ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం.. కేంద్రం సహాయం చేస్తే కాని నేట్టుకురాలేని పరిస్థితి.. కాంగ్రెస్ అన్యాయం చేసింది అని బీజేపీని గెలిపిస్తే, బీజేపీ నమ్మించి మోసం చేసింది. మా హక్కుగా ఇవ్వాల్సినవి మాకు ఇవ్వండి అంటుంటే, మీకు దేశంలోనే అందరి కంటే ఎక్కువ సహాయం చేసామని ఊదరగొడుతున్నారు.. రూపాయి కేంద్రం నుంచి రావాలి అంటే సవాలక్షా ఆంక్షలు.. యుసిలు అని, కమిటీ రిపోర్ట్ లు అని, ఇలా అన్నీ ఉంటే కూడా, రూపాయి ఇవ్వటానికి బాధ.. పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్, 56 వేలు ఖర్చు అయ్యే ప్రాజెక్ట్ కి, ఇప్పటి వరకు ఇచ్చింది 9 వేలు. అది కూడా విడతల విడతలుగా, మనం ఖర్చు చేసిన, కొన్ని నెలలకు.. మనం పెట్టిన ఖర్చు , కేంద్రం ఇచ్చే దాక, మళ్ళీ వడ్డీ భారం మనకి అదనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇలా టోపీ పెట్టిన కేంద్రం, మహారాష్ట్రకు బంగారు కిరీటం ఎలా పెడుతుందో చూద్దాం..

modi 25082018 2

మహారాష్ట్రలో తమ పార్టీ అధికారమే ఉందనో, మరే కారణమో కాని, ఆ రాష్ట్రానికి పారిస్తున్న నిధులు చూసి, ప్రధాని కార్యాలయంలో ఉన్న అధికారాలే అవాక్కవుతున్నారు. గత రెండేళ్లలోనే మహారాష్ట్రలోని ప్రాజెక్టులకు కేంద్రం రూ.63వేల కోట్లకు పైగా ఇచ్చింది. ఈ ఏడాది ఒక్క విడతలో, 13 వేల ఆరు వందల కోట్లు ఇచ్చారు. మహారాష్ట్రలో రైతులకి ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం. మరి మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితిలే ఉన్నాయి కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం పూర్తి చెయ్యాలని, చట్టంలోనే పెట్టారు కదా. పైగా మనకు బోనస్ గా, రాయలసీమ ప్రాంతానికి ఇచ్చిన, 350 కోట్లు, ఇచ్చి మరీ వెనక్కు తీసుకున్నారు.

modi 25082018 3

గత ఏడాది బడ్జెట్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం సాగునీటి పథకాల కోసం రూ.6489 కోట్లను ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని ప్రతిపాదించింది. కేంద్రం నుంచి మాత్రం, ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.59,162 కోట్లుగా చూపించింది. ఇలాంటివి కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీ అడగలేదు. ఎందుకంటే, ఇలాంటి పెద్ద రాష్ట్రం పై, విమర్శలు చేసి, రాజకీయంగా ఇబ్బందులు కొని తెచ్చుకోవు. మరి, ఇలాంటి దోపిడీ ఎవరు పైకి తెస్తారు ? ఒక్కో రాష్ట్రాన్ని ఇలా వేరు చేసి, తాము బలం ఉన్న చోటు దోచిపెడుతుంటే ఎవరు అడగాలి ? మన రాష్ట్రానికి చట్టంలో ఉన్నవి కూడా ఇవ్వకుండా, ఇచ్చినవి వెనక్కు తీసుకని మరీ, సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న, ఇలాంటి పార్టీకి తగిన బుద్ధి ప్రజలే చెప్పాలి.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో వైజాగ్ మెట్రో, ఒక ముఖ్యమైన హామీ. నాలుగేళ్ళు గడిచినా, ఈ ప్రాజెక్ట్ పై కేంద్రం కొర్రీలు పెడుతూనే ఉంది. విజయవాడ మెట్రోకి, వైజాగ్ మెట్రోకి అభ్యంతరాలు పెడుతూనే ఉంది. కాని ఈ రెండు నగరాల కంటే చిన్నదైన, నాగపూర్ లో మెట్రోకి మాత్రం ఎలాంటి అభ్యంతరం లేదు. ఎన్ని సార్లు మోర పెట్టుకున్నా వైజాగ్ మెట్రో పై కేంద్రం ఏ మాత్రం స్పందించలేదు. అందుకే ఇక చంద్రబాబు రంగంలోకి దిగారు. చంద్రబాబు అనేక ప్రయత్నాలు చెయ్యగా, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్ట్ చేపట్టడానికి దక్షిణ కొరియాకు చెందిన బృందం ఆసక్తి వ్యక్తం చేసింది. ఆ బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమై మెట్రో ప్రాజెక్టుల్లో తమ అనుభవాలను వివరించారు.

cbn 25082018 2

విశాఖ మెట్రో ఆంధ్రప్రదేశ్ కు ఒక ప్రతిష్టాత్మక ప్రొజెక్టని ముఖ్యమంత్రి చెప్పారు. విశాఖపట్నం రాష్ట్రానికే ఒక మంచి ఆకర్షణ అని ప్రజల అవసరాలకు అనుగుణంగా మెట్రో ప్రాజెక్ట్ ఏర్పాటు కావాలని ఆకాంక్షిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం, 8 వేల కోట్లు అవసరమనే అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు డీపీఆర్‌ రూపొందించారు. ఈ ఖర్చు, ముందుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సగం-సగం భరించాలని అనుకున్నాయి. అయితే కేంద్రం నుంచి సరైన సహకారం రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం, అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ ద్వారా సగం నిధులు పెట్టి, మిగిలిన సగం నిధులను పీపీపీ విధానంలో సేకరించాలని నిర్ణయించింది.

cbn 25082018 3

దీనికి అనుగుణంగా టెండర్లు పిలవగా ప్రముఖ కంపెనీలు అయిన, టాటా, అదాని, ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ అనే ఈ ఐదు సంస్థలు అర్హత సాధించాయి. ఈ ప్రాజెక్టు పనులు, రెండు ప్యాకేజీలుగా విభజించారు. మొదటి ప్యాకేజిలో సివిల్‌ పనులు వస్తాయి. అంతే కాకుండా, మెట్రో రైలు మార్గానికి అవసరమైన భూమిని సేకరించాలి. ఈ పనులన్నీ అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ చూసుకుంటుంది. రెండవ ప్యాకేజీలో రైలు ట్రాక్‌ నిర్మాణం, సిగ్నలింగ్‌ వ్యవస్థ, జీపీఎస్‌ ఏర్పాటు, ఇతర మెకానికల్‌ పనులు ప్రైవేటు సంస్థ చేపడతాయి. ఈ రెండో దశ పనులను చేపట్టేందుకు దక్షిణ కొరియా సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన రూ.4 వేల కోట్ల నిధులు, కేంద్రం ఇవ్వదు అని స్పష్టం కావటంతో, విశాఖపట్నంలో ప్రభుత్వ భూములను బ్యాంకుల వద్ద తనఖా పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.

పవన్ కళ్యాణ్ స్పీచ్లు ఎప్పుడైనా విన్నారా ? ఎక్కువగా నీతి సూత్రాలు చెప్తూ ఉంటారు. నేను కులానికి వ్యతిరేకం అంటారు, కట్ చేస్తే, ఆయన పార్టీలో ఇప్పటి వరకు చేరింది, 90 శాతం ఆయన కులం వారే.. అన్ని పార్టీల్లో వ్యాపారస్తులు ఉన్నారు అంటారు, కట్ చేస్తే ఆయన వెనుక ఉండే తోట చంద్రశేఖరే పెద్ద వ్యాపారవేత్త.. అన్ని పార్టీలకు చానల్స్ ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి అంటారు, కట్ చేస్తే ఆయనకు ఇప్పుడు రెండు చానల్స్, ఒక పేపర్ వచ్చి చేరాయి.. డబ్బులు లేవు అంటారు, ఎకరాలు ఎకరాలు కొంటున్నాడు.. ఇక వేరే పార్టీ వాళ్ళు వస్తే చేర్చుకునేది లేదు అంటారు, కట్ చేస్తే, ఇప్పటికే ఆయన 20 మంది ఎమ్మల్యేలతో టచ్ లో ఉన్నారు అంట.. వీళ్ళ మాటలు ఇలా ఉంటాయి మరి.

pk 25082018 2

పవన్ తో 20 మంది ఎమ్మల్యేలు టచ్ లో ఉండటం ఏమిటి అనుకుంటున్నారా ? ఈ వ్యాఖ్యలు చేసింది వాళ్ళ పార్టీ నేతలే. పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలో చేరడానికి ఏపీకి చెందిన 20 ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ కన్వీనర్ వి.పార్థసారథి తెలిపారు. ఆయ‌న నిన్న తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో జ‌న‌సేన నేత‌ల‌తో స‌మావేశ‌మై ఈ వివ‌రాలు వెల్ల‌డించారు. ఆ ఎమ్మెల్యేలంతా ఇప్పటికే పవన్‌తో చర్చించారని, ఆయన నిర్ణయం తీసుకుని, తేదీ ఖరారు చేసిన తర్వాత వారంతా వచ్చి పార్టీలో చేరుతారని ఆయ‌న పేర్కొన్నారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు ముఖ్యనేతలు కూడా జనసేనలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

pk 25082018 3

పాత, కొత్త తరం మేలు కలయికతో పార్టీ ముందుకెళ్తుంద‌ని, పార్టీలో నవతరానికి 60 శాతం సీట్లు ఇస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల కోసం రాష్ట్రం మొత్తానికి ఓ మేనిఫెస్టో, ఒక్కో నియోజకవర్గాని ఒక్కొటి చొప్పున మేనిఫెస్టోలు తయారు చేస్తామని ఆయ‌న‌ వివరించారు. ఈయన ఈ వ్యాఖ్యల చేసారో లేదో, జన సైనికులు డాన్స్ లు వేస్తున్నారు. చూసారా, మా నాయకుడు దుమ్ము దులుపుతున్నాడు. మా నాయకుడు కోసం, 20 మంది ఎమ్మల్యేలు లైన్ లో ఉన్నారు. ఇది మా సత్తా అంటూ డాన్స్ వేస్తున్నారు. అయితే, ఈ వ్యాఖ్యలు చేసిన ఆ జనసేన నాయకుడుని, ఈ వ్యాఖ్యలు చూసి డాన్స్ వేస్తున్న పవన్ ఫాన్స్ ని చూసి, ప్రజలు నవ్వుకుంటున్నారు.

వరుణుడి కరుణతో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో నెల రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది. జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి నీరు వస్తుంది. సాగర్ కు వరద నీటి ప్రవాహం పెరిగింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో పుష్కలంగా నీటి నిల్వలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కుడి కాలువకు సాగు నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు శనివారం ఉదయం నీరు విడుదల చేయనున్నారు. సీఎం చంద్రబాబుతో మంత్రి ఉమా, అధికారుల భేటీ అయ్యారు. రైతులు వరి పంట వేసుకునేందుకు ఈ సందర్భంగా అనుమతి ఇచ్చారు. సాగు నీటి ప్రణాళికను రూపొందించాలని నీటి పారుదల శాఖకు ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు అందాయి.

sagar 25082018 2

వరి సాగుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయటంతో ఆయకట్టు అన్నదాతల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. కుడి కాలువ పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11.16 లక్షల ఎకరాల మెట్ట, మాగాణి భూములకు నీటిని సరఫరా చేయాలంటే 132 టీఎంసీలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు లింగంగుంట్ల సర్కిల్ నీటి పారుదల శాఖ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆయకట్టులో వరి సాగుకు మూడేళ్ళ అనంతరం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆయకట్టు అన్నదాత లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

sagar 25082018 3

వరి సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. విత్తన సేకరణలో నిమగ్నమయ్యారు. మొత్తం మీద సాగర్ ఆయకట్టులో ఈ సారి వరి సాగుకు అనుకూల పరిస్థితులు నెలకొనటంతో వ్యవసాయ కార్మికులకు చేతినిండా పని దొరకనుంది. కూలీలు పట్టణాలకు వలస వెళ్ళే పరిస్థితులు తొలగిపోనున్నాయి. దాదాపు మూడు లక్షల ఎకరాలలో వరి సాగు అవుతుందని అంచనా. ఐతే మాగాణి భూముల్లో కూడా కంది, మినుము, పెసర తదితర పంటలను వేలాది ఎకరాలలో రైతులు సాగు చేశారు. నెల రోజుల క్రితం సాగు చేసిన పంటను తొలగించి వరి సాగు చేసేందుకు రైతులు సిద్దమవుతున్నారు. మూడేళ్ళ అనంతరం ఆయకట్టు భూముల్లో సాగు సందడి నెలకొంటోంది.

Advertisements

Latest Articles

Most Read