తమ ప్రభుత్వం పైన, జగన్ పాలన పైన ఎవరైనా విమర్శలు చేసారు అంటే, వారికి వైసీపీ చేతిలో మూడిందే. ఇందుకు ఉదాహరణలు ఏకంగా వైసీపీ పార్టీ ఎంపీకి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్. సొంత పార్టీ సీనియర్ కార్యకర్త సుబ్బారావు గుప్తాకు స్పెషల్ ట్రీట్మెంట్. చివరకు సొంత కుటుంబంలో ఉన్న వైఎస్ సునీత, చంద్రబాబు పావు అనేంత దిగజారుడు. ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు ఏకంగా సొంత బావ, అంటే చెల్లెలు షర్మిల భర్త అనిల్ ను కూడా వైసీపీ టార్గెట్ చేపిస్తుంది. షర్మిలకు, జగన్ కు మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి చేసిన మోసానికి, వాడుకుని వదిలేసిన విధానానికి, అలాగే ఆస్తుల విషయంలో చేసిన మోసానికి, షర్మిల, జగన్ నుంచి దూరం జరిగింది. ప్రస్తుతం ఆమె, తెలంగాణాలో పార్టీ పెట్టారు. అయితే ఆమె ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీ పెడతారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే బ్రదర్ అనిల్, గత నెల రోజలుగా ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. గతంలో తాను వైసీపీ పార్టీకి ఓటు వేయమని చెప్పిన వారు అందరూ ఇప్పుడు, వైసీపీ పార్టీ తమను పట్టించుకోవటం లేదని, బ్రదర్ అనిల్ కు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే బ్రదర్ అనిల్, విజయవాడతో పాటుగా, విశాఖపట్నంలో కూడా పర్యటించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

anil 18032022 2

అయితే బ్రదర్ అనిల్ ఇప్పుడు బీసి సియం స్లోగన్ ఎత్తుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల తరుపున మాట్లాడుతున్నారు. ఈ శక్తులతో కలిసి ఒక పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టనున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే షర్మిల కానీ, అనిల్ కానీ ఈ విషయం పై క్లారిటీ ఇవ్వలేదు. అయితే బ్రదర్ అనిల్ శక్తి ఏంటో వైసీపీకి తెలుసు. పాస్టర్ నెట్వర్క్ ఉన్న అనిల్, గత ఎన్నికల్లో అన్ని చర్చిల్లో వైసీపీకి ఓటు వేసేలా అక్కడ ప్రజలు ప్రేరేపించారు. ఇప్పుడు అనిల్ తమకు ఎదురు తిరగటంతో, వైసీపీ గేం మొదలు పెట్టింది. ఏపీ క్రిస్టియన్ జేఏసీ ఛైర్మన్ యలమంచిలి ప్రవీణ్, బ్రదర్ అనిల్ పైన నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేసారు. బ్రదర్ అనిల్ కు రాజకీయాలకు ఏమి సంబంధం అని, తెలంగాణాలో చూసుకోవాలి అని, ఏపి సంగతి వదిలేయాలని అంటూ వార్నింగ్ ఇచ్చారు. అగ్ర కులానికి చెందిన అనిల్ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. వైఎస్ఆర్ ద్వారా శాంతిదూతగా అనిల్ ఎదిగారని, అలాంటి అనిల్ ఏపి రాజకీయాల్లోకి అడుగుపెట్టవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఏపీ క్రిస్టియన్ జేఏసీ మాటలు వెనుక ఎవరు ఉన్నారో, ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.

ఇది వినటానికి వింతగా ఉన్న నిజం. జగన్ మోహన్ రెడ్డి, బీజేపీకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేసారు. ఇది చెప్పింది ఎవరో కాదు, స్వయంగా ఢిల్లీ బీజేపీలో కీలక నేత. ఒక పక్క బీజేపీని , జగన్ మోహన్ రెడ్డి నెత్తిన పెట్టుకుని మోస్తున్నారు. రాష్ట్రంలో కూడా బీజేపీ నేతలు చంద్రబాబుని టార్గెట్ చేస్తారు కానీ, జగన్ ని ఏమి అనరు. జగన్ మోహన్ రెడ్డి కూడా 28 మంది ఎంపీలు ఉన్నా, ఏ నాడు బీజేపీ పై ఒత్తిడి తీసుకుని రారు. ఎలాంటి షరతులు లేకుండా బిల్లులకు మద్దతు ఇస్తారు. ఇక ఇక్కడ జగన్ మొహన్ రెడ్డి ఏమి చేసినా, కేంద్రం పట్టించుకోదు. అడ్డగోలు అప్పులు చేసినా, శాంతి భద్రతలు అయినా, అసలు బీజేపీ పట్టించుకోదు. పై పెచ్చు, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చి, జగన్ మోహన్ రెడ్డిని, మోడీ తండ్రిలాగా ఆదుకుంటున్నారు అంటూ చెప్తారు. ఇవన్నీ చూసిన వారికి, జగన్ మోహన్ రెడ్డి బీజేపి వెన్ను పోటు పొడిచే సాహసం చేసారు అంటే నమ్మరు. ఒక పక్క కేసులు వేలాడుతూ, ఎప్పుడు బెయిల్ క్యాన్సిల్ అవుతుందో తెలియని పరిస్థితిలో , జగన్ మోహన్ రెడ్డి ఇంతటి సాహసం చేస్తారా అనే అనుమానం కలుగక మానదు. అయితే బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు ఢిల్లీలోనే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రంలో కూడా హాట్ టాపిక్ అయ్యాయి.

akhilesh 18032022 2

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని ఓడించటానికి, జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ కలిసి, అఖిలేష్ యాదవ్ కు భారీగా ఆర్ధిక సహాయం చేసారని, మూడు వేల కోట్ల వరకు జగన్ మోహన్ రెడ్డి పంపించారని, దీని పైన తమకు పక్కా సమాచారం ఉందని, ఇప్పటికే ఈ విషయం పై కేంద్ర సంస్థలు కూడా దర్యాప్తు చేస్తున్నాయని, త్వరలోనే ఈ విషయం పై సంచలన విషయాలు బయట పెడతాం అంటూ, ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైసీపీలో గుబులు రేపుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ గెలిచి బీజేపీ ఓడిపోతే, తమ పైన బీజేపీ మరింత ఆధార పడుతుందని, జగన్ భావించారని, అందుకే ఫెడరల్ ఫ్రంట్ అంటూ తిరిగిన కేసీఆర్ కు మద్దతు పలికి, బీజేపీని ఓడించటానికి ఆర్ధిక సాయం చేసారు అంటూ, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే అనూహ్యంగా ఈ వ్యాఖ్యలు చేసి, రెండు రోజులు అవుతున్నా, వైసీపీ నుంచి ఒక్కరు అంటే, ఒక్కరు కూడా ఇంత పెద్ద ఆరోపణలను ఖండించ లేదు. ఇదే నిజం అయితే కనుక, బీజేపీ నుంచి జగన్ కు గడ్డు పరిస్థితి తప్పదు.

పెగాసెస్ సాఫ్ట్ వేర్ కు సంబంధించి, దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీ పై నిఘా పెట్టటానికి, తద్వారా రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు అంటూ, ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ కేసు సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. కేంద్రం పై అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో, నిన్న మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు, మన రాష్ట్రంలో కూడా చర్చకు దారి తీసాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ, పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేయాలి అంటూ, తనకు నాలుగేళ్ల క్రితమే ఆఫర్ వచ్చిందని, అయితే దానికి తాను ఒప్పుకోలేదని, ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ సియంగా ఉన్న చంద్రబాబు, దాన్ని కొనుగోలు చేసినట్టు తమకు సమాచారం ఉంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు నిన్న ప్రముఖంగా పత్రికల్లో, టీవీల్లో వచ్చాయి. అయితే మమతా బెనర్జీ వ్యాఖ్యల పైన నారా లోకేష్ స్పందించారు. నిన్న మాండాలి వాయిదా పడిన తరువాత, లోకేష్ విలేఖరులతో చిట్ చాట్ చేసారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, మమతా బెనర్జీకి కౌంటర్ ఇచ్చారు. పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కొనుగోలు చేయలేదని, ఇలాంటి చట్ట వ్యతిరేకత కార్యక్రమాలు టిడిపి ఎప్పుడూ చేయదని అన్నారు.

lokesh 18032022 2

ఒక వేళ తాము కనుక పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసి ఉంటే, అసలు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఉండేవారా అని లోకేష్ ప్రశ్నించారు. ఒక వేళ మేము కనుక పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసి ఉంటే, జగన్ మోహన్ రెడ్డి అసలు మమ్మల్ని వదిలి పెట్టే వారా ? మూడేళ్ళ నుంచి జగన్ రెడ్డి మమ్మల్ని ప్రశాంతంగా ఉంచే వారా అని లోకేష్ ఎదురు ప్రశ్నించారు. టిడిపి ఏమి తప్పులు చేసిందో చెప్పండి అంటూ, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, అన్ని వ్యవస్థలను జగన్ మోహన్ రెడ్డి వాడుకుని, మొత్తం అన్ని శాఖలు తనిఖీ చేయించారని, మేము పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసి ఉంటే బయట పాడేది కదా ఆని అన్నారు. మమతా బెనర్జీ నిజంగా ఆ కామెంట్ చేసి ఉంటే కనుక, ఆమెకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని, లోకేష్ అన్నారు. వ్యవస్థలను నమ్మి, అవే శాస్వతం అని నమ్మే వ్యక్తి చంద్రబాబు గారని, చంద్రబాబు ఎప్పుడూ చట్ట వ్యతిరేకత పనులు చేయరని, అందుకే 40 ఏళ్ళు, ఆయనను ఎవరూ ఏమి చేయలేక పోయారని అన్నారు.

తెలుగు న్యూస్ చానెల్స్ ఒకదానికి ఒకటి పోటీ పడి వ్యవహరిస్తూ ఉంటాయి. ఇప్పటికే న్యూస్ చానెల్స్ అన్నీ, ఒక పార్టీ స్టాండ్ తీసుకుని పని చేస్తున్నాయి అనే విషయం అర్ధం అవుతుంది. నీలి మీడియా చానెల్స్ గా కొన్ని, పచ్చ చానెల్స్ అని కొన్ని ఇలా విమర్శలు చేసుకుంటూ ఉంటారు. జగన్ మోహన్ రెడ్డి అయితే టీవీ5, ఈనాడు, ఏబిఎన్ పేరు చెప్తే, నిదరలో కూడా ఉలిక్కి పడుతూ ఉంటారు. ఇక సాక్షితో పాటు, మరి కొన్ని చానెల్స్ జగన్ భజన చేయటంలో ఆరి తేరి ఉన్నాయి. వీళ్ళకు ప్రజా సమస్యలు అసలు పట్టవు. కేవలం జగన్ మోహన్ రెడ్డి భజనే. ఈ నేపధ్యంలో తాజాగా బార్క్ టీవీ ఛానెల్ రేటింగ్స్ ప్రకటించింది. చాలా కాలం తరువాత, బార్క్ ఈ రేటింగ్స్ ప్రకటించింది. చాలా కాలం పాటు తెలుగు న్యూస్ చానెల్ లో టాప్ అంటే టీవీ9 ఛానెల్ అనేది అందరికీ తెలిసిందే. టీవీ9 ఛానెల్ రవి ప్రకాష్ ఉండగా, ఎవరికీ అందనంత ఎత్తులో ఉండేది. అయితే రాను రాను, టీవీ9 ఛానల్ కు గడ్డు పరిస్థితి రావటం, వారు తీసుకున్న రాజకీయ స్టాండ్, తీసుకున్న ప్రోగ్రాంలు కూడా ప్రజల్లో ఆదరణ కోల్పాయాయి అనే చెప్పే విధంగా, తాజా ర్యాంకింగ్స్ ఉన్నాయి. చాలా కాలం పాటు, నెంబర్ వన్ తెలుగు న్యూస్ చానెల్ గా, పేరు తెచ్చుకున్న టీవీ9, తన మొదటి ప్లేస్ ను కోల్పోయి, రెండో స్థానానికి పడిపోయింది.

news 18032022 2

ప్రస్తుత ర్యాంకింగ్స్ ప్రకారం, నెంబర్ వన్ న్యూస్ చానెల్ ఎన్ టీవీ. 77 పాయింట్లతో ఎన్టీవీ మొదటి స్థానంలో ఉంది. తరువాత స్థానంలో టీవీ9 ఉన్నా, పాయింట్స్ పరంగా చూస్తే ఎక్కడో ఉంది. రెండో స్థానంలో ఉన్న టీవీ9 కు కేవలం 55 పాయింట్లు వచ్చాయి. మొదటి ప్లేస్ కు, రెండో ప్లేస్ కు మధ్య 20 పాయింట్ల తేడా ఉంది. ప్రజలకు ఇష్టమైన కంటెంట్ ఇవ్వకపోతే, కొన్నేళ్లుగా నెంబర్ వన్ ఉన్న చానెల్ అయినా, పడిపోక తప్పదు. ఇక మూడో స్థానంలో తెలంగాణా రాష్ట్రానికి చెందిన వీ6 ఛానెల్ నిలిచింది. మిగతా చానెల్స్ అయిన టీవీ5, ఏబీఎన్, సాక్షి, ఈటీవీ లాంటి న్యూస్ చానెల్స్ 15 నుంచి 30 పాయింట్ల మధ్య, ఎప్పటి లాగే తమ స్థానాన్ని నిలుపుకున్నాయి. అర్బన్ ప్రాంతాలతో పాటుగా, రూరల్ ప్రాంతంలో కూడా ఎన్టీవీ టాప్ లో నిలవటం మరో గమనించాల్సిన అంశం. మొత్తానికి తెలుగు రాష్ట్రాలలో ఎన్టీవీ నెంబర్ వన్ న్యూస్ ఛానల్ అయ్యింది. దారుణంగా పడిపోయిన టీవీ9, ఇప్పటికైనా తన తప్పులు తెలుసుకుంటుందో లేదో చూడాలి మరి.

Advertisements

Latest Articles

Most Read