సీనియర్ IPS అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం మేమో జారి చేసింది. గత నెల 21 వ తేదీన విజయవాడ లోని ప్రెస్ క్లబ్ లో ఏ బి వెంకటేశ్వరరావు పెగాసిస్ మీద ప్రెస్ మీట్ పెట్టి ,తన హయంలో పెగాసిస్ కొనుగోలు చేయలేదని ,దీనికి సంభందించిన ఆధరాలు తన వద్ద ఉన్నాయని ,అప్పట్లో డిజిపి గౌతం సవాంగ్ ఇచ్చిన ఒక లేఖను కూడా ఆయన విడుదల చేసారు. పెగాసిస్ తాను కొనుగోలు చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం ,డిజిపి కార్యాలయం పెగాసిస్ ను ప్రొడ్యూస్ చేయలేదని చెప్పి RTI కార్యాలయం ఇచ్చిన లేఖను కూడా మీడియా ముందు చూపించారు. స్వయంగా RTI కింద డీజీపీ కార్యాలయం ఇచ్చిన సమాధానం ఆయన చదివి వినిపించారు. ఆ జవాబు కూడా ఆయన మీడియా సమావేశం లో చూపించారు. అయితే మీడియాతో మాట్లాడటం పై వివరణ కోరుతూ, ఏబి వెంకటేశ్వర రావుకు ప్రభుత్వం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఈ మేరకు ఏ బి వెంకటేశ్వరరావుకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అల్ ఇండియా సర్వీస్ రూల్స్ లోని 6 వ నిబంధనను పాటించకుండా మీడియా సమావేశం పెట్టారని ఏబీ వెంకటేశ్వరరావుకు జారీ చేసిన నోటీసులో సమీర్ శర్మ పేర్కొన్నారు. వెంటనే తమకు సమాధానం చెప్పాలని ఆ నోటీసులో కోరారు.
పెగాసిస్ తో పాటు , తన సస్పెన్షన్ అంశాల గురించి ఆ రోజు మీడియా సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఓక సెక్షన్ అఫ్ మీడియా పదే పదే తనపై ఆరోపణలు చేస్తూ , అవే ప్రచారం చేస్తున్నారని, ఈ నేపధ్యంలోనే తనకు గత్యంతరం లేని పరిస్థితుల్లో తానూ పెగాసిస్ పై వివరణ ఇచ్చేందుకు మీడియా ముందుకు వచ్చానంటూ ఏ బి వెంకటేశ్వరరావు ఆ రోజు చెప్పారు. ఆ రోజు మధ్యహ్నం ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మను కూడా కలిసేందుకు వెళ్ళి, ఆయన కార్యాలయంలో లేఖను కూడా అందించారు. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా మీడియా సమావేశం పెట్టటం తప్పేనంటూ నోటీసులను పంపారు. మెమో అందిన వారంలో వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయి అని ఆ నోటీస్ లో పేర్కొన్నారు. ఏబి వెంకటేశ్వరరావు మీడియా సమావేశం పెట్టిన మరుసటి రోజుప్రభుత్వం నోటీస్ పంపింది. ఆయనకు నిన్న ఈ నోటీసులు అందాయి. వెంటనే తగిన వివరణ ఇవ్వాలని , ఇవ్వని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని కూడ నోటీస్ లో ప్రభుత్వం హెచ్చరించింది.