విభజన హామీల్లో పొందుపర్చిన కడప స్టీల్‌ ప్లాంట్‌ గురించి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ మళ్లి పాతపాటే పాడారు. రెండు రాష్ట్రాల్లో స్టీల్‌ ప్లాంట్లు నెలకొల్పడంపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ నివేదిక ఇచ్చేవరకు తానేమీ చేయలేనని చేతులెత్తేశారు. తరువాత, భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. బృందంలో కేవలం 10 మందికి మాత్రమే అపాయింట్మెంట్‌ ఖరారు చేయడంతో ఎంపీ సీఎం రమేశ్‌ సహా తెదేపా ఎంపీలు, రాష్ట్ర మంత్రులు వెళ్లి కలిశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలన్న విషయాన్ని పొందుపరిచారని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. చట్టంలో ఉన్నప్పుడు అమలు చేయడంలో ఇబ్బంది ఏంటని రాష్ట్రపతి ప్రశ్నించినట్టు తెదేపా నేతలు తెలిపారు. అలాగే ఉక్కు పరిశ్రమ కోసం సీఎం రమేశ్‌ 11 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన విషయం కూడా తన దృష్టికొచ్చిందని రాష్ట్రపతి గుర్తుచేశారని తెలుగుదేశం నేతలు వెల్లడించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్రపతి హామీ ఇచ్చినట్టు ఎంపీ సీఎం రమేశ్‌ మీడియాకు వివరించారు.

rastrapati 02082018 2

విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాల్సి ఉందని, దీని పై ఏర్పాటు చేసిన టాస్క్‌ ఫోర్స్‌ కూడా రెండు రాష్ట్రాల్లో సాధ్యా సాధ్యాల పై అధ్యయనం చేస్తోందని కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ అన్నారు. తనను కలిసిన తెలుగుదేశం పార్టీ ఎంపీలు, కడప జిల్లా నేతలతో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌ సమావేశాలు జరుగు తున్న నేపథ్యంలో తాను స్టీల్‌ ప్లాంట్‌ గురించి ఎలాంటి ప్రకటన చేయ లేనని తేల్చి చెప్పారు. అనం తరం అక్కడికి వచ్చిన మీడియా ప్రతి నిధులతో మాట్లా డుతూ టాస్క్‌ ఫోర్స్‌ నివేదిక వచ్చిన తర్వాతనే తాము నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇందుకు ఎంత సమయం పడుతుందని విలేకరులు ప్రశ్నించగా, టాస్క్‌ఫోర్స్‌ నివేదిక ఇచ్చేందుకు ఎటువంటి డెడ్‌లైన్‌ లేదని వ్యాఖ్యానించారు.

rastrapati 02082018 3

కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశపైం ఏపీ ప్రభుత్వం, కేంద్రం కొద్ది నెలలుగా సిగపట్లు పట్టుకుంటున్నాయి. 2014 ఏపీ రికగ్నైజేషన్ చట్టం (తెలంగాణ యాక్ట్)లో హామీ ఇచ్చిన విధంగా స్టీల్ ప్లాంట్ కడపలో ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తుండగా, ఆ ప్రతిపాదనను కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తోసిపుచ్చింది. ఈ ప్రాజెక్టు ఆర్థికంగా ఏమాత్రం కలిసిరాదని కేంద్రం పేర్కొంటూ ఈ నిర్ణయాన్ని ఇటీవల ఉపసంహరించుకుంది. అయితే కేంద్రం వాదనను ఏపీ ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. కనీసం 15 ఏళ్లయినా వెనక్కి తిరిగిచూసుకోవాల్సిన అవసరం లేని ప్రాజెక్టు ఇదని కుండబద్ధలు కొట్టింది. కడపలో ఇండిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీ ఎంపి సి.ఎం.రమేష్ కడపలో ఇటీవల 10 రోజుల పాటు నిరాహార దీక్ష కూడా చేశారు.

కాపు రిజర్వేషన్లపై జగన్‌ ఏం మాట్లాడారో ప్రజలందరికీ తెలుసని, కెమారాల్లో రికార్డు అయిన జగన్‌ వ్యాఖ్యల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని మంత్రి లోకేష్‌ అన్నారు. బుధవారం ఏపీఎన్నార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10 ఐటీ కంపెనీలను గుంటూరు జిల్లా తాడే పల్లిలోని ఇన్ఫోసైట్‌ భవనంలో ఒకేసారి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి అనుభవం ఉన్న నేత కావాలన్న విషయం జగన్‌ వ్యాఖ్యలతో స్పష్టమైందన్నారు. పవన్‌ కళ్యాణ్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని, కానీ తనపై ఆరోపణలు, విమర్శలు చేస్తే బాధ కలుగుతుందన్నారు. తనపై అవినీతి, దోపిడీ ఆరోపణలు చేయడం తగదన్నారు. సాక్ష్యాకధారాలు ఉంటే నిరూపించాలని సవాల్‌ విసిరినా ఇంత వరకు పవన్‌ నిరూపించ లేకపోయారని ఎద్దేవా చేశారు.

lokesh 02082018 2

రాజధాని నిర్మాణాన్ని ఆపుతామని పవన్‌ అనటం సరికాదన్నారు. 10మందికోసం రాజధాని నిర్మాణం ఆగదని మంత్రి లోకేష్‌ స్పష్టంచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు సైబరాబాద్‌లు నిర్మించాలనేదని తమ విజన్‌ అని మంత్రి లోకేష్‌ తెలిపారు. బుధవారం కొత్తగా ఏర్పాటైన 10ఐటీ కంపెనీల సీఈఓలతో మంత్రి సమావేశమయ్యారు. ఈసందర్భంగా మాట్లడుతూ లక్ష ఐటీ ఉద్యోగాలు, ఎలక్ట్రానిక్‌ రంగంలో 2లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇప్పటి వరకు ఐటీలో 36వేలు, ఎలక్ట్రానిక్స్‌లో 20వేల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. జియో ఫోన్ల తయారీ కోసం తిరుపతిలో 125 ఎకరాలు సేకరించామని సమావేశంలో చెప్పారు.

lokesh 02082018 3

విశాఖ, చిత్తూరు, అనంతపురం, గోదావరి జిల్లాల్లో ఐటీ అభివృద్ది చేస్తున్నామన్నారు. ఏపీలో ఎంఓయూ కన్వర్షన్‌ 48నుంచి 53శాతం ఉందని మంత్రి తెలిపారు. ఫైబర్‌ గ్రిడ్‌కు ఎంఎస్‌వోలు సహకరించాలని కోరారు. ఫైబర్‌ గ్రిడ్‌తో ఎంఎస్‌వోలకు మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందని, ఆగస్టు 15నాటికి ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా 5లక్షల కనెక్షన్లు ఇస్తామని తెలిపారు. డిసెంబర్‌ నెలాఖరు నాటికి అన్ని పంచాయితీలకు ఫ్రీవైఫై కనెక్షన్‌ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. పంచాయితీల్లో ప్రత్యేక అధికారుల పాలనకు నిర్ణయం తీసుకున్నామని ఈసందర్భంగా లోకేష్‌ పేర్కొన్నారు.

కొన్ని దశాబ్దాలుగా ఆ కలియుగ దైవం వెంకన్నకు సేవ చేసిన రమణ దీక్షితులు, గత కొన్ని రోజులుగా అమిత్ షా సేవలో తరించటం చూసాం, జగన్ ఇంటికి వెళ్లి ఆశీర్వదించటం చూసాం, అన్యమతస్తులతో చెట్టాపట్టాలేసుకుని తిరగటం చూసాం. రమణ దీక్షితులు వెనుక రాజకీయ నాయకులు ఉన్నారనేది స్పష్టం. ఈ మాటలకు బలం చేకురుస్తూ, భూమన కరుణాకరరెడ్డి నిన్న మాట్లడారు. ‘మా నాయకుడు జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే జరిగే మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో తొలి అజెండాలోనే వయస్సు కారణంగా తొలగించిన రమణదీక్షితులతో పాటు ఇతర ముగ్గురు అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటాం. అర్చకులందరికీ పదవీ విరమణ లేకుండా చేయటంతోనే రాష్ట్రంలో జగన్‌ పరిపాలన మొదలవుతుంది’ అని వైసీపీ ప్రధాన కార్యదర్శి,

bhumana 02082018 2

తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం రమణదీక్షితులు ఇంటికి వచ్చిన కరుణాకరరెడ్డి ఆయనతో సుమారు 35 నిమిషాలు భేటీఅయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మిరాశీ కుటుంబాలకు చెందిన ప్రధాన అర్చకులు రమణదీక్షితులను అక్రమంగా తీసేవేయటం చాలా బాధకలిగించిందన్నారు. కొద్దిరోజుల క్రితం కర్నాటక ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరుమలకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో దీక్షితులు మంతనాలు జరిపారు. ఆ తర్వాతే ఆరోపణలపర్వం ప్రారంభించారు. ముందుగా చెన్నైలో ఆ తర్వాత ఢిల్లీలో ఈ తరహా ఆరోపణలు చేశారు. అప్పడే టీటీడీ ఆయనకు రిటైర్డ్‌మెంట్ ప్రకటించింది.

bhumana 02082018 3

ఆ తర్వాత కూడా దీక్షితులు ఆరోపణలపర్వం కొనసాగించారు. నేరుగా జగన్‌తో దీక్షితుల భేటీ కావటం, ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలవటం, అన్యమతస్థులతో కలిసి తిరిగటం, అంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారన్న ఆరోపణలకు బలం చేకూరింది. రమణదీక్షితులు మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితులుగా ఉన్నారనే ఆరోణలున్నాయి. 2003లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం కావాలని అప్పట్లో కొండపై యాగం చేశారని ప్రచారం జరిగింది. నిబంధనలకు విరుద్ధమైనా పట్టించుకోలేదనే విమర్శలు ఆయనపై వచ్చాయి. ఇప్పటికీ దీక్షితులు తన ఇంట్లో శ్రీవారి చిత్రపటం పక్కన వైఎస్ చిత్రపటం పెట్టుకుంటారనే ప్రచారం ఉంది.

రచయిత్రి, సంఘ సేవామయి, మాన వతా స్ఫూర్తి ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌ పర్సన్‌, టీటీడీ ట్రస్ట్‌ బోర్డు సభ్యురాలు సుధామూర్తి పెద్ద మనసుతో స్పందిం చారు. వంద మంది విద్యార్ధులున్న ప్రతి పాఠశాలలకు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ పక్షాన పుస్తకాలను విరాళంగా అందజయనున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లా ల్లోని 3000 పాఠశాలలకు పుస్తకాలను విరాళంగా అందజేయాలని నిర్ణయించారు. జీవితం కోణాలను స్పశిస్తూ , విలువలతో కూడిన మెరుగైన జీవనానికి బాటవేసే దిశగా అవగాహన కలిగించే పుస్తకాలివి. వీటిలో 250 టైటిళ్లతో కూడిన పుస్తకాలను మాధ్యమిక పాఠశాలలకు ఇవ్వనున్నారు. ఉన్నత పాఠశాలలకు ఎంపిక చేసిన 300 టైటిళ్ల పుస్తకాలు పంపనున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని వందకు మించిన విద్యార్ధులున్న 1725 ప్రాధమిక పాఠశాలల్లో ఒక్కో పాఠశాలకు రూ.10,000 వంతున, 842 ఉన్నత పాఠశాల్లో ఒక్కో పాఠశాలకు రూ.15,000 వంతున మొత్తం రూ. 2.5 కోట్ల విలువైన పుస్తకాలను విరాళంగా అందించనున్నారు.

infosis 02082018 2

గ్రంధాలయాలకు ఇంత భారీ స్ధాయిలో గతంలో ఏ స్వచ్చంద సంస్ధ కూడా పుస్తకాలు విరాళంగా అందజేయలేదు. సుధా మూర్తి గత ఏడాది విజయవాడ సందర్శించినప్పుడు నగర పాలక సంస్ధ పరిధి లోని ఎంపిక చేసిన పాఠశాలలకు పుస్తకాలు విరాళంగా ఇవ్వాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఉన్నత విద్యాశాఖను సంప్రదించిన మీదట తొలుత విజయవాడ నగర పాలక సంస్ధ పరిధిలోని 54 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా పుస్తకాలను విరాళంగా అందజేశారు. ఉన్నత పాఠశాలలకు రూ. 15,000, ప్రాధమిక పాఠశాల లకు రూ. 10,000 విలువైన పుస్తకాలను బహుకరించారు. అలాగే గత మార్చిలో అమరావతి వచ్చినప్పుడు సుధామూర్తి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని 45 ప్రభు త్వ , జిల్లా పరిషత్‌ పాఠశాలలకు పుస్తకాలు విరాళంగా ఇచ్చారు. వీట న్నింటి విలువ రూ. 3 కోట్లు ఉంటుందని అంచనా. ఆమె భారత సైనికులు, సమాజంలో అట్టడుగు వర్గాల శ్రేయస్సుకు ఎంతో తోడ్పడుతున్నారు.ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత,పుస్తక ప్రేమికురాలు, సాహితీ పిపాసి, కనీసం ఒక్క గ్రంధాలయమైనా నెలకొల్పాలన్న తన తాతగారి ఆకాంక్ష మేరకు,ఆయన కలను నెరవేరుస్తానని వాగ్ధానం చేశారు.ఒక ఉద్యమంలా చేపట్టి ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే 60 వేల గ్రంధాలయాల అభివృద్దికి సహకారం అందిస్తున్నారు.

infosis 02082018 3

పాఠశాలలకు పుస్తకాలను విరాళంగా అందజేస్తున్న సుధామూర్తిని ముఖ్య మంత్రి అభినందించి,ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దాలన్న తమ ప్రయత్నానికి ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ సహకారం మరవలేని దన్నారు. విరాళంగా అందజేస్తున్న పుస్తకాలు విద్యార్ధులకు ఉపయోగపడేలా చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి విద్యాశాఖను కోరారు.ఎంతో ఔన్నత్యం కలి గిన సుధామూర్తి రచయిత్రిగా కలం ద్వారా స్పందిస్తూ మరో వైపు ఫౌండేషన్‌ ద్వారా సామాజిక సేవ చేస్తూ ఆచరణాత్మక దృక్పధంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. సుధామూర్తి స్పూర్తితో మరికొందరు ఆ దిశగా స్పందించే అవకాశం ఉందన్నారు. తన సదాశయం, ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి సుధామూర్తి ఏపీను గమ్యస్ధానంగా ఎంచుకున్నందుకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read