ఈ మధ్య కాలంలో జగన్ మోహన్ రెడ్డి ఊరికే ఉక్రోష పడుతూ, బయట పడిపోతున్నారు. తాను సియంని అనే విషయం కూడా మర్చిపోయి, హుందాతనం గాలికి వదిలేసి ప్రవర్తిస్తున్నారు. సాక్ష్యాత్తు అసెంబ్లీలోనే జగన్ మోహన్ రెడ్డి ఇలా ప్రవర్తిస్తూ ఉండటంతో, అందరూ ఆశ్చర్య పోతున్నారు. జగన్ మోహన్ రెడ్డికి సొంత చానెల్,సొంత పేపర్ సాక్షి ఉన్న సంగతి తెలిసిందే. సాక్షిని జగన భార్య చూసుకుంటూ ఉంటారు. ఇక జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ను తన పార్టీ కార్యక్రమాలకు రాకుండా బ్యాన్ చేసారు. కాకపోతే ఇప్పుడు అధికారిక కార్యక్రమాలు కాబట్టి, ప్రభుత్వ కార్యక్రమలాకు బ్యాన్ చేయలేడు. అధికారంలోకి రాగానే ఏబిఎన్, టీవీ5 చానెల్స్ కేబుల్ లో రాకుండా చేసారు. ఇదంతా ఒక ఎత్తు. సహజంగా మనకు ఎవరైనా నచ్చక పోతే వాళ్ళ వైపు కూడా మనం చూడం. వాడు ఏమి చేసుకుంటే మాకెందుకు అని పట్టించుకోము. అయితే జగన్ మోహన్ రెడ్డి మాత్రం, ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఈనాడు, జ్యోతి, టీవీ5 భజన చేస్తున్నారు. ప్రతి రోజు అసెంబ్లీలో, ఈ మూడు చానల్స్ ప్రస్తావన తెస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ సాక్షిని అసలు పట్టించుకోలేదు. ఏమి రాసుకుంటే మాకెందుకు, రాసుకోండి అన్నట్టు, వదిలేసింది. అయితే జగన్ మాత్రం, బ్యాన్ చేసినా, మనసు మాత్రం ఆ మూడు చానెల్స్ చుట్టూ తిప్పుకుంటున్నారు.

sakshi 25032022 2

జగన్ మోహన్ రెడ్డి తన సాక్షి చానెల్ కానీ, సాక్షి పేపర్ కానీ చూడటం లేదని, ప్రతి రోజు కేవలం ఏబీఎన్, టీవీ5, ఈనాడు మాత్రమే చూస్తున్నారని అర్ధం అవుతుంది. ఎందుకు అంటే, ఆయన గత నాలుగు రోజులుగా చేస్తున్న ప్రసంగాలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. ముఖ్యంగా పోలవరం పైన ప్రసంగంలో, పోలవరం ఎత్తు తగ్గిస్తున్నాం అని రాసారని, రాధాకృష్ణా రాధాకృష్ణా, రామోజీ రామోజీ, మేము ఎత్తు తగ్గిస్తున్నాం అని మోడీ వీళ్ళకు ఫోన్ చేసి చెప్పారా అంటూ, జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏమిటి అంటే, సాక్షి కూడా ఇదే రాసింది. అంటే జగన్ మోహన్ రెడ్డి సాక్షి చూడటం ఆపేశారని, ఈ ఘటన చూస్తే అర్ధం అవుతుంది. కధనంలో తప్పు ఉంటే, తప్పు అని చెప్పాలి, లేదంటే లీగల్ నోటీసులు పంపించాలి, కానీ జగన్ మాత్రం, కుర్రతనంలో ఉండే యువకుడిలా మైండ్ సెట్ మార్చుకుని, తన ఉక్రోషం మొత్తం, ఆ మూడు చానెల్స్ పైన చూపిస్తూ, సియం అనే హుందాతనం కూడా మర్చిపోయారు.

జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ పెద్దలు తెలివిగల వాళ్ళం అనుకుంటారో, లేక ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటారో కానీ, ఇష్టం వచ్చినట్టు జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, ఇప్పుడు వారికే బాక్ ఫైర్ అయ్యాయి. మరీ ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, ఆయనకు రాసిచ్చిన స్క్రిప్ట్ ని చదువుతూ, కనీసం అందులో ఏమి ఉంది అనే విషయం కూడా పట్టించుకోకుండా చేసిన తీరు, అందరినీ ఆశ్చర్య పరిచింది. గత మూడు రోజులు స్పీచ్ల గురించి పక్కన పెడితే, అంతకు ముందు జంగారెడ్డి గూడెం సంఘటనలో జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు, అందరినీ విస్మయానికి గురి చేసింది. జగన్ మోహన్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రంలో ప్రతి ప్రాణం పైన ఆయనకు బాధ్యత ఉంటుంది. అలాంటిది ఎకంగా 40 మంది కల్తీ సారాతో మరణిస్తే, అవి సహజ మరణాలని, దేశంలో మనుషులు చనిపోతూ ఉండటం, సర్వ సాధారణం అంటూ, ఆయన లెక్కలు చెప్పిన తీరు అందరినీ షాక్ కు గురి చేసింది. జగన్ మోహన్ రెడ్డి ఇలా ఎలా మాట్లాడతారు అంటూ సామాన్య ప్రజలు కూడా అభిప్రాయ పడ్డారు. ఇక గత మూడు రోజులుగా, మూడు కీలక అంశాల పై జగన్ మాట్లాడారు. ఒకటి పోలవరం, రెండు మద్యం, మూడు అమరావతి పై హైకోర్టు ఇచ్చిన తీర్పు.

jagan 25032022 2

ఈ మూడు విషయాల్లో కూడా జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ ప్రసంగాలు అయితే ఇచ్చారు కానీ, ఆయన ముఖ్యమంత్రి, అయన చేతిలో అధికారం ఉంది అనే సంగతి మర్చిపోయారు. తన అసమర్ధతను తానే చాటుకున్నారు. పోలవరం పైన చర్చలో, ఇప్పటికీ ఎందుకు పోలవరం పూర్తి కాలేదో చెప్తూ, చంద్రబాబు వల్లే పూర్తి కాలేదని చెప్పిన తీరు, అందరినీ షాక్ కు గురి చేసింది. 3 ఏళ్ళు అయినా చంద్రబాబు పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసారు. ఇక మద్యం విషయంలో,అవన్నీ చంద్రబాబు ఇచ్చిన అనుమతులు అని చెప్పారు,మరి ఇన్నాళ్ళు మీరు ఎందుకు రద్దు చేయలేదు అంటే సమాధానం లేదు, అదేమంటే చంద్రబాబు మా మద్యం ఆదాయం రాకుండా చూస్తున్నాడు అంటూ సెల్ఫ్ గోల్ వేసి, మద్య నిషేధం హామీని గాలికి వదిలేసారు. ఇక నిన్న మూడు రాజధానుల అంశం, నిన్న హైకోర్టుకే పాఠాలు చెప్పిన జగన్, ఇవన్నీ కోర్టులో ఎందుకు వాదించలేదు ? అసలు తీర్పు నచ్చక పోతే, ఇప్పటికీ సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు అనే చర్చ నడుస్తుంది. ఇలా ప్రతి అంశంలోనూ జగన్ ఎక్ష్పొజ్ అయ్యారు.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఈ రోజు మధ్యానం 12 గంటలకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో, ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో సంచలన వాస్తవాలు బయట పెడుతున్నాం అని, రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా చూడాలని అంటున్నారు. ఇందులో మద్యానికి సంబంధించి, ఏపి ప్రభుత్వం చేస్తున్న దోపిడీ, అదే విధంగా జే-బ్రాండ్స్ కు సంబంధించి వైసీపీ వ్యవహరిస్తున్న తీరు, తెలుగుదేశం హాయాంలో ఇచ్చిన అనుమతులు ఏమిటి, ఆ తరువాత ఇచ్చిన అనుమతులు ఏమిటి ? ఇప్పుడు మార్కెట్ లో ఏ బ్రాండ్స్ ఉన్నాయి ? అదే విధంగా మంది పేరు ఉన్న బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ లోకి రానివ్వకుండా, ప్రభుత్వం వాటిని ఎలా అడ్డుకుంది, అలాగే ముడుపులకు సంబందించిన ఆధారాలు, ఇలా వీటి అన్నిటినీ కూడా బహిర్గతం చేస్తామని తెలుగుదేశం పార్టీ చెపుతుంది. ఇప్పటికీ కూడా మార్కెట్ లో మద్యం షాపుల్లో, జే-బ్రాండులు మినహా, మరే ఇతర బ్రాండులు ఉండటం లేదని, టిడిపి ఆరోపిస్తుంది. వీటి అన్నిటికీ సంబంధించి సాక్ష్యాలు, ఆధారాలతో సంచలన విషయాలు చెప్తామని, గత మూడేళ్ళ నుంచి ఏ విధంగా దోపిడీ జరిగింది, ఈ దోపిదీలో ఎవరు కీలక సుత్రదారాలు, పాత్రధారులు, రాష్ట్రంలో డిస్టిలరీస్ ఎవరి పేరు మీద సాగుతున్నాయి ?

tdp 24032022 2

డిస్టిలరీస్ అద్దెకు తీసుకుని ఎవరు నడిపిస్తున్నారు ? దీంతో పాటు, అసలు దీని వెనుక ఉన్న సుత్రదారాలు ఎవరు అనే విషయం బహిర్గతం చేస్తాం అని చెప్పి, టిడిపి ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఈ రోజు మధ్యానం 12 గంటలకు సాక్ష్యాలతో, వీడియోలతో సహా అన్నీ చూపిస్తాం అని చెప్తున్నారు. వీటి అన్నిటికీ సంబంధించిన విషయంతో పాటు, నిన్న జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ చేసిన ఆరోపణలు, డిస్టిలరీస్ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వారివి అని చెప్పటం పైన కూడా టిడిపి కౌంటర్ ఇవ్వనుంది. ప్రస్తుతం ఆ డిస్టిలరీస్ ఎవరి పేరు మీద ఉన్నాయి ? ఏమి తాయారు అవుతాయి అనేది కూడా బహిర్గతం చేస్తాం అని, వాటి వివరాలు అన్నీ కూడా బహిర్గతం చేస్తాం అని చెప్తున్నారు. అలాగే మరో అంశం , చంద్రబాబు సియంగా ఉన్న సమయంలో, అనుమతి ఇచ్చిన బ్రాండులు అంటూ, జగన్ చేసిన ఆరోపణలు, జగన్ వచ్చిన తరువాత బ్రాండులు ఏంటి అనే విషయాలు కూడా వెల్లడిస్తామని అని చెప్తున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు ఈ కసరత్తు సాగిందని, మొత్తం వివరాలు చెప్తాం అని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చివరి నిమిషంలో తీసుకున్న ఆ నిర్ణయం సూపర్ హిట్ అయ్యింది. తెలుగుదేశం స్ట్రాటజీ అర్ధం కాక, జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ పెద్దలు విలవిలలాడి పోయారు. విషయానికి వస్త, నిండు సభలో చంద్రబాబు సతీమణిని వైసీపీ నేతలు కొడాలి నాని, అంబటి, ద్వారంపూడి దూషించారు. లోకేష్ పుటుక గురించి, డీఎన్ఏల గురించి మాట్లాడారు. నిండు సభలో అది సహించలేని చంద్రబాబు, 40 ఏళ్ళు తనకు అన్నీ తానై ఉన్న తన సతీమణిని ఇలా బజారులో పెట్టటం పై సహించలేక పోయారు. చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చారు. అదే రోజు అసెంబ్లీలో, ఈ కౌరవ సభను గౌరవ సభను చేసి కానీ, మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టను అని శపధం చేసి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసారు. అసెంబ్లీకి మళ్ళీ సియంగానే వస్తానని శపధం చేసారు. అయితే తరువాత జరిగిన పరిణామాల్లో, బడ్జెట్ సమావేశాలు మొదలు కావటంతో, టిడిపిలోని మిగతా ఎమ్మెల్యేలు ఈ సమావేశాలకు వెళ్ళాలా వద్దా అనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. పోలిట్ బ్యూరో సమావేశం, ఆ తరువాత జరిగిన ఎమ్మెల్యేల సమావేశం, ఇలా అనేక మీటింగ్లు జరిగాయి. ఎక్కవ మంది సమావేశాలకు వెళ్ళాక పోవటమే మంచిందని, కానీ ఫైనల్ నిర్ణయం చంద్రబాబుకు వదిలి పెడుతున్నాం అని అన్నారు.

cbn 25032022 21

అయితే చంద్రబాబు మాత్రం, అందరిలా ఎందుకు ఆలోచిస్తారు. అందరిలా ఆలోచిస్తే ఆయన ఇంతటి మహా నాయకుడు ఎలా అవుతారు ? చంద్రబాబు మాత్రం, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళాలని, ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కుంటున్నారని, తాను తీసుకున్న నిర్ణయం వ్యక్తిగతం అని, మనం ప్రజల కోసం నిలబడాలి అని ఎమ్మెల్యేలకు చెప్పారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీకి వెళ్ళారు. అయితే ఎవరూ ఊహించని విధంగా, ఈ అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి పై చేయి సాధించింది. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవటంతోనే, వైసీపీ మైండ్ బ్లాక్ అయ్యింది. అక్కడ నుంచి మొదలు పెడితే, ప్రతి అంశంలోనూ జగన్ మోహన్ రెడ్డిని ఎక్ష్పొజ్ చేయటంలో టిడిపి సక్సెస్ అయ్యింది. కమ్మ డీఎస్పీల విషయంలో, జగన్ అబద్ధాలు బట్టబయలు అయ్యాయి. పోలవరంలో జగన్ అసమర్ధత బయట పడింది, మద్యం అమ్మితేనే తన ప్రభుత్వం నడుస్తుందని చెప్పాల్సిన పరిస్థితి, ఇక మూడు రాజధానుల పై సుప్రీం కోర్టుకు వెళ్ళకుండా, అసెంబ్లీలో చర్చించిన విధానం, ఇలా అన్ని విషయాల్లో జగన ఎక్ష్పొజ్ అయ్యారు. టిడిపి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలి అనే టిడిపి నిర్ణయం, ఇప్పుడు సూపర్ హిట్ అయ్యింది.

Advertisements

Latest Articles

Most Read