కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ గత 11 రోజులుగా తెదేపా ఎంపీ సీఎం రమేశ్‌ చేపట్టిన దీక్షను విరమించారు. ఆరోగ్యం బాగా దెబ్బతిందని, ఏ క్షణాన ఏమైనా జరగవచ్చి అని డాక్టర్లు చెప్పటంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఆయన దీక్షను విరమించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిమ్మరసం ఇచ్చి సీఎం రమేశ్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవిల దీక్షలను విరమింప జేశారు. అంతకుముందు వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి పై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ ఈనెల 20న సీఎం రమేష్ దీక్షకు దిగారు. 11 రోజుల పాటు దీక్షను కొనసాగించారు. రోజురోజుకు ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని, దీక్ష విరమించడం మంచిదని వైద్యులు చెప్పినప్పటికీ ఎంపీ తన దీక్షను కొనసాగించారు. ప్లాంట్‌ వచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీఎం రమేష్ దీక్షకు ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఉక్కు సంకల్పంతో ముందుకొచ్చిన అందరికీ అభినందనలు తెలిపారు. ఆరోగ్యం బాగాలేకున్నా బీటెక్‌ రవి ఏడురోజులు దీక్ష చేశారని, సీఎం రమేష్‌ ఆరోగ్యం క్షీణించిందన్నారు. నాలుగైదు రోజులు కూడా దీక్ష చేయలేని నేతలు సీఎం రమేష్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. దీక్షలపై అనవసరమైన విమర్శలు మానుకోవాలని సీఎం అన్నారు. విశాఖ ఉక్కు కోసం ఆనాడు ఆంధ్రులు పోరాడి విజయం సాధించామని, విశాఖ స్టీల్‌ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం 19వేల ఎకరాలు ఇచ్చిందని గుర్తుచేశారు.

సాధ్యాసాధ్యాలు పరిశీలించి కడపలో ప్లాంట్‌ పెట్టాలని చట్టంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఇంతకాలం కాలయాపన చేసిందని విమర్శించారు. ఆరునెలల్లో ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని పేర్కొన్నారు. కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీని సాధించి తీరతామని స్పష్టం చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మెకాన్‌ సంస్థ నివేదిక ఇచ్చిందని తెలిపారు. కేసుల కోసం లాలూచీపడి రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టుపెడుతున్నారని సీఎం ఆరోపించారు. కడప స్టీల్‌ఫ్యాక్టరీకి అన్ని వసతులు కల్పిస్తామని కేంద్రానికి చెప్పామన్నారు. గండికోటకు నీరు తీసుకొచ్చామని ఇప్పుడు నీటి కొరత కూడా లేదని తెలిపారు. 15కి.మీ. దూరంలో హైవే, రైల్వేలైన్‌ ఉందన్నారు. అందరూ సంఘటితంగా ఉంటేనే కేంద్రం దిగి వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు.

ఏసిబి డీజీ గా అవనీతి పరుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించిన ఆర్‌.పి ఠాకూర్, ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ఆర్‌.పి ఠాకూర్ నియమితులయ్యారు. ఈమేరకు శనివారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటితో డీజీపీ మాలకొండయ్య పదవీ విరమణ చేశారు. దీంతో కొత్త డీజీపీ కోసం సీఎం చంద్రబాబు కసరత్తు చేశారు. చివరకు ఠాకూర్‌ను డీజీపీగా ఖరారు చేశారు. ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఆర్పీ ఠాకూర్ ఉన్నారు. ఠాకూర్ వచ్చాక అవినీతి అధికారుల భరతం పట్టారు. దీంతో డీజీపీగా ఠాకూర్ నియమించేంది అనుమానమే అని సావంగ్‌కే అవకాశం ఉందని మొదట ప్రచారం జరిగింది. డీజీపీ ఎంపికపై చంద్రబాబుతో అధికారులు భేటీ అయ్యారు. ఆ తరువాత ఎంపికపై చంద్రబాబు అన్ని కోణాల్లోనూ కసరత్తు చేసి చివరకు ఠాకూర్ వైపు మొగ్గు చూపారు.

1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఆర్.పి. ఠాకూర్ పూర్తి పేరు రామ్ ప్రవేశ్ ఠాకూర్. 1961 జూలై 01 న జన్మించిన ఠాకూర్ ఐఐటీ కాన్పూర్‌లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చదివారు. ఏడీజీగా ఉమ్మడి రాష్ట్రంలో కంట్రోలర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ అధిపతిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ, ఏడీజీపీ (లా అండ్ ఆర్డర్)గా బాధ్యతలు నిర్వహించారు. 2016 నవంబర్ 19 నుంచి రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డీజీగా బాధ్యతల నిర్వహిస్తోన్న ఆర్పీ ఠాకూర్ 2003లో ఇండియన్ పోలీసు మెడల్, 2004 లో ఏఎస్‌ఎస్పీ మెడల్ సాధించారు. పోలీసు శాఖలో విశిష్ట సేవలకు గుర్తింపుగా 2011లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా రాఠూక్ మెడల్ పొందారు. ప్రస్తుతం ఏపీ కొత్త డీజీపీగా ఆర్పీ ఠాకూర్‌ను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డీజీ హోదాలో రాష్ట్రంలో పోలీసు దళాల అధిపతి ఆర్.పి.ఠాకూర్ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఠాకూర్ సాబ్ ఆల్ ది బెస్ట్! మీరు ఎదుర్కోవాల్సిన సవాళ్ళు ఎన్నో ఉన్నాయి... ప్రత్యేక వాదులు...రాజకీయ ముసుగులోని అత్యంత అవనీతి పరులు...కేంద్రం వత్తాసుతో కుట్రదారులు.. కులాల కుంపట్లు...ప్రాంతాల మధ్య విద్వేషాలు...అల్లర్లు...అలజడులకుప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్న క్లిష్ట పరిస్దితుల్లో బాధ్యతలు చేపడుతున్న ఠాకూర్ గారు, ముఖ్యమంత్రి మీమీద ఉంచిన బాధ్యత నమ్మకం నిలబెడతారని, నవ్యాంధ్ర ప్రగతిలో మీ మార్క్ చూపిస్తారు అని ఆశిస్తూ, ఆల్ ది బెస్ట్...

మన రాష్ట్రాన్ని దేశం గుర్తిస్తుంది, ప్రపంచం గుర్తిస్తుంది. కాని, మహా మేధావులు అయిన జగన్, పవన్ మాత్రం, మన రాష్ట్రంలోని యువతలో విష భీజాలు నాటుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి మా కడపను నిర్లక్ష్యం చేస్తున్నాడు, మొత్తం అమరావతికే చేస్తున్నాడు అంటాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావలి, అన్నీ అమరావతికి దోచిపెడుతున్నారు అంటాడు. ఈ మూర్ఖుల మాటలు ఎలా ఉన్నా, దేశం మాత్రం, కడపకు ఏమి చేసారు, ఉత్తరాంధ్రకు ఏమి చేసారో గుర్తిస్తుంది. దేశంలో అత్యంత వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నీతిఆయోగ్‌ ప్రారంభించిన ‘ఆకాంక్షిత జిల్లాల’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. ఒకరిని చూసి ఒకరు అభివృద్ధి చెందేందుకు వీలుగా పెట్టిన ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్‌లోని మూడు జిల్లాలు మంచి ముందడుగు వేశాయి.

niti 30062018 2

ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండునెలల్లో జిల్లాలు స్వయంగా సమర్పించిన సమాచారం ఆధారంగా వాటి పురోగతిని లెక్కించి నీతిఆయోగ్‌ శుక్రవారం కొత్తగా 108 జిల్లాలకు డెల్టార్యాంకులు విడుదల చేసింది. ఆరోగ్యం-పౌష్టికాహారం, విద్య, వ్యవసాయం-జలవనరులు, ఆర్థిక సమ్మిళితం-నైపుణ్యాభివృద్ధి-మౌలికవసతులు అనే ఐదు రంగాల్లో అభివృద్ధి ఆధారంగా ర్యాంకులు కేటాయించినట్లు నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ పేర్కొన్నారు. ఈ రెండునెలల్లో సాధించిన రాష్ట్రాల పురోగతిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. గత రెండునెలల్లో బాగా పురోగతి సాధించిన జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయనగరం 4, కడప 5, విశాఖపట్నం 14 ర్యాంకులో నిలిచాయి.

niti 30062018 3

విజయనగరం, కడప, విశాఖపట్నం జిల్లాలు ‘విద్యాపరంగా’ మంచి పనితీరు కనబరిచి 1, 4, 5 ర్యాంకులు సాధించాయి. ‘ఆర్థిక సమ్మిళిత పురోగతి’లో విశాఖపట్నం జిల్లా రెండో ర్యాంకు సాధించింది. అన్ని విభాగాలూ కలిపి చూస్తే 17.5% మార్కులతో విజయనగరం నాలుగు; 14.9% మార్కులతో కడప ఐదు; 11% మార్కులతో విశాఖపట్నం 14వ ర్యాంకు సాధించాయి. బేస్‌లైన్‌ ర్యాంకింగ్‌లో ఒకటోస్థానంలో నిలిచిన విజయనగరంజిల్లా గత రెండునెలల్లో సాధించిన పురోగతిలో నాలుగోస్థానాన్ని ఆక్రమించింది. ఇదివరకు నాలుగులో ఉన్న కడప ఇప్పుడు ఐదులో; 13లో ఉన్న విశాఖపట్నం 14వస్థానంలో నిలిచాయి.

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు నిన్న, కన్నా లక్ష్మీనారాయణకు లీగల్ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే కోవలో, ప్రతి రోజు రంకెలు వేసే సోము వీర్రాజుకి మాత్రం, ముందుగా ఒక లేఖ రాసారు. నా మీద చేస్తిన ఆరోపణలు నిరూపించండి, లేకపోతే మీ మీద క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని వీర్రాజుకు, కుటుంబరావు లేఖ రాశారు. ‘‘నాపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించండి. లేని పక్షంలో అసత్య ఆరోపణలు చేసినందుకు సివిల్‌, క్రిమినల్‌ చర్యలకు సిద్ధంకండి’’ అంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సీహెచ్‌ కుటుంబరావు, బీజేపీ నేతలను హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజులకు ఈ మేరకు ఆయన శుక్రవారం లేఖలు పంపారు.

veerraju 30062018 2

‘‘నేను స్టాక్‌ బ్రోకర్‌గా అనేక మందిని మోసం చేశానని కొందరు వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు మీరు విలేకరుల సమావేశంలో ఆరోపించారు. మీ ఆరోపణలు ప్రసార సాధనాల్లో విస్తృతంగా ప్రసారం అయ్యాయి. నా గౌరవానికి భంగం కలిగించే అసత్య ఆరోపణలు మీరు చేశారు. మీ ఆరోపణలకు ఆధారాలు చూపండి. నాపై మీకు ఇటువంటి సమాచారం ఇచ్చిన వ్యక్తులు ఎవరో తక్షణం వారి వివరాలు నాకు తెలపండి. ఆ వ్యక్తులు ఎవరో మీరు తెలపలేని పక్షంలో నాపై ఆరోపణలు మీరు చేసినట్లుగానే భావించి మీపై సివిల్‌, క్రిమినల్‌ చర్యలకు దిగాల్సి ఉంటుంది’’ అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

veerraju 30062018 3

కుటుంబరావు గారు, అనేక సందర్భాల్లో జీవీఎల్ ని దోషిగా ప్రజల ముందు నిలబెట్టారు. అమరావతి యుసిల దగ్గర నుంచి ఈ రోజు పోలవరం మీద చెప్పే పిట్ట కధలు దాకా, ఈ జీవీఎల్ ఏమి చెప్పినా అబద్ధమే.. ప్రతి సారి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు , ఈ జీవీఎల్ చెప్పే అబద్ధాలను ఎక్ష్పొజ్ చేసి, ప్రజల ముందు దోషిగా నిలబెట్టే వారు. ఇంకా అంతే, ఒకసారి దొరికేసినాక, ఆ విషయం గురించి మాట్లడే వాడు కాదు ఈ జీవీఎల్. అందుకే, కుటుంబరావు మీద వ్యక్తిగత కచ్చి పెట్టుకుంది బీజేపీ. ఈయన విషయం మొత్తం, ప్రజలకు చెప్తూ ఉండటంతో, వీరి అబద్ధపు ప్రచారాలు ప్రజలు నమ్మటం లేదని, అందుకే ఆయన వ్యక్తిత్వం పై దెబ్బ కొట్టే ఎత్తుగడ వేసింది. అయితే, ఈయన రాజకీయ నాయకుడు కాదు కాబట్టి, ఇలాంటి ఆరోపణలు వచ్చిన వెంటనే, నోటీసు పంపించారు. ఇప్పడు కన్నా , వీర్రాజు ఏమి చేస్తాడో..

Advertisements

Latest Articles

Most Read