తెలుగు సినిమా వాళ్ళు, అందులోనే హైదరాబాద్ లో స్థిరపడిన తెలుగు సినిమా వాళ్ళు, ఎలా కెసిఆర్ భజన చేస్తారో చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు అనే మాట కాని, ఆంధ్రప్రదేశ్ అనే మాట ఎత్తటానికి కూడా వీరికి భయం. తెలంగాణా ప్రభుత్వం ఏ కార్యక్రమం ప్రవేశపెట్టినా, కెసిఆర్ అడగకపోయినా వెళ్లి వాలిపోతారు. ఆంధ్రాలో మాత్రం, చంద్రబాబు పిలిచినా రారు. అలాంటి హైదరబాద్ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి, అలనాటి అగ్ర హీరాల్లో ఒకరైన సుమన్, చంద్రబాబు నా రాజకీయ గురువు అని ధైర్యంగా చెప్పారు. ఇలా చెప్పటంలో వింత లేదు. ఎందుకంటే ఎందరికో చంద్రబాబు రాజకీయ గురువు. కాని సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి, కెసిఆర్ కి భయపడకుండా, చంద్రబాబుని పొగడటం మాత్రం, చెప్పుకోవాలి.

suman 26082018 2

తన సినీ ప్రస్థానం 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సుమన్‌కు గుంటూరులో, శనివారం ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా సుమన్ తన సినీ జీవితం గురించి ప్రస్తావిస్తూ, రాజకీయాల పై కూడా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు రాజకీయ గురువని సుమన్ తెలిపారు. చంద్రబాబు సోదరుడు రామమూర్తి నాయుడుతో మంచి పరిచయం ఉందని, ఆయన అప్పట్లో తనను చంద్రబాబుకు పరిచయం చేశారని చెప్పారు. చంద్రబాబు పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆయన కష్టపడే తత్త్వం చూసి నేర్చుకోవాలని అన్నారు. ఎలాంటి వదవిని ఆశించకుండా నిస్వార్థంగా తాను టీడీపీకి ప్రచారం చేశానని ఆయన అన్నారు. తనకు సినిమాలు, రాజకీయాలు రెండు కళ్లవంటివని చెప్పారు.

suman 26082018 3

తొమ్మిది భాషల్లో 400లకు పైగా చిత్రాల్లో నటించే అవకాశం తనకు లభించడం తాను చేసుకున్న అదృష్టమని అన్నారు. హాలీవుడ్ మూవీలో కూడా నటించే అవకాశం తనకు అభించిందని చెప్పారు. గతంలో కూడా అనేసార్లు సుమన్, చంద్రబాబు పరిపాలన పై వ్యాఖ్యలు చేసారు. అలాగే చంద్రబాబు కేంద్రం పై చేస్తున్న పోరాటానికి కూడా మద్దతు పలికారు. అంతే కాదు, సినీ ఇండస్ట్రీలోని టాలీవుడ్ ప్రముఖులు కూడా ఢిల్లీ వెళ్లి ప్రత్యేక హోదా కోసం ప్రధానిపై ఒత్తిడి తేవాలని, సుమన్ అన్నారు. అయితే, ఎవరూ ముందుకు రాలేదు అనుకోండి అది వేరే విషయం. సుమన్ అవుట్ డేటెడ్ హీరో అయినా, ధైర్యంగా తన అభిప్రాయాన్ని చెప్పారు. ఎంతో మంది సినీ హీరోలు ఆంధ్రా ప్రాంతం వారే అయినా, మన రాష్ట్రానికి మద్దతుగా మాట్లాడటానికి సాహసించ లేకపొతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read