రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్న రూ.2 వేల కోట్ల విలువ చేసే అమరావతి బాండ్లకు ప్రముఖ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ఎ+ రేటింగ్‌ ఇచ్చింది. రాజధాని బాండ్లలో మదుపరులు పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించేందుకు క్రిసిల్‌ రేటింగ్‌ ఉపయోగపడుతుందని సీఆర్‌డీఏ వర్గాలు భావిస్తున్నాయి. ఈ బాండ్ల ద్వారా రూ.రెండు వేల కోట్ల వరకు సమీకరించాలని సీఆర్‌డీఏ లక్ష్యంగా పెట్టుకుంది. త్వరలోనే అరేంజర్ల నియామకం పూర్తి చేసి మార్కెట్‌లోకి వెళ్లాలని సీఆర్‌డీఏ యోచిస్తోంది. ఈ బాండ్లకు సంబంధించి సీఆర్‌డీఏ లోగడే బ్రిక్‌వర్క్‌, స్మెరా సంస్థలతో రేటింగ్‌ ప్రక్రియ నిర్వహించింది. ఆ రెండు సంస్థలూ ఏఏ- రేటింగ్‌ ఇచ్చాయి. క్రిసిల్‌ వంటి అగ్రశ్రేణి సంస్థల రేటింగ్‌ ఉంటే బాండ్లకు మార్కెట్‌లో మరింత ఆకర్షణ పెరుగుతుందన్న నిపుణుల సూచన మేరకు ఆ ప్రక్రియనూ సీఆర్‌డీఏ పూర్తి చేసింది.

crisil 23062018 2

ఈ బాండ్లకు సంబంధించి గత నెలలో ముంబయిలో సీఆర్‌డీఏ నిర్వహించిన మదుపరుల సమావేశానికి సుమారు 70 మంది హాజరయ్యారు. మరోవైపు అరేంజర్ల ఎంపికకు సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. సీఆర్‌డీఏ విడుదల చేసే బాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం హామీనిస్తోంది. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల్లో ప్రాథమికంగా రూ.2వేల కోట్ల మేరకు వివిధ బాండ్ల ద్వారా సమీకరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ బాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుంది. ఈ జారీచేస్తున్న బాండ్లతో పాటు ప్రవాసుల కోసం ప్రత్యేకంగా ‘అమరావతి బాండ్లు’ తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు.

crisil 23062018 3

రాజధాని నిర్మాణం కోసం ఎంతోమంది ముందుకొచ్చి ప్రతి రోజూ తనకు విరాళాలు అందిస్తున్నారని, ఈ నిధుల సేకరణను సక్రమంగా నిర్వహించడానికి ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నరసయ్య అనే వ్యక్తి ఆస్పత్రి నుంచి డిశ్చార్జయి నేరుగా తన దగ్గరకు వచ్చి రాజధాని నిర్మాణం కోసం చెక్ ఇచ్చి వెళ్లాడని, మరొకరు తన రెండు నెలల పింఛను అందించారని, ఒక ప్రవాస మహిళ తనకోసం చాలా సేపు వేచి వుండి రూ.10 లక్షలు చెక్ ఇచ్చి వెళ్లారని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

అభివృద్ధి పనులు వేగవంతంగా జరగడానికి, కార్మికుల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించడానికి పాలకొల్లు ఎమ్మెల్యే డాక్ట ర్ నిమ్మల రామానాయుడు నేరుగా శ్మశాన వాటికలోనే రాత్రి నిద్ర చేశారు. పాలకొల్లు పట్టణంలోని హిందూ స్మశాన వాటికను రూ.3 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి పనులు మందగమనంతో ఉండడాన్ని గమనించిన ఎమ్మెల్యే నిమ్మల పనుల నత్తనడక పై ఆరా తీశారు. శ్మశానంలో పనులు, మరో వైపు తవ్వకాల్లో ఎముకలు బయటపడడం తదితర కారణాలతో కార్మి కులు భయాందోళనలకు గురవుతున్నట్టు ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. వాస్తవానికి అభివృద్ది పనుల్లో 50 శాతం ఈ మాసాంతానికే పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటికీ పనుల పురోగతి లేకపోవడంతో ఎమ్మెల్యే నిమ్మల స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు.

nimmala 2362018 2

కార్మికుల్లో నెలకొన్న భయాం దోళనలను పోగొట్టడానికి, మనోస్థైర్యం ఇవ్వడాని కి ఎమ్మెల్యే సాహతోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు ఆయన శ్మశాన వాటికలోనే అల్పాహారం తీసుకున్నారు. అనంతరం అక్కడే మడత మంచం పై నిద్రకు ఉపక్రమించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అభివృద్ధి పనులకు నిధులు తేవడంలోనే ఆనందం లేదని వాటిని సద్వినియోగం చేసి అభివృద్ధి జరిగినప్పుడే సం తృప్తి కలుగుతుందన్నారు. శ్మశానంలో నిద్రించడం పట్ల ఆయన స్పందిస్తూ తనకు ఏవిధమైన భయాందోళనలు లేవని, సాటి మనిషిగా కార్మికుల్లో ధైర్యాన్ని నింపి పనులను వేగవంతం చేయించడానికే రాత్రి బసకు ఉపక్రమించానని చెప్పారు.

nimmala 2362018 3

పనుల జాప్యంలో కాంట్రాక్టర్ ప్రమేయం ఏమీలేదని, కార్మికుల ఇబ్బందుల వల్లనే ఆలస్యం జరిగిందన్నారు. ఇప్పుడు తాను చొరవ చూపి శ్మశానంలో మకాం వేయడంతో కార్మికులు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. అవసరమైతే మరో ఒకటి, రెండు రోజులు అక్కడే ఉంటానన్నారు. రాత్రంతా స్మశానంలో నిద్రించిన ఎమ్మెల్యే ఉదయం అక్కడే కాలకృత్యాలు తీర్చుకున్నారు. ఆ తర్వాత కప్పు కాఫీ తాగుతూ దినపత్రికలు చదివారు. అధికారులతో చర్చించారు. ఇంతకాలం స్మశానవాటిక అభివృద్ధిని పెద్దగా పట్టించుకోని అధికారులు కార్మికులను వెంటపెట్టుకుని వచ్చారు. పనులు యుద్ధప్రాతిపదికన చేయడానికి ఓ కదలిక వచ్చింది. నిమ్మల రామానాయుడుని, అక్కడ ప్రజలు చంద్రబాబుతో పోలుస్తూ ఉంటారు. చంద్రబాబు ఎంత కష్టపడి పని చేస్తారో, మా ఎమ్మల్యే కూడా అంతగా కష్టపడటతారని చెప్తూ ఉంటారు. ఈ సంఘటనతో అది మరోసారి రుజువైంది.

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ, రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. నిన్న వైసిపీ ఎంపీ మాట్లాడుతూ, పవన్ మాకు మద్దతు ఇస్తామని చెప్పారని, 2019కి కలిసి ఎన్నికలకు వెళ్దామని చెప్పాడని చెప్పారు. మరో పక్క బీజేపీ, పవన్ కలుస్తారని వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే, పవన్ ఒక్కటంటే ఒక్క మాట కూడా బీజేపీని అనటం లేదు. అలాగే మాజీ జేడీ లక్ష్మీనారయణ కూడా బీజేపీలో చేరతారని అని వార్తలు వస్తున్నాయి. ఆయన బీజేపీ సియం అభ్యర్ధి అనే ప్రచారం కూడా జరుగుతుంది. మరో పక్క బీజేపీ, వైసిపీ, పవన్ కలిసి చంద్రబాబుని ఓడించటానికి ఇప్పటి నుంచి, కోఆర్డినేట్ చేసుకుంటూ పనులు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో, ఈ రోజు జరిగిన రెండు కీలక పరిణామాలు, రాష్ట్రంలో రాజకీయాన్ని, రసవత్తరంగా మార్చాయి.

lakshmi 23062018 2

అందులో ఒకటి, బీజేపీ ఎమ్మెల్యేతో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సమావేశం... బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ శనివారం ఉదయం సమావేశమయ్యారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజమండ్రి వచ్చిన ఆయన బీజేపీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. స్నేహపూర్వకంగానే ఆకుల సత్యనారాయణ ఇంటికి వెళ్లానని లక్ష్మీనారాయణ చెప్పారు. ఉద్యోగానికి రాజీనామా చేసి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లక్ష్మీనారాయణ పర్యటిస్తున్నారు. రాష్ట్రం నలమూలలా పర్యటించిన తర్వాతే... తాను ఏ పార్టీలో చేరబోయేది ప్రకటిస్తానని మాజీ ఐపీఎస్ వీవీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

lakshmi 23062018 3

మరో పక్క, విజయవాడలో పవన్ ఇంటికి, మాజీ స్పీకర్ వచ్చారు. పవన్ కల్యాణ్‌తో అసెంబ్లీ మాజీ స్పీకర్, కాంగ్రెస్ నేత నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. నాదెండ్ల మనోహార్ ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. అయితే పవన్‌ కల్యాణ్‌ను కలుసుకోవడం పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది. అయితే ఈ భేటీ ఎందుకోసమని ఇరు వర్గాల నుంచి ఎలాంటి సమాచారమూ రాలేదు. కాగా ఆయన జనసేన పార్టీలో చేరతారానని పలు అనుమానాలు లేవనెత్తుతున్నాయి. నాదెండ్ల కూడా రాజకీయ ప్రయోజనం కోసమే పవన్‌ను కలిశారా? లేదంటే మరే ఇతర రాజకీయేతర కారణలతో భేటీ అయ్యారా? అనే విషయం అంతు పట్టడం లేదు. ఇటు పవన్ నుంచి కానీ అటు నాదెండ్ల నుంచి కానీ.. ఈ భేటికీ సంబంధించిన వివరాలను వెల్లడించాకే అసలు విషయం తెలుస్తుందని అనడంలో ఆశ్చర్యం లేదు.

దేశం రాజధానిలో ప్రెస్ మీట్ పెట్టి, వీడియోలు చూపించి, కేంద్ర మోసాన్ని ఎండగట్టారు చంద్రబాబు... అయినా చలనం లేదు... నీతీ ఆయోగ్ మీటింగ్ లో, 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముందు, కేంద్రం మోసం చేస్తుంది అంటూ ప్రధాని ముందే కడిగి పడేసారు.. అయినా కేంద్రానికి చలనం లేదు... 5 కొట్ల ఆంధ్రులు ఆందోళన చేస్తున్నా, రెండు పార్టీలని తన గుప్పెట్లో పెట్టుకుని, నాటకాలు ఆడుతుంది... అందుకే, ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేశ అత్యున్నత న్యాయ స్థానం, సుప్రీం కోర్ట్ లోనే తేల్చుకోవటానికి సిద్ధమైంది. నరేంద్ర మోడీ చేసిన నయవంచనను సుప్రీం కోర్ట్ ముందు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేదని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన హామీల అమలుపై కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ వేసింది.

ఏపీ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి, పక్కన పెట్టిందని ఏపీ అఫడవిట్‌లో కేంద్ర తీరును తప్పుబట్టింది. అంతేకాదు హోదా ఉన్న రాష్ట్రాలతో సమానంగా పన్ను రాయితీలు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టింది. వెనకబడిన జిల్లాలకు 24,350 కోట్ల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలని కోరామని, రూ. 1050 కోట్లు మాత్రమే కేంద్రం ఇచ్చిందని వెల్లడించింది. పోలవరం ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 7918.40 కోట్లు ఖర్చు చేసిందని, కేంద్రం రూ. 5349.70 కోట్లు మాత్రమే ఇచ్చిందని ఏపీ తెలిపింది. సవరించిన రూ. 57,948.86 కోట్ల పోలవరం అంచనాలకు అనుమతించలేదని, విభజన హామీల్లో ఏ ఒక్క దానిని కేంద్రం అమలు చేయలేదని ఆరోపించింది. షెడ్యూల్‌-9లో ఉన్న 142 విద్యాసంస్థల విభజన ఇంకా పూర్తికాలేదని, కడప స్టీల్‌ప్లాంట్‌, గిరిజన వర్సిటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఏపీ పేర్కొంది.

నాలుగేళ్లలో జాతీయ విద్యాసంస్థల నిర్మాణానికి 10శాతం కన్నా తక్కువ నిధులు కేటాయించారని, దుగరాజపట్నం పోర్టు, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాట్లపై దృష్టి సారించలేదని వాపోయింది. రైల్వేజోన్‌ ఇంకా పరిశీలనలోనే ఉందని కేంద్రం చెబుతోందని, అమరావతి నిర్మాణానికి రూ. 11,602 కోట్లతో డీపీఆర్‌ పంపామని, రూ. 1500 కోట్లు మాత్రమే కేంద్రం విడుదల చేసిందని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. మొత్తం 19 అంశాల పై, కేంద్రం మనకు అన్యాయం చేస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు వనరుల ప్రాధాన్యత కల్పించడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రైల్వే జోన్ ఏర్పాటు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, విశాఖ, విజయవాడ మెట్రో రైల్, పేట్రో కెమికల్ కాంపెక్స్ ఏర్పాటు, జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థల ఏర్పాటు, నెల్లూరులో దుగ్గిరాజపట్నం పోర్టుతో పాటు, అమరావతికి ఆర్థిక సహాయం, పన్నుల సవరణ, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు, అమరావతికి సమగ్ర రవాణా కనెక్టివిటీ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, డిస్కంల ద్వారా విద్యుత్ బకాయిల చెల్లింపులు, 9వ షెడ్యూల్, 10వషెడ్యూల్ సంసలు, గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు వంటి అంశాల గురించి, ఇప్పటికీ క్లారిటీ లేదు.

Advertisements

Latest Articles

Most Read