ఏపీలో తప్పుడు కేసులు బనాయించి అర్ధరాత్రి, అపరాత్రి అని చూడకుండా అరెస్టులకి బరితెగించే సీఐడీ, కళ్ల ఎదుటే హత్యకేసు నిందితుడున్నా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్టు చేయలేని నిస్సహాయ స్థితికి ఎవరు కారణం అనఏ చర్చలు ఇప్పుడు సాగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారి ఇంటి గోడలు దూకి, తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్టు చేసిన సీఐడీ దారుణాలు వందల్లో ఉన్నాయి. సీఐడీ పెట్టిన కేసుల్లో చాలా కోర్టుల్లోనూ నిలబడలేదు. అటువంటి అక్రమకేసుల్లో థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించిన సీఐడీ కోర్టులో దోషిగా నిలబడినా తీరు మారలేదు. సొంత బాబాయ్‌ని చంపేసిన వైఎస్ వివేకానందరెడ్డిని అరెస్టు చేయడానికి మాత్రం సీబీఐ వీల్లేదంటోంది జగన్ రెడ్డి సైన్యం. సీబీఐ కూడా నిందితుడు అవినాష్ రెడ్డి చెప్పినట్టల్లా ఆడుతోందనే ఆరోపణలున్నాయి. సీబీఐయే అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా వెసులుబాట్లు కల్పిస్తున్నట్టు అనుమానాలు వస్తున్నాయి. తప్పు చేయని తమపై సీఐడీని ఉసిగొల్పి తప్పుడు కేసులు బనాయించి, ఇంట్లో పిల్లల్ని సైతం బెదిరించి అరెస్టులకి తెగబడిన తీరుపై టిడిపి రాష్ట్ర కార్యదర్శి చింతకాయల విజయ్ ప్రశ్నించారు. మాకో న్యాయం, అవినాష్ రెడ్డికి ఓ న్యాయమా అంటూ నిలదీశారు.
news
వైసీపీ కోసం దేశవ్యాప్తంగా పరువుపోగొట్టుకుంటోన్న బీజేపీ
వైసీపీతో ఏం ప్రయోజనాలున్నాయో తెలియదు కానీ, ఒక హంతకుడి కోసం దేశవ్యాప్తంగా సీబీఐ విశ్వసనీయతని కేంద్రంలోని బీజేపీ పణంగా పెట్టేస్తుందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే కేంద్రప్రభుత్వం పంజరంలో చిలుక సీబీఐ అనే విపక్షం ఆరోపణలకి ఇప్పుడు ఒక మాజీ ఎంపీ, ఒక సీఎం బాబాయ్ ని హత్యచేసిన నిందితుడిని అరెస్టు చేయడంలో కేంద్రం ఒత్తిడి గురైన సీబీఐని చూసి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఏపీలో బీజేపీకి వైకాపాకి పొత్తులేదు. కానీ వైసీపీ అధినేత జగన్ రెడ్డి కోసం రాజ్యాంగ వ్యవస్థలు, కేంద్ర దర్యాప్తు సంస్థలని కూడా మేనేజ్ చేస్తున్నారంటే..ఈ నిందితులని కాపాడటానికి పూర్తిగా ప్రయత్నిస్తున్నదని బీజేపీ కేంద్ర పెద్దలేనని సామాన్యులకి సైతం అవగతమైపోయింది. వైఎస్ జగన్ రెడ్డిని ప్రధాని మోదీ బిడ్డలా కాపాడుతున్నారని కేంద్రమంత్రి ఒకరు చెప్పిన అంశం ఇప్పుడు మననం చేసుకుంటే, కొడుకు ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకొచ్చే తండ్రిలా ఉంది కేంద్ర పెద్దల పాత్ర అనేది సుస్పష్టం.
ఎన్ని కోర్టులు ఛీకొట్టినా ఏంటి అవినాష్ రెడ్డి ధైర్యం
కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ అఫిడవిట్ల ప్రకారం వైఎస్ వివేకానందరెడ్డి కేసులో కీలక నిందితుడు. అయినా తనకే పాపం తెలియదంటూనే ఉన్నాడు. పాపం తెలియనప్పుడు, హత్య చేయించనప్పుడు సీబీఐ విచారణని తప్పించుకోవడానికి ఇన్ని ఎత్తులు ఎందుకు వేస్తున్నాడనేది అందరినీ తొలిచేసే ప్రశ్న. సీబీఐ కోర్టు, తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టులలో తనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు. అవన్నీ కొట్టేశారు. ఇతరులతోనూ వివిధ కోర్టుల్లో లెక్కకుమించిన పిటిషన్లు వేయించారు. అవీ పోయాయి. చిట్టచివరి అవకాశంగా సుప్రీంకోర్టు దారి కూడా మూసుకుపోయింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్ విచారణకు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. మెన్షనింగ్ లిస్ట్ లో ఉంటేనే విచారిస్తామన్న న్యాయమూర్తి సంజయ్ కరోల్, అనిరుద్ బోస్ ధర్మాసనం స్పష్టం చేసింది. మెన్షనింగ్ ఆఫీసర్ ముందుకు వెళ్లాలని సూచించడంతో సీబీఐ అరెస్టుకి లైన్ క్లియర్ అయ్యింది. అయినా తాను విచారణకి ఏడు రోజుల తరువాత వస్తానంటూ మళ్లీ కొత్త రాగం అందుకోవడం, తన తల్లికి సీరియస్గా ఉందని చెప్పడంతో మరో డ్రామాకి అవినాష్ రెడ్డి తెరలేపారని స్పష్టం అవుతోంది.
అవినాష్ రెడ్డి తల్లి క్షేమానికై లోకేష్ ప్రార్థన.. ఆమె ప్రాణాలకి ముప్పుందా?
వైఎస్ అవినాష్ రెడ్డి గారి తల్లి క్షేమంగా గుండెపోటు గండం నుంచి గట్టెక్కాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని టిడిపి యువనేత నారా లోకేష్ ప్రార్థించారు. దీని అర్థం ఏంటి అనేది ఇప్పుడు ఏపీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఆమె ప్రాణాలకి ముప్పు ఉందనే భయాందోళనలు నెలకొన్నాయి. వైఎస్ వివేకానందరెడ్డిని చంపేసి గుండెపోటు ప్రచారంలోకి తెచ్చిన గ్యాంగు...ఆ హత్యతో సంబంధం ఉన్న ఒక్కొక్కరినీ అనుమానాస్పద మరణాల పేరుతో తప్పించేస్తున్నారు. ఇప్పుడు అసలు నిందితులు చట్టానికి చిక్కకుండా ఈ గుండెపోటు డ్రామా తలపెట్టారని విశ్లేషిస్తున్నారు రాజకీయ మేధావులు. సీబీఐ విచారణకి రమ్మని నోటీసులు ఇచ్చిన క్రమంలో గుండెపోటుకు గురైన వైయస్ అవినాష్ రెడ్డి గారి తల్లి వైయస్ లక్ష్మమ్మని మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించే అవకాశం ఉంది. హైదరాబాద్ తీసుకొచ్చే వనరులు అవినాష్ రెడ్డికి ఉన్నాయి. అటూ ఇటూ కాకుండా కర్నూలు ఆస్పత్రిలో ఎందుకు చేర్చారనేది ఇప్పుడు మిస్టరీ. వైఎస్ జగన్ రెడ్డి మీడియా కథనాల ప్రకారం అవినాష్ రెడ్డి తల్లి కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో వైద్యులు ఆమెను క్రిటికల్ కేర్ యూనిట్ లో ఉంచి చికిత్స చేస్తున్నారు. రక్తపోటు తక్కువగా ఉండడంతో కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు. ఈ ఆస్పత్రి ఎవరిది అంటే డాక్టర్ కాంతారెడ్డిది. తన అల్లుడైన కార్డియాక్ సర్జన్ హితేష్ రెడ్డి సొంతూరు పులివెందుల మండలం సింహాద్రిపురం. వైఎస్ ఫ్యామిలీ మనుషులే ఈ వైద్యులు. వైజాగ్లో కోడికత్తి గీరుకుంటే, ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని సాంబశివారెడ్డి న్యూరో సెంటర్‌కి ప్రత్యేక విమానంలో తరలిపోయారు జగన్ రెడ్డి. ఆ తరువాత అధికారంలోకి వచ్చాక సాంబశివారెడ్డికి కేబినెట్ ర్యాంకు పదవి ఇచ్చారు. ఇప్పుడు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న అవినాష్ తల్లి లక్ష్మమ్మకి వైఎస్ వివేకానందరెడ్డిలాంటి గుండెపోటు మరణం తెప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సీబీఐ అరెస్ట్ చేస్తే, అది తట్టుకోలేకే తన తల్లి చనిపోయిందని ఒక వెర్షన్ వినిపిస్తారని, అరెస్టయ్యాక ..ఆమె గుండెపోటుతో చనిపోతే అంత్యక్రియల కోసం తీసుకొస్తారని...ఇలా ఆమె ప్రాణాలకి ఎలాగైనా ముప్పు తప్పకపోవచ్చనే ఆందోళనలు ఉన్నాయి. ఇవన్నీ పరిశీలించిన నారా లోకేష్ అవినాష్ రెడ్డి తల్లిగారు గుండెపోటు గండం నుంచి గట్టెక్కాలని, వివేకానందరెడ్డిలా ఆమె బలికాకూడదని దేవుడిని ప్రార్థించారని తెలుస్తోంది.