పోతుల సురేష్.. పరిటాల రవికి అత్యంత సన్నిహితుడు. దివంగత చమన్, పోతుల సురేష్, వీరిద్దరూ రవికి అత్యంత సన్నిహితులు. 2004లో ఉమ్మడి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మారణహోమం నుంచి, వీరిని కాపడటానికి, పరిటాల రవి వీరిద్దరినీ అండర్ గ్రౌండ్ కు పంపించారు. కొన్ని రోజులకే రవిని చంపేశారు. చమన్, పోతుల సురేష్ చాలా రోజులు అండర్ గ్రౌండ్ లోనే ఉన్నారు. ఆ చెడు జ్ఞాపకాలను, పోతుల సురేష్, ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పరిటాల రవితో ఉన్న సంబంధాలు, అప్పటి మారణహోమం, తన రాజకీయ భవిష్యత్‌ గురించి చెప్పారు. 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే, మారణహోమం మొదలు పెట్టారని, అప్పటికే వందల మందిని చంపేశారని, తొందరోలోనే పరిటాల రవిని చంపేస్తారని మాకు తెలుసని చెప్పారు.

ys 16072018 2

ఆనాడు నెలకొన్న పరిస్థితుల అన్నీ గమనించి, పరిటాల రవి వద్దకు తాను మూడు ప్రతిపాదనలను తీసుకెళ్లినట్టు పోతుల సురేష్ చెప్పారు. ఇప్పటివరకు తమకు అండగా ఉన్న గ్రూపును కాపాడుకొనేందుకు గాను నేతలంతా కలిసే ఉండాలనేది మొదటి ప్రతిపాదనగా రవి వద్ద ప్రస్తావించినట్టు చెప్పారు. ఇక వ్యక్తిగతంగా ఎవరికి వారు అజ్ఞాతంలోకి వెళ్లి ప్రాణాలు రక్షించుకోవడం పై కేంద్రీకరించడమనేది రెండో ప్రతిపాదనగా రవికి చెప్పానని ఆయన గుర్తు చేశారు. ఇక మూడో ప్రతిపాదనగా వైఎస్ఆర్‌తో రాజీ ప్రతిపాదనను చేశానని ఆయన చెప్పారు. అయితే ఈ మూడు ప్రతిపాదనలను పరిటాల రవి తీవ్రంగా వ్యతిరేకించారని ఆయన చెప్పారు.

ys 16072018 3

ఆనాడు నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎవరికి వారు అజ్ఞాతంలోకి వెళ్లి ప్రాణాలు దక్కించకోవడమే మేలని పరిటాల రవి సూచించారని పోతుల సురేష్ చెప్పారు. అయితే తాను మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లనని పరిటాల రవి చెప్పారని చెప్పారు. అప్పటికే ఎమ్మెల్యేగా ఉేన్నందున తాను మాత్రం గ్రామంలోనే ఉంటానని రవి చెప్పారని ఆయన చెప్పారు. తగరకుంట ప్రభాకర్ రెడ్డి హత్య తర్వాత తమ ప్రాణాలకు కూడ ముప్పు ఉంటుందని భావించిన నేపథ్యంలో తమ కుటుంబసభ్యులు, సన్నిహితుల సూచన మేరకు తాను కూడ అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. మేము అండర్ గ్రౌండ్ కు వెళ్ళిన కొద్ది రోజులకే, పరిటాల రవిని చంపేశారని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ ఎంపీలు సోమవారం చెన్నైలోని డీఎంకే ఎంపీ కనిమొళిని కలిశారు. మోదీ ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరారు. కనిమొళిని కలిసిన ఎంపీల్లో సీఎం రమేష్, టీజీ వెంకటేష్, మురళీ మోహన్ ఉన్నారు. నవ్యాంధ్ర సమస్యల పరిష్కారం, విభజన చట్టం హామీల అమలులో కేంద్రం మొండి వైఖరిని నిరసిస్తూ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో టీడీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలంటూ చంద్రబాబు రాసిన లేఖను కనిమొళికి అందజేశారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఎలా అన్యాయం చేసిందో టీడీపీ ఎంపీలు వివరించారు. ఈ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని టీడీపీ ఎంపీలు కోరుతున్నారని... వారికి తాము అండగా నిలుస్తామని చెప్పారు. ఒక బలమైన నేతను మీ హక్కుల కోసం పోరాడుతున్నారు, జాగ్రత్త, ఈ పోరాటంలో మా మద్దతు మీకే అంటూ ఆమె అన్నారు.

dmk 16072018 2

‘ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో ఎవరితోనూ సంప్రదించకుండా యూపీఏ ఏకపక్షంగా వ్యవహరించింది. విభజన చట్టంలో పొందుపరచిన అంశాలు, రాజ్యసభలో ఇచ్చిన హామీలను బీజేపీ కాలరాస్తోంది. ఏపీపై ఇంత నిర్లక్ష్యమా? మాకు జరిగిన అన్యాయంపై పోరాడుతున్నాం. గత నాలుగేళ్లుగా కేంద్రం ఏం ఇచ్చిందీ, ఇవ్వాల్సిందీ వివరాలివిగో.. ఓ రాజకీయ పార్టీగా మీరు ఆలోచించి మద్దతివ్వండంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖను కనిమొళికి అందచేసారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రకటించే అవిశ్వాసానికి మద్దతు కోరుతూ ఆదివారం పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలకు, ముఖ్యమంత్రులకు ఆయన రాసిన 8 పేజీల లేఖ రాసారు.

dmk 16072018 3

విభజన సందర్భంగా 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేర్చలేదు. అశాస్ర్తియ పద్ధతిలో విభజన జరిగింది. ఏకపక్షంగా తలుపులు మూసేసి బిల్లును ఆమోదించారు. విభజన చట్టం 11వ యాక్టులో 8వ షెడ్యూల్ ప్రకారం రాజ్యసభలో ఆరు ప్రధానమైన హామీలు ఇచ్చారు. ఇవి అమలు చేయటంలో కూడా కేంద్రంలోని బీజేపీ తాత్సారం చేస్తోంది’ అని ఆయన ఆరోపించారు. షెడ్యూల్ 8 ప్రకారం కడప స్టీల్‌ప్లాంట్, దుగ్గరాజపట్నం పోర్టు, గ్రీన్‌ఫీల్డ్ క్రూడ్ అయిల్ రిఫైనరీ - పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విశాఖపట్నం - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విశాఖ, విజయవాడ విమానాశ్రయాల విస్తరణ, తిరుపతికి అంతర్జాతీయ స్థాయి కల్పించటంతో పాటు నూతన రాజధాని నుంచి హైదరాబాద్ సహా తెలంగాణలోని ఇతర ముఖ్య ప్రాంతాలకు రైల్, రోడ్డు రవాణా అనుసంధానం, ప్రత్యేక రైల్వే జోన్, విశాఖపట్నం, విజయవాడ మెట్రోరైలు సదుపాయాలు కల్పించాల్సి ఉంది. షెడ్యూల్ 9 ప్రకారం 89 స్థిర, చరాస్తులు, షెడ్యూల్ 10 ప్రకారం 142 జాతీయ సంస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఢిల్లీలోని ఏపీ భవన్‌కు సంబంధించి ఇప్పటికీ పంపకాలు జరగలేదు. రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన ఆరు ప్రధాన హామీలకు సభలో ఉన్న పార్టీలే సాక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లు ప్రత్యేక హోదా ప్రకటించారు. ఈ అంశాన్ని ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న బీజేపీ సీమాంధ్ర ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చిందని ఆయన వివరించారు.

కాపు రిజర్వేషన్ సెగ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని తాకింది. మొన్నటి వరకు కాపు రిజర్వేషన్ పై చంద్రబాబు ప్రభుత్వం పై, విమర్శలు చేసిన జగన్, ఎప్పుడైతే చంద్రబాబు అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి కాపులకి రిజర్వేషన్ ఇవ్వమని పంపించారో, అప్పటి నుంచి జగన్, కాపు రిజర్వేషన్ పై అసలు మాట మాట్లాడటం లేదు. కేంద్రం కోర్ట్ లో కాపు రిజర్వేషన్ ఉంది కాబట్టి, అప్పటి నుంచి జగన్, కాపు రిజర్వేషన్ గురించి ఒక్క మాట మాట్లాడం లేదు. ఎందుకంటే, ఇప్పుడు నిందించాల్సింది కేంద్రాన్ని. మోడీ, అమిత్ షా ని ఒక్క మాట అనే సాహసం జగన్ చెయ్యలేడు. అయితే, ఇప్పుడు జగన్ తూర్పు గోదావరిలో పాదయాత్ర చెయ్యటం, కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో, అక్కడి వైసీపీ నేతలు, ఇప్పటికైనా కాపు రిజర్వేషన్ పై మాట్లాడమని అడుగుతున్నారు.

jagan 16072018 1

కాకినాడలో నిర్వహించనున్న బహిరంగ సభలో జాబితాలో చేర్చే అంశంపై స్పష్టత ఇవ్వాలని ఆ పార్టీలో కాపు సామాజిక వర్గ నేతలు జగన్‌పైనా, పార్టీ కీలక నాయకులపైనా ఒత్తిడి చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్‌తోపాటు.. వైసీపీ అధికారంలోకి వస్తే కాపులకు ఉపముఖ్యమంత్రితో పాటు.. ఇతర ఏఏ కీలక పదవులు ఇస్తారనే అంశంపైనా ప్రకటన చేయాలని జగన్‌ని పట్టుపడుతున్నారు. అధికారంలోకి వస్తే కాపులను బీసీ జాబితాలో చేరుస్తామని ప్రకటించిన చంద్రబాబు ఆ మేరకు అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపారు. దీంతోపాటు.. టీడీపీ ఎన్నికల హామీలో భాగంగా కాపులకు ఇస్తామన్న ఉప ముఖ్యమంత్రి పదవిని కోనసీమ వాసి నిమ్మకాయల చినరాజప్పకు కట్టబెట్టారు. కాపులను బీసీ జాబితాలో చేర్చే అం శంపై ఇప్పటికీ చిత్తశుద్ధితో ఉన్నట్టు సీఎం చంద్రబాబు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ హామీ ఇస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్‌తో కూడా కాపులకు సంబంధించి హామీ ఇప్పించకపోతే ఆ సామాజిక వర్గంలో పార్టీ వెనుకబడుతుందన్న ఉద్దేశంతో ఉన్న వైసీపీ కాపు నేతలు పట్టుదలతో ఉన్నారు.

jagan 16072018 1

ఎట్టి పరిస్థితులలోనూ కాపులకు వైసీపీలో ఇవ్వబోయే ప్రాధాన్యంపైనా జగన్‌తోనే ప్రకటన చేయిస్తామని కాపు యువతకు ఆ సామాజిక వర్గ వైసీపీ నేతలు భరోసా ఇస్తున్నారు. ఇవన్నీ కాకినాడ బహిరంగ సభలో ప్రకటించేలా జగన్‌కి విజ్ఞప్తి చేస్తున్నట్టు కాపు నేతలు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో పాదయాత్ర పూర్తయ్యే సమయానికి కాపులకు వైసీపీలో ఇచ్చే ప్రాధాన్యత, బీసీ జాబితాలో చేరుస్తామన్న హామీ వంటి కీలక ప్రకటనలు జగన్‌ చెయ్యాలని, నేతలు ఒత్తిడి తెస్తున్నారు. నిజానికి పశ్చిమ గోదావరిలో ఎంటర్ అయ్యి, దాదాపు ఇప్పటికి నెల రోజుల పైనే అయ్యింది. అప్పటి నంచి, వైసిపీ కాపు నేతలు, కాపు రిజర్వేషన్ పై, ప్రతి మీటింగ్ లో మాట్లాడాలని కోరినా, జగన్ మాత్రం వినలేదు. కనీసం తూర్పు గోదావరి పాదయత్ర ముగిసే లోపు ఒక్క మాట అయినా చెప్పాలని, అప్పుడే ప్రజల మధ్య తల ఎత్తుకోగలం అని అంటున్నా, జగన్ మాత్రం వినటం లేదు.

వారే కొడతారు... ఎదురు వారే రాష్ట్రంలో శాంతిబధ్రతలు లేవు అంటారు. ఇదే బీజేపీ తాజా వ్యూహం. ఇదే వ్యూహంతో భావోద్వేగాలు రెచ్చగొట్టి, వివిధ రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంది. ఇప్పుడు ఇదే వ్యూహం మన రాష్ట్రంలో అమలు చేయ్యనుంది. ఈ రోజు కన్నా లక్ష్మీనారాయణ ఢిల్లీ వెళ్లి, హోం మంత్రిని కలిసి, రాష్ట్రంలో శాంతిబధ్రతలు ఆర్డర్ లో లేవని, అందరి పైనా దాడులు జరుగుతున్నాయని, ప్రజలు బ్రతకలేకపోతున్నారని ఫిర్యాదు చేసారు. మొన్న గవర్నర్ కు ఫిర్యాదు చేసి, రాష్ట్రపతి పాలన పెట్టమన్నారు. ఇవన్నీ చూస్తుంటే, ఏపిలో బీజేపీ వ్యూహం మార్చిందని, కేంద్రం ఇదే చేస్తుంది, అది చేస్తుంది అంటే ప్రజలు నమ్మటం లేదు కాబాట్టి, ప్రజల భావోద్వేగాలతో ఆడుకుని లబ్ది పొందటానికి ప్లాన్ వేసింది బీజేపీ.

kanna 16072018 2

ప్రతిఘటన ఎదురు కాక ముందే బీజేపీ నేతలు దూసుకెళ్తున్నారు. వ్యతిరేకంగా నినాదాలు వినిపించకముందే విరుచుకుపడుతున్నారు. ఒంగోలు నుంచి కావలి వరకు అదే జరిగింది. ఒంగోలులో ప్రత్యేకహోదా ప్లకార్డు పట్టుకున్న వ్యక్తిపై బీజేపీ నేతలు దాడి చేయడం కలకలం రేపుతోంది. శ్రీనివాస్ అనే ఆర్ఎంపీ డాక్టర్ ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ ఓ ప్లకార్డు ప్రదర్శించారు. దీంతో ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్‌ను బీజేపీ నేతలు తరిమి తరిమికొట్టారు. కింద పడేసి కాళ్లతో తొక్కారు. సాధారణంగా ఏ పార్టీ సమావేశంలో అయినా ఇతరులు గలాటా చేస్తే దాడులు చేయడం అరుదు. ఎందుకంటే దాడి అంటూ జరిగితే సమావేశం రసాబాస అవుతుంది. కానీ బీజేపీ నేతలు మాత్రం తమ పార్టీ కార్యక్రమం ఏమైపోయినా పర్వాలేదు, దాడుల విషయానికి మైలేజీ వస్తే చాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కన్నా పర్యటనలో వెలుగు చూసిన దాడుల వ్యవహారాల్లో ఇదే కీలకంగా మారుతోంది. ఈ దాడుల వెనుక రాజకీయ వ్యూహం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

kanna 16072018 3

భారతీయ జనతా పార్టీ తమకు ఏ మాత్రం పట్టు లేని రాష్ట్రాల్లో ఓటు బ్యాంక్ పెంచుకునేందుకు చేసే రాజకీయం ఇప్పుడు ఏపీలో కూడా ప్రారభించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగాల్, కరేళల్లో బీజేపీకి ఒకప్పుడు ఒక శాతం ఓటు బ్యాంక్ కూడా లేదు. కానీ ఇప్పుడు కొంత మేర బలపడింది. దీని వెనుక అసలు కారణం ఎప్పటికప్పుడు... తమ పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంస్థల కార్యకర్తలపై దాడులు, ప్రతి దాడుల వ్యవహారాలతో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండటం. రాజకీయం, ప్రజాసంక్షేమం కన్నా ఇతర భావోద్వేగ అంశాలతోనే బీజేపీ ఆయా రాష్ట్రాల్లో ఎగ్రెసివ్‌గా వ్యూహాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలో దాడులు, ప్రతిదాడులకు ఆ పార్టీ శ్రేణులు పాల్పడుతూంటారు. ఇదే వ్యూహాన్ని ఇప్పుడు బీజేపీ విభజన హామీల ఉద్యమకారులపై ప్రయోగిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతుతున్నాయి. దాడులు చేస్తోంది బీజేపీ నేతలు అయితే టీడీపీ పనేనంటూ ఆరోపిస్తూ నేరుగా గవర్నర్‌కు, హోం మంత్రికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి పాలన విధించాలంటూ డిమాండ్లు కూడా చేశారు. బీజేపీ నేతలు చేస్తున్న దాడులు వారి ఫిర్యాదుల వెనుక అసలు లక్ష్యం మాత్రం కేరళ, బెంగాల్ తరహా రాజకీయమేనని టీడీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read