ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంటే చాలు, ఈ జాతీయ పార్టీలకు ఎందుకో కోపమో కాని, మన మీద ఎప్పుడూ వివక్ష చూపిస్తూనే ఉంటారు... వారికి ఇష్టమైన రాష్ట్రాలకు దోచిపెడుతూ, ఆంధ్రప్రదేశ్ కి మాత్రం విదల్చటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రైల్వే ప్రాజెక్ట్ ల విషయంలో అన్యాయం జరిగేది, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో మాత్రం, ఒక్కటని కాదు, ప్రతి రంగంలోనూ వివక్షే. ప్రధానంగా రహదారుల గురించి మాట్లాడుకుంటే, ఇలాంటి వివక్షే కనిపిస్తుంది. భారతమాల ప్రాజెక్ట్, అనంత-అమరావతి ఎక్ష్ప్రెస్స్ వే, రాజధానిలో ఇన్నర్ రింగ్ రోడ్, ఇలా అనేక ప్రాజెక్ట్ ల కోసం, 2200 కిమీ సంబంధించిన ప్రతిపాదనలను, రాష్ట్రం, కేంద్రానికి పంపించింది. అయితే, కేంద్రంలోని అధికారులు మాత్రం, ఏపి నుంచి ఫైల్ వచ్చింది అనగానే, ఆ ఫైల్ తీసి పక్కన పడేస్తారు. ఇది రొటీన్ గా జరిగే ప్రాసెస్ అని ఢిల్లీలోని అధికారులు అంటున్నారు.

roads 26082018 2

రాయలసీమ జిల్లాలకు, రాజధాని అమరావతి కలుపుతూ, అనంతపురం-అమరావతి ఎక్ష్ప్రెస్స్ వే ను, 2015లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అప్పట్లో రాష్ట్రం పంపించిన ప్రతిపాదాలను, కేంద్రం భేష్ అంటుంది. ఆరు వరుసల రహదారి అద్భుతంగా ఉందని ప్రశంసించింది. 25వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్ చేపడతామని, కేంద్రం అప్పట్లో అంగీకరించింది. అయితే తెలుగుదేశం ఎన్డీఏ నుంచి బయటకు రావటంతో, కేంద్రం నుంచి కొర్రీలు మొదలయ్యాయి. ఆరు వరుసలు, నాలుగు అయ్యాయి. భూసేకరణ, రాష్ట్రమే పెట్టుకోవాలని చెప్పింది. చివరకు ఈ ప్రాజెక్ట్ ని, ఎన్‌హెచ్‌ ప్రాజెక్టుల జాబితాలో చేర్చలేదు. రాష్ట్రం ఎన్ని సార్లు అడిగినా ఇదే తంతు. ఎందుకు చేర్చలేదు అంటే, రూ.25వేల కోట్ల ప్రాజెక్ట్ లు చేర్చటం లేదు అని చెప్పింది. కాని, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని రూ.21వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు మాత్రం ఒకే చెప్పింది.

roads 26082018 3

అమరావతిలో నిర్మాణం చెయ్యాల్సిన ఇన్నర్‌ రింగ్‌రోడ్డు పరిస్థితీ కూడా ఇలాగే ఉంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డును ఎన్‌హెచ్‌ ప్రాజెక్టులో భాగంగా చేపడతామని అంగీకరించి, ఇన్నర్‌రింగ్‌ రోడ్డుకు మొండిచెయ్యి ఇచ్చింది. ఇదే సమయంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కొత్తగా 8 నగరాలకు ఇన్నర్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్‌ ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసింది. గడిచిన నాలుగేళ్లలో మహారాష్ట్రలో 9518 కోట్లతో, కొత్తగా 3,900 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, చత్తీ‌సగఢ్‌‌లకు గడిచిన నాలుగేళ్లలో జాతీయ రహదారుల ప్రాజెక్టుల కింద రూ.42వేలకోట్లపైనే కేటాయించారు. చత్తీ‌సగఢ్‌కు లాంటి చిన్న రాష్ట్రానికి కూడా, రూ.4200 కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే, నాలుగేళ్లలో ఏపీ రహదారులకు ఇచ్చింది మాత్రం 3,280 కోట్లు మాత్రమే.

తెలుగు సినిమా వాళ్ళు, అందులోనే హైదరాబాద్ లో స్థిరపడిన తెలుగు సినిమా వాళ్ళు, ఎలా కెసిఆర్ భజన చేస్తారో చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు అనే మాట కాని, ఆంధ్రప్రదేశ్ అనే మాట ఎత్తటానికి కూడా వీరికి భయం. తెలంగాణా ప్రభుత్వం ఏ కార్యక్రమం ప్రవేశపెట్టినా, కెసిఆర్ అడగకపోయినా వెళ్లి వాలిపోతారు. ఆంధ్రాలో మాత్రం, చంద్రబాబు పిలిచినా రారు. అలాంటి హైదరబాద్ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి, అలనాటి అగ్ర హీరాల్లో ఒకరైన సుమన్, చంద్రబాబు నా రాజకీయ గురువు అని ధైర్యంగా చెప్పారు. ఇలా చెప్పటంలో వింత లేదు. ఎందుకంటే ఎందరికో చంద్రబాబు రాజకీయ గురువు. కాని సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి, కెసిఆర్ కి భయపడకుండా, చంద్రబాబుని పొగడటం మాత్రం, చెప్పుకోవాలి.

suman 26082018 2

తన సినీ ప్రస్థానం 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సుమన్‌కు గుంటూరులో, శనివారం ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా సుమన్ తన సినీ జీవితం గురించి ప్రస్తావిస్తూ, రాజకీయాల పై కూడా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు రాజకీయ గురువని సుమన్ తెలిపారు. చంద్రబాబు సోదరుడు రామమూర్తి నాయుడుతో మంచి పరిచయం ఉందని, ఆయన అప్పట్లో తనను చంద్రబాబుకు పరిచయం చేశారని చెప్పారు. చంద్రబాబు పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆయన కష్టపడే తత్త్వం చూసి నేర్చుకోవాలని అన్నారు. ఎలాంటి వదవిని ఆశించకుండా నిస్వార్థంగా తాను టీడీపీకి ప్రచారం చేశానని ఆయన అన్నారు. తనకు సినిమాలు, రాజకీయాలు రెండు కళ్లవంటివని చెప్పారు.

suman 26082018 3

తొమ్మిది భాషల్లో 400లకు పైగా చిత్రాల్లో నటించే అవకాశం తనకు లభించడం తాను చేసుకున్న అదృష్టమని అన్నారు. హాలీవుడ్ మూవీలో కూడా నటించే అవకాశం తనకు అభించిందని చెప్పారు. గతంలో కూడా అనేసార్లు సుమన్, చంద్రబాబు పరిపాలన పై వ్యాఖ్యలు చేసారు. అలాగే చంద్రబాబు కేంద్రం పై చేస్తున్న పోరాటానికి కూడా మద్దతు పలికారు. అంతే కాదు, సినీ ఇండస్ట్రీలోని టాలీవుడ్ ప్రముఖులు కూడా ఢిల్లీ వెళ్లి ప్రత్యేక హోదా కోసం ప్రధానిపై ఒత్తిడి తేవాలని, సుమన్ అన్నారు. అయితే, ఎవరూ ముందుకు రాలేదు అనుకోండి అది వేరే విషయం. సుమన్ అవుట్ డేటెడ్ హీరో అయినా, ధైర్యంగా తన అభిప్రాయాన్ని చెప్పారు. ఎంతో మంది సినీ హీరోలు ఆంధ్రా ప్రాంతం వారే అయినా, మన రాష్ట్రానికి మద్దతుగా మాట్లాడటానికి సాహసించ లేకపొతున్నారు.

తెలంగాణా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. మరో 8 -9 నెలలు ఉంటే ప్రజా వ్యతిరేకత ఎక్కువ అవుతుందని, కెసిఆర్ ఇప్పుడే అన్నికలకు సై అంటున్నారు. దీని కోసం ప్రధాని మోడీని కూడా ఒప్పించారు. నిన్న ఢిల్లీ వెళ్లి, 20 నిమిషాల పాటు మోదీతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఒక వేళ ఇప్పుడు అసెంబ్లీ రద్దు చేస్తే, అక్టోబర్ లో ఎన్నికలు రాకపోతే అసలుకే మోసం వస్తుంది, అందుకే మోడీని మంచి చేసుకుని, ఆయాన సహకారంతోనే ఎన్నికలకు వెళ్ళాలని కెసిఆర్ భావిస్తున్నారు. ఎన్నికల వ్యవహారంలో బీజేపీ, టీఆర్‌ఎస్ పరస్పర సహకారంతోనే ముందుకు పోతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సెప్టెంబరు 6వ తేదీ.. ఏకాదశినాడు సీఎం కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేయనున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

jagan 26082018 2

అయితే, కెసిఆర్ ముందస్తుకి రెడీ అవుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ పతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కూడా రెడీ అవుతున్నారు. అక్కడ పోటీ చెయ్యటానికి కాదు, కెసిఆర్ ని గెలిపించేందుకు. తెలంగాణాలో కెసిఆర్ ని ఓడించటానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మీడియాలో ఉన్నంతగా కెసిఆర్ పాలన పై, ప్రజల్లో మంచి అభిప్రాయం లేదు. కాంగ్రెస్, తెలుగుదేశం కలిస్తే, కెసిఆర్ ఓడిపోవటం అనేది తధ్యం. అయితే కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి పోటీ చేసే అవకాసం అయితే లేదు. కెసిఆర్ ని ఓడించటానికి, ఇరు పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న వేళ, జగన మాత్రం కెసిఆర్ గెలుపు కోసం, ఇప్పటి నుంచి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

jagan 26082018 3

తెలంగాణాలో జగన్ చేసే ప్రయత్నాలు ఏమి ఉంటాయి అనుకుంటున్నారా ? తెలంగాణాలో, జగన్ పార్టీకి చెందిన, ముగ్గురు ఎమ్మల్యేలు, ఒక ఎంపీకి, భారీ కాంట్రాక్టులు ఉన్నాయి. మిషన్ భగీరథ పనులలో భాగంగా కొన్ని వేల కోట్ల కాంట్రాక్టులు వీరికి ఉన్నాయి. ఇది జగన్ - కెసిఆర్ అవగాహనలో భాగంగా, జగన్ ను ఆర్ధికంగా మరింత బలం చేకుర్చి, చంద్రబాబుని దెబ్బతియ్యటానికి కెసిఆర్ ఎప్పుడో వేసిన ప్లాన్ ఇది. నంద్యాల ఉప ఎన్నికలో కూడా, జగన్ పార్టీ ఖర్చు పెట్టిన డబ్బు అంతా, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ లో వచ్చిన కమీషనే అని, కెసిఆర్ కూడా డబ్బు పంపించనట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు మాత్రం, జగన్ ఎదురు డబ్బులు పెట్టి, కెసిఆర్ కి తోడ్పాటు అందించాల్సిన పరిస్థితి. మళ్ళీ కెసిఆర్ వస్తేనే, మళ్ళీ వాళ్ళ పార్టీ వాళ్లకి కాంట్రాక్టులు వచ్చేది. అందుకే, తెలంగాణాలో ఉన్న రెడ్డి సామాజికవర్గం కెసిఆర్ కి సుప్పొర్ చేసేలా, ఆర్ధికంగా కూడా కెసిఆర్ వైపు ఉండేలా, చెయ్యటానికి జగన్ రంగంలోకి దిగారు. ప్రస్తుతం రెడ్డి సామాజికవర్గం ఎక్కువగా కాంగ్రెస్ లో ఉంది. వీళ్ళను కెసిఆర్ వైపు తిప్పటానికి, జగన్ మోహన్ రెడ్డి, ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణాలో కనుకు కెసిఆర్ మళ్ళీ గెలిస్తే, ఆంధ్రప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో, కెసిఆర్ కూడా జగన్ వైపు ప్రచారం చేసి, ఆర్ధిక సహాయం చెయ్యాలనే ప్లాన్ లో, తతంగం మొత్తం నడుస్తుంది.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇతర హామీల సాధన, రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయం పై తెలుగుదేశం పార్టీ కర్నూలులో శనివారం నిర్వహించిన ధర్మపోరాట దీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రసంగంలో, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తావన వచ్చింది. మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా పై విభజన సమయంలో రాజ్యసభలో నాటి ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీని, ఇటీవల అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ రాజ్యసభ నేతగా హామీలను అమలు చేయాల్సిందేనన్న డిమాండ్ వీడియోలను వేదిక పై ప్రదర్శించారు.

cbn rahul 26082018 2

అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా హామీ అమలు చేసి తీరుతామని దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా హామీ ఇస్తున్నారని చంద్రబాబు అన్నారు. నిన్న రాహుల్, జర్మనీ రాజధాని బెర్లిన్ లో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దానికి చంద్రబాబు కర్నూల్ సభలో స్పందించారు. విభజనను సహేతుక పద్దతుల్లో చేయకుండా చేతులు కాల్చుకున్న కాంగ్రెస్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగిందని, దీనికి కారణం తెలుగోడి సత్తా ఏంటో వారు తెలుసుకోవడమేనని చంద్రబాబు ప్రకటించారు. తెలుగోడి సత్తా ఏంటో 130 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీకి, ఇప్పటికి తెలిసివచ్చిందని అని అన్నారు.

cbn rahul 26082018 3

రానున్న ఎన్నికల్లో కూడా తెలుగోడి దెబ్బ ఎలా ఉంటుందో బీజేపీ, ఆ పార్టీకి అంటకాగుతున్న వైకాపా, జనసేనకు రుచి చూపాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో 25 ఎంపీలను ఇస్తే ప్రధాని ఎవరో మనమే నిర్ణయిస్తామని, మనకు కావాల్సిన పనులు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి చేపించుకుందామని, దీనికి ప్రజల సహకారం కావాలని అన్నారు. "నాకోసం కాదు, ఎంపీల కోసం కాదు.. మన పిల్లల భవిష్యత్‌ కోసం, తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం.. దెబ్బతీసిన వారికి గుణపాఠం చెప్పడానికి 25 ఎంపీలను గెలిపించుకోవడం చరిత్రాత్మక అవసరం. కసిగా పోరాడతాం. కర్నూలు పౌరుషానికి మారుపేరైన కొండారెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్ఫూర్తితో కేంద్రంపై పోరాడదామని" ప్రజలకు పిలుపిచ్చారు.

Advertisements

Latest Articles

Most Read