వైసీపీ నేతలు ఎవరినీ వదలటం లేదు. అందిన కాడికి దోచుకునే పనిలో వైసీపీ నేతలు ఉన్నారు. అవినీతి సెంట్రలైజ్ అవ్వటం, తమకు మద్యం, ఇసుక, మట్టి, ఇలా దేంట్లో కూడా వాటా లేక పోవటంతో, వైసీపీ నేతలు సామాన్య ప్రజల పై పడి పీక్కుతింటున్నారు. అయితే మొన్నటి వరకు సామాన్య ప్రజలనే టార్గెట్ చేసిన వైసీపీ నేతలు, ఇప్పుడు ఈ సమాజాన్ని రక్షించే పోలీస్ లని కూడా వదిలిపెట్టటం లేదు. ఏకంగా ఎస్పీ స్థాయి అధికారి స్థాలనికే ఎర్త్ పెట్టాడు, వైసీపీ ఎంపీ. ఈ ఘటనతో ఒక్కసారిగా రాష్ట్రం ఉలిక్కి పడింది. విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై, ఒక ఎస్పీ స్థాయి అధికారి ఫిర్యాదు చేయటంతో, ఒక్కసారిగా కలకలం రేగింది. సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఎస్పీ కె. మధు, ఎంపీ పైన ఫిర్యాదు చేసారు. ఎంపీ తన స్థలాన్ని కబ్జా చేసారని కంప్లైంట్ ఇచ్చారు. తన స్థలం కబ్జా చేసుకోవటమే కాక, అందులో రోడ్డు కూడా వేసేసారని, విశాఖ నార్త్‌ ఏసీపీ సీహెచ్‌ శ్రీనివాసరావుకు, ఎస్పీ కంప్లైంట్ ఇచ్చారు. 531 గజాల స్థలాన్ని 2016లో ఎస్పీ కొనుగోలు చేసారు. అయితే ఆ స్థలంలో నిర్మాణం చేయాలని భావించి, 2018లో దరఖాస్తు చేసుకోగా, ఈ భూమిలో ప్రభుత్వ స్థలం కలిసి ఉందని జీవీయంసీ గతంలోనే ఆ అప్లికేషన్ తిరస్కరించింది. అయితే ఈ స్థలం సర్వే చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

police 28032022 2

ఇది ఇలా జరుగుతూ ఉండగానే, ఈ స్థలాన్ని ఆనుకుని, వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్థలం కూడా ఉంది. అక్కడ ఎంపీ లేఅవుట్ వేయించారు. అయితే పక్కనే ఉన్న ఎస్పీ స్థలాన్ని అక్రమంగా తీసుకుని, తన లేఅవుట్ కోసం రోడ్డు వేయించాడు ఎంపీ. అయితే విషయం తెలిసిన ఎస్పీ, తన స్థలం వద్దకు వెళ్లి, తన స్థలంలో ప్రహరీ గోడ కట్టే ప్రయత్నం చేసాడు. కూలీలను తీసుకుని వెళ్లి పనులు ప్రారంభించాడు. వెంటనే విషయం తెలుసుకున్న ఎంపీ అనుచరలు, అక్కడకు వచ్చి, ఈ స్థలం మదని, ఎస్పీని బెదిరించారు. ఇదే సమయంలో పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చి, స్థలం కాగితాలు తీసుకుని స్టేషన్ కు రావాలని చెప్పారు. దీంతో చేసేది ఏమి లేక, ఎస్పీ అక్కడ నుంచి వచ్చేసారు. తరువాత జరిగిన విషయం పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ విషయం పెద్దది అవ్వటం,మీడియాలో రావటంతో స్పందించిన వైసీపీ ఎంపీ, ఆ స్థలం తనదే అని, కావాలనే ఆయన ఇదంతా చేస్తున్నారు అంటూ, వివరణ ఇచ్చారు.

చంద్రబాబు.. చంద్రబాబు.. చంద్రబాబు... నిత్యం చంద్రబాబు పేరు జపం చేస్తూ ఉండే వైసీపీ బ్యాచ్, గత వారం పది రోజుల నుంచి, ట్యూన్ మార్చారు. ఇప్పుడు వాళ్ళ ట్యూన్, ఈనాడు, టీవీ, ఏబిఎన్. ఏకంగా అసెంబ్లీలో, ముఖ్యమంత్రి హోదాలో జగన్ మోహన్ రెడ్డి, మూడు చానల్స్ ని టార్గెట్ చేస్తూ, చంద్రబాబు కంటే, వాళ్ళే మా ప్రత్యర్ధులు అని చెప్పే స్థాయికి వెళ్లారు అంటే, జగన్ మోహన్ రెడ్డి ఆ మూడు చానెల్స్ ని చూసి, ఎలా భయపడుతున్నారో అర్ధం అవుతుంది. ఇందులో రామోజీ రావు, బీఆర్ నాయుడు సైలెంట్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. కానీ రాధాకృష్ణ మాత్రం, ప్రతి వారం వీకెండ్ కామెంట్ లో, తనదైన స్టైల్ లో , జగన్ మోహన్ రెడ్డికి సమాధానం ఇస్తూ, కౌంటర్ లు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు రాధాకృష్ణ అలాంటి కౌంటరే జగన్ మోహన్ రెడ్డికి ఇచ్చారు. గతంలో రాధాకృష్ణ, జగన్ మోహన్ రెడ్డి చెల్లి షర్మిలకు, జగన్ మోహన్ రెడ్డికి పడటం లేదని, షర్మిల త్వరలో పార్టీ పెడుతున్నారని చెప్పి బాంబు పేల్చారు. అయితే అప్పట్లో వైసీపీ ఎదురు దా-డి చేసింది. అన్యాయంగా తమ పై రాధాకృష్ణ అబండాలు వేస్తూ, కుటుంబంలో గొడవలు పెడుతున్నారు అంటూ కౌంటర్ ఇచ్చినా, చివరకు షర్మిల పార్టీ పెట్టి, రాధాకృష్ణ రాసిన వార్త నిజం అని చెప్పేలాగా చేయటంతో వైసీపీ షాక్ తింది.

rk 27032022 2

ఇప్పుడు రాధాకృష్ణ మరో సంచలన వార్తతో ముందుకు వచ్చారు. జగన్ మోహన్ రెడ్డి పార్టీకి వైఎస్ విజయమ్మ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే వైఎస్ విజయమ్మ, వైసీపీ పార్టీలోని గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారు అంటూ, రాధాకృష్ణ బాంబు పేల్చారు. అయితే ఈ విషయం జగన్ వద్ద చెప్పగా, ప్లీనరీ అయ్యేంత వరకు ఆగాలని చెప్పినట్టు, దీంతో విజయమ్మ ప్లీనరీ తరువాత రాజీనామా చేయనున్నట్టు రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ లో చెప్పారు. దీంతో ఇది కూడా నిజం అవుతుందేమో అని వైసీపీలో గుబులు పుట్టుకుంది. ఎందుకుంటే ఇప్పటికే జగన్ వైఖరి, విపరీత మనస్తత్వం పై ప్రజల్లో చర్చ జరుగుతుంది. తన సొంత చెల్లి షర్మిలను రోడ్డున పడేసాడు,మరో చెల్లి సునీతకు న్యాయం చేయకుండా ఏడిపిస్తున్నాడు, ఇప్పుడు తల్లి కూడా వెళ్ళిపోతే, ఇక జగన్ మోహన్ రెడ్డి వైఖరి పై విపరీత ప్రచారం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితిలోనూ మంచిది కాదని, ఈ వార్త నిజం అవ్వ కూడదని వైసీపీ శ్రేణులు దండం పెట్టుకుంటున్నాయి.

జగన్ ప్రభుత్వం పై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయశాఖ కార్యదర్శిని ప్రభుత్వం నియమించిన తీరు పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. న్యాయాధికారిగా ఉండే వ్యక్తి మాత్రమే న్యాయశాఖ కార్యదర్శిగా ఉండాలని నిబంధనలు ఉన్నా, న్యాయాధికారిగా లేని వ్యక్తికి ఆ పదవి ఎలా ఇస్తారు అంటూ, హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం పై విస్మయం వ్యక్తం చేసింది. ఇలాంటి నియామకం తాము ఎప్పుడూ చూడలేదని, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా, ఇలా జరిగిందా అని, అడ్వొకేట్ జనరల్ శ్రీరాంను హైకోర్టు ప్రశ్నించింది. దీని పైన మీరు పరిశీలిన జరిపి, కోర్టుకు అవగాహన కలిపిస్తే, తెలుసుకుంటాం అంటూ, అడ్వొకేట్ జనరల్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. న్యాయశాఖ కార్యదర్శిని ఎలా నియమిస్తారు, అర్హతలు ఏమిటి ? రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఏ నిబంధన ప్రకారం, ఈ నియామకం చేసింది అంటూ ప్రభుత్వాన్ని చెప్పాలని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన చీఫ్ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన హైకోర్టు ధర్మాసనం గురువారం జరిగిన కేసు విచారణ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం న్యాయశాఖ కార్యదర్శిని నియమించిన తీరు పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు పై, జగన్ మార్క్ కక్ష సాధింపు ఎలా ఉంటుందో చూస్తున్నాం. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన పై సస్పెన్షన్ వేటు వేసారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన సస్పెన్షన్ లోనే ఉన్నారు. విచారణ ఏమైందో తెలియదు, ఎక్కడ వరకు వచ్చిందో తెలియదు. మరో పక్క కోర్టులో కేసు కూడా విచారణకు రావటం లేదు. ఈ నేపధ్యంలోనే ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పుడు చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖ సంచలనం సృష్టిస్తుంది. ఆయన చీఫ్ సెక్రటరీ లేఖ రాస్తూ, ఫిబ్రవరి 8కి తనని సస్పెండ్ చేసి రెండేళ్ళు అయిపోయింది కాబట్టి, నిబంధనలు ప్రకారం, తన పై విధించిన సస్పెన్షన్ దానంతట అదే తొలగిపోయినట్టే అంటూ పేర్కొన్నారు. ఇప్పటికే ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసి రెండేళ్ళు దాటిపోయింది. అఖిల భారత సర్వీసుల నియమావళి ప్రకారం, రెండేళ్ళ లోపు ఆయన పైన మోపిన అభియోగాల పై విచారణ చేయాలి. విచారణలో తేలిన అంశాలను బట్టి, ఆ అధికారి పై చర్యలు తెసుకోవాల్సి ఉంటుంది. అయితే సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో, ఇప్పటికే రెండేళ్ళు అయిపోయినా, ఇప్పటి వరకు ఏమి జరగలేదు. రెండేళ్ళు దాటిపోయింది కాబట్టి, ఇప్పుడు ఇది కేంద్రం కోర్ట్ లోకి వెళ్తుంది.

abv 26032022 2

ఈ సస్పెన్షన్ రెండేళ్ళు దాటి కొనసాగాలి అంటే, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సమీక్ష కమిటీ సిఫార్సు చేస్తేనే ఇది కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు ఆ కమిటీ ఎలానటి సిఫారుసు కానీ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి రెండు సార్లు ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కొనసాగించింది. అది ఫిబ్రవరి 8తో ముగిసింది. రెండేళ్ళు దాటిపోవటం, అలాగే కేంద్రం కూడా ఎలాంటి సిఫార్సు చేయక పోవటంతో, ఆయన సస్పెన్షన్ పూర్తయినట్టే. ఆ రోజు నుంచి కూడా ఆయనకు పూర్తి జీతం పొందే అవకాసం ఉంది. ఇదే విషయం పైన ఏబీ వెంకటేశ్వరరావు, చీఫ్ సెక్రటరీకి లేఖ రాసారు. జగన్ మోహన్ రెడ్డి, ఏబీ వెంకటేశ్వరరావు ఎలా కక్ష కట్టారో తెలిసిందే. గత వారం కూడా అయన పై పెగాసిస్ ఆరోపణలు కూడా చేసారు. అయితే ఆ ఆరోపణల పై వెంటనే ఆయన సమాధానం కూడా చెప్పారు. ఆ ప్రెస్ మీట్ లో అనేక సంచలన అంశాలు ప్రస్తావించారు. ఇప్పుడు మళ్ళీ లేఖ రాసి, జగన్ మోహన్ రెడ్డిని, ఏబీ వెంకటేశ్వరరావు చాలెంజ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు నిబంధనలు ప్రకారం వెళ్తారో, జగన్ ఏమి చేస్తారో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read