ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో, ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియటం లేదు.. ఎక్కడో బీహార్ లో రోడ్లు ఉన్న ఫోటోలు తీసుకువచ్చి, ఆంధ్రప్రదేశ్ అంటారు... ఎక్కడో ఉత్తర ప్రదేశ్ లో పోలీసులు తంతంటే, పవన్ సభ కోసం వస్తుంటే పోలీసులు తంతున్నారు అంటారు.. ఇక లోటస్ పాండ్ నుంచి వచ్చే ఫేక్ న్యూస్ లు అయితే, లెక్క లేనన్ని.. యుట్యూబ్ ఓపెన్ చేస్తే, చెత్తా చెదారంతో నింపేస్తున్నారు... ఇక ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుకి వ్యతిరేకంగా, బీజేపీ, పవన్, జగన్ కలిసి, కోఆర్డినేట్ చేసుకుంటూ, చంద్రబాబు పై విష ప్రచారం చేసి, తప్పుడు వార్తలతో, ఎక్కడో జరిగినవి తీసుకొచ్చి, మన రాష్ట్రంలో జరిగినట్టు చెప్తూ, ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చేలా, అందరూ కలిసి ప్రయత్నం చేస్తున్నారు.. ముఖ్యంగా ఈ ముఠాలు అన్నీ హైదరబాద్ నుంచి పని చేస్తున్నాయి.

pawan 13062018 2

ఈ నేపధ్యంలో, హైదరబాద్ నుంచి , పవన్ ఫాన్స్ పేరుతో రన్ అవుతున్న పేజీల్లో, ఒక కొత్త ప్రచారం మొదలు పెట్టారు.. వారు ప్రచారం చేస్తున్న ప్రకారం, విజయవాడ పోలీసులు, మన బైక్ లు పై, పవన్ కళ్యాణ్ ఫోటో కాని, జనసేన ఫోటో కాని ఉంటే, మీ బైక్ ను ఆపి, ఫైన్ వేస్తున్నారు జాగ్రత్త అంటూ ప్రచారం మొదలు పెట్టారు. మరో పేజిలో ఇదే వార్తను, మీరు ఎన్నైనా చేసుకోండి, మా వెంట్రుక అంటూ, పెట్టారు.. వీరి విపరీత ప్రచారానికి, చివారకి పోలీసులు పై కూడా, విషం చిమ్ముతున్నారు. ఇలా చేస్తూ, పవన్ ఫాన్స్ ని రెచ్చగొట్టి, తద్వారా ప్రభుత్వం పై వ్యతిరేకత వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ పోస్ట్ లు చూసి, కొంత మంది ఫాన్స్ నిజమే అనుకుని, పోలీసుల పై, ప్రభుత్వం పై అసభ్యంగా పోస్ట్ లు కూడా పెట్టారు..

pawan 13062018 3

అయితే, ఈ విషయం విజయవాడ పోలీసుల దృష్టికి వెళ్ళింది. దీంతో విజయవాడ సత్యన్నారాయణ పురం పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఆ పోస్ట్ ల స్క్రీన్ షాట్ చూపిస్తూ, ఇలాంటివి నమ్మవద్దు అంటూ ప్రజలను కోరారు. పోలీసులుగా మాకు పక్షపాతం లేకుండా, ట్రాన్స్ పేరెంట్ గా, పబ్లిక్ ఫ్రెండ్లీతో, బాధ్యతగా పని చెయ్యటమే తెలుసు. విజయవాడ ప్రజలకు ఇది బాగా తెలుసు. ఇలాంటి ఫేక్ న్యూస్, పుకార్లు వ్యాప్తి చేస్తే, లీగల్ గా ఆక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి పోస్ట్ చేసిన అడ్మిన్స్ వెంటనే ఇవి డిలీట్ చెయ్యవలసిందిగా కోరుతున్నాము. ఇలాంటివి చేస్తే చూస్తూ ఊరుకోం అంటూ, అలాంటి పుకార్లు పుట్టించే వారికి, గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా, ఇలాంటి వాటి పై పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చేస్తున్న సోషల్ మీడియా పై, ఒక పాలసీ రావల్సిన అవసరం ఉంది.

అందరి టార్గెట్ చంద్రబాబు... బీజేపీ, పవన్, జగన్ తెర ముందు డైరెక్ట్ గా, కలిసి చంద్రబాబు పై పోరాటం చేస్తుంటే, వెనుక నుండి ముద్రగడ, ఉండవల్లి, ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లాం, పోసాని కృష్ణమురళి, జనచైతన్య వేదిక లక్ష్మణరెడ్డి ఉన్నారు. వీరి అందరి టార్గెట్ చంద్రబాబుని దించటం. మొన్నటి వరకు జగన్, ముద్రగడ మాత్రమే ఈ లిస్టు లో ఉండేవాడు.. ఒక్కసారి చంద్రబాబు బీజేపీని డీ కొట్టటంతో, బీజేపీ వీరందరి చేత, చంద్రబాబు పై దాడి చేపిస్తుంది.. వింత ఏమిటి అంటే, చంద్రబాబుని ఇబ్బంది పెడతాం అని చెప్పి మరీ, దాడి చేస్తుంది.. ఇంతకీ చంద్రబాబు చేసిన తప్పు ఏంటి అంటే, రాష్ట్రానికి రావాల్సిన హక్కులు గట్టిగా అడగటం.. దగా పడ్డ రాష్ట్రానికి, విభజన హామీలు నెరవేర్చండి అని అడగటం.. మాకే ఎదురు తిరుగుతువా అని ఢిల్లీ పెద్దలు, మన ముఖ్యమంత్రి పది దాడి చేస్తుంటే, వీరందరూ ఆ ఢిల్లీ పెద్దలకు సహకరిస్తున్నారు.

motkupalli 13062018 2

అయితే ఇప్పడు కొత్తగా మోత్కుపల్లి నరసింహులును కూడా రంగంలోకి దింపేందుకు ఆయనతో వైసీపీ ఎంపీ విజయ్‌సాయిరెడ్డి మంతనాలు జరిపారని టీడీపీ ఆరోపిస్తోంది. తెలంగాణ నేతగా మోత్కుపల్లి వైసీపీలో చేరలేదు. కానీ ఆ పార్టీ స్పాన్సర్‌షిప్‌తో చంద్రబాబును విమర్శించడానికి రెడీ చేయిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల మోత్కుపల్లి నర్సింహులును కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కలిశారు. మోత్కుపల్లికి ముద్రగడ సంఘీభావం తెలిపారు. తాజా రాజకీయాలపై మోత్కుపల్లితో ముద్రగడ మంతనాలు జరిపారు. ఆంధ్రాలో మా జాతిని అణగదొక్కడమే ధ్యేయంగా చంద్రబాబు పెట్టుకున్నారని, మనందరం ఏకమై ఆయనకు బుద్ధ్దిచెప్పే సమయం ఆసన్నమైందని, రాష్ట్రానికి రావాలని ఆయన మోత్కుపల్లిని కోరారు.

motkupalli 13062018 3

అంతేకాకుండా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మోత్కుపల్లి ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ మీడియాను చూసి వాహనం దిగకుండానే విజయసాయిరెడ్డి వెళ్లిపోయారు. టీడీపీ నుంచి మోత్కుపల్లిని బహిష్కరించిన తర్వాత వారం తిరక్కుండానే ముద్రగడ, విజయ్‌సాయిలు కలవడం వెనుక భారీ వ్యూహం దాగి ఉందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఢీ కొట్టడానికి తన ఇమేజ్ మైనస్‌గా మారడం జగన్‌ను కలవరపెడుతోంది. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన దుస్థితి, వెంటాడుతున్న ఈడీ కేసులు జగన్ అభత్రాభావానికి గురిచేస్తున్నాయి. చంద్రబాబు పనిమంతుడనే ఇమేజ్‌ను వీలైనంతగా తగ్గిస్తేనే తనకు ప్లస్ అవుతుందని, ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలు జగన్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత పెంచుకున్న వారందరినీ కూడగట్టి ‌రాజకీయ విమర్శలకు సిద్ధం చేస్తున్నారన్న అనుమానాలు టీడీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తుంది కేంద్ర ప్రభుత్వం ... ఒకవైపు ఢిల్లీ లో కూర్చోని నేషనల్ మీడియా ముందు .. మాకు అన్ని రాష్ట్రాలూ సమానమే .. గుజరాత్ పై ప్రత్యేక అభిమానం ఏమీ లేదు.. ఆంధ్రాకు 85 శాతం చేసేసాం.. లక్షల లక్షల కోట్లు ఇచ్చాం.. ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ, జీవీఎల్, సోము, కన్నా, లాంటి నేతలు చెప్పిందే చెప్పి, ప్రజల చెవిల్లో నుంచి రక్తం వచ్చేలా, సొల్లు చెప్పారు... ఇప్పుడు తాజాగా మరో నయవంచన చేసింది కేంద్రం... విభజన చట్టంలో ఉన్న కడప స్టీల్ ఫ్లాంట్‌ ఏర్పాటు చేయడానికి సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం బుధవారం తేల్చి చెప్పింది. విభజన హామీల అమలుపై తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో ఏపీ, తెలంగాణలో స్టీల్ ఫ్యాక్టరీల నిర్మాణం సాధ్యం కాదనే రిపోర్టులు వచ్చాయని కేంద్రం తెలిపింది.

steelplant 13062018 2

తొలి ఆరు నెలల్లోనే సాధ్యం కాదని చెప్పినా.. పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచనలు వచ్చాయన్న కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు స్పష్టంగా నివేదిక వచ్చినట్టు పేర్కొంది. తమ ప్రభుత్వం ఏర్పాటైన ఆర్నెళ్లలోనే ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యంకాదని, ఇప్పటికే ఉన్న పరిశ్రమలు నష్టాల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పామని స్పష్టం చేసింది. అలాగే ఖనిజాలు దొరకడం కూడా కష్టతరమైన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కొత్తగా రెండు రాష్ట్రాల్లో ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు సాధ్యం కాదని తాము స్పష్టంచేశామని కేంద్రం తెలిపింది.

steelplant 13062018 3

మరో పక్క స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు విషయంలో తెలంగాణతో ఆంధ్రప్రదేశ్‌కు లంకె ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ‘మా రాష్ట్రంలో అపారమైన ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ఇనుప ఖనిజ లభ్యతపై క్షేత్ర స్థాయిలో పర్యటించి సర్వే జరిపిన మెకాన్‌ సంస్థకు కోరినంత సమాచారం అందించాం. ఆ సంస్థ ముసాయిదా నివేదిక ఇవ్వడంతో రాష్ట్రంలో స్టీల్‌ ప్లాంటు ఏర్పాటుకు మార్గం సుగమమైందని సంతోషించాం. కానీ తెలంగాణ నుంచి నివేదిక రాలేదంటూ ఆంధ్రలో స్టీల్‌ ప్లాంటు అంశాన్నీ అటకెక్కించడమేంటి’ ఏపీ గనుల శాఖ కార్యదర్శి శ్రీధర్‌, ఏపీఎండీసీ ఎండీ సీహెచ్‌వీ చౌదరి అసహనం వ్యక్తం చేశారు. మరి ఇంత వంచన చేస్తుంటే, కడప పౌరుషం అంటూ చెప్పే జగన్, జెండా పౌరుషం అంటూ చెప్పే పవన్, రాయలసీమ ఉద్యమం అంటూ ప్రజల్ని రెచ్చగొడుతున్న రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం, ఒక్క మాట మాట్లాడటం లేదు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే, సియం రమేష్ మాట్లాడుతూ, దీని పై నిరసన తెలియచేస్తూ, కేంద్ర వైఖరికి నిరసనగా, ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు.

ఢిల్లీలో ఈనెల 17వ తేదీ ఉదయం నిర్వహించనున్న నీతి ఆయోగ్ (NITI Ayog) 4 గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని 18 వ తేదీకి వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడిక్కడ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్‌కు లేఖ రాశారు. ఈనెల 16 వతేదీన రంజాన్ పండుగ ఉందని, ముస్లింలకు ఇది పెద్దపండుగ అని, అలాగే 17వ తేదీ ఉదయం ఈద్ మిలాప్ ఉందని, అందువల్ల రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను రాజధాని అమరావతిలో ఉండాల్సి ఉందని, ఈ కారణంగా నీతి ఆయోగ్ సమావేశాన్ని 18వ తేదీకి లేదా కనీసం 17వ తేదీ మధ్యాహ్నానికి వాయిదా వేయాలని కోరుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ లేఖలో వివరించారు. తమ అభ్యర్ధనకు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి అన్నారు.

muslim 13062018 2

ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఉదయం సచివాలయంలోని తన ఛాంబర్ లో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. విభజన అంశాలు, కేంద్ర ప్రాజెక్టులకు అందిస్తున్న నిధులతో నివేదిక అందించాలని, అవసరమైన జిల్లాలకు ప్రత్యేక సహాయం అందుతున్న తీరుపై నీతి ఆయోగ్ చర్చనీయాంశాల్లో ఉందని, అందువల్ల సమగ్ర వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. నీతి ఆయోగ్ గత సమావేశపు కార్యప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలుకు కేంద్రం నుంచి ఏమేరకు సహకారం అందుతుందో తనకు సవివరంగా నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు.

muslim 13062018 2

వ్యవసాయరంగంలో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే అంశంలో, ఇ-నామ్, వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు, భూసార స్థితి కార్డులు తదితర అంశాలపై ఆయన అధికారులతో మాట్లాడారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులు ఏమేరకు వినియోగించాం, ఇంకా కేంద్రం నుంచి ఎంత రావాలి? అనే వివరాలను, అలాగే వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అమలు జరుగుతున్న కేంద్రపథకాల తాజా స్థితిని చంద్రబాబు సమీక్షించారు.  ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి రాష్ట్రీయ స్వస్థ సురక్షా మిషన్ , పోషణ్ మిషన్ (Poshn Mission), మిషన్ ఇంధ్రధనుష్‌ అమలు వివరాలను తెలియజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో జలసంరక్షణకు, నదుల అనుసంధానానికి నరేగా నిధులను ఏమేరకు వినియోగించాం? మెరుగైన ఫలితాల సాధనకు నరేగా నిధులను ఎలా ఉపయోగించాలో నివేదికలో వివరాలు పొందుపర్చాలని కోరారు. జాతిపిత మహాత్మాగాంధీ 150 జయంతి ఉత్సవాలకు రాష్ట్రంలో ఏం చేయవచ్చో సూచనలివ్వాలని కోరారు.

Advertisements

Latest Articles

Most Read