నిన్నటి నుంచి ఏపి రాజకీయాలు జంగారెడ్డి గూడెం చుట్టూ తిరుగుతున్నాయి. కల్తీ నాటు సారా తాగి 25 మంది చనిపోయిన విషయం తెలిసిందే. లిక్కర్ రేట్లు తట్టుకోలేక, చాలా చోట్ల, సారా వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ సారాని ఇష్టం వచ్చినట్టు కెమికల్స్ కలిపి, తక్కువ రేటుకు ఎక్కువ కిక్ వచ్చేలా చేసి, కల్తీ చేసి పెడుతున్నారు. వాలంటీర్లు కూడా సారా కాస్తూ పట్టుబడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. కొన్ని చోట్ల అధికార పార్టీ అండదండలతో, ఈ నాటు సారా మాఫియా కొనసాగుతుంది. అయితే నిన్న జరిగిన ఘటనలో, అంత మంది చనిపోవటంతో, సహజంగా అటు వైపు ఫోకస్ వస్తుంది. ఈ నేపధ్యంలోనే నిన్న చంద్రబాబు అటు వెళ్ళటం, బాధితులతో మాట్లాడటం, తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని పెద్ద ఎత్తున సభలో చర్చకు పెట్టటం, ఇవన్నీ జరిగాయి. ప్రజల్లో దీని పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. లిక్కర్ రేట్లు పెరగటంతో, నాటు సారా ఎక్కువగా ఉన్న విషయం తెలిసిన ప్రజలు కూడా ఈ విషయానికి కనెక్ట్ అయ్యారు. అయితే అనూహ్యంగా ఈ విషయంలో స్పందించిన ప్రభుత్వం, ఈ మరణాలు అన్నీ కూడా నాటు సారా తాగి చనిపోయిన వారి మరణాలు కాదని, ఇవన్నీ కూడా సహజ మరణాలు అని, తెలుగుదేశం పార్టీ వారిని తీసుకుని వచ్చి గోల చేస్తుందని ఆరోపిస్తున్నారు.

ysr 150320222 2

ఈ రోజు అయితే, ఏకంగా వాళ్ళు ఏడవటం లేదు, మీకెందుకు ఏడుపు అని ఒకరు, అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్లకు డబ్బులు ఇచ్చి, ఈ ఆట ఆడిస్తుంది అంటూ మరొకరు, బాధితుల పట్ల మానవత్వం లేకుండా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ శవ రాజకీయాలు చేస్తుంది అంటూ, విమర్శలు చేసారు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తుంది వైసీపీ. అయితే, ఇది ఇలా ఉంటే, దీనికి తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఇచ్చింది. అసలు శవ రాజకీయం చేసింది ఎవరూ అంటూ, గతంలో వైఎస్ఆర్ చనిపోయిన సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి, ఎక్కడో చనిపోయిన వారికి 5 వేలు ఇచ్చి, వారిని వైఎస్ఆర్ ఖాతాలో వేసి, ఓదార్పు యాత్ర చేసిన విషయాన్ని, అప్పట్లో వచ్చిన ఒక ఇంగ్లీష్ ఛానెల్ కధనం సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అలాగే వివేక మరణాన్ని జగన్ మోహన్ రెడ్డి ఎలా వాడుకుంది కూడా, టిడిపి కౌంటర్ ఇచ్చింది. అంతే ఒక్క దెబ్బతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైలెంట్ అయ్యింది. మొత్తానికి శవ రాజకీయాలు అంటూ వైసీపీ చేసిన ప్రాపగాండాని, టిడిపి తిప్పి కొట్టింది.

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఈ రోజు నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభ పై, అందరికీ ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. ఈ సభ ద్వారా, భవిష్యత్తు రాజకీయానికి పునాదులు పడతాయని అందరూ భావించారు. ముఖ్యంగా పొత్తుల విషయం పై పవన్ కళ్యాణ్ స్పష్టత ఇస్తారని భావించారు. అందరూ అనుకున్నట్టుగానే, పవన్ కళ్యాణ్ పొత్తుల పై సంకేతాలు ఇచ్చారు. ప్రసంగం చివరలో పవన్ కళ్యాణ్ పొత్తుల పై మాట్లాడుతూ, బీజేపీ పార్టీ తనకు రోడ్ మ్యాప్ ఇస్తానని చెప్పిందని, ఇప్పటి వరకు ఆ రోడ్ మ్యాప్ ఇవ్వలేదని, మేము దాని కోసం ఎదురు చూస్తున్నాం అంటూ, బీజేపీ పై అసహనం వ్యక్తం చేసారు. తమకు బీజేపీ ఆ రోడ్ మ్యాప్ ఇస్తే, దాని కోసం పని చేసి, వైసీపీ పై పోరాటం చేస్తాం అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇక తరువాత పవన్ కళ్యాణ్ అసలు విషయం చెప్పారు. గతంలో ఎమర్జెన్సీ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అన్ని రాజకీయ పక్షాలు కలిసి పోరాటం చేసయాని, అప్పట్లో ఆ వ్యతిరేకత శక్తులు అన్నీ ఎలా కలిసి పని చేసాయో, ఇప్పుడు కూడా వైసీపీ వ్యతిరేక శక్తులు అన్నీ కలిసి పని చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బాగు కోసం తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నా అని, వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ తన పార్టీ ఆవిర్భావ సభలో స్పష్టం చేసారు.

janasena 4032021 2

పార్టీలు వ్యక్తిగత లాభాలు వదిలి, రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తుల కోసం రావాలని అన్నారు. తాను ఇచ్చే వాడినే కానీ, ఏదో కావాలని ఆశించే వాడిని కాదంటూ, పవన్ కళ్యాణ్ పొత్తుల పై స్పష్టం చేసారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర నాయకత్వం సరిగ్గా సహకరించక పోయినా, ఢిల్లీలో ఉండే కేంద్ర నాయకత్వం సూచనలు ప్రకారం పవన్ కళ్యాణ్ పొత్తులో ఉంటున్నారు. ఇక ఈ రోజు పవన్ కళ్యాణ్ పరోక్షంగా తెలుగుదేశం పార్టీ గురించే ప్రస్తావించారని అనుకోవాలి. వైసీపీ వ్యతిరేక శక్తులలో, తెలుగుదేశం పార్టీ 40 శాతం ఓటు బ్యాంక్ తో బలంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా ముందు ఉండి పోరాటాలు చేస్తుంది. పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి ప్రస్తావిస్తూ, ఇది తెలుగుదేశం పార్టీకి ఇస్తున్న పిలుపుగానే చూడాలి. మరి ఈ విషయం పై బీజేపీ ఎలా స్పందిస్తుంది, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారు, రాష్ట్ర రాజకీయం ఎలా మారుతుంది, రాబోయే రోజుల్లో రాజకీయం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఈ రోజు జంగారెడ్డి గూడెం వెళ్లనున్నారు. కల్తీ నాటు సారా తాగి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించటానికి చంద్రబాబు ఈ రోజు జంగారెడ్డి గూడెం వెళ్ళనున్నారు. అయితే చంద్రబాబు వస్తున్నారని తెలిసి, చంద్రబాబు పర్యటనను విఫలం చేసేందుకు, వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. నాటుసారా తాగి చనిపోయిన వారి కుటుంబాలను చంద్రబాబు కలవకుండా, ప్రభుత్వం ప్లాన్ వేసింది. నిన్న రాత్రి బాధితుల దగ్గరకు వచ్చిన కొంత మంది, మీకు రేపు పది లక్షలు ప్రభుత్వం ఇస్తుంది, వెంటనే మీరు ఏలూరు కలెక్టర్ కార్యాలయాని రావాలి అంటూ, ప్రలోభాలు పెడుతున్నారు. నిన్న రాత్రి బాధితుల ఇళ్ళకు వెళ్ళిన అధికారులు, వైసీపీ నేతలువెంటనే వెళ్లిపోవాలి అని ప్రలోభాలు పెట్టారు. అయితే బాధితులు మాత్రం, తాము ఎక్కడకు వెళ్ళమని, చంద్రబాబుని కలుస్తామని చెప్తున్నారు. బాధితుల వెంట, టిడిపి నేతలు.

జంగారెడ్డిగూడెంలో, వరుసమరణాలు కలకలం రేపుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 25 మంది చనిపోయారు. గత రెండు మూడు రోజులుగా, ఈ సంఘటనలు జరిగాయి. పెద్దవాళ్ళు, జబ్బులు ఉన్న వాళ్ళు అయితే అనుకోవచ్చు కానీ, అక్కడ చనిపోయింది అంతా వయసులో ఉన్న వారే. వీరి మరణాలను కారణం కల్తీ నాటు సారా అని కుటుంబ సభ్యులే చెప్తున్నారు. ప్రతి రోజు సారా తాగుతున్నారని, మద్యం కొనుక్కోలేక సారాకి అలవాటు పడ్డారని వాపోతున్నారు. అయితే ఇంత మంది చనిపోవటంతో, ప్రభుత్వం పట్టించుకోక పోవటంతో, ప్రతిపక్షం రంగంలోకి దిగింది. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, ఈ అంశం పై నిజ నిర్ధారణ చేసి, నిజంగానే నటు సారా తాగి చనిపోయారని, తెలుగుదేశం పార్టీ నిర్ధారించటంతో, చంద్రబాబు నాయుడు ఈ రోజు నేరుగా బాధితుల వద్దకు వచ్చారు. నాటు సారా తాగి చనిపోవటం, ప్రభుత్వ భాధ్యాతారాహిత్యమే అని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి 25 లక్షల పరిహారం ప్రభుత్వం తరుపున ఇవ్వాలని, నాటు సారా దుకాణాలు, మాఫియా లేకుండా చూడాలని, చంద్రబాబు డిమాండ్ చేసారు. ఈ విషయం పైన తెలుగుదేశం పార్టీ, ఈ రోజు అసెంబ్లీలో కూడా ఆందోళన చేసి, ప్రభుత్వాన్ని నిలదీసింది.

asembly 14032022 2

అయితే ఈ విషయంలో కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎదురు దా-డి వ్యూహాన్నే ఎంచుకుంది. అక్కడ 25 మంది చనిపోతే, విషయం ఏమిటో అడ్రెస్ చేయకుండా, అక్కడ ఏమి జరగలేదు, అవన్నీ సహజ మరణాలే, తెలుగుదేశం పార్టీ స్మశానానికి వెళ్లి, అక్కడ చనిపోయిన వారి అందరినీ ఇక్కడకు తీసుకొచ్చి, ఆ లెక్కల్లో కలిపేసారు అంటూ, జుబుక్సారంగా వ్యవహరించటం మొదలు పెట్టింది. ఇది అందరినీ షాక్ కు గురి చేసే అంశం. చివరకు జగన్ మోహన్ రెడ్డి కూడా, ఇలాగే స్పందించారు. అక్కడ జనాభాలో 2 శాతం చనిపోవటం అనేది సర్వ సాదహరణ విషయం అని, దానికి నాటు సారా అంటూ లింక్ చేయటం ఏమిటి అంటూ, జగన్ అసెంబ్లీలో మాట్లాడారు. గతంలో ఎప్పుడూ ఈ నాటు సారా లేదా ? ఇప్పుడే కొత్తగా వచ్చిందా అంటూ, జగన్ మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్య పరించింది. జగన్ మోహన్ రెడ్డి ఇలా మాట్లాడటం, ప్రభుత్వం స్పందించిన తీరు, అందరినీ షాక్ కు గురి చేసింది. చివరకు ఇది చర్చకు అడిగిన టిడిపి సభ్యులను, సభ ముగిసే వరకు సస్పెండ్ చేసారు.

Advertisements

Latest Articles

Most Read