ప్రకృతి విపత్తులో అతలాకుతలమైన రాష్ట్రాన్ని సమాఖ్య స్ఫూర్తితో ఉదారంగా ఆర్థిక చేయూతనందించి అండగా నిలువాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయకపోగా కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. కేరళీయుల కన్నీటి కష్టాలకు చలించి మానవతా హృదయంతో రూ.700 కోట్ల విరాళం అందజేసేందుకు ముందుకొచ్చిన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఎఇ)ని అడ్డుకొంటామని మోడీ ప్రభుత్వం సంకేతాలిస్తోంది. విపత్తు నుంచి తేరుకోవాలంటే ఆర్థిక, సాంకేతిక సేవలు కేరళకు అత్యవసరం. పునరావాస, పునిర్నిర్మాణ పనులకు రూ.700 కోట్లు ఆర్థిక సహాయం అందిస్తామని యుఎఇ ప్రకటించినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. యుఎఇతో కేరళకు ప్రత్యేక ఆత్మీయ సంబంధముందని, మళయాళీలు దూరంగా ఉన్న సొంత ఇంటిలా భావిస్తారని పేర్కొన్నారు.

kerala 22082018 2

అయితే ఈ సహాయాన్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుమతించకపోవచ్చని అత్యంత ఉన్నతస్థాయి వర్గాలు అందించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. 'ఏ దేశమైనా సరే, విదేశాల నుంచి వచ్చే ఆర్థిక సహాయాన్ని కేంద్రం ఇప్పటి వరకు అంగీకరించలేదు. యుఎఇ ప్రకటించిన సాయం విషయంలోనూ ఇదే జరగవచ్చు' అని మంత్రివర్గ స్థాయి అధికారి ఒకరు తెలిపారు. అయితే విదేశాంగ మంత్రిత్వ శాఖదే తుది నిర్ణయంగా ఉంటుందని సదరు అధికారి పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ విషయమై ప్రతిపాదన కానీ, ఆఫర్‌ కానీ తమ ముందుకు రాలేదని విదేశాంగమంత్రిత్వ శాఖ పేర్కొంది. విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉందని, అవసరమైతేనే విదేశీ సాయం తీసుకోవాలని భారత్‌ గతంలో ఈ నిర్ణయం తీసుకుంది. దేశీయ ప్రయత్నాల ద్వారానే ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాలని కేంద్రం భావిస్తోంది. అయితే విదేశాల్లో ఉంటున్న భారతీయులు కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు నేరుగా ఆర్థిక సాయం చేయొచ్చు అని కేంద్రం తెలిపింది.

kerala 22082018 3

యూఏఈ, ఖతార్‌, మాల్దీవుల ప్రభుత్వాలు ఇప్పటికే ఆపన్న హస్తాన్ని అందించడానికి ముందుకొచ్చాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వరదలపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వరదలకు ధ్వంసమైన ఇళ్ల పునర్నిర్మాణానికి ఐక్యరాజ్య సమితి ఎయిడ్‌ ఏజెన్సీల సహకారం తీసుకోవాలని ప్రధాని మోదీకి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విజ్ఞప్తి చేశారు. ఐక్య రాజ్య సమితి కూడా చేయూత అందించేందుకు ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, విదేశీ సాయాన్ని తీసుకోరాదని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు దాదాపు రూ.20వేల కోట్ల నష్టం వాటిల్లిందని విజయన్‌ తెలిపారు. కాగా ఆయన కేంద్రాన్ని రూ.2600కోట్లు సాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం రూ.600కోట్ల సాయం అందజేసింది. రాష్ట్రంలో వరదల కారణంగా రెండు వందల మందికి పైగా మరణించారు. దాదాపు 14లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

ఎప్పుడూ శాంతంగా ఉండే డిప్యూటీ స్పీకర్‌ మండలి ‘బుద్ధ’ప్రసాద్‌కు కోపమొచ్చింది. అవనిగడ్డ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి గైనకాలజిస్ట్‌ డిప్యుటేషన్‌ విషయంలో డీసీహెచ్‌ఎస్‌ (డిస్ట్రిక్ట్‌ కో-ఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌) జ్యోతిర్మయి వ్యవహారశైలిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అవనిగడ్డ గాంధీక్షేత్రంలో మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో బుద్ధప్రసాద్‌ గైనకాలజిస్ట్‌ డిప్యుటేషన్‌ విషయంలో జరిగిన వివరాలు తెలియజేశారు. ఏరియా ఆసుప్రతికి ఇటీవలే వచ్చిన గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ నాగలక్ష్మిని మూడు రోజుల క్రితం మచిలీపట్నానికి డిప్యుటేషన్‌ ఇచ్చిన విషయాన్ని అభివృద్ధి కమిటీ సభ్యులు చెప్పడంతో.. ఆపాలని కలెక్టర్‌కు సూచించానన్నారు. ఆయన వెంటనే రద్దు చేస్తున్నట్లు మెసేజ్‌ చేశారని తెలిపారు.

buddha 220820182

పాముకాటు బాధితులను పరామర్శించడానికి వచ్చిన డీసీహెచ్‌ఎస్‌. నాగలక్ష్మిని రిలీవ్‌ ఎందుకు చేయలేదని అడగటమే కాకుండా రాజకీయ ఒత్తిడి తీసుకువస్తారా.. అంటూ అనుచితంగా మాట్లాడినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. కలెక్టర్‌ ఆదేశాలను పక్కనపెట్టి.. రిలీవ్‌ ఎందుకు చేయరంటూ డీసీహెచ్‌ఎస్‌ ఒత్తిడి చేయడం దురదృష్టకరమన్నారు. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాననీ, వెంటనే విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలిపానన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వైద్యశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య జరిగిన ఘటనపై విచారణ నిర్వహిస్తున్నారనీ, ఉదయం ఫోన్‌ చేసి విచారం వ్యక్తం చేసినట్లు చెప్పారు. డిప్యుటేషన్‌ వేసే అధికారం డీసీహెచ్‌ఎస్‌కు లేదని మాలకొండయ్య చెప్పారన్నారు.

buddha 22082018 3

అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి రోగులు రావటంలేదా..?ఇక్కడి వారు ప్రజలు కాదా, అంటూ డీసీహెచ్‌ఎస్‌ను ప్రశ్నించారు. గతేడాది ఆసుపత్రికి 70వేల 201 మంది రోగులు వచ్చారనీ, ఈ ఏడాది ఇప్పటి వరకూ 43 వేల మంది వచ్చారని తెలిపారు. అధికారులు మంచిచేస్తే నెత్తిన పెట్టుకుంటాననీ, ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. తొలిసారిగా అధికారపక్షం రోడ్డెక్కే పరిస్థితి తీసుకువచ్చారనీ, అవసరమైతే తానే రోడ్డెక్కుతానని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి 24 గంటలూ కష్టపడితే చాలదనీ, అధికారులంతా పనిచేయాలన్నారు. ప్రత్యేకాధికారులపై గురుతర బాధ్యత ఉందనీ, ప్రతి రోజూ పరిశీలిస్తుంటాననీ, చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి... మొన్నటి దాక, తెలుగుదేశం పార్టీతో ఉన్న పవన్ కళ్యాణ్, సడన్ గా ప్లేట్ మార్చేసారు... మోడీని ఒక్క మాట అనకుండా, ప్రత్యెక హోదా పై, విభజన అంశాల పై ఏమి చేస్తాడో చెప్పకుండా, కేవలం రాష్ట్రం కోసం కష్టపడుతున్న చంద్రబాబునే టార్గెట్ చేస్తూ, గత నాలుగు నెలలుగా పవన్ హంగామా చేస్తున్నాడు... మోడీని ఒక్క మాట అనకుండా, కేంద్రం పై ఎదురు తిరుగుతున్న చంద్రబాబుని ఎందుకు నిందిస్తున్నారో, పవన్ ఎజెండా ఏంటో అని ప్రజలు అనుకుంటున్నారు... అయితే ఇదంతా బీజేపీ ఆడిస్తున్న ఆట అని, కేవలం తనకి ఎదురు తిరిగాడు అనే కసితో, చంద్రబాబు పై అన్ని అస్త్రాలని ప్రయోగిస్తుందని ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే అర్ధం చేసుకుంటున్నారు.

pawnvision 22082018 2

ఇది ఇలా ఉండగా, ఇప్పుడు ఈ ముసుగు ఆటలు లేకుండా, పవన్, జగన్, బీజేపీ బహిరంగగా కలిసి, చంద్రబాబు పై దాడి చెయ్యటానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా, వైసీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే ఒక అవగాహానకు వచ్చేసాయి. ఈ రోజు వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, ఇవన్నీ అవును అనే సమాధానం వస్తుంది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విజన్‌ ఉన్న నాయకుడని తిరుపతి వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ కితాబిచ్చారు. మంగళవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే జనసేన, వైసీపీ కలుస్తాయని చెప్పారు. ఎన్నికల్లో కూడా కలిసే పోటీచేస్తాయని పునరుద్ఘాటించారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి తాను తిరుపతి ఎంపీగా పోటీ చేశానని, అప్పుడు పవన్‌ను దగ్గరగా గమనించానని, సమాజం పట్ల ఆయనలో బాధ్యత కనిపిస్తోందని తెలిపారు.

pawnvision 22082018 3

ప్రజానేతగా జగన్‌.. ప్రజా ద్రోహిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారన్నారు. వైసీపీలో విశ్వాసంగా పనిచేస్తున్నానని, ఈసారి కూడా తిరుపతి నుంచి పోటీకి తనకే అవకాశం రావచ్చని అభిప్రాయపడ్డారు. వరప్రసాద్, పవన్ కల్యాణ్ స్నేహితులన్న సంగతి తెలిసిందే. తాజాగా వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2019 ఎన్నికల్లో పవన్ వైసీపీకి మద్దతిస్తారని.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తనతో చెప్పారని వరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు బాగా అవినీతి చేస్తున్నారని, అందుకే జగన్ తో కలిసి వెళ్లి, చంద్రబాబుని ఓడించాలి అని పవన్ చెప్పినట్టు, వరప్రసాద్ గతంలో కూడా మీడియాతో చెప్పారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుకు మద్దతు తెలపనని జనసేనాని స్పష్టం చేశారని వరప్రసాద్ చెప్పుకొచ్చారు. కేవలం, రాష్ట్రానికి న్యాయం చెయ్యండి అని అన్నందుకు, బీజేపీ, పవన్, జగన్, ఇలా ఎగబడుతూ, చంద్రబాబుని దించటానికి నానా అవస్థలు పడుతున్నారు.

తెలంగాణలో పొత్తులు ఉంటాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అక్కడి నాయకులు, కేడర్‌తో చర్చించిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుందామని వ్యాఖ్యానించారు. తెలంగాణతోపాటు జాతీయ రాజకీయాల్లో పోషించాల్సిన పాత్రపై టీడీపీ దృష్టిసారించింది. దీనిపై చంద్రబాబు చర్చను ప్రారంభించారు. అందుబాటులో ఉన్న కొందరు మంత్రులు, ఎంపీలతో మంగళవారం మధ్యాహ్నం సుమారు మూడు గంటలపాటు ఆయన మేధోమథనం జరిపారు. మంత్రులు కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, నారాయణ, సుజయ్‌ కృష్ణ రంగారావు, లోకేశ్‌, ఎంపీలు రామ్మోహన నాయుడు, సీఎం రమేశ్‌, గరికపాటి మోహనరావు తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

kcr 22082018 2

ఈ సందర్భంగా, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నందున టీడీపీ రాజకీయ వైఖరి ఎలా ఉండాలన్న దానిపై చర్చ జరిగింది. ‘‘తెలంగాణలో పార్టీని, కేడర్‌ను కాపాడుకోవాలి. దానికి ఎటువంటి వ్యూహం అవసరమో ఆ ప్రకారమే వెళ్దాం’’ అని చంద్రబాబు అన్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓట్లు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు.. టీఆర్‌ఎస్‌, కాంగ్రె స్‌ పరిస్థితిపై మంత్రులు, ఎంపీలు తమ తమ అభిప్రాయాలు చెప్పారు. నాయకులు వెళ్లిపోవడంతో కార్యకలాపాలు పెద్దగా లేవని, కానీ, తెలంగాణలో టీడీపీ ఓటింగ్‌ కొంతమేర నిలిచే ఉందని అభిప్రాయపడ్డారు.

kcr 220820183

‘‘టీఆర్‌ఎస్‌ రాజకీయంగా బీజేపీకి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ నిర్ణయాలు.. రాజకీయ సంబంధాలు అదే కోణాన్ని సూచిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ బీజేపీకి దగ్గరైతే.. ఆ పార్టీకి టీడీపీ దూరంగా ఉండక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. టీఆర్‌ఎ్‌సతో అధికారికంగా పొత్తు ఉండాలని బీజేపీ కోరుకుంటోంది. అలా పొత్తు పెట్టుకొంటే టీఆర్‌ఎస్‌ మునిగి పోతుంది. పొత్తు లేకపోతే బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు. దేశవ్యాప్తంగా ఆ పార్టీ చులకన అవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి’’ అని నాయకులు అన్నారు. దాంతో, ఎవరు ఏం చేస్తారో.. ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో చూద్దామని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Advertisements

Latest Articles

Most Read