టీడీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సమావేశం అయిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరిపై నిశితంగా చర్చించారు. సుమారు అరగంటపాటు జరిగిన ఈ సమావేశంలో ఎంపీలకు.. సీఎం పలు కీలక సూచనలు చేశారు. ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని.. పార్లమెంట్‌లో గతం కంటే ఉధృతంగా పోరాటం చేయాలని ఎంపీలకు సీఎం సూచించారు. కేంద్రంపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఢిల్లీ వేదికగా ప్రతిపక్షాల నేతలను కలిసి ఏపీకి జరిగిన అన్యాయంపై మద్దతు కోరాలని ఎంపీలకు సీఎం సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ మినహా అన్ని పార్టీల మద్దతు కోరి.. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పోరాటం చేయాలన్నారు. అవిశ్వాస తీర్మానం మళ్లీ పెట్టి.. తీర్మానానికి మిగిలిన ప్రతిపక్షాల మద్దతు కోరాలని ఎంపీలకు చంద్రబాబు సూచించడం జరిగింది. ఏపీకి బీజేపీ చేసిన నమ్మకద్రోహంపై పార్లమెంట్ సాక్షిగా నిలదీయాలన్నారు.

cbn parties 15072018 2

చంద్రబాబు సూచనల మేరకు, ఎంపీలు రెడీ అయ్యారు. కాంగ్రెస్‌, బీజేపీ యేతర పార్టీల నేతలను తెలుగుదేశం పార్టీ ఎంపీలు కలవనున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా, ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని వివరించనున్నారు. ఆదివారం సాయంత్రం ముంబైలో శరద్‌పవార్, ఉద్ధవ్‌థాకరేలను ఎంపీలు తోట నరసింహం, రవీంద్ర బాబు కలవనున్నారు. అలాగే డీఎంకే, అన్నాడీఎంకే నేతలను టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కలవనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని అశోక్‌గజపతి రాజు, కొనకళ్ళ నారాయణ, శివప్రసాద్ కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయం, కేంద్రం పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటం గురించి వివరించనున్నారు. తమ పోరాటానికి, పార్లమెంట్ లో సహకారం అందించాలని కోరనున్నారు.

cbn parties 15072018 3

మరో పక్క, ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో, కేంద్ర ప్రభుత్వంపై మళ్లీ అవిస్వాస తీర్మానం పెట్టాలని తెలుగుదేశం పార్టీ నేతలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశనం చేశారు. బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసిందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. కేంద్ర ప్రభుత్వంపై మళ్లీ అవిశ్వాసం పెట్టాలని, అలాగే, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. లోకసభలో ప్రస్తుతం బీజేపీ బలం తగ్గిపోయిందని, మిత్రపక్షాల కారణంగా బీజేపీకి ఆధిక్యత ఉందని, కాంగ్రెస్‌, బీజేపీ యేతర పార్టీలను ఏకం చేసి, కేంద్రం పై పోరాటం కొనసాగిస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు.

ఈ నెల 11న ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించిన కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ.. ప్రాజెక్టు నిర్మాణ డిజైన్లు, ఇతర సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఢిల్లీకి రావాలని, తన సమక్షంలోనే అధికారులతో సమావేశమై చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం బావుంటుందని ఆయన పేర్కొన్నారు. తదనుగుణంగా ఢిల్లీ వెళ్లి వెంటనే సమస్య పరిష్కారం చేసి, పోలవరంలో అన్ని అనుమతులు పొందటానికి, రేపే అధికారులని హుటాహుటిన ఢిల్లీకి పంపిస్తున్నారు చంద్రబాబు. నవ్యాంధ్రకు గుండెకాయ లాంటి పోలవరం ప్రాజెక్టుకు తాజాగా ఏర్పడిన అవాంతరాలను అధిగమించేందుకు చంద్రబాబునాయుడు అధికారులతో కూడిన ఒక ప్రతినిధి బృందాన్ని సోమవారం ఢిల్లీకి పంపించాలని నిర్ణయించారు. ప్రాజెక్టును నిర్దేశిత గడువులో పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ అహో రాత్రులు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ ప్రతినిధి బృందం సోమవారం ఢిల్లీకి బయలు దేరి వెళ్లేందుకు రంగం సిద్ధమైంది. ఈమేరకు ముఖ్యమంత్రి శనివారం సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

delhi 15072018 2

కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల పోలవరం వచ్చిన సందర్భంలో ప్రాజెక్టుకు సంబంధించిన తాజా డీపీఆర్ తో పాటు భూసేకరణ, ఆర్ ఆర్ ప్యాకేజీ, పరిహారం, పునరావాసం, సవరించిన అంచనాల విషయంలో కొన్ని ప్రశ్నలు లేవనత్తిన సంగతి తెలిసిందే. ముందస్తు నిధుల విడుదల గురించి కూడా సీఎం ఆరోజు నితిన్ గడ్కరీని అడిగారు. కానీ ఆయన సానుకూలంగా స్పందించలేదు. పైగా ఆ డాక్యుమెంట్లు లేవు.. ఈ డాక్యుమెంట్లు లేవు. తాజా డీపీఆర్ సక్రమంగా లేవంటూ కొర్రీలు పెట్టారు. పైగా రాష్ట్రప్రభుత్వ పెద్దలు ఎంత త్వరగా ఢిల్లీ వచ్చి, రెండో డీపీఆర్ కు సంబంధించిన లెక్కలతో కూడిన సంబంధిత దస్త్రాలను ఆర్థిక మంత్రిత్వ శాఖకు అందజేయాలని ఆ రోజు నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రిని ప్రాజెక్టు సైట్లోనే కోరారు. దీంతో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ఎంతో ప్రతీష్టాత్మకంగా తీసుకుని, రెండో డీపీఆర్ కు సంబంధించిన లెక్కలుతో కూడిన అన్ని దస్త్రాలను తాజాగా సిద్దం చేయించారు.

delhi 15072018 3

దీంతో ముఖ్యమంత్రి ఆదేశాలతో అన్ని దస్త్రాలతో అధికార బృందాన్ని సోమవారం ఢిల్లీకి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. జలవనరుల శాఖాధికారులతో పాటు ఆర్థిక శాఖ, రెవిన్యూ శాఖ నుంచి పలువురు అధికారులు సోమవారం ఢిల్లీ వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నితిన్ గడ్కరీ లేవనెత్తిన అన్ని అంశాలను ఢిల్లీలో ఈ అధికారుల బృందం ఆర్ధిక మంత్రిత్వ శాఖాధికారులను కలిసి, సందేహాలను నివృత్తి చేయనున్నది. ఈ బృందం ఢిల్లీలో పెద్దలను కలిసి మాట్లాడి వచ్చిన తర్వాత రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర పేద్దలంతా ఢిల్లీకి తరలి వెళ్లేందుకు కూడా పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నారు. ముందస్తు నిధులతో పాటు రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను ఇంతవరకు కేంద్రం విడుదల చేయకపోగా బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగడంతో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రాజెక్టు పనులను అనేక ప్రతికూల పరిస్థితుల్లో నిర్వహిస్తున్న క్రమంలో కేంద్రం రకరకాల కారణాలతో అడ్డుపుల్లలు వేస్తుండడంతో ప్రాజెక్టు పనులకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఒక వేళ చర్చల్లో కేంద్రం ఏమన్నా ఇబ్బందులు పెడితే, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది.బాబు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సంకల్పానికి వరుణుడు కూడా తోడయ్యాడు. గత పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతూ ఉండటంతో, రైతులు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు ముందు చూపుతో పని చేసిన ఇంకుడు గుంటలు, పంట కుంటలు, నీటి గుంటలు చెక్ డాంలు, పూడిక తీసిన చెరువులతో, రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలాలు నిల్వలు బాగా పెరిగాయి. మరో పక్క ఎగువ ప్రాంతాల వరదనీరొస్తోంది. మహారాష్ట్ర, కర్నాటకల్లో భారీ వర్షాల వల్ల దిగువన ఉన్న కృష్ణా, తుంగభద్ర నదులు వరద నీటితో పోటెత్తుతున్నాయి. స్థానికంగా మునేరు, వైరా వాగులతో పాటు, పట్టిసీమ ఎత్తిపోతల నుంచి గోదావరి నీరు 7,700 క్యూసెక్కుల నీరు కృష్ణకు వస్తోంది. ఫలితంగా శనివారం నాటికి ప్రకాశం బ్యారేజి సామార్థ్యం 12 అడుగుల మించి వరద నీరు చేరుతుండటంతో అదనపు నీటిని ఎప్పటికప్పుడు తూర్పు డెల్టా, పశ్చిమ డెల్టా కాల్వలకు, బ్యారేజ్‌ గేట్లూ ఎత్తి దిగువకు వదులుతున్నారు. నదికి 14,941 క్యూసెక్కుల చొప్పున నీరు వస్తుండగా, 10,971 క్యూసెక్కుల చొప్పున తూర్పు, పశ్చిమ డెల్టాలకు విడుదల చేస్తున్నారు.

మరో పక్క గోదావరి కూడా ఉదృతంగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. రెండు రోజులుగా భద్రాచలం వద్ద నిలకడగా ఉన్న గోదావరి నీటిమట్టం శనివారం సాయంత్రం 30.30 అడుగులకు పెరిగింది. శుక్రవారం సాయంత్రం 29.70 అడుగులు ఉన్న నీటిమట్టం శనివారానికి పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 9.70 అడుగులకు నీటిమట్టాన్ని స్థిరీకరించారు. బ్యారేజీకి చెందిన 175 గేట్లను ఎత్తివేసి సముద్రంలోకి 2,98,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ధవళేశ్వరం, విజ్జేశ్వరం వద్ద బ్యారేజీకి చెందిన గేట్లను 0.69 మీటర్ల ఎత్తుకు లేపారు.

ఉత్తరాంధ్ర నర్సీపట్నం డివిజన్‌లోని ప్రధాన జలాశయాల్లో నీటిమట్టాలు ఆశాజన కంగా ఉన్నాయి. తాండవ రిజర్వాయర్‌ సాధారణ నీటిమట్టం 380 అడుగులు కాగా, ప్రస్తుతం 366.5 అడుగుల నీటిమట్టం ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 362 అడుగుల నీటిమట్టం ఉండేది. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అదనంగా 3.5 అడుగులు పెరిగింది. ప్రస్తుతం జలాశయంలో 2680 ఎంసిఎఫ్‌టిల ఉండగా గత ఏడాది ఇదే సమయానికి 1920 ఎంసిఎఫ్‌టిలు ఉండేది. ప్రస్తుతం జలాశయంలోకి రోజుకు 200 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉంది.

శనివారం కృష్ణా నది ఎగువున వున్న ఆల్మట్టి డ్యాం లోకి 90,886 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఆల్మట్టి డ్యాం పూర్తి స్థాయి సామర్థ్యం 129.72 టిఎంసిలు కాగా ప్రస్తుతం 83.78 టిఎంసిల నమోదైంది. మరో 45 టిఎంసిలు వస్తే దిగువకు వరదనీరు వచ్చే అవకాశం వుంది. తుంగభద్ర నదిలోకి కూడా భారీగా వరద ప్రవాహం నమోదైంది. 76,527 క్యూసెక్కుల వరదనీరు డ్యాంలోకి వచ్చి చేరుతోంది. తుంగభద్ర డ్యాం పూర్తి స్థాయి సామర్థ్యం 100.8 టిఎంసిలు కాగా ప్రస్తుతం 66 టిఎంసిలకు చేరుకుంది. మరో 34 టిఎంసిలు తుంగభద్ర డ్యాంలోకి వస్తే దిగువకు వదులుతారు. గతేడాది ఇదే సమయానికి కేవలం 14.3 టిఎంసిలు నీరు మాత్రమే అందుబాటులో వుండేది.

వైసీపీ నేత జగన్‌ను ఎన్డీయే కూటమిలో చేరాలంటూ రాందాస్‌ అథవాలే చేసిన వ్యాఖ్య రాబోయే అసలు సినిమాకు ముందస్తు కొసరని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. ‘బీజేపీ, వైసీపీ అపవిత్ర పొత్తుకు సంబంధించిన అసలు సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పుడు ఇది ముందస్తు ట్రైలర్‌. తెలుగు ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలోని బీజేపీ పెద్దల కాళ్ల వద్ద తాకట్టు పెడితే తెలుగు ప్రజలు చూస్తూ మౌనంగా ఊరుకోరు. 2019లో వైసీపీ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ కావడం ఖాయం’ అని ఆయన పేర్కొన్నారు. నిన్న కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే హైదరాబాద్ లో చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రంలో పెద్ద చర్చనీయంసం అయ్యాయి. వైసిపీ - బీజేపీ ఇంత తొందరగా బహిరంగంగా కలిసిపోతారని ఎవరూ ఊహించలేదు.

lokesh 15702018 2

జగన్‌ను తాము ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నామని, తమతో కలిస్తే ఆయన సీఎం అయ్యేందుకు మేము కృషి చేస్తామని కేంద్ర మంత్రి చెప్పటం, అందరినీ అవాక్కయేలా చేసింది. ప్రత్యేక హోదా విషయంలో మోదీ, అమిత్‌షాలతో తాను మాట్లాడతానని చెప్పారు. నేను ప్రత్యేక హోదా ఇచ్చే బాధ్యత తీసుకుని, జగన్ ను సియం చేస్తామని ఆయన అన్నారు. ఈ విషయం పై పెద్ద ఎత్తున చర్చ జరగటంతో, లోకేష్ కూడా ఈ విషయం పై ట్వీట్ చేసారు. "Sri Ramdas Athawale’s comment about Jagan joining NDA is a trailer before the final film on the unholy alliance between YCP & BJP hits the theatres. People are no fools to sit quiet & watch Jagan placing Telugu pride on the feet of BJP bosses. They will flop the film in 2019!"

lokesh 15702018 3

మరో పక్క అన్నక్యాంటీన్ల పై కూడా లోకేష్ ట్వీట్ చేసారు. అన్నక్యాంటీన్లను జాతీయ మీడియా ఆకాశానికెత్తేస్తూ కధనాలు వేసింది. అన్నక్యాంటీన్లపై వివిధ పత్రికల్లో వచ్చిన కథనాల పేపర్ కటింగ్స్‌ను నారా లోకేశ్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. మనీ కంట్రోల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందూ, ఐబీటీ, బిజినెస్ స్టాండర్డ్, ఏఎన్ఐ, డెక్కన్ క్రానికల్‌తో పాటు ఓ తమిళ పత్రికల్లో కధనాలు వచ్చాయి. దీని పై లోకేష్ ట్వీట్ చేస్తూ, 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు .. టీడీపీ సూపర్‌హిట్ అని ఆనాడు ఈనాడు దినపత్రిక ప్రచురించిందని.. ఈ రోజు టీడీపీ ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్ల గురించి జాతీయ పత్రికలన్నీ కథనాలను ప్రచురించాయని లోకేశ్ ట్వీట్ చేశారు.

Advertisements

Latest Articles

Most Read