జూన్ నెలలో ఇంత నీరు, డెల్టాకి వస్తే, అక్కడ రైతన్నలకు ఆనందం అంతా ఇంతా కాదు... అందుకే పట్టిసీమ నుంచి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించిన నీటికి, పూజలు చేసారు. ప్రతి సంవత్సరం ఈ పూజలు అవసరమా అనే ఏడుపుగొట్టు గాళ్ళు అర్ధం చేసుకోవాల్సింది, అక్కడ రైతులకి అది ఒక సంక్రాంతి పండుగతో సమానం.. అందుకే పట్టిసీమ నీరు వచ్చిన ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటారు... ఎందుకు అంత చేటు పండుగ చేసుకోవటం అనే అజ్ఞానులకి, తెలియదు, చెప్పినా అర్ధం కాదు.. కాని చెప్పే బాధ్యత మన పైన ఉంది.. డెల్టా రైతులకు పట్టిసీమ అనేది లేకపోతే కృష్ణా నీరే దిక్కు.. దానికి ఆల్మిట్టి నిండాలి.. అప్పుడు నారయణపూర్, తరువాత జూరాల, తరువాత శ్రీశైలం, తరువాత నాగార్జున సాగార్, ఇన్ని నిండితే కాని, కృష్ణా డెల్టాకు నీరు రాదు...
ఇది జరగాలి అంటే అక్టోబర్ దాకా ఆగాలి.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, అప్పటికీ వస్తాయి అని గ్యారెంటీ లేదు.. అందుకే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టిసీమతో, డెల్టాకి జీవం పోశారు.. అందుకే ఈ నీరు చుస్తే అక్కడ రైతులకు ఆనందం.. ఇంత మంది ఆనందంతో ఉన్నారు కదా, మన రాష్ట్రంలో ఉన్న కొంత మంది సైకోలు ఏడవటంతో అర్ధం ఉంది...పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం జానంపేట ఆక్విడెక్టు వద్ద మంగళవారం, పట్టిసీమ నీటికి స్వాగతం పలికారు. ఇకక్డ నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, మంత్రి దేవినేని ఉమా, జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కింద పోలవరం కుడికాల్వ ద్వారా కృష్ణా డెల్టాకు 8.4 టిఎంసిలు సాగునీరందించి, 18 వేల ఎకరాల్లో, రూ.2,500 కోట్ల విలువైన పంటను కాపాడగలిగామని తెలిపారు. పట్టిసీమ నీరు మరింత సరళంగా పారేందుకు ప్రకాశం బ్యారేజీ వద్ద కొత్త రెగ్యులేటర్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తమకు పుట్టగతులు ఉండవనే దురాలోచనతో ఎంతో ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. అయినా విజ్ఞులైన ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు, రైతులు సహకరించారని.. వారివల్లే పట్టిసీమ సాకారమైందని చెప్పారు. పట్టిసీమ దండగని, దాని నిర్మాణానికి తాను వ్యతిరేకమని, దానికి జీవితాంతం అడ్డుపడతానని, దాని నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్న వారిపై కేసులు పెట్టాలన్న జగన్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. జూన్ 15వ తేదీన పట్టిసీమ వద్ద 18 మోటార్ల ద్వారా 6 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశామని.. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో నీరుమడులకు నీరు అందించి, రైతులను ఖరీఫ్ సీజన్‌కు సమాయత్తం చేశామని చెప్పారు.