ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతోందా..? మంత్రి వర్గ విస్తరణ జరిగితే భారీగా మార్పులు చేర్పులు ఉంటాయా..? లేదంటే బీజేపీ వదులుకున్న రెండు మంత్రి పదవులకే పరిమితమవుతారా..? ఆ రెండు బెర్తులు ఎవరికి దక్కబోతున్నాయి. ప్రస్తుతం టీడీపీలో ఇదే అంశంపై విపరీతమైన చర్చ నడుస్తోంది. కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు రాజీనామా తర్వాత ఖాళీ అయిన వైద్యఆరోగ్య శాఖతో పాటు దేవాదాయ శాఖను కొత్త వారికి అప్పగించాలనే యోచనలో సీఎం ఉన్నారని తెలియడంతో మంత్రివర్గంలో చోటు కోసం పెద్ద తలకాయలే ఎదురు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎప్పుడన్న‌ది క‌రెక్ట్ గా చెప్ప‌క‌పోయినా నెల రోజుల లోపే మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఉండ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.

cbn 03072018 2

దీంతో మంత్రి ప‌ద‌వుల‌ను ఆశిస్తున్న ఆశావాహ‌లు త‌మ ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. తాజాగా చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరినీ తొలగించాలి...ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే విషయంపై 'చంద్రబాబు' ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆయన సన్నిహితుల ద్వారా మంత్రి పదవులు కోల్పోయేవారు...నూతనంగా మంత్రివర్గంలోకి వచ్చేవారి వివరాలు బయటకుపొక్కాయి. రాష్ట్రంలో ముస్లిం నాయకుడికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్సీ ఎంఏ షరీఫ్‌ వైపు అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ నుంచి ఇద్దరు మైనారిటీలు ఎమ్మెల్సీలుగా గెలిచారు. వారిలో ఎన్‌ఎండీ ఫరూక్‌ ప్రస్తుతం శాసనమండలి చైర్మన్‌గా ఉన్నారు. మరో ఎమ్మెల్సీ షరీఫ్‌ ప్రస్తుతం మండలి నుంచి ప్రభుత్వ విప్‌గా ఉన్నారు. జలీల్‌ ఖాన్‌ ఇటీవల రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు అధ్యక్షునిగా నియమితులయ్యారు.

cbn 03072018 3

వీరిలో ఫరూక్‌ రాయలసీమ వారు కాగా షరీఫ్‌ కోస్తా నాయకుడు. మైనారిటీల సంఖ్య రాయలసీమలో అధికంగా ఉండటంతో ఫరూక్‌ చేత మండలి చైర్మన్‌ పదవికి రాజీనామా చేయించి మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ జరిగింది. అదే జరిగితే చైర్మన్‌ పదవిని మరో సీనియర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ పదవిలో ఫరూక్‌నే కొనసాగించి, షరీఫ్ ను మంత్రిని చేస్తే ముస్లిం మైనారిటీలకు రెండు ప్రధాన పదవులు ఇచ్చినట్లవుతుందన్నది ప్రస్తుతం టీడీపీ అధిష్ఠానం మదిలో ఉన్న ఆలోచనగా చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన షరీఫ్‌ దీర్ఘకాలంగా పార్టీని అంటి పెట్టుకొని పనిచేస్తున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధిష్ఠానం ఏ బాధ్యత అప్పగించినా అంకిత భావంతో నిర్వహిస్తున్నారు. ఇక... ఖాళీగా ఉన్న రెండో మంత్రి పదవిపై టీడీపీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా దానిని కొంతకాలం అలాగే ఉంచి ఆ తర్వాత భర్తీ చేయవచ్చని అంటున్నారు.

అనుకున్నదే జరిగింది... పోలవరం పై కక్షతో, కేంద్రం మరోసారి మనకు పరీక్షలు పెడుతుంది... పోలవరం స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌పై స్టే కొనసాగింపునకు కేంద్ర ప్రభుత్వ తుది ఆమోదం లభించలేదు. దీంతో ప్రాజెక్టు పనులపై అనిశ్చితి నెలకొంది. ఈ ఫైల్ పై, కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సంయుక్త, అదనపు కార్యదర్శులు ఆమోదముద్ర వేసి కార్యదర్శి సీకే మిశ్రాకు పంపారు. ఆయన నుంచి అనుమతి పొందడానికి సోమవారం రాత్రి వరకూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారులు పడిగాపులు కాసినా ఫలితం లేకపోయింది. ఈ ఫైల్ కి ఆయన ఆమోదముద్ర వేస్తే, కేంద్ర మంత్రి హర్షవర్థన్‌కు చేరుతుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఆయన ఈ నెల 5వ తేదీ రాత్రి దిల్లీకి చేరుకుంటారని అధికార వర్గాల సమాచారం. ఆలోపు పర్యావరణశాఖ కార్యదర్శి పచ్చజెండా ఊపితే కేంద్ర మంత్రి దిల్లీకి వచ్చిన వెంటనే ఫైల్ పై తుది ముద్ర వేసే అవకాశం ఉంటుంది. ఏదన్నా రాజకీయ కారణం చూపితే మరికొంత జాప్యం జరిగే ప్రమాదం ఉందని ఏపీ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

polavaram 03072018 2

అయితే, అప్పటి వరకు పనులు కొనసాగించాలా లేదా అన్న దాని పై, అనిశ్చితి నెలకొంది. పోయిన సారి ఇలాగే లేట్ అయితే 2 రోజులు పనులు ఆగిపోయాయి. మరి మారిన రాజకీయ పరిస్థుతుల నపధ్యంలో, పోలవరం ప్రాజెక్ట్ ను అడ్డుకోవాలని కేంద్రం చూస్తున్న తరుణంలో, రాష్ట్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. ఒక్క రోజు కూడా వేస్ట్ చెయ్యకుండా, చంద్రబాబు పనులు పరిగెత్తిస్తున్నారు. మరి ఇప్పుడు పనులు ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు ఏమి చేస్తారో చూడాలి. పోలవరం పనుల నిలిపివేతకు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వకూడదని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు జూన్‌ 2న ఆయన కేంద్ర మంత్రి హర్షవర్థన్‌కు లేఖ రాశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా నవీన్‌ లేఖకు కౌంటర్‌గా హర్షవర్థన్‌కు లేఖ రాశారు. తక్షణం ‘స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌’పై స్టే జారీచేసి పోలవరం పనులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఈ ఆర్డర్‌పై గత ఏడాది జులై 3న ఇచ్చిన స్టే సోమవారం (జూన్‌ 2)తో ముగిసింది. ఇప్పుడు కేంద్రం మళ్లీ దాన్ని పునరుద్ధారించాల్సి ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి తెదేపా బయటకు వచ్చిన నేపథ్యంలో కేంద్రం ఎలాంటి మెలికపెడుతుందోనన్న ఆందోళన ఏపీ అధికారుల్లో వ్యక్తమవుతోంది.

polavaram 03072018 3

పోలవరం ప్రాజెక్టుపై ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌ అభ్యంతరాల నేపథ్యంలో నిర్మాణ పనులు ఆపేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) 2015 చివరిలో ‘స్టాప్‌ వర్క్‌’ ఆదేశాలిచ్చింది. అప్పటి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిగా ఉన్న ప్రకాశ్‌ జావడేకర్‌ ఆ ఆదేశాలపై 2016లో స్టే ఉత్తర్వులిచ్చారు. దీంతో.. 2017 జూన్‌ 2వ తేదీ దాకా పనులు కొనసాగించే అవకాశం కలిగింది. ఈ గడువు ముగిసేలోగా మరోసారి స్టేను పొడిగించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా జావడేకర్‌తో మాట్లాడి స్టేను పొడిగించాలని కోరారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించి.. ఏకంగా రెండేళ్లపాటు స్టే పొడిగిస్తూ ఫైలుపై సంతకం చేశారు. ఇది అమల్లోకి వచ్చి ఉంటే 2019 దాకా స్టే ఉత్తర్వు కొనసాగేది. అయితే.. ఈ స్టే ఉత్తర్వు జారీ చేసేలోగా జావడేకర్‌ను మానవ వనరుల అభివృద్ధి శాఖకు మార్చారు. ఆయన స్థానంలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ బాధ్యతలను అనిల్‌ దవే స్వీకరించారు. స్టే కాలపరిమితిపై పలు సందేహాలు వ్యక్తం చేసి.. చివరకు స్టాప్‌ ఆర్డర్‌పై స్టేను ఏడాదికే పరిమితం చేశారు. జూలై 2వ తేదీతో స్టే గడువు ముగిసింది.

ప్రధాని మోడీ, ఎట్టకేలక మన రాష్ట్రానికి వస్తున్నారు. అయితే బీజేపీ నేతలు చెప్తునట్టు కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు కాదు, విభజన హామీలు నెరవేరుస్తాం అని చెప్పటానికి కాదు, లేకపోతే మరే ఇతర పెద్ద ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి కాదు.. ఆయన అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కు వస్తున్నారు. కర్నూల్ లో అతి పెద్ద సోలార్ పార్క్ ప్రారంభోత్సవానికి రమ్మని, దాదాపు సంవత్సరం నుంచి ప్రభుత్వం అడిగినా రాని ప్రధాని, 5 కోట్ల మంది ఆంధ్రులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నా రాని ప్రధాని, ఇప్పుడు వస్తున్నారు.. ఈ నెల 22న షార్ కు రానున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రధాన ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో సుమారు రూ. 650 కోట్లతో నిర్మించిన రెండవ రాకెట్ వాహన అనుసంధాన భవనాన్ని మోడీ ఈ సందర్భంగా జాతికి అంకితం చేయనున్నారు.

modi 0307201 2

ఆయన పర్యటన ఖరారు కావడంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో భారత శాస్త్రవేత్తలు వివిధ విభాగ అధిపతులు అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేపడుతున్నారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన షార్లో ప్రస్తుతం ప్రయోగాల సంఖ్య గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. అయితే అందుకు సరైన రాకెట్ వాహన అనుసంధాన భవనం లేకపోవడం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఒక్క భవనం పై ఆధారపడే ప్రయోగాలు చేయాలంటే సాంకేతికంగా ఇబ్బందులు ఎదుర వుతున్నాయి.

modi 0307201 3

దీంతో 2015లో షార్ లో రెండవ అనుసంధాన భవనాన్ని నిర్మించాలని అప్పటి ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఆ తరువాత ఇస్రో చైర్మన్ గా పని చేసిన ఏఎస్ కిరణ్ కుమార్ ఆ ప్రతిపాదన పై ప్రతేక శ్రద్ధ చూపడంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు గత రెండు సంవత్సరాల్లో నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేశారు. అయితే షార్ లో రెండో అనుసంధాన భవనానికి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగానే ఆ భవనాన్ని జాతికి అంకితం చేయాలని ప్రస్తుత ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ పట్టుదలతో ఉన్నారు. ఇలా దేశానికి గర్వంగా ఉండే ప్రాజెక్ట్ ల గురించి రాకీయం చెయ్యకూడదు కాని, ఈ సందర్భంలో అయినా, కానీసం ఆంధ్రప్రదేశ్ గుర్తు ఉన్నందుకు, ప్రధానికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత, ఏదన్నా కనికరించి, ఆంధ్రులు చేస్తున్న ఆందోళనలు ప్రధాని అడ్రస్ చేస్తారేమో చూడాలి.

ఒకే దేశం, ఒకే ఎన్నిక నినాదం పై ముందుకు వెళ్లనున్న మోడీ సర్కార్ ఆ దిశగా పావులు కదుపుతోంది. ఈ మేరకు జమిలి ఎన్నికలపై కేంద్రంలో కదలిక ప్రారంభమైంది. ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాల మేరకు ఈనెల 7,8 తేదీలలో రాజకీయ పార్టీలతో లా కమిషన్ సంప్రదింపులు జరుపనున్నట్లు తెలుస్తోంది. లా కమిషన్ ప్రజలు, భాగస్వామ్య పక్షాల నుంచి సలహాలు, సూచనలు కోరుతుంది. లోక్ సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలపై చర్చలు సాగించనుంది. ఆగస్టులో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కేంద్ర పెద్దలు చెబుతున్నారు. మొత్తంగా 2018 ఏడాది చివరలో అన్ని పార్టీలకు పండుగలా మారే పరిస్థితి వచ్చింది. అంటే ముందస్తు ఎన్నికలు, ఇంకా చెప్పాలంటే సెప్టెంబర్ అక్టోబర్లోనే లోక్సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశంపై చర్చ జరుగనుందని అంటున్నారు.

elections 03072018

అయితే కేంద్రం మొదట్లో నవంబర్, డిసెంబర్ నెలలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిందని ప్రచారం అయింది. ఆరు నెలల ముందు కాదు, 8నెలల ముందేఎన్నికలకు వెళ్లేందుకు వ్యూహం రూపొందించుకుంటు అన్నట్లుగా ఢిల్లీ పెద్దలు లీక్ చేశారు. కాగా, దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లడాన్ని టిడిపితో పాటు కమ్యూనిస్టు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ తో పాటు ఇతర పక్షాలు ముందస్తు ఎన్నికలకు సైతం సిద్దమైనట్లుగా చెబుతున్నాయి. జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం లబ్దిపొందాలని చూస్తుందని విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. గత రెండు, మూడు ఏండ్లుగా దేశంలో జమిలి ఎన్నికల ప్రస్తావన కేంద్ర పెద్దలు పదేపదే తెస్తున్నారు. చివరికి నూతన రాష్ట్రపతి రామ్నాద్ కోవింద్ నోట కూడా వినిపింపచేశారు. దేశంలో ఏడాది పొడవునా వేర్వేరు ఎన్నికలు జరుగుతున్న కారణంగా అభివృద్ధి పనులు నిర్వహించడం కష్టంగా ఉందని, ఐదేళ్ల కొకసారి ఒకేసారి అసెంబ్లీ, లోక్ సభకు ఎన్నికలు జరిగితే ఖర్చులు తగ్గడంతో పాటు అభివృద్ధి పనులు కూడా సులభంగా సాగుతాయని ఢిల్లీ పెద్దలు పదేపదే చెబుతు న్నారు.

elections 03072018

తాజాగా ప్రధాని నరేంద్రమోడీ కూడా నీతి అయోగ్ సమక్షంలో జరిగిన ముఖ్య మంత్రుల సమావేశంలో ప్రస్తావన చేశారు. మొత్తంగా ముందస్తు ఎన్నికలు తప్పవనే పరిస్థితి వచ్చేసింది. తాజాగా పార్లమెంట్ వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం భేటీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు చేసిన విషయం తెలిసిందే. జూలై 18 నుంచి ఆగస్టు 10 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉన్నాయి. 18 రోజుల పాటు సాగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఓబిసి కమిషన్ కు రాజ్యాంగ భద్రత, త్రిపుల్ తలాక్, ట్రింజెండర్ బిల్లు, సిటీజన్షిప్ బిల్లు, నహా జమిలి ఎన్నికల నిర్వహణకు బిల్లును ప్రత్యేకంగా ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్తాన్ ఎన్నికలు నవంబర్, డిసెంబర్లో జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మేలో పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జరుగనున్నాయి. దేశంలోని 29 రాష్ట్రాల్లో కనీసంగా సగం రాష్ట్రాలైనా కలుపుకుని లోక్ సభతో పాటు జమిలీ ఎన్నికలకు పోవాలని కేంద్రం నిర్ణయానికి వచ్చిందంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read