ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ పై, వైసీపీలో నిరసనలు, అలకలు ఇంకా బయట పడుతూనే ఉన్నాయి. రోజుకి ఒకరు బయటకు వస్తూ నిరసన తెలుపుతున్నారు. నిన్న కాపు రామచంద్రా రెడ్డి నిరసన తెలిపితే, ఈ రోజు ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆ లిస్టు లో చేరారు. అయితే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మాత్రం తెలివిగా తన అసంతృప్తిని బయటకు చూపించకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలో మంత్రి పదవి ఆశించి భంగ పడ్డ మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పిలిచి బుజ్జగించి, సెటిల్మెంట్ చేసి పంపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ రోజు కుటంబ సమేతంగా, మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అయితే ఇదే సమయంలో, మంగళగిరి టౌన్ లోనే ఉన్న ఆళ్ల రామకృష్ణా రెడ్డి అటు వైపు కూడా తొంగి చూడలేదు. సజ్జల పర్యటన చేసిన ప్రాంతంలో లేకుండా, సజ్జలని కలిసే ప్రయత్నం కూడా చేయకుండా ఆళ్ల రామకృష్ణా రెడ్డి, తన కార్యాలయానికే పరిమితం అయ్యి, సజ్జలను కనీసం లెక్క చేయలేదు.

alla 13042022 2

ఇదే సమయంలో, ఇటీవల కాలంలో మంగళగిరి నుంచి నూతనంగా ఎన్నికైనా ఎమ్మెల్సీతో పాటుగా, ఇతర నేతలు సజ్జల పర్యటనలో ఉన్నారు. వీరు ఇరువురూ, సజ్జలతోనే ఉంటూ, సజ్జల పర్యటన అయ్యే దాకా అక్కడే ఉండి, అన్ని ఏర్పాట్లు చేసారు. ఇదే సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, తన కార్యాలయం నుంచి ఒక వీడియో విడుదల చేసారు. మంత్రి వర్గ విస్తరణ పై తనకు చోటు రాలేదని ఎక్కడా అసంతృప్తి లేదని, తాను జగన్ ఎలా చెప్తే అలా నడుచుకుంటానని గతంలోనే చెప్పానని, తనకు మంత్రి ఇచ్చినా, ఇవ్వకపోయినా, ఎవరికి ఇచ్చినా, జగన్ వెంటే నడుస్తానని వీడియో ఒకటి విడుదల చేసి తన కార్యాలయానికే పరిమతం అయ్యారు. అదే సమయంలో సజ్జల, మంగళగిరి వస్తే, మిగతా నేతలు అందరూ వెళ్ళటం, ఆళ్ల రామకృష్ణా రెడ్డి మాతమ్రే వెళ్లకపోవటం పై చర్చనీయంసం అయ్యింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. క-రో-నా సమయంలో, క-రో-నా బారిన పడి మరణించిన వారి కుటుంబాలకు, రూ.50 వేలు చొప్పున ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, ఆ నిధులు ఇవ్వటానికి తమ వద్ద డబ్బులు లేవు, SDRF నిధులు లేవు అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. గతంలో సుప్రీం కోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది. క-రో-నా తో అనేక మంది చనిపోయారు కాబట్టి, ఇది జాతీయ విపత్తు కాబట్టి, ప్రభుత్వం వారికి రూ.3 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని పిటీషన్ వేసారు. ఈ పిటీషన్ పైన సుదీర్ఘంగా వదనాలు జరిగాయి. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను సుప్రీం కోర్టు తీసుకుంది. విచారణ అనంతరం, రూ.50 వేలు ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇందుకు అంగీకరించాయి. క-రో-నా-తో చనిపోయిన వారికి రూ.50 వేలు చొప్పున ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వటం, కేంద్రం నుంచి SDRF కు వచ్చే నిధులు వాడాలని, కేంద్రం చెప్పటం తెలిసిందే.

sc 13042022 2

అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, సుప్రీం కోర్టు తీర్పు పాటించలేదు. కేంద్రం ప్రభ్తువం SDRF ద్వారా పంపించిన నిధులను PD ఖాతాలకు మల్లించి, తమ వద్దకు డబ్బులు లేవని చెప్పింది. దీంతో సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారం, క-రో-నా-తో చనిపోయిన వారికి రూ.50 వేలు రాష్ట్ర ప్రభ్తువం ఇవ్వలేక పోయింది. అయితే ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయక పోవటంతో, సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం పంపించిన నిధులను కూడా PD ఖాతాలకు మల్లించటం పైన, నిధుల దారి మళ్లింపుపైన కేంద్ర ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ అంశం పైన సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిధులు మళ్లింపు పైన సమాధానం చెప్పాలి అంటూ, ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది హైకోర్టు. రాష్ట్రంలో నిధుల మళ్లింపు ఎలా జరుగుతుంది అని చెప్పటానికి,ఇది ఒక ఉదాహరణ అని చెప్పాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బాదుడే బాదుడుకి రంగం సిద్ధం అవుతుంది. ఇప్పటికే కరెంటు చార్జీలు, పెట్రోల్ డీజిల్ రేట్లు, గ్యాస్ ధరలు, ఇంటి పన్నులు, చెత్త పన్నులతో, ప్రజలకు షాక్ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు మరో వీర బదుడుకి సిద్ధం అయ్యింది. రాష్ట్రంలో ఆర్టీసి బస్సు చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఈ రోజు దీనికి సంబంధించిన ప్రకటన రానుంది. డీజిల్ ధరలు భారిగా పెరగటంతో, చార్జీలు కూడా పెంచాలాని ఆర్టీసి నిర్ణయం తీసుకుంది. ఆర్టీసి చార్జీలు పెంచాలాని, ఇప్పటికే ఆ ఫైల్ ను ఆర్టీసి సిద్ధం చేసి, వారం రోజుల క్రితమే, ఆ ఫైల్ ను జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు పంపించారు. అయితే దీనికి సంబంధించి, జగన్ మోహన్ రెడ్డి ఫైల్ పైన సంతకం చేసినట్టు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి, మధ్యాహ్నం 3 గంటలకు ఆర్టీసీ ఎండీ మీడియా సమావేశంలో ప్రకటన చేయనున్నారు. ఈ రోజు దీనికి సంబంధించి, అధికారిక సమాచారం రానుంది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి చుక్కు ఎదురైంది. ఆమె వేసిన రివ్యూ పిటీషన్ ను రాష్ట్ర హైకోర్టు కొద్ది సేపటి క్రితం కొట్టివేసింది. గతంలో హైకోర్టు తీర్పుని అమలు చేయనందుకు, సేవా శిక్షను విధిస్తూ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఉండే, పలు స్కూల్ ప్రాంగణాల్లో, రైతు భరోసా కేంద్రాలు , గ్రామ సచివాలయ నిర్మాణాలు చేపట్టవద్దు అంటూ, రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా నిర్మాణాలు చేపట్టటం పై, పలు విద్యా కమిటీలు, తల్లిదండ్రులు హైకోర్టులో సవాల్ చేసారు. ఈ పిటీషన్ విచారణ చేసిన అనంతరం, రాష్ట్ర హైకోర్టు, రైతు భరోసా కేంద్రాలు కానీ, సచివాలయాలు కానీ, స్కూల్ పరిశరాల్లో నిర్మించ వద్దు అని చెప్పి, తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇచ్చినా కూడా, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయక పోవటంతో, దీని పైన, హైకోర్టు సుమోటోగా హైకోర్టు కోర్టు ధిక్కార కేసు నమోదు చేసింది. దీని పైన కూడా కోర్టు ధిక్కార పిటీషన్ పైన విచారణ చేసారు. ఈ కేసులో, సీనియర్ ఐఏఎస్ అధికారులు అందరూ కూడా ఉద్దేశపూర్వకంగానే తీర్పు అమలు చేయలేదని, కోర్టు నిర్ణయానికి వచ్చింది.

sri 13042022 2

మొత్తం ఎనిమిది మంది ఐఏఎస్ ఆఫీసర్లకు రాష్ట్ర హైకోర్టు, జైలు శిక్ష విధించింది. అయితే వీరు అందరూ హైకోర్టుకు క్షమాపణ చెప్పి, తమకు విధించిన శిక్షను రద్దు చేయాలని కోరారు. అయితే హైకోర్టు వీరి విజ్ఞప్తిని అంగీకరించి, సేవా శిక్షను విధించింది. ఏడాదకి 12 నెలలు పాటు, ప్రతి నెల విద్యార్ధులతో కలిపి, వారితో భోజనం చేసి, సొంత డబ్బుతో వారికి భోజనం పెట్టాలని సేవా శిక్ష విధించింది. అయితే తనకు వేసిన సేవా శిక్షను సమీక్షించాలని ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మీ, రివ్యూ పిటిషన్‍ ను హైకోర్టులో వేసారు. ఈ రివ్యూ పిటీషన్ ను రిజిస్ట్రీ నంబెర్ కేటాయించకుండా తిరస్కరించారు. అయితే ఇది తెలిసిన హైకోర్టు, నంబెర్ ఇచ్చి విచారణలో పెట్టాలని ఆదేశించింది. ఈ రోజు ఈ పిటీషన్ విచారణకు రాగా, శ్రీలక్ష్మి వేసిన రివ్యూ పిటీషన్ ను హైకోర్టు కొట్టేస్తూ, సేవా శిక్షను అమలు చేసి తీరాల్సిందే అంటూ, హైకోర్టు స్పష్టం చేసింది.

Advertisements

Latest Articles

Most Read