ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం నిర్మాణాన్ని వైసిపి ప్రభుత్వం ఇప్పట్లో పూర్తిచెయ్య లేదని సర్వత్రా విమర్శలు ఎదుర్కుంటున్న ఈ సమయంలో, మరో షాకింగ్ న్యూస్ కేంద్రం నుంచి వచ్చింది. ఈ రోజు పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం ప్రకారం పోలావరం ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది అనే దాని పైన ఇప్పటివరకు తుది గడువు లేదు అని సమాధానం చెప్పటం జరిగింది. ఎంపి సుజన చౌదరి పోలవరానికి సంభందించి అడిగినటువంటి ప్రశ్నకు, జల శక్తి శాఖా సహాయ మంత్రి రాత పూర్వకమైన సమాధానం ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఏప్రిల్ 2022 పోలవరం నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. కాని అనేక కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాలేదని కేంద్రం చెప్పింది. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందనే స్పష్టత రావాల్సి ఉంది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పటికే ఏడాది ఒకసారి మూడు డేట్లు మార్చారు. కొద్దిగా కూడా పనులు ముందుకు వెళ్ళలేదు. ఈ తరుణంలోనే, అసలు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తి అవుతుందో, కేంద్రం కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేయటంతో, కేంద్రం కూడా తమకు ఇది ఎప్పటికి అవుతుందో చెప్పలేం అని తేల్చి చెప్పింది.
రాష్ట్రమే చెప్పలేదు, ఇక మేమేం చెప్తాం... సుజనా చౌదరి ప్రశ్నకు రాజ్యసభలో కేంద్రం దిమ్మ తిరిగే సమాధానం...
Advertisements