ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, జనసేనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు... బీజేపీ, వైసీపీ, జనసేన ఆ మూడు పార్టీలూ తోడు దొంగలేనని మండిపడ్డా ఆయన... ద్రోహులంతా ఒక్కటై రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విభజించిన వారే... రాష్ట్రం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్న దేవినేని... కాంగ్రెస్ నేతలే ఇప్పుడు వైసీపీ, బీజేపీ నేతలుగా రూపాంతరం చెందారని సెటైర్లు వేశారు. పదేళ్లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినవాళ్లే ఇప్పుడు నీతులు చెబుతున్నారంటూ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ దేవినేని... జగన్ అనవసరంగా ప్రభుత్వంపై నోరు పారేసుకుంటున్నారు... వచ్చే ఎన్నికల్లో ప్రజలే జగన్ కి గుండు కొడతారని వ్యాఖ్యానించారు.
బొత్స, కన్నా, ధర్మాన పదేళ్లు మంత్రులుగా ఉండి రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు దేవినేని... జగన్, పవన్... నరేంద్ర మోడీని ఎందుకు ప్రశ్నించరు..? ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారు... పార్లమెంట్ కి ఎంపీలు వెళ్లలేరు... వీళ్ళకి అసలు రాష్ట్ర ప్రయోజనాలే అవసరం లేదన్నారు. వైఎస్ జగన్... సీఎం పదవి పిచ్చిపట్టి రోడ్లపై తిరుగుతున్నాడంటూ మండిపడ్డ ఆయన... ప్రతిపక్ష నేతగా పోలవరం డ్యామ్ సైట్ పనులు చూడాల్సిన బాధ్యత లేదా..? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా జగన్ అనర్హుడు... తప్పుకోవాలని డిమాండ్ చేశారు దేవినేని ఉమ.
పట్టిసీమపై కాంగ్రెస్, వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు.... ఆల్మట్టికి ఇప్పటి వరకూ నీరు రాలేదని, అయినా పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లిస్తుంటే కుళ్లుకుంటున్నారని విమర్శించారు.... ఒక బేసిన్ నుండి మరో బేసిన్‌కు 105 టీఎంసీలు తరలించడం రికార్డు అని అన్నారు.... పట్టిసీమను అందరూ అభినందిస్తుంటే జగన్‌కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.... పోలవరం ప్రాజెక్టు చూడకుండానే గోదావరి జిల్లా దాటిన వ్యక్తి జగన్ అని విమర్శించారు.... రాజ్యసభలో ప్రశ్నలు వేస్తూ పక్కరాష్ట్రాలకు విజయసాయిరెడ్డి సమాచారం ఇస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు.