మాజీ ముఖ్యమంత్రి, జై సమైఖ్యాంధ్ర పార్టీ అధినేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాజకీయాల్లోకి రీ ఎంట్రీ చేయనున్నారు. అయితే ఆయాన ఎవరూ ఊహించని విధంగా,తిరిగి సొంతగూటికే చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు రంగం సిద్ధమైంది. మరో ఏడాదిలో ఎన్నికలు రానుండడంతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ సిఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి విభజనను వ్యతిరేకించారు. చివరి దాకా బంతి మన కోర్టులోనే ఉందని ఎపిలోని ప్రజలను నమ్మించారు.

kira 20062018 2

అయితే విభజన తప్పదని తేలిపోవడంతో ఏకంగా సిఎం పదవికే రాజీనామా చేశారు. అప్పటికప్పుడే జై సమైఖ్యాంధ్ర పార్టీ పేరిట నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. కొంతమేరకు ఉద్యమాన్ని నడిపారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పాటు కావడంతో ఆయన అనూహ్యంగా తెరమరుగయ్యారు. అయితే ఇప్పటికే మాజీ సియంగా ఎంతో కొంత పేరు ఉంది. విభజన జరిగిన అనంతరం 4 ఏళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన ఇటీవల జనసేన పార్టీలో చేరుతారనే ఊహాగానాలు వినిపించాయి. తమ్ముడు తెలుగుదేశంలో చేరటంతో, తెలుగుదేశంలోకి వస్తారని అనుకున్నారు.

kira 20062018 3

కానీ ఊహలను తారుమారు చేస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. సమైఖ్యాంధ్ర ఉద్యమం నడిపిన ఏపి ప్రజల మనోభావాలను, అభిప్రాయాలను గౌరవివంచకుండా కాంగ్రెస్ తమను అన్యాయంగా విడగొట్టిందనే ఆగ్రహం, ఆవేశం ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఏపిలో బలంగా ఉన్న తెలుగుదేశంతో పాటు, ప్రతిపక్షం కోసం పోటీ పడుతున్న,వైసిపి, జనసేన పార్టీలను తట్టుకుని వ్యతిరేకతను అనూకూలంగా మలుచుకుని ఓట్ల రూపంలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని, అక్కడ ప్రజలకు నమ్మకం కల్పించే నాయకుడు కావాలని కాంగ్రెస్ పెద్దలు పావులు కదిపారు. ఇందులో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ లో కి ఆహ్వానించినట్లు సమాచారం. దీనిపై ఆయన కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలిసింది.

జూన్ నెలలో ఇంత నీరు, డెల్టాకి వస్తే, అక్కడ రైతన్నలకు ఆనందం అంతా ఇంతా కాదు... అందుకే పట్టిసీమ నుంచి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించిన నీటికి, పూజలు చేసారు. ప్రతి సంవత్సరం ఈ పూజలు అవసరమా అనే ఏడుపుగొట్టు గాళ్ళు అర్ధం చేసుకోవాల్సింది, అక్కడ రైతులకి అది ఒక సంక్రాంతి పండుగతో సమానం.. అందుకే పట్టిసీమ నీరు వచ్చిన ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటారు... ఎందుకు అంత చేటు పండుగ చేసుకోవటం అనే అజ్ఞానులకి, తెలియదు, చెప్పినా అర్ధం కాదు.. కాని చెప్పే బాధ్యత మన పైన ఉంది.. డెల్టా రైతులకు పట్టిసీమ అనేది లేకపోతే కృష్ణా నీరే దిక్కు.. దానికి ఆల్మిట్టి నిండాలి.. అప్పుడు నారయణపూర్, తరువాత జూరాల, తరువాత శ్రీశైలం, తరువాత నాగార్జున సాగార్, ఇన్ని నిండితే కాని, కృష్ణా డెల్టాకు నీరు రాదు...

pattiseema 20062018 2

ఇది జరగాలి అంటే అక్టోబర్ దాకా ఆగాలి.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, అప్పటికీ వస్తాయి అని గ్యారెంటీ లేదు.. అందుకే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టిసీమతో, డెల్టాకి జీవం పోశారు.. అందుకే ఈ నీరు చుస్తే అక్కడ రైతులకు ఆనందం.. ఇంత మంది ఆనందంతో ఉన్నారు కదా, మన రాష్ట్రంలో ఉన్న కొంత మంది సైకోలు ఏడవటంతో అర్ధం ఉంది...పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం జానంపేట ఆక్విడెక్టు వద్ద మంగళవారం, పట్టిసీమ నీటికి స్వాగతం పలికారు. ఇకక్డ నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌, మంత్రి దేవినేని ఉమా, జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ పాల్గొన్నారు.

pattiseema 20062018 3

ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కింద పోలవరం కుడికాల్వ ద్వారా కృష్ణా డెల్టాకు 8.4 టిఎంసిలు సాగునీరందించి, 18 వేల ఎకరాల్లో, రూ.2,500 కోట్ల విలువైన పంటను కాపాడగలిగామని తెలిపారు. పట్టిసీమ నీరు మరింత సరళంగా పారేందుకు ప్రకాశం బ్యారేజీ వద్ద కొత్త రెగ్యులేటర్‌ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తమకు పుట్టగతులు ఉండవనే దురాలోచనతో ఎంతో ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. అయినా విజ్ఞులైన ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు, రైతులు సహకరించారని.. వారివల్లే పట్టిసీమ సాకారమైందని చెప్పారు. పట్టిసీమ దండగని, దాని నిర్మాణానికి తాను వ్యతిరేకమని, దానికి జీవితాంతం అడ్డుపడతానని, దాని నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్న వారిపై కేసులు పెట్టాలన్న జగన్‌ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. జూన్‌ 15వ తేదీన పట్టిసీమ వద్ద 18 మోటార్ల ద్వారా 6 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశామని.. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో నీరుమడులకు నీరు అందించి, రైతులను ఖరీఫ్‌ సీజన్‌కు సమాయత్తం చేశామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ కు చేస్తున్న అన్యాయం పై, కేంద్రానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. రాష్ట్రానికి నిధులు విడుదల చేసే అంశం పై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. రెండు వారాల్లో కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన నిధులు వచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దాంతోపాటు వెనుకబడిన ప్రాంతాల కోసం రాష్ట్ర అకౌంట్‌లో 350 కోట్లు నిధులు వేసి, వెంటనే కేంద్రం మళ్లీ వెనక్కి తీసుకోవడాన్ని కూడా పిటిషన్‌లో ప్రస్తావించారు. ఇవన్నీ విన్న హైకోర్ట్, దీనిపై విచారించిన ధర్మాసనం.. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి నోటీసులు పంపింది.

highcourt 19062018 4

విభజన హామీల్లో మన రాష్ట్రానికి ఇవ్వాల్సింది ఇవ్వకపోగా, ఇచ్చిన కొంచెం కూడా వెనక్కి తీసుకుంటున్నారు... వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఈ ఏడాది జనవరి 31వ తేదీన రూ.350 కోట్లు విడుదల చేశారు. కానీ... ప్రధాని ఆమోదం లేదంటూ వెంటనే మొత్తం డబ్బు వెనక్కి తీసుకున్నారు... ఇది నిజంగా ఎంత దౌర్భాగ్యం తెలియచేసే సంఘటన... డబ్బులు మన ఎకౌంటు లో వేసి, ప్రధాని వద్దు అన్నారని మళ్ళీ వెనక్కు తీసేసుకున్నారు అంటే, వీరు ఎలాంటి వారో అర్ధమవుతుంది... ఇదే విషయం పై, ఎన్ని సార్లు నిలదీసిన, ఇప్పటి వరకు కేంద్రం, ఆ డబ్బులు ఎందుకు వెనక్కు తీసుకొందో, ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదో చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్ని సార్లు అడిగినా కేంద్రం సమాధానం చెప్పటం లేదు.

highcourt 19062018 5

మొత్తం 19 అంశాల పై, కేంద్రం మనకు అన్యాయం చేస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు వనరుల ప్రాధాన్యత కల్పించడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రైల్వే జోన్ ఏర్పాటు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, విశాఖ, విజయవాడ మెట్రో రైల్, పేట్రో కెమికల్ కాంపెక్స్ ఏర్పాటు, జాతీయ ప్రాధాన్యత కలిగిన సంస్థల ఏర్పాటు, నెల్లూరులో దుగ్గిరాజపట్నం పోర్టుతో పాటు, అమరావతికి ఆర్థిక సహాయం, పన్నుల సవరణ, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు, అమరావతికి సమగ్ర రవాణా కనెక్టివిటీ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, డిస్కంల ద్వారా విద్యుత్ బకాయిల చెల్లింపులు, 9వ షెడ్యూల్, 10వషెడ్యూల్ సంసలు, గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు వంటి అంశాల గురించి, ఇప్పటికీ క్లారిటీ లేదు.

నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టపరచాల్సిన బాధ్యత మీదేననీ, మంత్రులు ప్రజలకు చేరువకావడం లేదంటూ సిఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారు. వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం జరిగింది. దీనిలో పలు అంశాలపై విస్తృతస్ధాయి చర్చ జరిగినట్లు తెలిసింది. అగ్రిగోల్డు వ్యవహారంపై సిఎస్‌ అధ్యక్షతన అధికారుల కమిటీని వేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు సమాచారం. ప్రజల సమస్యలను త్వరిత గతిన పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన డయల్‌ 1100కు ప్రతిపక్షపార్టీ ఫిర్యాదులు చేస్తోందని, వాటిపై విచారణ సరిగా చేయకపోవడంతో అనర్హులకు లబ్ధి చేకూరుతోందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సిఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

cbn 20062018 2

ఎమ్మెల్యేలకే పరిష్కార బాధ్యతను అప్పగించాలని నిర్ణయించారు. అయితే ఇది మరో జన్మభూమి కమిటీలా తయారవుతుందని మంత్రులు చెప్పగా సమస్యలు లేకుండా చూసుకోవాలని సిఎం ఆదేశించారు. అలాగే నియోజకవర్గాల్లో ఇటీవల సమస్యలు ఎక్కువవుతున్నాయని, జిల్లా ఇన్‌ఛార్జు మంత్రులు ఆయా జిల్లాలను పట్టించుకోవడం లేదని, ఎన్నికల సంవత్సరంలో జాగు చేయొద్దని, ఇష్టం లేకపోతే చెప్పాలని సిఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. భూ కుంభకోణాల విషయంలో మంత్రులు ఆచితూచీ మట్లాడాలని, ఎంపిలను కూడా కలుపుకొని పోవాలని సూచించారు. విచారణ జరిగే అంశాలపై ఇటీవల కొందరు మంత్రులు మాట్లాడుతున్నారని, అది ఇక ముందు జరగకూడదని చెప్పినట్లు తెలిసింది. విశాఖపట్నం వ్యవహారంపై మంత్రి అయ్యన్న, గంటా విషయం వ్యక్తిగతంగా మాట్లాడుతానని చెప్పినట్లు సమాచారం.

cbn 20062018 3

బిజెపి వ్యవహారంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కొంత జాగ్రత్తగా వ్యవహరించడంతోపాటు ప్రతిపక్ష నాయకులు వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యంగా దళితులు, మైనార్టీల విషయంలో అడ్వాన్స్‌గా వ్యవహరించి వైసిపి తీరును ఎండగట్టాలని సూచించారు. తాను ఢిల్లీలో ప్రధానిని కలిసిన అంశంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే ఒకరిద్దరు మంత్రులు మినహా ఎవరూ పట్టించుకోలేదని అన్నట్లు తెలిసింది. ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు రూ.55 వేలు లింకు చేశారని, మూడు నెలల నుండి నిధులు విడుదల కాకపోవడంతో ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారని, ఎవరికి చెప్పుకోవాలో తెలియడంలేదని మంత్రులు సిఎం ముందు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. మహిళా శిశు సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లకపోవడంపై ఆశాఖ మంత్రిని మందలించినట్లు సమాచారం. తెల్ల రేషన్‌కార్డులు ప్రతి నియోజకవర్గంలో కొత్తగా ఇచ్చే విధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రణాళిక రూపొందించాలని, ఇవే రేపు ఎన్నికల్లో కీలకంగా మారతాయని సిఎం సూచించారు.

Advertisements

Latest Articles

Most Read