సీనియర్‌ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, గాంధీ కుటుంబ విధేయుడు. అప్పటి ఇందిరా గాంధీ నుంచి, రాహుల్ గాంధీ దాకా, అందరితో సన్నిహితంగా ఉండేవారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు కాంగ్రెస్‌లో ఎంపీలుగా పదవులు నిర్వహించి.. రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీకి దూరమైన ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఫోకస్‌ పెట్టింది. కాంగ్రెస్‌ పార్టీకి అంతటి కీలకమైన నేత కావడంతో ఉండవల్లిని తిరిగి కాంగ్రె‌స్‌లోకి రావాలంటూ ఆహ్వానం పంపారు. రాష్ట్ర విభజన తర్వాత ఉండవల్లి కాంగ్రె‌స్‌ను సైతం తూర్పారబట్టారు. ఆ పార్టీకి రాజీనామా చేసి కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన సమైక్యాంధ్ర పార్టీలో చేరినా, ఎన్నికలలో మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు.

undavalli 06072018 2

తర్వాత వైసీపీలో చేరతారని ఉండవల్లి అనుచరవర్గం భావించింది. అయితే ఇప్పటికీ అరుణ్‌కుమార్‌ జగన్‌ పార్టీలో చేరలేదు. కానీ ప్రతి ప్రెస్ మీట్ లో, జగన్ కు అనుకూలంగా మాట్లాడుతూ, చంద్రబాబుని విమర్శిస్తూ ఉంటారు. ప్రతి సందర్భంలో, నేను ఇంకా రాజకీయాల్లోకి రాను, ఏ పార్టీలోకి వెళ్ళను, కాని రాజకీయాలు మాట్లాడతూ అని చెప్తూ ఉంటారు. అయితే, కాంగ్రెస్ పార్టీ కోమాలో నుంచి బయటకు వచ్చే ప్రయత్నంలో, పాత నేతలు అందరినీ, తిరిగి సొంత గూటికి ఆహ్వానిస్తున్నారు.ఇందులో భాగంగా, ఉండవల్లిని కూడా తిరిగి పార్టీలోకి ఆహ్వానించటానికి, కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలు పెట్టింది.

undavalli 06072018 3

వచ్చే ఎన్నికలలో కేంద్రంలో కాంగ్రెస్‌ క్రియాశీల పాత్ర పోషిస్తుందన్న అంచనాలు వేసుకుంటున్నారు. ఎన్డీయేకి వ్యతిరేకంగా ఏర్పడుతున్న కూటమికి మద్దతు ఇవ్వడమా? ఎక్కువ సీట్లు వస్తే వారి మద్దతు కూడగట్టుకోవడమా? అనేదానిపై కాంగ్రెస్‌ సీరియ్‌సగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభావం లేకపోయినా, కేంద్రంలో క్రియాశీలకంగా ఉంటుందన్న అంచనాలతో పాత నేతలు కాంగ్రె్‌సలోకి తిరిగి వస్తారని నమ్మకంగా ఉన్నారు. రాష్ట్రంలో ప్రభావంలేకపోయినా కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం వస్తే కాంగ్రె్‌సలో ముఖ్య నాయకులకు ఏవేవో పదవులు పొందవచ్చన్న అభిప్రాయంలో కూడా పలువురు నేతలు దృష్టిసారిస్తున్నట్లు చెప్తున్నారు.

కేంద్రం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు గురించి పట్టించుకోకుండా, అన్నీ ఇచ్చేసాం అంటూ హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే... ఈ నేపధ్యంలో, గత నాలుగు నెలల నుంచి, రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయి. అయినా కేంద్రం మాత్రం, పట్టించుకోవటం లేదు. ఈ నేపధ్యంలో, చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు చేస్తున్న పోరాటాలు చేస్తూనే, రాష్ట్ర ప్రభుత్వం తరుపున, కేంద్రం పై సుప్రీం కోర్ట్ కు వెళ్లనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా విభజన హామీలపై ఇటీవల సుప్రీం కోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుదీర్ఘంగా చర్చించారు.

cabinet 06072018 2

ప్రత్యేక హోదా, విభజన హామీలపై న్యాయపోరాటం చేసేందుకు మంత్రివర్గం నిర్ణయించారు. విభజన హామీల అమలుపై సుప్రీంను ఆశ్రయించాలని, ఇందుకోసం సొంతంగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇది ఇలా ఉండగా, తెలుగు రాష్ట్రాలకు విభజన హామీల అమలులో జాప్యం జరుగుతోందని పేర్కొంటూ, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ పై, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్నీ ఇచ్చేసాం అని ఆఫిడవిట్ ఇచ్చింది. అయితే, ఈ పిటిషన్‌ లో ఇంప్లీడ్ అవ్వకుండా, సొంతగా మరో కేసు వెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి వేసిన పిటిషన్‌ లో తెలంగాణా అంశాలు కూడా ఉంటాయి కాబట్టి, మన సమస్యలు మాత్రమే ప్రస్తావిస్తూ, పిటిషన్‌ వెయ్యనున్నారు.

cabinet 06072018 3

మొత్తం 19 అంశాల పై, కేంద్రం మనకు అన్యాయం చేస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు వనరుల ప్రాధాన్యత కల్పించడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రైల్వే జోన్ ఏర్పాటు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, విశాఖ, విజయవాడ మెట్రో రైల్, పేట్రో కెమికల్ కాంపెక్స్ ఏర్పాటు, జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థల ఏర్పాటు, నెల్లూరులో దుగ్గిరాజపట్నం పోర్టుతో పాటు, అమరావతికి ఆర్థిక సహాయం, పన్నుల సవరణ, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు, అమరావతికి సమగ్ర రవాణా కనెక్టివిటీ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, డిస్కంల ద్వారా విద్యుత్ బకాయిల చెల్లింపులు, 9వ షెడ్యూల్, 10వషెడ్యూల్ సంసలు, గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు వంటి అంశాల గురించి, ఇప్పటికీ క్లారిటీ లేదు.

ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, జనసేనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు... బీజేపీ, వైసీపీ, జనసేన ఆ మూడు పార్టీలూ తోడు దొంగలేనని మండిపడ్డా ఆయన... ద్రోహులంతా ఒక్కటై రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విభజించిన వారే... రాష్ట్రం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్న దేవినేని... కాంగ్రెస్ నేతలే ఇప్పుడు వైసీపీ, బీజేపీ నేతలుగా రూపాంతరం చెందారని సెటైర్లు వేశారు. పదేళ్లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినవాళ్లే ఇప్పుడు నీతులు చెబుతున్నారంటూ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ దేవినేని... జగన్ అనవసరంగా ప్రభుత్వంపై నోరు పారేసుకుంటున్నారు... వచ్చే ఎన్నికల్లో ప్రజలే జగన్ కి గుండు కొడతారని వ్యాఖ్యానించారు.

polavaram 06072018 2

బొత్స, కన్నా, ధర్మాన పదేళ్లు మంత్రులుగా ఉండి రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు దేవినేని... జగన్, పవన్... నరేంద్ర మోడీని ఎందుకు ప్రశ్నించరు..? ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారు... పార్లమెంట్ కి ఎంపీలు వెళ్లలేరు... వీళ్ళకి అసలు రాష్ట్ర ప్రయోజనాలే అవసరం లేదన్నారు. వైఎస్ జగన్... సీఎం పదవి పిచ్చిపట్టి రోడ్లపై తిరుగుతున్నాడంటూ మండిపడ్డ ఆయన... ప్రతిపక్ష నేతగా పోలవరం డ్యామ్ సైట్ పనులు చూడాల్సిన బాధ్యత లేదా..? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా జగన్ అనర్హుడు... తప్పుకోవాలని డిమాండ్ చేశారు దేవినేని ఉమ.

polavaram 06072018 3

పట్టిసీమపై కాంగ్రెస్, వైసీపీ నేత‌లు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు.... ఆల్మట్టికి ఇప్పటి వ‌ర‌కూ నీరు రాలేదని, అయినా పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లిస్తుంటే కుళ్లుకుంటున్నారని విమర్శించారు.... ఒక బేసిన్ నుండి మరో బేసిన్‌కు 105 టీఎంసీలు తరలించడం రికార్డు అని అన్నారు.... పట్టిసీమను అందరూ అభినందిస్తుంటే జ‌గ‌న్‌కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.... పోల‌వ‌రం ప్రాజెక్టు చూడ‌కుండానే గోదావ‌రి జిల్లా దాటిన వ్యక్తి జ‌గ‌న్ అని విమర్శించారు.... రాజ్యసభలో ప్రశ్నలు వేస్తూ పక్కరాష్ట్రాలకు విజయసాయిరెడ్డి సమాచారం ఇస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు.

శ్రీసిటీలో మరో భారీ పరిశ్రమ యూఎస్జీ బోరల్ బిల్డింగ్ ప్రాడెక్ట్స్ఇండియా లిమిటెడ్ నిర్మాణానికి గురువారం ఉదయం భూమిపూజ జరిగింది. అమెరికాకు చెందిన యూఎస్జీ, ఆస్ట్రేలియాకు చెందిన బోరల్ కంపెనీల సంయుక్త భాగస్వామ్యంతో నెలకొల్పబడనున్న ఈ పరిశ్రమ అధునాతన భవన నిర్మాణ రంగంలో ఉపయోగించే ప్లాస్టర్ బోర్డులను ఉత్పత్తి చేస్తుంది. యూఎస్జీ బోరల్ గ్రూప్ సీఈఓ ఫ్రెడరిక్ డీ రోగేమోంట్, ఆసియా, మిడిల్ ఈస్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాన్ కాసే, ఇండియా ఆపరేషన్స్ సీఈఓ సుమిత్ బిడాని, ఇతర ప్రతినిధుల చేతుల మీదుగా ఉదయం 11 గంటల సమయంలో లాంఛనంగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.

usg 06072018 2

ఈ సందర్భంగా ఫ్రెడరిక్ డీ రోగేమోంట్మాట్లాడుతూ, తమ శ్రీసిటీ ప్లాంట్ లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారయ్యే ఉత్పత్తులు దేశీయ, దక్షిణాసియా దేశాల మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉంటాయన్నారు. అమెరికాలో పర్యటనలో వున్న శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ తన సందేశంలో, భవన నిర్మాణ రంగంలో అగ్రగామి సంస్థ అయిన యూఎస్జీ బోరల్ శ్రీసిటీకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నాణ్యమైన ప్లాస్టర్ బోర్డుల తయారీ ద్వారా ఈ సంస్థ భారత్ మరియు ఇతర దేశాలలో తమ వ్యాపారాన్ని విస్తరింపచేయగలదన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు.

usg 06072018 3

ఇండియా ఆపరేషన్స్ సీఈఓ సుమిత్ బిడాని మాట్లాడుతూ, వివిధ వ్యాపార అనుకూలతల వలనే శ్రీసిటీలో తమ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భారత్ లో తమ వ్యాపార విస్తరణకు ఈ ప్లాంటు బాగా ఉపయోగపడుతుందని అన్నారు. శ్రీసిటీలో 24 ఎకరాల్లో తలపెట్టిన యూఎస్జీ బోరల్ కంపెనీ నిర్మాణం 2019 సంవత్సరాంతానికి పూర్తికానుంది. సుమారు 300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ పరిశ్రమలో ఏడాదికి 30 మిలియన్ చదరపు మీటర్ల ప్లాస్టర్ బోర్డులు తయారవుతాయి. ప్రత్యక్షంగా 100 మందికి ఉపాధి దొరుకుతుంది. ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా ఖండాలలోని వివిధ దేశాలలో ఉత్పత్తి కేంద్రాలున్న యూఎస్జీ బోరల్ సంస్థకు భారతదేశంలో రాజస్థాన్, తమిళనాడులలో మరో రెండు ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి.

Advertisements

Latest Articles

Most Read