ ప్రాజెక్టు ఆందోళన కేసు ఆకస్మికంగా, అనూహ్యంగా తెరపైకి వచ్చింది. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ధర్మాబాద్‌ కోర్టు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు 16 మందిపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసింది. ఈ నెల 21న హాజరుపరచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో విచిత్రంఏమిటంటే బాబ్లీ ఆందోళన సమయంలో తమ పై నమోదైన కేసు ఎప్పుడో క్లోజ్ అయ్యిందని, ఆ తరువాత మహారాష్ట్ర పోలీసులు మరో కేసు పెట్టినట్లు తమకు తెలియనే తెలియదని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే అసలు ఇప్పటివరకు తమకు కోర్టు నుంచి ఎలాంటి నోటీసులూ అందలేదని తెలిపారు.

cbn 15092018

ఇంకా చెప్పాలంటే... ‘చంద్రబాబుపై అరెస్టు వారెంటు’ అంటూ గురువారం మహారాష్ట్రలోని స్థానిక పత్రికలో వార్త వచ్చేదాకా ఈ విషయం బయటి ప్రపంచానికి కూడా తెలియదని చెపుతున్నారు. అయితే ఈ కేసులో సంచలన విషయమేమిటంటే ఈ కేసు బెయిలబుల్‌ కేసు. 2010 జూలై 17వ తేదీన కేసు నమోదైంది. జూలై 19వ తేదీన ధర్మాబాద్‌ సివిల్‌ జడ్జి జూనియర్‌ డివిజన్‌ కోర్టులో విచారణ జరిగింది.అదేనెల 26వ తేదీన ఈ కేసును కొట్టివేస్తూ చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. వేరే కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అడ్రస్ లభ్యం కానప్పుడు, ప్రాసిక్యూషన్‌ అంత పట్టింపుతో లేదనుకున్నప్పుడు మాత్రమే ఇతర కారణాలతో కేసును డిస్పోజ్‌ చేస్తారు. అంటే... చంద్రబాబుతోపాటు 65 మందిపై బాబ్లీ ఆందోళన కేసు మొదలైన పది రోజుల్లోనే క్లోజ్‌ అయ్యింది. ఈ విషయం కోర్టుల అధికారిక వెబ్‌సైట్‌లోనే ఉంది. ఈ కేసు నెంబర్‌తో ఎవరైనా శోధిస్తే... ‘డిస్పోజ్డ్‌’ అనే కనిపిస్తుంది. దీంతో ఈ కేసు గురించి టీడీపీ నేతలు కూడా మరిచిపోయారు

cbn 15092018

అయితే అదే టైంలో కేసు డిస్పోజ్ చేసి, మరో కేసు పెట్టారు. రెండో కేసులో, మొదటి కేసులో ఉన్న 64 మంది కాకుండా, చంద్రబాబుతో పాటు మరో 15 మంది ముఖ్య నేతలను మాత్రమే నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఐపీసీలోని సెక్షన్‌ 353, 324, 332, 336, 337, 323, 504, 506, 109, 34 ప్రయోగించారు. ప్రభుత్వ విధి నిర్వహణలో ఉన్న వారి పై దాడికి పాల్పడటం, వారి విధులను అడ్డుకోవడం, మారణాయుధాలతో దాడికి ప్రయత్నించడం, ఇలా తీవ్ర నేరారోపణలు చేశారు. చంద్రబాబు పై ఇలాంటి కేసు పెట్టటం ఏంటో ఎవరికీ అర్ధం కాలేదు. ఒకే సంఘటనకు సంబంధించి పలు పరిణామాలు జరిగినప్పుడు మొదటి కోర్టు అనుమతితో కేసులో కొత్త వివరాలు, సెక్షన్లు చేర్చవచ్చు. కానీ... ధర్మాబాద్‌ పోలీసులు అలా చేయలేదు. కొత్తగా మరో కేసు పెట్టారు. అయితే, ఆ సమాచారాన్ని నిందితులుగా పేర్కొన్న వారికి తెలియపరచలేదు.

cbn 15092018

ఈ కేసు విషయమై 2013 జూలై 1న ధర్మాబాద్‌ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. 2013 ఆగస్టు 31న మొదటి విచారణ జరిగింది. విచారణకు ముందు కేసులోని నిందితులకు సమాచారం ఇవ్వడం, ఎఫ్‌ఐఆర్‌తో పాటు చార్జిషీటు ప్రతులను అందరు నిందితులకు అందించడం తప్పనిసరి. కానీ,చంద్రబాబు సహా ఎవ్వరికీ సమాచారం అందలేదు. ఈ కేసు 2013 నుంచి ఇప్పటిదాకా ధర్మాబాద్‌ కోర్టులో 52 వాయిదాలు పడింది. విచిత్రమేమిటంటే, ఇన్ని వాయిదాలలో మహారాష్ట్ర పోలీసులు ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఈ కేసు సంగతి, విచారణ గురించి చంద్రబాబుకి కాని, ఆ 15 మందికి కాని తెలుపలేదు. చివరికి, మొన్న బయటకు వచ్చిన విషయం, చంద్రబాబు, మరో 15 మందిని అరెస్టు చేసి ఆగస్టు 16న తన ముందు హాజరుపరచాలని జడ్జి జూలై 5న ఉత్తర్వులు ఇచ్చారు. మళ్ళీ హాజరు తేదీని సెప్టెంబర్ 21కి మార్చారు. ఈ ఉత్తర్వు కూడా మీడియాలో వచ్చింది కాని, ఇంకా ఇంతవరకూ చంద్రబాబుకి కాని, ఆ 15 మందికి కాని అందలేదు.

cbn 15092018

గురువారం మహారాష్ట్ర స్థానిక పత్రికలో వార్త వచ్చిన తర్వాతే ఈ సంగతి బయటి ప్రపంచానికి తెలిసింది. ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా ఏకంగా అరెస్టు వారెంటు జారీ కావడం వెనుక రాజకీయ కుట్ర ఉందని, ఒకో పావును కదుపుతున్నారన్న అభిప్రాయం కలుగుతోందని టీడీపీ ముఖ్యలు అనుమానిస్తున్నారు. ఐరాస సమావేశంలో ప్రసంగించేందుకు చంద్రబాబు 23న అమెరికా వెళ్తున్నారు. సరిగ్గా దీనికి రెండు రోజుల ముందు కోర్టులో చంద్రబాబు బృందాన్ని హాజరు పరచాలని వారెంటు జారీ కావడం.. ఆయన్ను అందులో పాల్గొనకుండా చేసేందుకేనని కొందరు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రులు ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటి కేసుల్లో కోర్టుకు హాజరయ్యారా... దాని వల్ల తర్వాతి పరిణామాలు ఎలా ఉన్నాయన్నదానిపై పార్టీ వర్గాలు సమాచారం సేకరిస్తున్నాయి.

Advertisements

Latest Articles

Most Read