చంద్రబాబుకు నోటీసులు ఇస్తున్నారు.. చంద్రబాబుని ఇబ్బంది పెట్టే చర్యలు తీసుకుంటున్నారు అంటూ, గత రెండు రోజులుగా హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు మరవకముందే, మహారాష్ట్రలోని అన్ని పత్రికల్లో, ధర్మాబాద్ కోర్ట్ నుంచి చంద్రబాబుకు నోటీసులు వస్తున్నాయి అంటూ పెద్ద ఎత్తన ప్రచారం జరుగుతుంది. అయితే, ఇదేమి అవినీతి కేసు కాదు. ఇది ఆనాడు ఉమ్మడి ఆంధ్రపదేశ్ లో, తెలంగాణా ప్రజలు అన్యాయం అయిపోతుంటే, బాబ్లీ ప్రాజెక్ట్ కోసం, మహారాష్ట్ర వెళ్లి మరీ చంద్రబాబు, అప్పటి ఎమ్మల్యేలు ఆందోళన చేసారు. 2010లో ప్రాజెక్ట్ వద్దకు వస్తున్నాం అంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి కబురు పంపించారు.

notiesce 13092018 2

అయితే అది అక్రమ ప్రాజెక్ట్ కావటంతో, మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకున్నా, చంద్రబాబు అప్పుడు అక్కడికి వెళ్లారు. దీంతో అక్కడ పోలీసులు చంద్రబాబుని అడ్డుకున్నారు, తన్నారు, అరెస్ట్ చేసారు.. దాదపు రెండు రోజుల పాటు చంద్రబాబుకి, మిగిలిన ఎమ్మల్యేలకు, మహిళాలకు చుక్కలు చూపించారు. అప్పటి చంద్రబాబు పోరాటం, ఇప్పటికీ తెలంగాణా ప్రజలకు గుర్తుంది. అయితే, ఈ కేసు అప్పటి నుంచి ధర్మాబాద్ కోర్ట్ లో విచారణలో ఉంది. బాబ్లీ ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా, ఆందోళన చేసిన కేసులు, ఇప్పుడు చంద్రబాబుకి నోటీసులు ఇవ్వటానికి రెడీ అయ్యారు అంటూ, మహారాష్ట్ర పత్రికల్లో కధనాలు వచ్చాయి.

notiesce 13092018 3

దీని పై మంత్రి లోకేష్ స్పందించారు. నోటీసులు ఇస్తే చంద్రబాబుతో పాటు, నోటీసులు అందుకున్న అందరం, కోర్ట్ కి వెళ్తామని చెప్పారు. తెలంగాణా ప్రజల కోసం అప్పుడు పోరాటం చేసామని, అదే కోర్ట్ కి చెప్తామని చెప్పారు. తెలంగాణా ప్రయోజనాల కోసం నాడు బాబ్లీకి వ్యతిరేకంగా చంద్రబాబు పోరాడారని గుర్తు చేసారు. ధర్మాబాద్ పోరాటంలో తెలుగుదేశం తెగువ ప్రజలు చూసారని లోకేష్ అన్నారు. చంద్రబాబుని, టిడిపి నేతలను అరెస్ట్ చేసినా, వెనక్కు తగ్గలేదని గుర్తు చేసారు. అయితే దీని పై కెసిఆర్ శిబిరానికి టెన్షన్ మొదలైంది. మనం చంద్రబాబుని తెలంగాణా ద్రోహులుగా చిత్రీకరించాము. ఇప్పుడు తెలంగాణా పోరాటం కోసం, చంద్రబాబు పోరాడారనే విషయం మళ్ళీ ప్రజలకు గుర్తు వస్తుంది అని, ఇది ఎన్నికల పై ప్రభావం చూపుతుందని, తెలంగాణాలో చంద్రబాబు పాత్ర ప్రజలు గుర్తు చేసుకుంటే, మనకు ఇబ్బందే అని కెసిఆర్ శిబిరం టెన్షన్ పడుతుంది. నోటీసులు అందుకుని, చంద్రబాబు కోర్ట్ కి వెళ్తే మాత్రం, తెలంగాణాలో రాజకీయ పరిణామాలు మారిపోతాయి.

విశ్వవిఖ్యాత న‌టుడు, మాజీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు జీవిత‌కథ ఆధారంగా `ఎన్టీయార్‌` పేరుతో ఓ బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. డైరెక్ట‌ర్ క్రిష్ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఎన్టీయార్‌గా నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్నారు. ఎన్టీయార్ భార్య బ‌స‌వ‌తారకం పాత్ర‌లో విద్యాబాల‌న్‌, ఏఎన్నార్ పాత్ర‌లో సుమంత్ క‌నిపించ‌నున్నారు. ఇక‌, ఎన్టీయార్ అల్లుడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడి పాత్ర‌లో ద‌గ్గుబాటి రానా న‌టిస్తున్నాడు.

ntr 13092018 2

వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా బుధ‌వారం నాడు చంద్ర‌బాబు పాత్ర‌లోని రానా లుక్‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర పోస్ట‌ర్‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. ఎన్టీయార్ పాత్ర‌లోని బాల‌య్య‌, చంద్ర‌బాబు పాత్ర‌లోని రానా క‌లిసి ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. `ఓ మ‌హా నాయ‌కుడి పాత్ర‌లో నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఓ విజ‌న‌రీ లీడ‌ర్ పాత్ర‌లో రానా` అంటూ విడుద‌ల చేసిన ఈ లుక్ ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంటోంది.

బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్ మాల్యా సంచలన రాజకీయ ఆరోపణ చేశారు బ్రిటన్‌కు వెళ్లిపోయేముందు తాను ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీని కలిసినట్లు వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం వదిలి వెళ్లిపోయే ముందు అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ఆయన్ను చాలా సార్లు కలిసినట్లు పేర్కొన్నారు. మాల్యా కేసు విచారణ జరుగుతున్న లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ కోర్టు బయట ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘రుణాలను తిరిగి బ్యాంకులకు చెల్లించేందుకు అరుణ్‌ జైట్లీకి నేను చాలా మార్గాలు చెప్పాను. ఇది నిజం.’’ అని ఆయన విలేకరులతో అన్నారు.

malya 12092018 2

విజయ్‌మాల్యా తాజా వ్యాఖ్యలు దేశంలో రాజకీయ వేడిని పెంచుతున్నాయి. కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే దీనిపై కొందమంది నేతలు స్పందించారు. ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి వెళ్లిపోయేందుకు భాజపానే వారికి అవకాశం కల్పిస్తుందని, దీనికి రుజువు విజయ్‌మాల్యా చేసిన తాజా వ్యాఖ్యలేనని ఆరోపిస్తున్నారు. మాల్యా దేశం విడిచి వెళ్లిపోయేందుకు ప్రభుత్వం ఎందుకు అవకాశం కల్పించిందో చెప్పాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. దీనిపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ‘‘మాల్యా వ్యాఖ్యలపై ప్రధాని తప్పకుండా స్పందించాలి. దీనిగురించి ఆయనకు తెలియకుండా ఉండే అవకాశం లేదు’’ అని ట్వీట్‌ చేశారు. అరుణ్‌ జైట్లీ ఇన్ని రోజులు ఈ విషయం ఎందుకు దాచి ఉంచారని మరో ట్వీట్‌లో ప్రశ్నించారు.

malya 12092018 3

మోదీ ప్రభుత్వం విజయ్‌మాల్యా వంటి కొందరు బడా వ్యాపారవేత్తలకు మాత్రమే అనుకూలంగా ఉంటోందని గత నెలలో లండన్‌ పర్యటన సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. మాల్యా దేశం విడిచి వెళ్లాక చాలా మంది భాజపా సీనియర్‌ నాయకులను కలిశారని, తన వద్ద రుజువులు ఉన్నాయని రాహుల్‌ లండన్‌లోని విలేకరులతో చెప్పారు. దీనిపై ఫేస్‌బుక్‌ వేదికగా స్పందించిన అరుణ్‌జైట్లీ.. విజయ్‌మాల్యా చేసిన ఆరోపణలు ఉద్దేశపూర్వకంగా ఉన్నాయని, అవి నిజం కాదని పేర్కొన్నారు. 2014 నుంచి అసలు మాల్యాకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని చెప్పారు. మాల్యా 2016 మార్చి 2న భారతదేశం నుంచి బ్రిటన్ పారిపోయిన సంగతి తెలిసిందే. ఆయనను తిరిగి భారతదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం బ్రిటన్ కోర్టులో కేసు దాఖలు చేసింది. ఈ కేసుపై విచారణ తుది దశలో ఉంది.

ఎప్పుడా.. ఎప్పుడెప్పుడా... అని ఎదురుచూస్తున్న హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సేవలు ఈ రోజు ప్రారంభం కాబోతున్నాయి. కేసరపల్లి ఎల్‌అండ్‌టీ - ఏపీఐఐసీ హైటెక్‌ సిటీలోని ‘మేథ’ టవర్‌లో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో తన సేవలను ప్రారంభించటానికి హెచ్‌సీఎల్‌ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫైనాన్షియల్‌ సర్వీసెస్ లో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న అంతర్జాతీయ కంపెనీ హెచ్‌సీఎల్‌ స్టేట్‌ స్ట్రీట్‌ రాష్ట్రంలో కొలువుదీరనుంది. గన్నవరం సమీపంలోని మేధాటవర్స్‌లో ఏర్పాటుకానున్న ఈ కంపెనీని ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ గురువారం ప్రారంభిస్తున్నారు.

hcl 13092018 2

ఈ సంస్థ ద్వారా వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. వాస్తవానికి హెచ్‌సీఎల్‌-అమెరికాకు చెందిన స్టేట్‌ స్ట్రీట్‌ కంపెనీలు కలిసి ఈ భాగస్వామ్య సంస్థను ఏర్పాటుచేశాయి. అమెరికా, కెనడా, యూరప్‌, మిడిల్‌ ఈస్ట్‌, ఆసియా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హెచ్‌సీఎల్‌-స్టేట్‌ స్ట్రీట్‌లు సంయుక్తంగా ఏర్పడ్డాక మన దేశంలోని కోయంబత్తూరులో తొలిశాఖను ప్రారంభించారు. అక్కడ 4వేల మందికి ఉద్యోగాలు కల్పించింది. కాగా, అక్టోబరు 8న హెచ్‌సీఎల్‌ కంపెనీ కూడా మేధాటవర్స్‌లో ప్రారంభం కానుంది. తద్వారా మరింత పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు రానున్నాయి.

hcl 13092018 3

గన్నవరంలోని ఆర్టీసీ జోనల్‌ కాలేజీ స్థలంలో శాశ్వతంగా టెక్నాలజీస్‌ పార్క్‌ నిర్మాణానికి హెచ్‌సీఎల్‌ మరోవైపు చర్యలు తీసుకుంటున్న సంగతి కూడా తెలిసిందే. ఎయిర్‌పోర్టు ఉండటం వల్ల డిజైన్లకు కేంద్రం నుంచి ఇంకా కొన్ని అనుమతులు రావాల్సి ఉన్నందున ఇక్కడ శంకుస్థాపన, హైరైజ్‌ భవన నిర్మాణ పనులు ప్రారంభించటానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ‘మేథ’ టవర్‌లో తాత్కాలికంగా తమ కార్యకలాపాలు ప్రారంభించాలని హెచ్‌సీఎల్‌ నిర్ణయించింది. లక్ష అడుగుల విస్తీర్ణాన్ని తీసుకుని గత ఆరు నెలలుగా పనులు చేయిస్తోంది. మేధ టవర్‌ పూర్తిగా ఐటీ కంపెనీలతో నిండిపోయింది. ఐదేళ్ల కిందట ఐటీ కంపెనీలు లేక వెలవెలపోయింది. రెండు మూడు చిన్న కంపెనీలు తప్పితే ఖాళీగా ఉండేది. అలాంటిది అనేక ఐటీ కంపెనీలు ఏర్పాటు కావటంతో పాటు బిగ్‌ ఐటీ కంపెనీగా ‘స్టేట్‌ స్ర్టీట్‌ ’ సంస్థ రంగ ప్రవేశం చేయటంతో కేసర పల్లికి మహర్దశ పట్టుకుంది.

Advertisements

Latest Articles

Most Read