ఆర్టీసీ అంటేనే, ఎప్పుడూ నష్టాల్లో నడిచే నష్టాల బస్సుగా ముద్ర పడింది.. ఇది నిజం కూడా... ఆదాయం రాక పడరాని పాట్లు పడుతోన్న ప్రజా రవాణాసంస్థ ఎట్టకేలకు ఇన్నాళ్లకు ఏపీఎస్ఆర్టీసీ లాభాలను నమోదు చేసింది. బస్సులను నడపడంలో లోపాలను సరిదిద్దుకోవడం, కొత్త బస్సుల కొనుగోళ్లు, ఆక్యుపెన్సీని పెంచుకోవడం, పట్టుదలగా యాజమాన్యం చేసిన ప్రయత్నాలు తదితర అంశాలలో యాజమాన్యం చేసిన కృషి ఫలించి, చివరకు ఆర్టీసీని లాభాల బాట పట్టించింది. పెళ్లిళ్లు, వేసవి సెలవులు తదితర అంశాలు కూడా ఆర్టీసీకి బాగా కలసివచ్చాయి. సొంతగా కార్గో సేవలు అందిచటం కూడా,కలిసి వచ్చింది. కొన్ని రూట్లలో అద్దెబస్సులను, మరిన్ని రూట్లలో కొత్త బస్సులను నడిపి.. ప్రయోగాలకు తెర తీసింది. కేసినేని లాంటి ట్రావెల్స్‌ ఆగిపోవటంతో, దూరప్రాంత బస్సుల్లో కొంతమేర ఆక్యుపెన్సీ పెరిగింది.

rtc 02072018 2

రాష్ట్ర విభజన తరువాత దాదాపు 3వేల కోట్ల రూపాయల తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ వస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ తాజా సంస్కరణల ఫలితంగా క్రమేణా రాబడి పెంచుకుంటూ నష్టాలను తగ్గించుకుంటోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ మాలకొండయ్య హయాంలో 2016-17లో రూ. 780 కోట్లుగా ఉన్న సంస్థ నష్టం 2017-18 నాటికి రూ. 390 కోట్లకి చేరింది. అంటే రికార్డు స్థాయిలో ఒక్కసారిగా రూ. 450 కోట్లు నష్టం తగ్గింది. ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి సురేంద్రబాబు కృషి కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతినెలా క్రమేణా నష్టాలు తగ్గుతూ వస్తున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో 2017-18 ఏప్రిల్‌తో పోలిస్తే మొత్తం 128 డిపోల్లో రికార్డు స్థాయిలో రూ. 31 కోట్లు నష్టం తగ్గింది.

rtc 02072018 3

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మే నెలలో ఏడు డిపోల్లో రాబడి పెరిగింది. ఏప్రిలో వచ్చిన నష్టం రూ. 27కోట్లు కాగా మే నెలలో వచ్చిన నష్టం రూ. 7.13 కోట్లు మాత్రమే కావటం విశేషం. మొత్తం 128 డిపోల్లో మూడు బస్ స్టేషన్లు సహా మొత్తం 35 డిపోల్లో రూ. 23.51 కోట్లు రాబడి రాగా, 97 డిపోల్లో రూ. 58 కోట్ల రూపాయల మేర సంస్థకు నష్టాలు వచ్చాయి. ఈ రెండు మాసాల్లో కలిపి అత్యధికంగా విజయవాడ డిపో రూ. 3.41 కోట్ల రాబడితో ప్రథమ స్థానంలో నిలవగా రూ. 1.91 కోట్లతో రాజమండ్రి, కోటి 90 లక్షల 42వేలతో అమలాపురం, కోటి 67 లక్షల 75 వేలతో కాకినాడ, కోటి 54 లక్షలతో కనిగిరి, కోటి 15 లక్షల 27వేలతో విజయవాడ ఆటోనగర్, కోటి 8 లక్షలతో విశాఖ, 88.81 లక్షలతో తుని, రూ. 69 లక్షలతో రాజోలు వరుస క్రమంలో నిలిచాయి. ఇక రూ. కోటి 84 లక్షల 12వేల నష్టాలతో చిత్తూరు-1 డిపో చివరి స్థానంలో నిలిచింది.

సీఎం కుమారుడిగా రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగుపెట్టారు. అనంతరం మంత్రి పదవిని చేపట్టి మంచి మార్కులే పొందారు. ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల కదన రంగంలోకి దూకబోతున్నట్లు ప్రకటించి ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారారు. ఆయనెవరో కాదు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్. ఏపీ మంత్రిగా కొనసాగుతున్న నారా లోకేష్ 2019 ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. లోకేష్ తొలిసారి ఎదుర్కోబోతున్న ఎన్నికలు కావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. దానికి కారణం లేకపోలేదు. ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన ఎక్కడ నుంచి అనేది మాత్రం పార్టీ నిర్ణయమేనని సస్పెన్స్‌కు తెరలేపారు. దీంతో లోకేష్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే అంశం ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

lokesh 02072018 2

రానున్న సాధారణ ఎన్నికల్లో లోకేష్‌ను ఎక్కడ నుండి పోటీకి దింపాలనే అంశం పై అధిష్టానం తీవ్రస్థాయిలో చర్చిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల వాతావరణం రావడంతో లోకేశ్‌ పోటీ వ్యవహారమూ తెరమీదకొచ్చింది. ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటిసారి పోటీచేస్తుండటంతో నియోజకవర్గ ఎంపిక కీలకంగా మారనుంది. లోకేశ్‌ను చంద్రగిరి నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని ఇటీవల పార్టీ సర్వే చేయించినట్లు తెలిసింది. దీనిలో భాగంగానే అక్కడ ఇన్‌ఛార్జిగా ఉన్న గల్లా అరుణకుమారిని పొలిట్‌బ్యూరోలోకి తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయనకు చంద్రగిరి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

lokesh 02072018 3

ఒకవేళ చంద్రగిరి కాకపోతే కృష్ణాజిల్లా గుడివాడ నుండి బరిలోకి దింపే ఆలోచనా చేస్తోంది. పెనమలూరు నియోజకవర్గాన్ని పరిశీలనలో పెట్టుకున్నారు. అక్కడ ఇప్పటికే బోడే ప్రసాద్‌ భారీ మెజార్టీలో గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ నుండి ప్రసాద్‌ను తప్పించడం అంతమంచిది కాదనే అభిప్రాయమూ వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వెనుకబడిన నియోజకవర్గాలు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయనే అంశంపైనా పార్టీ ఇటీవల సర్వే చేయించించినట్లు తెలిసింది. దీనిలో ఎమ్మెల్యేలు ఉన్న 22 నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు తెలిసింది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏమి చేస్తారో, ఏమి మాట్లాడతారో ఆయనకే తెలియదు. తనది కమ్యూనిస్టుల భావజాలమని అనేక సార్లు చెప్పారు. ఇది నమ్మి కమ్యూనిస్ట్ లు దగ్గర అయ్యారు. పవన్ తో కలిసి ఎదో హడావిడి చేస్తున్నారు. ఎప్పుడూ ఎన్నికల ముందు, ఎదో ఒక పార్టీతో పొత్తు లేనిదే ఈ తోక పార్టీలకు మనుగడ ఉండదు. అందుకే, ఇప్పుడు పవన్ పక్కన చేరారు. కమ్యూనిస్ట్ భావజాలం అని చెప్పుకునే పవన్, నరేంద్ర మోడీ అంటే అమితమైన అభిమానం అని, ఆయన నాకు ఆదర్శం అని అనేక సార్లు చెప్పారు. అసలు కమ్యూనిస్టు అనే వాడికి,మోడీపై ఎలా అభిమానం ఉంటుందో అందిరికీ తెలిసిందే. కమ్యూనిస్ట్ లకు, ఈ దేశంలో ప్రధాన శత్రువు మోడీ. మరి మోడీని ఆరాధిస్తున్న పవన్ తో, కమ్యూనిస్ట్ లు వెళ్తున్నారు అంటే, వీళ్ళ పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

cpi 02072018 2

ఒక పక్క బీజేపీ పార్టీనే, పవన్ కళ్యాణ్ ను ఆడిస్తుంది అని, ఆంధ్రప్రదేశ్ మొత్తం నమ్ముతున్నారు. దగా పడ్డ ఆంధ్రుడుకి, విభజన హామీలు నెరవేర్చకుండా, నమ్మించి మోసం చేసాడు మోడీ. ఇలాంటి మోడీ పై, కనీసం ఒక్క మాట కూడా అనకుండా, పవన్ కళ్యాణ్ నాటకాలు పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నాడు. 2009 నుంచి, ప్రతి ఎన్నికల్లో ఒక ఆరు నెలలు ముందు రావటం, ఎన్నికలు అయిపోయినాక, త్రివిక్రమ్ తో సినిమాలు తీసుకోవటం, చూస్తూ ఉన్నాం. ఇలాంటి పవన్ కళ్యాణ్ తో కమ్యూనిస్ట్ లు దోస్తీ చేస్తున్నారు. ఒక పక్క, జనసేన పార్టీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందంటూ.. సందర్భం వచ్చినప్పుడల్లా పవన్ ప్రకటిస్తున్నారు. అయినా సరే, పవన్ తోనే మా పొత్తు అని కమ్యూనిస్ట్ లు అంటున్నారు. దీని పై ఇప్పటి వరకు, పవన్ ఏ మాట చెప్పకపోయినా, వీళ్ళు మాత్రం, పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తుతున్నారు.

cpi 02072018 3

ఈ రోజు మరో అడుగు ముందుకు వేసి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, భజన కార్యక్రమం చేసారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలపై అవగాహన ఉన్న వ్యక్తి అని, మహా కూటమి ఏర్పడితే సీఎం అభ్యర్థి ఆయనే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రజల్లో పవన్‌కు ఇమేజ్‌, క్రేజ్‌ రెండూ ఉన్నాయని, అలాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు సీఎం అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. పవన్‌కు రాజకీయంగా మంచి పరిణతి ఉందని, ఇలాంటి నాయుకులు అసలు ఆంధ్రప్రదేశ్ లేరని కొనియాడారు. అందుకే మా కూటమికి పవన్ ముఖ్యామంత్రి అభ్యర్ధి అని, చెప్పారు. రానున్న ఎన్నికల్లో వామపక్ష, జనసేన పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్‌కల్యాణ్‌ అని, మేము అధికారంలోకి వస్తాం అంటూ చెప్పుకొచ్చారు.

రాయలసీమ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చేది... నవ్యాంధ్రలోనే అతిపెద్ద ఆటోమొబైల్‌ పరిశ్రమ ! ‘కియ’ కార్ల కంపెనీ ఏర్పాటు పనులు జోరుగా సాగుతున్నాయి. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో... యర్రమంచి గ్రామం వద్ద, జాతీయ రహదారి పక్కనే ‘కియ’ ప్లాంటు ఏర్పాటవుతోంది. మరొక్క ఏడాదిలోనే కియ ప్లాంటు నుంచి మొదటి కారు రోడ్డెక్కనుంది. పరిశ్రమ ఉత్పత్తి సమయానికి అవసరమైన సిబ్బంది, కార్మికుల కోసం ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే కియ కార్ల ఉత్పత్తికి సన్నాహాలు చేస్తుండగా.. తొలిగా 20 మంది డిప్లమో పూర్తి చేసిన వారిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. దశలవారీగా ఈ నియామకాలు కొనసాగుతూనే ఉంటాయని కియ ప్రతినిధులు చెబుతున్నారు. కియ కార్లపరిశ్రమలో ప్రాథమిక, సాంకేతిక కోర్సులో శిక్షణ ప్రారంభమైంది.

kia 02072018 2

మరో పక్క, కియాలో ఉద్యోగాల కోసం వచ్చిన ధరఖాస్తులు చూసి, కియా కంపెనీనే ఆశ్చర్యపోయింది. పరిశ్రమలో ఉద్యోగ నియామకాల కోసం 5400 మంది డిప్లమో అభ్యర్థులు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థకు దరఖాస్తు చేసుకున్నారని విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. అయితే, వీరిలో నుంచి ముందుగా 290 మందికి అర్హత పరీక్షలు నిర్వహించారు. పరిశ్రమ సమీపంలోని దుద్దేబండ క్రాస్‌ వద్ద 11 ఎకరాల్లో కియ మోటార్‌ ఇండియా శిక్షణ కేంద్రాన్ని ఈ నెల 20న ప్రారంభించారు. ఈ కేంద్రంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ తొలి బ్యాచ్‌ అభ్యర్థులకు శిక్షణా తరగతులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. అందులో 20 విభాగాల పనితీరుకు సంబంధించి శిక్షణ ఇస్తున్నారు. అర్హత సాధించిన అభ్యర్థుల్లో 20 మందికి ఐదేసి రోజుల చొప్పున శిక్షణ ఇస్తున్నారు.

kia 02072018 3

ఈ శిక్షణలో నైపుణ్యం కనబరచిన 600 మంది అభ్యర్థులను మెయిన్‌ ప్లాంట్‌కు, మిగిలిన వారిని వివిధ విభాగాల్లో పనికి నియమిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కియ పరిశ్రమ ఒప్పందం ప్రకారం 11 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాల్సి ఉంది. ఇందులో భాగంగా తొలిదశలో అనంతపురం జిల్లా వాసులు 2వేల మందికి మొదట పెనుకొండలో శిక్షణ పూర్తి చేస్తారు. డిప్లమో పూర్తి చేసిన వారికి మొదట ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆటో మొబైల్‌ పరిశ్రమ కోసం ప్రాథమిక, సాంకేతిక కోర్సు శిక్షణలో అత్యత్తమమైన ప్రతిభ కనపరిచిన అభ్యర్థులకు కియ ప్రధాన ప్లాంటులో నియమించనున్నారు. పరిశ్రమ నిర్మాణ పనులు పూర్తయితే ప్రత్యక్షంగా 4 వేలు, పరోక్షంగా 7 వేల మందికి ఉపాధి లభించనుంది.

Advertisements

Latest Articles

Most Read