మన విద్యా రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా తీర్చిదిద్దాలని, అంతర్జాతీయ స్థాయి విద్య ప్రమాణాలు, బోధన, పరిశో ధనల తోకూడిన విద్యాసంస్థల ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమి నన్స్‌ (ఐఓఈ) కార్యక్రమం ఆది లోనే వివాదాస్పదమైంది. దేశంలో అత్యుత్తమ నాణ్యతాప్ర మాణాలున్న విద్యాసంస్థలను కాదని, ఇంకా ఆవిర్భవించని జియో విశ్వవిద్యాలయానికి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ ట్యాగ్‌ ఇవ్వడంతో వివాదం రాజుకుంది. అంతర్జాతీయంగా అత్యుత్తమ శ్రేణి విద్యా సంస్థల టాప్‌ 200 జాబితాలో భారతదేశం నుంచి ఒక్క విశ్వవిద్యాల యానికీ చోటు దక్కకపోవడంతో ఆందోళన చెందిన ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. తాజాగా మానవ వనరుల శాఖ నిపుణుల కమిటీ సిఫారసు మేరకు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ జాబితాను ప్రభుత్వం రెండురోజుల క్రితం ప్రకటించింది.

jio 12072018 2

వాటిలో ప్రభుత్వరంగానికి చెందిన ముంబై, ఢిల్లి ఐఐటీలు, బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌, ప్రైవేటు రంగానికి చెందిన ప్రఖ్యాత విద్యాసంస్థలు బిట్స్‌ పిలానీ, మణిపాల్‌ యూనివర్శిటీలు ఉన్నాయి. వీటితోపాటు రిలయన్స్‌ సంస్థకు చెందిన జియో వర్శిటీ పేరును ఆ జాబితాలో చేర్చడం ఇప్పుడు వివాదంగా మారింది. రిలయన్స్‌ సంస్థలు, వాటి అధిపతు లైన అంబానీలపై మోదీ ప్రభుత్వం అపారకరుణ చూపుతోందన డానికి ఇది నిదర్శనమని విపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. దేశంలో 800 విశ్వవిద్యాలయాలు, పేరెన్నికన్న విద్యాసంస్థలు ఉండగా, అసలు మొదలే కాని జియో వర్శిటీకి, మోడీ ప్రభుత్వం సలాం కొడుతుంది.

jio 12072018 3

దీని వెనుక భారీ కుట్ర ఉంది. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థలను ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినె న్స్‌ జాబితాలో చేరుస్తామని, అలా ప్రకటించిన విద్యాసంస్థలకు ప్రత్యేకంగా నిధులు, హక్కులు ఇస్తామని పేర్కొంది. ఎమినెన్స్‌ హోదా ఇచ్చిన ప్రైవేటు విద్యాసంస్థలకు, స్వయంప్రతిపత్తి కూడా ఇస్తామని, మరెన్నో హక్కులూ కల్పిస్తామని కేంద్రం పేర్కొంది. ఫీజుల నిర్ణయం, ఫ్యాకల్టీల నియామకం, కొత్త కోర్సుల నిర్వహణపై ప్రభుత్వ జోక్యం ఉండదు. యితే జియో విశ్వవిద్యాలయం ఎంపికపైనే ఇ ప్పుడు వివాదం రాజుకుంది. ఎందుకంటే, అసలు ఆ విశ్వవిద్యాలయం ఇప్పటివరకు ఏర్పాటు కాలేదు. జియో యూనివర్శిటీ ఎక్కడ ఏర్పాటు చేస్తారన్నదానిపైనా స్పష్టత లేదు. ఈ విద్యాసంస్థను ప్రమోట్‌ చేస్తున్న రిలయన్స్‌ ఫౌండేషన్‌కు ఆర్థికబలగం ఉన్నప్పటికీ విద్యా సంస్థల నిర్వహణలో ఏమాత్రం అనుభవం లేదు. అయితే అలాంటి సంస్థలను పోషిస్తున్న యాజమాన్యాల ట్రాక్‌ రికార్డును పరిగణనలోకి తీసుకుంటామని, విద్యాసంస్థల నిర్వహణలో అనుభవం ఉంటే మంచిదేకాని, కచ్చితంగా ఉండాలనే లేదని ఓ నిబంధన పెట్టారు. ఇది విమర్శలకు కారణమైంది.

ప్రపంచం వేగంగా మారిపోతుంది. గ్రీన్ ఎనర్జీ వైపు పరుగులు పెడుతుంది. ఇందులో భాగంగా, మన దేశంలో సోలార్ వైపు ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నా, ప్రజలు మాత్రం సహకరించటం లేదు. దానికి ప్రధాన కారణం సోలార్ ప్యానెల్ ల ధరలు. సోలార్ పై మక్కువతో ఉన్న చంద్రబాబు, ఈ సమస్యను అధిగమించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇంటి పైకప్పు పై సోలార్ విద్యుత్తు ప్యానెల్స్ ను అతి తక్కువ ధరకే ఏర్పాటు చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) ప్రణాళికలు రూపొందించింది. ముందుగా తక్కువ విద్యుత్తు వాడుతున్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీకి అదనంగా మరికొంత ఏపీఎస్పీడీసీఎల్‌ భరించి ప్రజలకు చేరువ చేసేందుకు సిద్ధమైంది.

solar 12072018 2

ముందుగా తిరుపతి, విజయవాడ ప్రాంతాల్లోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. మరో వారంలో వినియోగదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఇంటి పైకప్పు పై ఏర్పాటు చేసుకునే సోలార్ ప్యానెల్స్ నెడ్‌క్యాప్‌ 30 శాతం సబ్సిడీ అందిస్తూ వస్తోంది. ఒక కిలోవాటు విద్యుత్‌కు సంబంధించి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సుమారు 70వేలు అవుతుంది. ఇందులో 30 శాతం సబ్సిడీ పోనూ రూ.49వేలు చెల్లించాల్సి వచ్చేది. దీంతో వినియోగదారులు ముందుకు రాకపోవడంతో.. నెడ్‌క్యాప్‌ సబ్సిడీకి అదనంగా ఏపీఎస్పీడీసీఎల్‌ మరికొంత నిధులను భరించేందుకు సిద్ధమైంది.

solar 12072018 3

ఇటీవలే కొత్తగా సోలార్ ప్యానెల్స్ సరఫరా చేసేవారి నుంచి టెండర్లు పిలిచారు. ఒక్కో కిలోవాట్‌ విద్యుత్తును ఉత్పత్తి చేసే సౌర పలకలను రూ.60వేలకు ఇచ్చేందుకు ఓ సంస్థ ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో నెలకు 100 యూనిట్ల విద్యుత్తును వినియోగించే వినియోగదారులు..1 కిలోవాట్‌ సోలార్ ప్యానెల్స్ కు రూ.10వేలు చెల్లిస్తే సరిపోతుంది. 0.5 కిలోవాట్‌ పెట్టుకుంటే రూ.5వేలకే అందిస్తారు. నెడ్‌క్యాప్‌ ఇచ్చే 30శాతం సబ్సిడీ పోనూ మిగతా మొత్తాన్ని ఏపీఎస్పీడీసీఎల్‌ భరించనుంది. 100 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకూ విద్యుత్‌ వినియోగించే వారికి ఒక్కో కిలోవాట్‌ సోలార్ ప్యానెల్స్ ను రూ.15వేలకు అందిస్తారు. 0.5 కిలోవాట్‌కు రూ.7500కే ఇవ్వనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ అడ్డుకట్టకు పోలీసులు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నా ఎర్రచందనం స్మగ్లింగ్ మాత్రం వివధ రూపాల్లో జరుగుతుంది. సెలబ్రిటీలుగా పేరు ఉన్న వారు కూడా, ఈ స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా ఎర్రచందనం స్మగ్మింగ్‍లో 'జబర్దస్త్' నటుడుకి సంబంధం ఉన్నట్టు, టాలీవుడ్ లింక్‌లు ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. మొన్నటి దాకా, టీవీ సీరియళ్లలో చిన్నచిన్న క్యారెక్టర్లు వేసుకునే ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్... ఎర్రచందనం అక్రమరవాణాతో కోట్లకు పడగలెత్తాడు. ఎర్రచందనం అక్రమరవాణా ద్వారా సంపాదించిన కోట్ల రూపాయాలతో సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నాడు.

jabardasth 12072018 2

రీసెంట్ గా రిలీజ్ అయిన, షకలక శంకర్ హీరోగా నటించిన శంభోశంకర సినిమాకు కూడా ఫైనాన్స్ చేశాడు. సినిమా నటుడిగా చలామణి అవుతూనే ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తున్న అతని కోసం తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. తిరుపతికి చెందిన ఈ స్మగ్లర్... టీవీ ప్రోగ్రామ్స్‌లో చిన్నచిన్న వేషాలేస్తుంటాడు. ఆర్టిస్టుగా పేరు తెచ్చుకుంటూనే ఎర్రచందనం స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకున్నాడు. శేషాచలంలోని చెట్లను నరికి అక్రమంగా ఇతర రాష్ట్రాలకు పంపించడం ప్రారంభించాడు.

jabardasth 12072018 3

తమిళనాడు, కర్ణాటకలోని స్మగ్లర్ల ద్వారా బడా స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌తో కోట్లాది రూపాయలు కూడబెట్టినట్టు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పక్కా ఆధారాలు లభించాయి. అతనిపై 20కి పైగా కేసులు నమోదు చేశారు. ఇతనిపై 20 కేసులు నమోదు చేశామని చెప్పిన టాస్క్ ఫోర్స్ అధికారులు, అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఇతను ఫైనాన్స్ చేసిన పలు చిత్రాలు ప్రస్తుతం నిర్మాణ, నిర్మాణానంతర దశలో ఉన్నాయని తెలుస్తోంది.. అయితే మరో ఇద్దరు నటుల ప్రమేయం ఉన్నట్టు పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. విచారణ జరిపి, వీరిని కూడా అరెస్ట్ చేతామని పోలీసులు అంటున్నారు.

నవ్యాంధ్రలో మనం కట్టుకున్న మొదటి కట్టడం, సచివాలయం. వెలగపుడిలో సకల హంగులతో సచివాలయం ఏర్పాటు అయ్యి, పాలన మొత్తం ఇక్కడ నుంచే ప్రారంభం అయ్యింది. ముఖ్యమంత్రి మొదలుకుని, మంత్రులు, ముఖ్య కార్యదర్శులు వివిధ శాఖలు అన్నీ ఇక్కడ నుంచే పని చేస్తున్నాయి. తమ సమస్యలు తీరుస్తారు అని గంపడే ఆశతో, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వెలగపూడిలో ఉన్న కొత్త సచివాలయానికి వస్తున్నారు. అయితే, అలాంటి వారు, మారిన నిబంధనలు తెలుసుకుని రావాలి. సచివాలయ ప్రవేశానికి, నిబంధనలు మారాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది.

sec 12072018 2

సచివాలయ ప్రధాన ద్వారంలో ప్రవేశానికి ఆధార్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది. ఇప్పటి వరకూ సంబంధిత కార్యాలయం అధికారులు భద్రత విభాగం వారికి కాగితం పై రాసి పంపడమో, ఫోన్‌లో చెప్పడం ద్వారానో లోపలికి పంపమనే వారు. ఇకపై తప్పనిసరిగా ఫొటో ఆధారిత పాస్‌ ద్వారానే అనుమతిస్తారు. సందర్శకులు వచ్చినప్పుడు వారి ఫోన్‌ నెంబరు, ఆధార్‌ సంఖ్యను మంత్రి ముఖ్య కార్యదర్శుల వ్యక్తిగత కార్యదర్శులు సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి నమోదు చేస్తారు.

sec 12072018 3

అనంతరం ఒక సందేశం సంబంధిత సందర్శకుడు ఇచ్చిన ఫోన్‌ నెంబరుకు వెళుతుంది. వారు ఆ సందేశాన్ని సచివాలయం ప్రధాన ద్వారం వద్ద ఉన్న జీఏడీ కౌంటర్‌ వద్ద చూపితే అక్కడే వారి ఫొటో తీసుకుని పాస్‌ జారీ చేస్తారు. దానిని భద్రతా సిబ్బందికి చూపించి సచివాలయంలోకి ప్రవేశించవచ్చు. ఎక్కువమంది కలిసి ఒకే బృందంగా వస్తే.. వారిలో ప్రధాన వ్యక్తి ఆధార్‌ నెంబరును, మిగిలిన వారి సంఖ్యను పై తరహాలోనే నమోదు చేసి గ్రూప్‌ ఫొటోతీసి పాస్‌ జారీ చేస్తారు. ముఖ్యమంత్రికి సమస్యలు విన్నవించుకునేందుకో, వివిధ శాఖల్లో పనుల కోసమో వచ్చే సందర్శకులు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య సాధారణ సందర్శన వేళల్లో సచివాలయంలోకి వెళ్లవచ్చు. వారు కూడా ఆధార్‌ వివరాలను సమర్పించి పై విధానంలోనే పాస్‌ను పొందాల్సి ఉంటుంది.

Advertisements

Latest Articles

Most Read