కూర్చొని తిన్నా తరగని ఆస్తి. వేలు, లక్షలు కాదు. ఏకంగా రూ.12,000 కోట్లు. దానికి రోజూ కొన్ని కోట్లు జమవుతున్నాయి తప్ప తగ్గడం లేదు. అలాంటి ఆస్తిపరుడైన కుబేరుడు తన చిన్నబుద్ధిని బయటపెట్టుకున్నాడు. పెద్దనోట్ల రద్దు సమయంలో చకచకా వేల కోట్లు సంపాదించిన ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ. వేల కోట్ల రూపాయలకు అధిపతి అయిన పేటీఎం సృష్టికర్త విజయ్ శేఖర్ కేరళ వరద బాధితులకు పదివేల రూపాయల విరాళం ఇచ్చారు. అంతే కాదు ‘‘నేను నా వంతుగా కేరళ ప్రజలకు రూ 10000 విరాళమిచ్చాను. మీరు కూడా పేటీఎం ద్వారా మీ విరాళాలను చెల్లించండి’’ అని విజయ్ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు మండిపడితున్నారు. దేశంలోనే అత్యంత పిన్న వయస్సులో బిలియనీర్‌గా అవతరించిన విజయ్ పదివేలు విరాళం ఇవ్వడం ఏంటని పెదవి విరుస్తున్నారు.
కేవలం 48 గంటల్లోనే పేటీఎం ద్వారా మూడు కోట్ల రూపాయల విరాళాలు వసూలయ్యాయి. కానీ దాదాపు రెండు బిలియన్ డాలర్ల సంపద ఉన్న పేటీఎం అధినేత పదివేల రూపాయలు విరాళం ఇచ్చాడు చూడండంటూ విజయ్ చేసిన ట్వీట్‌ను స్ర్కీన్ షాట్ తీసి మరీ పోస్ట్ చేస్తున్నారు. 2017 డిసెంబర్లో ఫ్లాగ్‌డే సందర్భంగా విజయ్ భారత సైనిక దళాలకు 500 రూపాయలు విరాళం ఇలాగే విమర్శల పాలయ్యాడు. బిలియనీర్‌గా ఉన్న వ్యక్తి అంతకొద్ది మొత్తం ఇవ్వడంపై విమర్శలు ఎదురయ్యాయి. అనంతరం ఆయన స్క్రీన్‌షాట్‌ను తొలగించారు. అయితే కొందరు ఆయనకు మద్దతుగా కూడా నిలిచారు.
అయితే, ఇంత డబ్బు అర్జిస్తున్న పేటీఎం సంస్థ వ్యవస్థాపకుడు కేవలం పది వేలు సహాయం చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. రూ.12 వేల కోట్ల అధిపేతి అయిన విజయ్ శేఖర్ అంత తక్కువ మొత్తం సహాయం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ ఆయన భారత ఆర్మీకి రూ.500 విరాళం ఇచ్చి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా అలానే ట్రోలింగ్ కు గురవుతున్నారు. అయితే, వెంటనే తేరుకున్న విజయ్ శేఖర్ సదరు ట్వీట్ ను డిలీట్ చేశారు. పేటీఎం ప్రజల ద్వారా రూ. 3 కోట్ల విరాళాలు సేకరించింది. ఈ మొత్తాన్ని కేరళకు అందించనుంది.