వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకరికిఒకరు, తోడూ నీడగా సాగుతున్నారు. ఇద్దరినీ నడిపిస్తున్న బీజేపీ, పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం, అంతా సెట్ చేసింది. వీరందరి టార్గెట్ ఒక్కటే చంద్రబాబుని దించటం. దీని కోసం, పవన్, జగన్ లను, ప్లాన్ ప్రకారం వాడుతుంది బీజేపీ. ఇందుకోసం, ఉత్తరాంధ్రను ఇప్పటికే ఎంచుకుంది. దీనికి పవన్ కళ్యాణ్ ను వాడుతుంది. ఉత్తరాంధ్రలో విభాజన వాదం నింపటం, గోదావరి జిల్లాల్లో కులాల కుంపట్లు రాజెయ్యటం వీరి పని. దీని కోసం, ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఉత్తరంద్రలో, దాదాపు 20 రోజుల పాటు (సెలవలు కలపకుండా) అక్కడ ప్రజలను రెచ్చగొట్టారు. రెండు విడతలుగా చేసిన ఉత్తరాంధ్ర పర్యటనలో, అక్కడ ప్రజల్ని విభజన వాదం వైపు తీసుకెళ్ళే ప్రయత్నం చేసారు.
అయితే, ఇప్పుడు ఉత్తరాంధ్ర పర్యటన అయిపోవటంతో, పవన్ కళ్యాణ్ ఈ నెల 16 నుంచి గోదావరి జిల్లా యాత్ర చేస్తారంటూ, జనసేన పార్టీ వర్గాలు ప్రెస్ కి కూడా చెప్పాయి. అయితే, ఏమైందో ఏమో కానీ, కంటి మీద కురుపు తీయించుకునే ఆపరేషన్ చేయించుకున్నారు పవన్. దీంతో, వారం పది రోజుల దాకా, పవన్ రెస్ట్ లో ఉండే అవకాశం ఉంది. మళ్ళీ యాత్ర ఎప్పుడు నుంచి మొదలవుతుంది అనే దాని పై, త్వరలోనే చెప్తాం అంటుంది జనసేన పార్టీ. అయితే, దీని వెనుక, జగన్, పవన్ కోఆపరేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి, తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే, 16 వ తారీఖు లోపే, జగన్ విశాఖ జిల్లాలో అడుగు పెట్టాల్సింది.
కాని, వర్షాలు పడుతూ ఉండటంతో, గత వారం రోజులుగా పాదయాత్ర సాగటం లేదు. దీంతో జగన్ చాలా తక్కువ దూరం నడుస్తున్నారు. ఈ పరిణామంతో, షడ్యుల్ అంతా మారిపోయింది. ఇక పవన్ విషయానికి వస్తే 16 నుంచి తూర్పు గోదావరి పర్యటన అని చెప్పారు. గోదావరి జిల్లాల పర్యటన తరువాత కంటి ఆపరేషన్ అన్నారు. కాని, పవన్ ఉన్నట్టు ఉండి ఆపరేషన్ చేసుకున్నారు. దీనికి కారణం, జగన్ పాదయాత్ర కూడా తూర్పు గోదావరి జిల్లాలోనే ఉండటం, మరో వారం రోజులకి కాని విశాఖలో జగన్ అడుగుపెట్టరు. జగన్ విశాఖకు వెళ్ళే దాక, పవన్ గోదావరి జిల్లా పర్యటన చెయ్యరు. ఎందుకంటే ఇద్దరి లక్ష్యం చంద్రబాబు. ఒకేసారి ఒకే జిల్లలో, ఒకే రకమైన విమర్శలు చేస్తే, ప్రాధాన్యత తగ్గుతుందనే వెనుకడుగు వేసినట్టు తెలుస్తుంది. జగన్ తూర్పు గోదావరి పర్యటన అయ్యే వరకు, పవన్ గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లరు.