జగన్ మోహన్ రెడ్డి గారు, మరియి ఆయన కొత్త స్నేహితులు, ఎక్కడ ఉన్నా, రేపు రేపు ఉదయం ప్రకాశం బ్యారేజీ దగ్గరకు రావల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనవి చేస్తున్నారు. ఎందుకంటే, వీరికి పట్టిసీమ అంటే ఏంటో తెలియదు. అవి ఎక్కడ నుంచి, ఎక్కడకి వేల్తాయో తెలియదు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు క్లాసు తీసుకున్నా వీరికి అర్ధం కాదు. అందుకే రేపు వస్తే, ప్రాక్టికల్ గా చూపించి ట్యూషన్ చెప్పే అవకాసం ఉంటుంది. అప్పుడైనా, ఇలాంటి మంచి ప్రాజెక్ట్ పై, ఎందుకు విషం చిమ్ముతున్నామా అని ఆలోచిస్తారేమో. రేపే ఎందుకంటే... రేపు కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు తరలిరానున్నాయి. పట్టిసీమ నుంచి ప్రస్తుతం 16 పంపుల ద్వారా గోదావరి వడివడిగా కృష్ణా జిల్లాలోకి ప్రవేశించనుంది. మిగిలిన 8 పంపులను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చి కృష్ణా డెల్టా అంతటికీ వీలైనంత త్వరగా సాగునీరు అందించేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సోమవారం సచివాలయంలో పోలవరం ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలో తలపెట్టిన 54 ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

pattiseema 19062018 2

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు కోట్ల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈ సీజన్‌కు సన్నద్ధం కావాలని సూచించారు. విస్తరిస్తున్న ఉద్యాన పంటల సాగు, మత్స్య పరిశ్రమల అవసరాన్ని కూడా తీర్చాలన్నారు. భూగర్భ జలాలు 35 మీటర్ల కన్నా దిగువను ఉన్న ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా వ్యవసాయ బోర్లు వేసేందుకు అనుమతులు నిలిపివేయాలని ఆదేశించారు. తాగునీటికి బోర్లు వేసుకునేందుకు మాత్రం అనుమతి ఇవ్వాలన్నారు. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 55.38 శాతం పూర్తయిందని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. కుడి ప్రధాన కాలువ 89.96, ఎడమ కాలువ 61.28 శాతం నిర్మాణం పూర్తయిందన్నారు. రేడియల్‌ గేట్ల ఫ్యాబ్రికేషన్‌ 61.17శాతం, కాఫర్‌ డ్యాం జెట్‌ గ్రౌంటింగ్‌ పనులు 86.60 శాతం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. నీరు-ప్రగతి, వ్యవసాయ రంగంపై టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి ట్యాంకర్లతో తాగునీటి రవాణా అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది తాగునీటి రవాణా బాగా తగ్గిందన్నారు. తాగునీటి సమస్యను గుర్తించిన 500 గ్రామాల్లో ఇన్‌జక్షన్‌ బోర్‌ వెల్స్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

pattiseema 19062018 3

నీతి ఆయోగ్‌ భేటీలో రాష్ట్రం సాధించిన వృద్ధిని వివరించామని, జల సంరక్షణ, పంటల మార్పిడి, పండ్ల తోటల వృద్ధిపై ప్రెజెంటేషన్‌ ఇచ్చామని చెప్పారు. ఈ నెలలో ఇంతవరకు ఉపాధి నిధులు రూ.576 కోట్లు ఖర్చు చేశామని, గత నెలలో రూ.వెయ్యి కోట్లు లక్ష్యాన్ని అధిగమించామని చెప్పారు. ఉపాధి హామీకి మెటిరియల్‌ కాంపోనెంట్‌ నిధులు రూ.830 కోట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. రేషన్‌ డీలర్లతో ఏర్పాటు చేసిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ రేషన్‌ కోసం రాలేని పరిస్థితుల్లో ఉన్న వారికి అవసరమైతే వారి గృహాలకే డీలర్‌ వెళ్లి రేషన్‌ అందించాలన్నారు. రేషన్‌ దుకాణదార్ల ఆదాయాన్ని పెంచుతామని, మరిన్ని వస్తువులను విక్రయించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. పౌర సరఫరాల సేవలతో ప్రజా సంతృప్తి శాతాన్ని 90శాతానికి తీసుకెళ్లాలన్నారు. చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుకల పథకాల్లో ప్రజల్లో సంతృప్తి ఉందని, మిగిలిన పథకాల్లోనూ ఇదే తరహా సంతృప్తి రావాలని సూచించారు.

చంద్రబాబు అంటే, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ కు ఎంత వ్యతిరేకతో అందరికీ తెలిసిందే. చంద్రబాబు ఏ పని చేసిన ఒంటి కాలు మీద వెళ్లి, చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వారి లిస్టు తీస్తే, ఉండవల్లి టాప్ 5 లో ఉంటారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి, చంద్రబాబు పై విరుచుకు పడే ఉండవల్లి, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినా, ఏ రాజకీయ పార్టీలో లేకపోయినా, వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి, చంద్రనాబుని నాలుగు తిట్లు తిట్టి, జగన్ ని ఆకాశానికి ఎత్తి, ప్రెస్ మీట్ ముగిస్తారు. జగన్ కు అనుకూలంగా రాజకీయ ప్రసంగాలు చేస్తారు అనేది బహిరంగ రహస్యం. అయితే, తాను జగన్ కు అనుకూలం కాదు అంటూనే, చంద్రబాబు ఓడిపోవాలని, జగన్ గెలుస్తాడని ప్రచారం చేస్తూ ఉంటారు. చంద్రబాబు వ్యతిరేకులతో కలిసి, ఎప్పుడూ చంద్రబాబుని ఇబ్బంది పెడుతూనే ఉంటాడు..

undavalli 19062018 2

ఇలాంటి ఉండవల్లి నోట, మొదటి సారి చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలుస్తాడు అనే మాట వచ్చింది... అయితే ఇక్కడ కూడా ఆయనకు ఇగో అడ్డు వచ్చింది. జగన్ కు గెలిచే అవకాశాలు ఉన్నాయి కాని, చంద్రబాబు పోల్ మ్యానేజ్మెంట్ తో బయట పడతారని, చంద్రబాబు గెలుపుని ఒప్పుకోలేక ఒప్పుకోలేక ఒప్పుకుంటున్నారు.. ఇవాల్టి రోజున ఏ పార్టీ అయినా పోల్ మ్యానేజ్మెంట్ లో దిట్టగానే ఉన్నారు.. జగన్ దగ్గర డబ్బు ఉంది, ప్రశాంత్ కిషోర్ లాంటి సలహాదారుడు ఉన్నాడు... అలాంటి జగన్ కు పోల్ మ్యానేజ్మెంట్ తెలియదు అంటే ఎవరు నమ్ముతారు... కాకపొతే, చంద్రబాబు గెలిచిపోతారు అనే ఊపు ఉంది కాబట్టి, స్లో గా ట్యూన్ మారుస్తున్నాడు ఉండవల్లి.. ప్రజల్లో ఉంటేనే కదా, పోల్ మ్యానేజ్మెంట్ తో గట్టెక్కేది... ప్రజల్లో అభిమానం లేకుండా, పోల్ మ్యానేజ్మెంట్ తో గట్టేక్కలా అయితే, తెలంగాణాలో తెలుగుదేశం ఎందుకు అధికారంలోకి రాలేక పోతుంది ?

undavalli 19062018 3

మరో పక్క, జగనసేన పార్టీ గురించి విలేకరులు అడగగా, 'ఆ పార్టీకి ఇంకా మేనిఫెస్టో లేదు. ఎవరితోనైనా పొత్తులుంటాయో లేదో స్పష్టత లేదు. పార్టీ నిర్మాణం కూడా లేదు. కానీ పవన్‌ సభలకు యువత వస్తున్నారు' అంటూ చెప్పారు. 2019కి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం లేదని, కాఫర్‌డ్యాం ద్వారా నీరు మళ్లించడానికి సీఎం ప్రయత్నిస్తున్నారని అన్నారు. తనకు ఏ పార్టీపైనా వ్యతిరేకత లేదని చెప్పారు. తానిక ఎన్నికల్లో పోటీ చేయనని, నామినేటెడ్‌ పదవులు కూడా తీసుకోనని చెప్పారు. ‘రాజకీయాల్లో నిజాయితీగా ఉన్నానని ఎవరైనా చెబితే అది నిజం కాదు. కమ్యూనిస్టులైనా సరే డబ్బు వసూలు చేయకుండా పని చేయలేరు. చివరకు గాంధీజీ కూడా డబ్బు సహాయం కోరకుండా నడవలేరు. ప్రధాని మోదీ అవినీతి చేయకపోవచ్చు. కానీ అధికారం కోసం ఏదైనా చేస్తారు’. అని ఉండవల్లి అన్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ విషయంలో, ఉండవల్లికి జ్ఞానదయం అయ్యింది, ఇక మిగిలిన ముతక బ్యాచ్ కూడా రియాలిటీ ఏంటో, గ్రౌండ లెవెల్ లో ఎలా ఉందో అర్ధం చేసుకుంటే, రేపు ఎన్నికలు ఫలితాలు వచ్చిన తరువాత, కోమాలోకి పోకుండా ఉండగలుగుతారు.

రాష్ట్రానికి మళ్లీ కొత్త డిజిపి ఎవరనేది చర్చనీయాంశమైంది. కొత్త పోలీస్‌ బాస్‌ ఎంపికకు కసరత్తూ సాగుతోందని సమాచారం. ఈ నెలాఖరుకు ప్రస్తుత డిజిపి ఎం మాలకొండయ్య పదవీ విరమణ చేయనున్నారు. డిజిపి ఎంపికకు గతంలోలా కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకునేందుకు వీలుగా పోలీస్‌ యాక్ట్‌కు 2017లోనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు తెచ్చిన విషయం విదితమే. వచ్చే సాధారణ ఎన్నికల దృష్ట్యా కీలకమైన డిజిపి ఎంపిక ప్రభుత్వంలో ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో డిజిపి ఎంపిక సీనియార్టీ ప్రాధాన్య క్రమంలో సాగేది. సీనియార్టీ ప్రకారమైతే 1983 బ్యాచ్‌ ఐపిఎస్‌ అధికారి ఎస్వీ రమణమూర్తి రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నారు. అనంతరం 1986 బ్యాచ్‌కు చెందిన విఎస్‌కె కౌముది ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో సిఆర్‌పిఎఫ్‌ అదనపు డిజిగా జమ్ము, కాశ్మీర్‌ డివిజన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. వినరురంజన్‌ రే జైళ్ల శాఖ డిజిగా ఉన్నారు.

police quarters 18062018 2

ఆ తరువాత ఒకేరోజు విధుల్లో చేరిన 1986 బ్యాచ్‌ ఐపిఎస్‌ అధికారులు ఆర్పీ ఠాకూర్‌, గౌతమ్‌ సవాంగ్‌ డిజి హోదాలోనే ఉన్నారు. 2017 డిసెంబర్‌లో సాంబశివరావు పదవీ విరమణ చేసిన తర్వాత డిజిపి పదవి కోసం ఠాకూర్‌, సవాంగ్‌ ప్రయత్నించారు. ఇప్పుడు మళ్లీ వారు యత్నిస్తారని పలువురు అంచనా వేస్తున్నారు. మరో రెండు వారాల్లోనే కొత్త డిజిపిని ఎంపిక చేయాల్సిన పరిస్థితుల్లో ఆశావహులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎసిబి డిజి ఆర్పీ ఠాకూర్‌, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌, హోంశాఖ కార్యదర్శి అనురాధ, ఆర్టీసీ ఎండి సురేంద్రబాబు పేర్లు వీరిలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అవినీతి నిరోధక శాఖకు సంబంధించి కొన్ని కీలక కేసులు నమోదు చేయడంతో తెలుగుదేశం పార్టీ పరంగా ఠాకూర్‌కు గ్రీన్‌సిగల్‌ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుతో సత్సంబంధాలు గల విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.

police quarters 18062018 3

మరోవైపు వీరిద్దరూ ఉత్తర భారతదేశానికి చెందిన వారని, వారికి పదవి ఇస్తే ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అందుకే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారికి డిజిపి ఇవ్వాలని కొందరు అధికారులు ప్రభుత్వానికి అనధికార నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీంతో 1987 బ్యాచ్‌లో సీనియర్‌, ప్రస్తుత హోం శాఖ కార్యదర్శి ఎఆర్‌ అనురాధ పేరు కూడా డిజిపి రేసులో ప్రముఖంగానే వినిపిస్తోంది. ఆనవాయితీ ప్రకారం ఆర్టీసి ఎండినే, తదుపరి డిజిపి అవుతున్నారు. ఇలా చూస్తే ఆర్టీసి ఎండిగా సురేంద్రబాబు పేరూ ప్రభుత్వ పెద్దల దృష్టి ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు మాత్రం ఎన్నికల సీజన్ కావటంతో, సురేంద్ర బాబు వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే నిర్ణయం గురించి అంతా ఆసక్తికరంగా నిరీక్షిస్తున్నారు.

ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రంలో మూడు రోజుల పాటు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్టు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి స్పష్టంచేశారు. రేపటి నుంచి ఈ నెల 21 వరకు సెలవులు ఉంటాయని, మళ్లీ ఈ నెల 22న పాఠశాలలు యథావిథిగా ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ఈ సెలవుల్లో ఎవరైనా క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ప్రైవేట్, ప్రభుత్వ స్కూళ్లన్నీ కచ్చితంగా సెలవులు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది.

schools 18062018 2

ఇంకా ఎండకాలంలో ఉన్నామేమో అన్పించేలా ఎండలు మాడ్చేస్తున్నాయనే చెప్పాలి. రుతుపవనాలు వచ్చేసి నాలుగురోజులు తొలకరి పలకరించి వెళ్లిపోగా ఆతర్వాత మళ్లీ రోహిణీకార్తె వచ్చిందేమో అన్నట్లుగా భారీ ఉష్ణోగ్రతలతో ఎండలు మరోసారి వెనక్కి తిరిగి వచ్చేశాయి. గత మూడు,నాలుగురోజులుగా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ దానికితోడు వడగాల్పులు కూడా జతగా రావటంతో జనం అంతా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. వీటికిమించి వడగాలులు తమ ప్రతాపాన్ని పూర్తిస్ధాయిలో ప్రదర్శిస్తున్నాయి. దీంతో సహజంగానే జనం అంతా ఉక్కిరిబిక్కిరి అవుతుండగా వడగాలుల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఆదివారంనాటి పరిణామంలో పలు ఆసుపత్రుల్లో పదుల సంఖ్యలోనే వడగాలుల ప్రభావానికి గురై చికిత్స పొందుతున్నవారు ఉన్నారు.

schools 18062018 3

ఇక రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగిపోతుందని అనుమానిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో చేరినవారు అధికశాతం మంది కూలీనాలి చేసుకుంటున్నవారే. మిగిలిన వర్గాల్లో ఉన్నవారు ప్రైవేటు ఆసుపత్రుల్లో అధికసంఖ్యలోనే చేరిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా ఈపరిస్దితి మరింత దారుణంగా ఉందనే చెప్పాలి. అటు పిల్లల ఆసుపత్రులు, ఇటు సాధారణ అసుపత్రులు కూడా వడగాలుల ప్రభావానికి గురైనవారితో కిటకిటలాడిపోతున్నాయి. సిలైన్ల విక్రయం విపరీతంగా పెరిగింది. మొత్తంగా చూస్తే గత నాలుగు రోజులుగా 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత నమోదవుతూ వచ్చి ఆదివారంనాటికి 42కు చేరిపోయింది. తొలకరి వర్షాలు కురిసిన తర్వాత కూడా ఈస్ధాయిలో ఉష్ణోగ్రతలు నమోదుకావటం ఇంతకుముందు ఎన్నడూ చూడలేదని పలువురు పేర్కొంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read