నిన్నటి వరకు అమరావతిని పూర్తిగా విస్మరించి, అమరావతిని నాశనం చేయాలని అన్ని ప్రయత్నాలు చేసిన జగన్ ప్రభుత్వం, దిగి రాక తప్పలేదు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో, జగన్ మోహన్ రెడ్డి మొండి పట్టుదల వీడుతున్నారు. అమరావతి రాజధాని రైతులకు, సీఆర్డీఏ రెండు రోజుల నుంచి లేఖలు పంపిస్తుంది. ఇందులో ప్రధానంగా సీఆర్డీఏ, ఎవరు అయితే ప్లాట్లు రిజిస్టర్ చేయించుకోలేదో, అటువంటి రైతులు అందరికీ కూడా, వెంటనే రిజిస్టర్ చేయించుకోవాలని ఈ లేఖలు రాసి కోరుతున్నారు. ఆ లేఖల్లోని అంశాలు చూస్తే, సీఆర్డిఏ రైతులకు, ఏవైతే రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చారో, భూ సమీకరణ విధానంలో ఇచ్చారో, అటువంటి వాటి అన్నిటినీ కూడా వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవలని కోరింది. మూడు రోజులు ముందు స్లాట్ బుక్ చేసుకుని, ఈ నెలాఖారు లోపు, అన్ని రిజిస్ట్రేషన్ లు పూర్తి అయ్యేలా చూడాలని సీఆర్డీఏ కోరింది. అయితే ఇటీవల రాష్ట్ర రాజధానికి సంబధించి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని త్రిసభ్య ధర్మాసనం, స్పష్టమైన తీర్పు ఇచ్చింది. రెండు నెలల లోపు రైతులకు ఇచ్చిన ఫ్లాట్లలో మౌలిక సదుపాయాలు కలిపించాలని ఆదేశాలు జారీ చేసింది. దీని పై పూర్తిగా తమకు నివేదిక కూడా దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అలాగే రిట్ అఫ్ మ్యండామస్ కొనాగుతుందని కూడా, హైకోర్టు పేర్కొంది.
అయితే కోర్టు తీర్పుతో, సీఆర్డీఏ అధికారులు తెగ హడావిడి పడిపోతున్నారు. రైతులు మాత్రం, సీఆర్డీఏ ఇస్తున్న లేఖలు తీసుకుని, న్యాయవాదులకు చూపించి, వాటి పైన ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశం పై చర్చిస్తున్నారు. ఇందులో ప్రధానంగా రైతులు అంతా కూడా ఒకటే కోరుతున్నారు. తమకు ఎక్కడైతే రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చారో, రిటర్నబుల్ ఫ్లాట్లకు సమందించి, తమకు సరిహద్దు రాళ్ళు వేసి, కొలతలు వేసి అప్పగిస్తే, రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని చెప్పటంతో పాటుగా, తమతో సీఆర్డీఏ చేసుకున్న భూసమీకరణ ఒప్పందం ప్రకారం, రహదారులతో పాటు, ఇతర మౌలిక సదుపాయాలు కలిపిస్తాం అన్నారో, అవన్నీ కల్పించిన తరువాతే తాము రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని రైతుల చెప్తున్నారు. ఇప్పటికే తమకు అందిన లేఖలను, రాజధాని కోసం కేసులు వాదిస్తున్న న్యాయవాదులకు చూపించి, వారి సూచనలు ప్రకారం, ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తానికి కోర్టు దెబ్బతో, జగన్ మోహన్ రెడ్డి మారక తప్పలేదు.