రైతు కుటుంబాలను ఆదుకోవడానికే చంద్రన్న బీమా తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని రావికంటిపేటలోజరిగిన ఏరువాక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంగా ఎడ్లబండి నడుపుతూ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగ్గుశాస్త్రులపేట సమీపంలోని ఎన్టీఆర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఈనెల నుంచి రైతు బీమాను ప్రారంభిస్తామన్నారు. ప్రమాదవశాత్తు చనిపోతే రూ.5 లక్షల బీమా, పాక్షిక అంగవైకల్యానికి రూ.2 లక్షలు ఇస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. రైతుల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తామన్నారు.

cbn yeruvaka 28062018 2

రైతు ఆనందంగా ఉంటే సమాజం ఆనందంగా ఉంటుందన్నారు. నదుల అనుసంధానంతో రాష్ట్రంలో నీటికొరతను అధిగమిస్తున్నామన్నారు. రైతు కూలీలకు న్యాయం జరగాలని, వారికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు పెట్టుకోవాలని సూచించారు. వ్యవసాయంలో కొత్త మెళకువలు తెలుసుకోవడంతో పాటు రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధరలు దక్కాలని ఆయన ఆకాంక్షించారు. ప్రమాదవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే రూ.5లక్షల మొత్తాన్ని బాధిత రైతు కుటుంబానికి అందజేసే ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. రైతు లేకపోతే తిండిలేదు.. అలాంటి రైతులు చేసే వ్యవసాయానికి సంఘీభావం తెలపాల్సిన బాధ్యత అందరి పైనా ఉందన్నారు.

cbn yeruvaka 28062018 3

2004-2014 మధ్య కాలం ఓ భయంకరమైనదని అభివర్ణించారు. ఆ కాలంలో విత్తనాలు, ఎరువులు దొరికేవి కాదని విమర్శించారు. ఒక్కో రైతుకు రెండు లాఠీ దెబ్బలు, ఒక్క ఎరువు బస్తా దొరికేదని గుర్తుచేశారు. ఆ రోజులను రైతులు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కల్తీ విత్తనాల సమస్య ఉండేదని.. ఆ సమయంలో అన్నీ సమస్యలేనన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులకు విద్యుత్‌కొరత లేదని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చాక రైతులకు రూ.24వేల కోట్ల మేర రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన ఈ నాలుగేళ్లలో వ్యవసాయ రంగానికి రూ.82వేల కోట్లు ఖర్చుచేసినట్టు చెప్పారు. సాంకేతికతను అనుసంధానం చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని, శాస్త్రీయ వ్యవసాయం చేయాలని, యాంత్రీకరణపై దృష్టి పెట్తాలని చంద్రబాబు రైతులకు సూచించారు. వ్యవసాయంలో ఖర్చులు తగ్గాలన్నారు. నదుల అనుసంధానం పూర్తిచేసి నీటి కొరతను అధిగమించే అంశంపై దృష్టి సారించినట్టు చెప్పారు.

కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం దీక్ష చేపట్టిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్ర సింగ్ ఇవాళ మళ్లీ ఫోన్ చేశారు. దీక్ష విరమించాలని కోరారు. కడపలో స్టీల్ ఫ్లాంట్ ఏర్పాటుకు సంప్రదింపులు కొనసాగిస్తున్నామని అందుచేత దీక్ష విరమించాలని కోరారు. అయితే అధికారిక ప్రకటన చేస్తేనే దీక్ష విరమిస్తానని రమేష్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా, ఉత్తర్వు లేకుండా ఎలా దీక్ష విరమించమంటారని కేంద్రమంత్రిని ప్రశ్నించారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు అవసరమైన వసతులన్నీ ఏర్పాటు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందని మరోసారి సీఎం రమేశ్‌ స్పష్టం చేశారు. ఈ రోజు ప్రభుత్వం లేఖ కూడా ఇచ్చిందన్నారు. ఉక్కు పరిశ్రమకు 3వేల ఎకరాలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ తనకు ఫోన్‌ చేసినందుకు కేంద్రమంత్రికి ధన్యవాదాలు చెప్పిన సీఎం రమేశ్‌.. తాను రాష్ట్ర ప్రజల కోసం ఆందోళన చెందుతున్నట్టు చెప్పారు.

ramesh 28062018 3

కడప చాలా వెనుకబడిన జిల్లా అని, ఉక్కు పరిశ్రమ ప్రజల సెంటిమెంట్‌కు సంబంధించినదని చెప్పారు. అందువల్ల ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడకుండా తక్షణమే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి ఆ క్రెడిట్‌ కేంద్రమే తీసుకోవాలని, తమకెలాంటి క్రెడిట్‌ అవసరం లేదని కేంద్రమంత్రికి స్పష్టంచేశారు. పరిశ్రమ ఏర్పాటు చేస్తే కేంద్రంలోని భాజపాకు మంచి పేరు వస్తుందని చెప్పారు. రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే తన డెడ్‌బాడీని చూస్తారని బీరేంద్రసింగ్‌తో రమేశ్‌ అన్నారు. ప్రజల పరిస్థితిని అర్థం చేసుకొని ప్రధానితో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు.

ramesh 28062018 2

బీరేంద్ర సింగ్‌ను గురువారం టీడీపీ ఎంపీలు కలిసారు. 9 అంశాల్లో 7 అంశాలకు స్పష్టత రాగా మిగిలిని రెండు అంశాలకు సంబంధించి సీఎం చంద్రబాబు ఇచ్చిన లేఖను కేంద్రమంత్రికి అందజేశారు. ఆ లేఖపై చర్చలు జరిపిన అనంతరం బీరేంద్రసింగ్ మీడియాతో మాట్లాడుతూ కడప స్టీల్‌ ప్లాంట్‌పై ఏపీ ప్రభుత్వం పంపిన సమాచారాన్ని అధికారులతో చర్చిస్తానని అన్నారు. అధికారులతో చర్చల తర్వాతే స్పష్టత ఇస్తానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సమాచారాన్ని మెకాన్‌కు పంపాలని టీడీపీ ఎంపీలకు సూచించానని, ఇవ్వాల్సిన సమాచారాన్ని ప్రభుత్వ ఫార్మాట్‌లో మెకాన్‌కు పంపాలని చెప్పానని ఆయన అన్నారు. అయితే ఇప్పటికే మెకాన్‌కు పంపినట్టు ఏపీఎండీసీ చైర్మన్‌ వెంకయ్యచౌదరి చెప్పారు. ఆ పూర్తి వీడియో ఇక్కడ చూడవచ్చు... https://youtu.be/4X0Rfu2mmkI

విధి ఎంత పవర్ఫుల్ అనేది అందరికీ తెలుసు.. ఖర్మ సిద్ధాంతం గురించి కూడా అందరికీ తెలుసు. ఏ కారణం లేకుండా అవతలి వారిని కించ పరిస్తే, మనం చేసిన దానికి కచ్చితంగా అనుభవిస్తాం... ఇదే ఖర్మ సిద్ధాంతంలో ఉన్న బ్యూటీ... ఈ రోజు కెసిఆర్, విజయవాడ వచ్చిన సందర్భంలో, దేవినేని ఉమా వెళ్లి కెసిఆర్ కు స్వగతం పలికి మేడలో పచ్చ శాలువా కప్పి, పచ్చ పూల బోకే ఇస్తే, బలే గమ్మత్తుగా అనిపించిది. రాజకీయ నాయకులు ఎన్నో విమర్శలు చేస్తారు. అవి చాలా హుందాగా ఉండాలి. కాని గత కొన్ని సంవత్సరాలుగా, అది పూర్తిగా మారి పోయింది. పూర్తిగా వ్యక్తిగతం అయిపొయింది. జగన్ లాంటి వాళ్ళు ఉరి వెయ్యాలి, చంపేయాలి అంటూ విమర్శలు చెయ్యటం చూస్తున్నాం.. అయితే, 2014 ముందు కెసిఆర్ వేసిన వేషాలు, తిట్టిన బూతులు అన్నీ ఇన్నీ కావు..

kcr 28062018 1 2

ఒరేయ్ ఉమాగా, ఆ పేరు ఏంటి రా.. నువ్వు మోగోడివా రా ? ఆడెంగోడివా రా ? అంటూ కెసిఆర్, దేవినేని ఉమాను అన్న మాటాలు, కెసిఆర్ మర్చిపోయడేమో కాని, ప్రజలు మర్చిపోలేదు.. ఆంధ్రాలో వండే బిర్యానీ పెంట లాగా ఉంటుంది అన్నాడు.. తినే తిండిని, పెంటతో పోల్చిన మహానుభావుడు... చంద్రబాబుని అయితే, ఇక చెప్పనే అవసరం లేదు.. ఇలాంటి కెసిఆర్, ఇప్పుడు విజయవాడలో అడుగు పెట్టగానే, దేవినేని ఉమా వచ్చి, స్వాగతం పలికారు.. మరి కెసిఆర్ గారికి ఇప్పుడైనా, తెలిసిందో లేదో, ఆయన ఏంటో.. అంతేనా, ఇక్కడే భోజనం చేసారు. మరి కెసిఆర్ గారు, ఏమి తిన్నారో ఆయనే చెప్పాలి... రాజకీయ విమర్శలు హుందాగా లేకపోతే , ఇలాగే ఉంటుంది..

kcr 28062018 1 3

అసలు హైలైట్ ఏంటి అంటే, దేవినేని ఉమా వచ్చి, పచ్చ కండువా కప్పి, పచ్చ పూల బోకే ఇస్తే, నవ్వాలో, ఏడవాలో తెలియని కెసిఆర్ ఎక్స్ప్రెషన్ చూస్తే బలే నవ్వు వచ్చింది. ప్రోటోకాల్ ప్రకారం, దేవినేని ఉమాని పంపటం కూడా ఒక హైలైట్. అతిధిగా వచ్చిన వ్యక్తిని అవమానపరచాలనే ఉద్దేశం లేదు కాని, కెసిఆర్ అన్న మాటలు గుర్తు చేసుకుని, ఈ రోజు జరిగినవి చూస్తుంటే, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది అని మన పెద్దలు చెప్పే మాట నిజమే అనిపిస్తుంది. ఏదేమైనా ఆ కనకదుర్గ తల్లి దీవెనలతో, కెసిఆర్ గారు మరో సారి మా ఆంధ్రా ప్రాంత వంటలను, మనుషులను హేళన చెయ్యకుండా ఉండాలని కోరుకుంటున్నాము.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం రావికంటపేట గ్రామంలో ఏరువాక కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భూమిపూజ చేసి గురువారం ఉదయం ప్రారంభించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా ఎడ్లతో నాగలి పట్టి దుక్కిదున్నారు. విత్తనాలు, ఎరువులు వేసే యంత్రాలను పరిశీలించిన ముఖ్యమంత్రి సాంప్రదాయపద్ధతికీ, యాంత్రీకరణ పద్ధతి గురించి వ్యవసాయ శాస్త్రవేత్త చిన్నంనాయుడును ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇందుకు శాస్త్రవేత్త చిన్నంనాయుడు బదులుస్తూ విత్తనం ఖర్చు 50 శాతం తగ్గుతుందని, అలాగే సాగు ఖర్చు ఎకరానికి రూ. 4 వేల వరకు ఆదా అవుతుందని చెప్పారు.

cbn tractor 28062018 2

అలాగే దిగుబడిలో యాంత్రీకరణకు, నేరుగా వేసే పద్ధతులకు గల వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. యాంత్రీకరణ ద్వారా ఎకరాకు 28 నుండి 32 బస్తాల వరకు దిగుబడి వస్తుందనే వివరాలను శాస్త్రవేత్తలు ముఖ్యమంత్రికి వివరించారు. అదేవిధంగా ఈ యంత్రం ద్వారా విత్తనాలు వేయడానికి ఎకరాకు రూ.850/-లు అవుతుందని, దీనిద్వారా ఒకే పద్ధతిలో వరుసగా వస్తుందని అన్నారు. , వెదజల్లే పద్ధతికి, యాంత్రీకరణకు అయ్యే ఖర్చు సరిసమానంగా అవుతుందని, యాంత్రీకరణ పద్దతి ద్వారా రెండు మూడు బస్తాల వరకు అధిక దిగుబడి వస్తుందని తెలిపారు.

cbn tractor 28062018 3

అనంతరం సీడ్ డిబ్లర్స్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు. యంత్రం ద్వారా ముఖ్యమంత్రి నాట్లు వేసారు. తొలుత హెలీప్యాడ్ నుండి సాంప్రదాయ వస్త్రధారణతో ఎడ్లబండిపై ఏరువాక కార్యక్రమం వద్దకు ముఖ్యమంత్రి చేరుకున్నారు. ఆయనకు ధింసా నృత్యంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బి.సి.సంక్షేమ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర ఇంధన శాఖామాత్యులు కిమిడి కళా వెంకటరావు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మీ, శాసనసభ్యులు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి,డా. బెందాళం అశోక్, కలమట వెంకటరమణమూర్తి , గాదె శ్రీనివాసులనాయుడు, ఆమదాలవలస పురపాలక సంఘ చైర్ పర్సన్ తమ్మినేని గీత, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Latest Articles

Most Read