ఒకే దేశం, ఒకే ఎన్నిక నినాదం పై ముందుకు వెళ్లనున్న మోడీ సర్కార్ ఆ దిశగా పావులు కదుపుతోంది. ఈ మేరకు జమిలి ఎన్నికలపై కేంద్రంలో కదలిక ప్రారంభమైంది. ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాల మేరకు ఈనెల 7,8 తేదీలలో రాజకీయ పార్టీలతో లా కమిషన్ సంప్రదింపులు జరుపనున్నట్లు తెలుస్తోంది. లా కమిషన్ ప్రజలు, భాగస్వామ్య పక్షాల నుంచి సలహాలు, సూచనలు కోరుతుంది. లోక్ సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలపై చర్చలు సాగించనుంది. ఆగస్టులో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కేంద్ర పెద్దలు చెబుతున్నారు. మొత్తంగా 2018 ఏడాది చివరలో అన్ని పార్టీలకు పండుగలా మారే పరిస్థితి వచ్చింది. అంటే ముందస్తు ఎన్నికలు, ఇంకా చెప్పాలంటే సెప్టెంబర్ అక్టోబర్లోనే లోక్సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశంపై చర్చ జరుగనుందని అంటున్నారు.

elections 03072018

అయితే కేంద్రం మొదట్లో నవంబర్, డిసెంబర్ నెలలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిందని ప్రచారం అయింది. ఆరు నెలల ముందు కాదు, 8నెలల ముందేఎన్నికలకు వెళ్లేందుకు వ్యూహం రూపొందించుకుంటు అన్నట్లుగా ఢిల్లీ పెద్దలు లీక్ చేశారు. కాగా, దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లడాన్ని టిడిపితో పాటు కమ్యూనిస్టు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ తో పాటు ఇతర పక్షాలు ముందస్తు ఎన్నికలకు సైతం సిద్దమైనట్లుగా చెబుతున్నాయి. జమిలి ఎన్నికల పేరుతో కేంద్రం లబ్దిపొందాలని చూస్తుందని విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. గత రెండు, మూడు ఏండ్లుగా దేశంలో జమిలి ఎన్నికల ప్రస్తావన కేంద్ర పెద్దలు పదేపదే తెస్తున్నారు. చివరికి నూతన రాష్ట్రపతి రామ్నాద్ కోవింద్ నోట కూడా వినిపింపచేశారు. దేశంలో ఏడాది పొడవునా వేర్వేరు ఎన్నికలు జరుగుతున్న కారణంగా అభివృద్ధి పనులు నిర్వహించడం కష్టంగా ఉందని, ఐదేళ్ల కొకసారి ఒకేసారి అసెంబ్లీ, లోక్ సభకు ఎన్నికలు జరిగితే ఖర్చులు తగ్గడంతో పాటు అభివృద్ధి పనులు కూడా సులభంగా సాగుతాయని ఢిల్లీ పెద్దలు పదేపదే చెబుతు న్నారు.

elections 03072018

తాజాగా ప్రధాని నరేంద్రమోడీ కూడా నీతి అయోగ్ సమక్షంలో జరిగిన ముఖ్య మంత్రుల సమావేశంలో ప్రస్తావన చేశారు. మొత్తంగా ముందస్తు ఎన్నికలు తప్పవనే పరిస్థితి వచ్చేసింది. తాజాగా పార్లమెంట్ వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం భేటీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు చేసిన విషయం తెలిసిందే. జూలై 18 నుంచి ఆగస్టు 10 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉన్నాయి. 18 రోజుల పాటు సాగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఓబిసి కమిషన్ కు రాజ్యాంగ భద్రత, త్రిపుల్ తలాక్, ట్రింజెండర్ బిల్లు, సిటీజన్షిప్ బిల్లు, నహా జమిలి ఎన్నికల నిర్వహణకు బిల్లును ప్రత్యేకంగా ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్తాన్ ఎన్నికలు నవంబర్, డిసెంబర్లో జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మేలో పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జరుగనున్నాయి. దేశంలోని 29 రాష్ట్రాల్లో కనీసంగా సగం రాష్ట్రాలైనా కలుపుకుని లోక్ సభతో పాటు జమిలీ ఎన్నికలకు పోవాలని కేంద్రం నిర్ణయానికి వచ్చిందంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read