గుడిని మింగే వాడు ఒకడు అయితే .. గుడిని, గుడిలో లింగాన్ని మింగేవాడు మరొకరు.. ఈ సామెత, కెసిఆర్, మోడీలకు చక్కగా సరిపోతుంది. మొన్నటి వరకు బూతులు తిట్టుకున్న వాళ్ళు, సడన్ గా కలిసిపోయారు. రాజకీయం ఇలాగే ఉంటుంది కాబట్టి, మనం ఏమి మాట్లాడలేం కాని, ఈ కలియికలో మనం బలపడదాం అనే దానికంటే, వాడిని ఎలా తోక్కేద్దాం అని ఇద్దరూ చూస్తుంటే, ఈ కలియిక ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. మనకు, తెలంగాణా రాజకీయాలతో సంబంధం లేకపోయినా, కెసిఆర్, మోడీ కలిసి, ఆంధ్రా పై పన్నిన కుట్రలకు, వెళ్ళు చేసే పనులు కూడా ప్రజల ముందు చెప్పాల్సిన పరిస్థితి. కెసిఆర్ ఎలాంటి వాడో అందరికీ తెలిసిందే. ఒక రోజు సోనియా గాంధీని దేవత అన్నాడు, ఆవిడతో అవసరం తీరగానే దెయ్యం అన్నాడు. ఇప్పుడు మోడీ వంతు..
గత 15-20 రోజులుగా తెలంగాణా రాజకీయం మొత్తం మారిపోయింది. కెసిఆర్ అసెంబ్లీ రద్దు చేసేస్తున్నారు అని, మోడీ దానికి అంగీకరించారు అని, సెప్టెంబర్ 2 న అసెంబ్లీ రద్దు చేస్తారని, ఇలా చాలా మాటలు విన్నాం. కాని, నిన్న సభకి అంత హంగామా చేసిన కెసిఆర్, సభ పూర్తియిన తరువాత, తుస్సు మానిపించారు. గవర్నర్ అప్పాయింట్మెంట్ కూడా కోరారు అని, అసెంబ్లీ రద్దు అయిపోతుంది అంటూ, హంగామా చేసారు. కాని, నిన్న కెసిఆర్ మాత్రం, రద్దు ప్రకటన చెయ్యలేదు. దీని వెనుక అసలు స్టొరీ ఏంటి అని, రాజకీయ వర్గాల్లో డిస్కషన్ నడుస్తుంది.
అసెంబ్లీ రద్దు చెయ్యి, నేను డిసెంబర్ లో ఎన్నికలు వచ్చేలా చేస్తా అని మోడీ హామీ ఇచ్చారు. కాని అసెంబ్లీ రద్దు అయిన వెంటనే, గవర్నర్ పాలన పెట్టి, పార్లమెంట్ ఎన్నికలతో పాటే (మే నెల) చేసేలా మోడీ, షా ప్లాన్ చేసారని, తద్వారా ఈ టైంలో కెసిఆర్ ని బలహీన పరిచి, బీజేపీ తెలంగాణలో పుంజుకునేలా మోడీ/అమిత్ షా ప్లాన్ చేసారని సమాచారం. ఈ విషయం కెసిఆర్ గ్రహించి, నిన్న అసెంబ్లీ రద్దు ప్రకటన చెయ్యలేదు అని తెలుస్తుంది. అయితే, మోడీ, కెసిఆర్ ని బురిడి కొట్టిద్దాం అనుకుంటే, కెసిఆర్ కూడా మోడీ దగ్గర మంచిగా ఉండి, కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం పొందారు. ఇప్పుడు కెసిఆర్, మోడీ/షా లను బురిడీ కొట్టించారా ? లేక మోడీ/షా, కెసిఆర్ ను బురిడీ కొట్టించారా అనేది చూడాలి ? గుడిని మింగే వాడు ఒకడు అయితే .. గుడిని, గుడిలో లింగాన్ని మింగేవాడు మరొకరు అంటే ఇదేనేమో..