ఆంధ్రప్రదేశ్ ప్రజల పై మరో భారం వేయడానికి ప్రభుత్వం సిద్దమైంది. ఈ రోజు నుంచే ఏపిలో ఉన్న 13 జిల్లాలు 26 కొత్త జిల్లాలగా ఎర్పాటైన సంగతి తెలిసిందే. కొత్త జిల్లాలు ఏర్పాడ్డాయని ఆనందం తీరక ముందే , మరో భారాన్ని ప్రజల పై వేస్తూ జగన్ ప్రభుత్వం షాక్ కు గురిచేసింది. ప్రభుత్వానికి ఆదాయం పెరగాలంటే పన్నుల భారం పెంచటం, ఒకటే మార్గమన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీనిలో భాగంగా కొత్తగా ఏర్పడిన ఏర్పడిన 13 జిల్లాల పరిధిలో భూముల ధరలను భారీగా పెంచాలని వైసిపి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంభందించి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నపటికీ , ఈ భూముల పెరుగుదల ఏ మేరకు ఉంటుందని అనే విషయం పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. దీనికి సంబంధించి అన్ని విషయాలపై మరి కొన్ని గంటల్లోనే సమాచారం వెల్లడయ్యే అవకాసం ఉంది. ఈరోజే కొత్త జిల్లాలు ఏర్పటు కావటంతో ఈ రోజు , రేపు వదిలేసి, ఈ నెల 6 వ తారీఖు నుంచి భూముల ధరలను పెంచాలని నిర్ణయించారని సమాచారం. దీనిలో భాగంగానే భూముల రిజిస్ట్రేషన్ ధరలు కూడా భారీగా పెరుగుతాయని తెలుస్తుంది. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసారు. అయితే పాతగా ఉన్న పదమూడు జిల్లాల్లో మాత్రం పాత రేట్లకే విక్రయాలు జరుగుతాయని తెలుస్తుంది.
అయితే ఇప్పటి వరకు ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చేఆదాయం భారీగా ఉన్నట్టు తెలుస్తుంది..మళ్ళి కొత్త జిల్లాల్లో పెంచిన ఈ ధరల వలన ప్రభుత్వానికి మరింత భారీ ఆదాయం వచ్చి పడనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం ప్రజలను షాక్ కు గురిచేసింది. ఇప్పటికే రకరకాల పన్నులతో ప్రజలను ప్రభుత్వం పీల్చి పిప్పి చేస్తుంది. మొన్నే కరెంటు చార్జీలు కూడా పెంచారు. ఇప్పటికే ఏడు సార్లు కారెంటు చార్జీలు పెంచారు. మరో పక్క ఇంటి పన్ను చార్జీలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు మనమే టాప్ లో ఉన్నాం. ఇక మరో పక్క గ్యాస్ ధర వెయ్యి రూపాయలు దాటింది. మరో పక్క ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా చెత్త పన్ను కూడా విధించారు. చెత్తకు పన్ను ఏంటి అని ప్రజలు అడుగుతుంటే, ఆ చెత్త తెచ్చి ఇంట్లో పడేస్తున్నారు. మరో పక్క మరుగుదొడ్డు పన్ను కూడా బాదేస్తున్నారు. ఇలా ఒకటి కాదు రెండు, ఏ రకంగా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయాలి అంటే, ఆ రకంగా ప్రజల నుంచి పిందేస్తున్నారు.