సోమవారం రాత్రి సచివాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు, రాష్ట్రంలో నీటిపారుదల రంగానికి సంబంధించి, వరదలకు సంబంధించి జరుగుతున్న విషయాలు చెప్పారు. ఆయన ప్రెస్ మీట్ పూర్తి అయిన తరువాత, ఒక విలేకరి ఓ ప్రశ్న అడిగారు ? ఇన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు అంటున్నారు, మరి కొత్తగా ఎన్నివేల ఎకరాలు భూమి స్థిరీకరణ జరిగింది అని ప్రశ్నించారు. దానిపై ముఖ్యమంత్రి సమాధానం చెబుతూ "కొత్తగా స్థిరీకరణ సంగతి పక్కన పెట్టండి, పట్టిసీమ ప్రాజెక్టు కట్టకపోతే, కృష్ణాడెల్టా పరిస్థితి ఏమిటో, ఒకసారి ఆలోచించండి. పట్టిసీమ వల్ల, గత మూడేళ్ల నుంచి జూన్‌లోనే, ఈ ప్రాంతానికి నీరు ఇచ్చి, దాదాపు 13లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసిన సంగతి తెలుసుకదా..? అదే పట్టిసీమ కట్టకపోతే, ఈ ప్రాంత రైతుల జీవితాలన్నీ గాల్లో దీపాలే కదా ? అంటూ సమాధానం చెప్పారు.

cbn 21082018 2

ఇప్పటి వరకు 9 ప్రాజెక్టులు ప్రారంభించామని, మరో 6 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. మొత్తం 90వేల కోట్ల వ్యయంతో 29 ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకురావాలనేదే తమ లక్ష్యమన్నారు. ఇందుకోసం రూ. 33వేల 720 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. మరో ఆరువేల కోట్ల ఖర్చుతో గోదావరి నీటిని పెన్నాకు తీసుకువెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా పెండింగ్‌లో ఉన్న 57 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయడం ద్వారా కరవును అధిగమించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఫలితంగా రెండుకోట్ల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, మరో కోటి ఎకరాల మేర ఉద్యానవన పంటలను సాగులోకి తీసుకు వస్తామన్నారు. ప్రస్తుతం కోటీ పది లక్షల ఎకరాలకు నీరందుతోందని తెలిపారు.

cbn 21082018 3

జలవనరుల నిర్వహణ ద్వారా 2.3 మీటర్ల వరకు భూగర్భ జలాలు పెరిగాయన్నారు. స్మార్ట్ వాటర్‌గ్రిడ్ ఏర్పాటుతో ప్రజలకు జల భద్రత కల్పిస్తామన్నారు. వంశధార నుంచి ఐదు నదులు అనుసంధానం చేసి మహా సంగమానికి శ్రీకారం చుడతామని ప్రకటించారు. రాయలసీమ ప్రాంతానికి గతంలో కంటే ఈ సారి ఎక్కువ నీరందించ గలిగామన్నారు. అసాధారణ పరిస్థితులను సాధ్యం చేయగలిగామనే తృప్తి మాకు ఉందన్నారు. వర్షం ఎక్కువగా కురిసే జిల్లాతో పాటు పేదరికం, వలసలు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయని అలాంటి జిల్లాను సస్యశ్యామలం చేయగలిగిన ఘనత తమకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు నిండి నీరు ప్రవహిస్తోందని వందల టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోతోందని వివరించారు.

అమరావతి బాండ్ల ద్వారా నిధులు సేకరణ ప్రభుత్వానికి ముమ్మాటికీ లాభదాయకమేనని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలూ ఇలాగే బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించుకుంటున్నాయని తెలిపారు. ఇప్పుడు తాము తెచ్చిన దాని కన్నా తక్కువ వడ్డీరేటుకు అంటే 10 శాతానికి ఇప్పిస్తే అరేంజ్‌ ఫీ ఇప్పిస్తామని ప్రతిపక్ష నేతలకు, మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావుకు, వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. సోమవారం సచివాలయంలో కుటుంబరావు విలేకరులతో మాట్లాడారు. ‘ బ్లాక్‌మనీ అని అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. బ్లాక్‌మనీని బాండ్లలో పెట్టడం ఎలా సాధ్యమవుతుంది? ఈ నెల 27న బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో పెట్టుబడి పెట్టినవారి అందరి పేర్లు ఉంటాయి. అందరూ చూడవచ్చు. ప్రతిపక్షం చేసే ఆరోపణల్లో నిజం లేదు. కొన్ని పత్రికల రాతలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. "

kutumbrao 21082018 2

"కొంత మంది రిటైర్డ్‌ అధికారులు తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇప్పటి వరకు రూ.1,500 కోట్లే ఇచ్చింది. ప్రపంచబ్యాంకు రుణం మంజూరు ఆలస్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో పనులు ఆగకుండా.. అవకాశం ఉన్న అన్ని మార్గాల్లో సీఆర్డీఏ నిధులు సేకరిస్తోంది. సంస్థ ఆదాయ మార్గాలు, వడ్డీ, అసలు చెల్లింపుల సామర్థ్యం వంటి పలు అంశాల ఆధారంగా వడ్డీరేటు నిర్ణయిస్తారు. ట్రిపుల్‌ ఏ రేటింగ్‌ అయితే ఒక రేటు, డబుల్‌ ఏ రేటింగ్‌ అయితే ఒక రేటు ఉంటుంది. మనకు ఏ ప్లస్‌ రేటింగ్‌ వచ్చింది. ఈ రేటింగ్‌కు ఈ రోజు వడ్డీరేటు 10.48 శాతంగా ఉంది. మనం చెల్లించేది 10.32 శాతమే. తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ భగీరఽథ ప్రాజెక్టు నిధులకు 10.5 శాతం వడ్డీరేటు చెల్లిస్తోంది."

kutumbrao 21082018 3

"దేశంలోని పలు ప్రభుత్వాలు ఈ విధంగా బాండ్లు విడుదల చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌ పవర్‌ కార్పొరేషన్‌, జీహెచ్‌ఎంసీ వంటివి కూడా బాండ్ల ద్వారా రుణం తీసుకున్నాయి. యూపీ బాండ్లకు ప్రభుత్వ సబ్సిడీలను కూడా సెక్యూరిటీగా పెట్టారు. సాధారణంగా బ్యాంకులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడంతోపాటు భూములు కూడా తాకట్టు పెట్టాలి. అమరావతి బాండ్లకు ప్రభుత్వం గ్యారెంటీ మాత్రమే ఇస్తోంది. భూములు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. బాండ్ల జారీలో సీఆర్డీఏ ఎటువంటి తప్పూ చేయలేదు. అప్పు చేయకుండా కేంద్రంలో కూడా ఏ పనులూ జరగవు. జాతీయ రహదారుల నిర్మాణానికి అప్పు తీసుకుంది." అని కుటుంబరావు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ ఎక్కడ ఉంటుందనే దానిపై చర్చోపచర్చలు జరిగాయి. ఏపీకి తరలిపోతుందని చాలా విశ్లేషణలు వచ్చాయి. అనేక మంది సినీ ప్రముఖులు విశాఖలో స్టూడియోలు కట్టేందుకు స్థలాలు కూడా కొనుగోలు చేశారన్న ప్రచారమూ జరిగింది. అయితే టాలీవుడ్ పెద్దలు ఎప్పుడూ చిత్ర పరిశ్రమ తరలిపోతుందనే ప్రకటనలు చేయలేదు. పైగా హైదరాబాద్‌లో చిత్ర పరిశ్రమ పాతుకుపోయిందని, తరలిపోవడమనేది సాధ్యం కాదని స్పష్టం చేశారు కూడా. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌ను కూడా చిత్ర నిర్మాణాలకు కేంద్రంగా చేయాలని నిర్ణయించారు.

cine 21082018 2

ఇప్పటికే ఈ విషయంపై ఇండస్ట్రీ వర్గాలతో సంప్రదింపులు జరుగుతున్నట్లుగా కొద్ది రోజుల క్రితం వెల్లడించారు. విశాఖ, అమరావతిల్లో ఏ ప్రాంతాన్ని పరిశ్రమలకు కేంద్రంగా చేయాలన్న దాని పై సినీ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నామని తనను కలిసిన సినీ పరిశ్రమ వర్గాలతో చంద్రబాబు వ్యాఖ్యానించారు. పలువురు విశాఖ అయితే సినీ పరిశ్రమకు బాగుంటుందని సలహా ఇచ్చారన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ హైదరాబాద్‌లో నిలదొక్కుకునేలా ఒకప్పుడు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించామన్నారు. ఇప్పుడు ఏపీలో కూడా పరిశ్రమ అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటామన్నారు. సహజ అందాలతో ఉండే విశాఖ, గోదావరి జిల్లాలు సినిమా షూటింగ్‌లకు కేంద్రంగా ఉంటున్నాయని చంద్రబాబు గుర్తు చేశారు.

cine 21082018 3

అయితే, ఇవి మాటల వరుకే కాకుండా, చేతల్లో కూడా చూపించాలని చంద్రబాబు రంగంలోకి దిగారు. ముందుగా చిన్న సినిమాలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం వరాలు కురిపించింది. చిన్న సినిమాలకు ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు ఇవ్వనుంది. రూ.4కోట్ల లోపు సినిమా తీస్తే చిన్న సినిమాగా పరిగణిస్తామని ఫిల్మ్, టెలివిజన్ & థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంబికా కృష్ణ తెలిపారు. సినిమాపై వచ్చే పన్ను మొత్తం వెనక్కి ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. జీఎస్టీలో రాష్ట్ర ప్రభుత్వ 9 శాతం పన్ను రద్దు చేస్తామని చెప్పారు. పన్ను రాయితీలు, లోకేషన్లు ఉచితంగా ఇస్తామని అంబికా కృష్ణ పేర్కొన్నారు.

గత కొన్ని రోజులుగా మన రాష్ట్రంలో, అతి పెద్ద కుట్ర మొదలైంది. సాక్షాత్తు కలియుగ దైవం వెంకన్నను రాజకీయాల కోసం వాడుకుని, పబ్బం గడుపుకునే వాళ్ళను చూసాం. తిరుమలలో ఎన్నో నేరాలు, ఘోరాలు జరిగిపోతున్నాయి అంటూ, ఒక అభూత కల్పనకు తెర లేపారు. దీని డైరెక్షన్ అంతా ఢిల్లీ నుంచే జరిగింది. మన రాష్ట్రంలో ఇన్ని కుట్రలు జరుగుతుంటే, పక్క రాష్ట్రాలు మాత్రం తిరుమలనే ఆదర్శంగా తీసుకుంటున్నాయి. తిరుమల భేష్ అంటూ, మేము తిరుమలను చూసి నేర్చుకుంటాం పాఠాలు చెప్పమంటున్నాయి. ఒడిశాకు చెందిన ఉన్నతస్థాయి కమిటీ సోమవారం తిరుమల శ్రీవారి ఆలయం, తితిదే పాలనావ్యవస్థను అధ్యయనం చేసింది.

tirumala 21082018 2

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒడిశా రాష్ట్రం పూరిలోని శ్రీ జగన్నాథస్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటుచేసింది. తిరుపతిలోని శ్రీ పదావ్మతి విశ్రాంతిగృహంలో కమిటీ సభ్యులతో తితిదే ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ సమావేశమయ్యారు. ఇందులో శ్రీవారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాల నిర్వహణ, తిరుమలలో భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ, పారిశుద్ధ్యం, ట్రస్టులు, పథకాలు, ధర్మప్రచార కార్యక్రమాలు, ఎస్వీబీసీ, గోశాల, వసతి కల్పన, నిఘా, భద్రతా వ్యవస్థ తదితర అంశాలను ఈవో వివరించారు.

tirumala 21082018 3

అనంతరం తితిదే పరిపాలనా భవనంలోని నాణేల పరకామణి, ఖజానా విభాగాలను కమిటీ సభ్యులు పరిశీలించారు. అంతకుముందు ఉదయం కమిటీ సభ్యులు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, శ్రీవారి ఆలయం, పరకామణి, లడ్డూల తయారీ, లడ్డూ కౌంటర్లు, అన్నప్రసాద వితరణ, శ్రీవారి సేవా విధానం, శ్రీవారి సేవకుల కోసం నిర్మిస్తున్న నూతన భవనాలు పరిశీలించగా, తిరుమల జేఈవో శ్రీనివాసరాజు వారికి అవసరమైన సమాచారాన్ని అందించారు. ఉన్నతస్థాయి కమిటీలో ఒడిశా అదనపు ముఖ్య కార్యదర్శి ఎస్‌.సి మహాపాత్ర, ఐజీ ఎస్‌.కె ప్రియదర్శి, జగన్నాథ ఆలయ కమిటీ సభ్యుడు ఎం.త్రిపాఠి ఉన్నారు.

Advertisements

Latest Articles

Most Read