ఇది విశాఖ వేదికగా జరగబోతున్న ‘ఫిన్‌టెక్ చాలెంజ్’ఫిన్‌టెక్ రంగంలో విశాఖపట్నంను ఉత్తమ కేంద్రంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న ఐటీ శాఖ...అందుకోసం ఫిన్‌టెక్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించనుంది.ఇందులో భాగంగా ఏడు కోట్ల రూపాయల బహుమానాలు ఇవ్వనున్నారు. కోటి రూపాయలు చొప్పున 3 ప్రధమ బహుమతులు, రెండవ బహుమతిగా రూ.70 లక్షలు, ఫైనల్ కి చేరిన వారందరికీ భారీగా నజరానాలు ఇవ్వనున్నారు. ఇది ఏపీలో ఉన్న విద్యార్థులకు, టాలెంట్ నిరుద్యోగులకు సూపర్ ఛాన్స్. ఈ ఫిన్‌టెక్ ఫెస్టివల్ అక్టోబరు 22 - 26మధ్య ఐదు రోజులపాటు నిర్వహిచానున్నారు. అత్యుత్తమ ఆలోచనలకు, ఆర్థిక సేవల సాంకేతిక పరిజ్ఞానానికి, ప్రొడక్ట్, టెక్నాలజీలకు భారీ బహుమానం అందిస్తారు.
ఫిన్‌టెక్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, అగ్రిటెక్ అనే ఈ మూడు కేటగిరిలకు కోటి రూపాయలు చొప్పున ప్రధాన బహుమతిగా అందిస్తారు. 70 లక్షలు రూపాయలు ద్వితీయ స్థానంలో నిలిచిన కంపెనీకి అందిస్తారు. అలాగే ఫైనల్ కు చేరిన వారికి 7లక్షల చొప్పున ఇవ్వనున్నారు. ఈ ఫిన్‌టెక్ ఫెస్టివల్లో పాల్గొనటానికి ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ప్రముఖ కంపెనీలు, 75 మంది ఆర్ధిక నిపుణులు, 2 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేశ్ మంగళవారం మీడియాకు తెలిపారు. ఆయన ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడుతూ విశాఖను ఫిన్‌టెక్ వ్యాలీగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం చాలా దోహదపడుతుందన్నారు. స్టార్టప్ కంపెనీలకు కూడాఈ ఫిన్‌టెక్ సవాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నాం అని చెప్పారు. ప్రత్యేకంగా విద్యార్థుల కోసం ఫిన్‌టెక్ ఫెస్టివల్ కంటేముందు.
ఈ నెల 17నుంచి అక్టోబర్ 12వరకు హ్యాకథాన్ నిర్వహిస్తాం అని, దీనిలో ఆలోచనలు, టెక్నాలజీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల కు ఫిన్‌టెక్ ఫెస్టివల్లో బహుమతులు అందచేస్తామని అన్నారు. ఈ రోజుల్లో బ్లాక్‌చైన్ , బిగ్ డాటా, ఫిన్‌టెక్ టెక్నాలజీలు వేగంగా దుసుకుపోతున్నాయని, ఆంధ్రప్రదేశ్ ఈ టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయిలో ఎదిగేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తరువాత అన్ని కంపెనీలు తెలంగాణలో ఉండిపోయాయి. ఇప్పుడిప్పుడే మన రాష్ట్రానికి విశాఖపట్నం, అమరావతి, తిరుపతికి కంపెనీలు వస్తున్నాయి అని ఆయన తెలిపారు. ఇలా ఒకే రాష్ట్రంలో మూడు నగరాలకు ఐటీ పెట్టుబడులు వస్తున్న రాష్ట్రం మనదే అన్నారు. ఒక్క ఐటీ రంగంలోనే 36వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఒక్క ఫిన్‌టెక్ రంగంలోనే 600ఉద్యోగాలు వచ్చాయి. మరో వెయ్యి ఉద్యోగాలు వచ్చే నెలలో వస్తాయి. ఫెడరల్ బ్యాంకు కూడా త్వరలోనే ఏపీకి రానుందని ఐటీ శాఖ మంత్రి లోకేశ్ మీడియా సమావేశంలో తెలిపారు.