ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కోవిడ్ సెంటర్లకు, గతంలో ఆహరం సప్లై చేసిన కాంట్రాక్టర్లకు, సంబంధిత బిల్లులు అందలేదని, హైకోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. ఆ పిటీషన్ కు సంబంధించి, ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో విచారణ జరిగిన సందర్భంలో, దీనికి సంబందించిన అధికారులు తమ ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దీంతో ఈ రోజు కోర్టు ఆదేశాలు ప్రకారం, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఇద్దరూ ఈ రోజు హైకోర్టుకు వ్యక్తిగతంగా హాజరు అయ్యారు. హైకోర్టుకు హాజరయిన అధికారులు, బిల్లులు చెల్లించినట్టు కోర్టుకు చెప్పారు. అదే విధంగా బిల్లులు చెల్లింపులు ఆలస్యం అయినందుకు కోర్టుకు క్షమాపణలు కూడా చెప్పారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం, అసలు ఎందుకు బిల్లులు చెల్లించటం ఆలస్యం అయ్యింది ? ఇప్పటి వరకు ఎంత చెల్లించారు, ఇంకా ఎంత చెల్లించాలి, ఇలాంటి పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలి అంటూ, హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ బిల్లుల వివరాల సమర్పణకు సమయం కావాలని కోరటంతో, తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేస్తూ, పూర్తి వివరాలు తమకు చెప్పాలని ఆదేశాలు ఇచ్చింది.

hc 11032022 2

ముఖ్యంగా చూసుకుంటే, కోవిడ్ సమయంలో, తాము ప్రభుత్వం అడిగినట్టు ఆహరం సప్లై చేసాం అని, అయితే ప్రభుత్వం వైపు నుంచి తమకు బిల్లులు చెల్లింపులో ఆలస్యం అయ్యిందని, ఇబ్బందులు పెడుతున్నాం అంటూ, పిటీషనర్ తరుపున న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్లారు. అయితే దీని పైన హైకోర్టు సీరియస్ అయ్యింది. ఎందుకు బిల్లులు చెల్లించ లేదు అంటూ, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు అధికారులు తమ ముందుకు రావాలని కోర్టు ఆదేశించటంతో, ఈ రోజు కోర్టు ముందుకు వచ్చిన అధికారులు, ఆలస్యానికి కారణాలు కోర్టుకు చెప్తూ, చెల్లింపుల వివారాలు చెప్పారు. అయితే కోర్టు పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని కోరింది. అయితే ఈ సందర్భంలో అధికారులను కోర్టు ఒక ప్రశ్న అడిగినట్టు తెలుస్తుంది. మీరు ఏదైనా హోటల్ కు వెళ్లి, మొత్తం తినేసి, బిల్లు తరువాత కడతాను అంటే ఎలా ఉంటుంది ? అని కోర్టు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ రోజు మరోసారి అధికారులు కోర్టు మెట్లు ఎక్కారు.

ఫేక్ ప్రచారం అనేది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొదలు పెట్టింది వైసిపీ. గత ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ని తీసుకుని వచ్చి, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేసి, మాయ చేసి, ప్రజలను మభ్య పెట్టారు. మొత్తం ఫేక్ చేసి పెట్టారు. ముఖ్యంగా కులాల మధ్య కుంపట్లు పెట్టి, సక్సెస్ కూడా అయ్యారు. ఇలాంటి ఫేక్ ప్రచారాల్లో ఒకటి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా, 35 మంది డీఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చింది, మొత్తం తన కులం వారినే అంటూ, జగన్ మోహన్ రెడ్డి స్వయంగా మాట్లాడుతూ ఫేక్ చేసారు. జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఈ మాటలు మాట్లాడారు. ఈ విషయం పైన నానా రచ్చ చేసారు. గవర్నర్ వద్దకు, రాష్ట్రపతి వద్దకు కూడా వెళ్లి, ఈ విషయం పైన ఫిర్యాదు చేసి, తమ అనుకూల బ్లూ మీడియా, పేటీయం బ్యాచ్ తో, రచ్చ రచ్చ చేసారు. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం, మొత్తం వివరాలు బయట పెట్టినా, వాళ్ళ ఫేక్ ప్రచారం ముందు, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వివరణ నిలువలేక పోయింది. ఇది ఇలా ఉంటే, ఈ ఫేక్ ప్రచారాలు అన్నిటికీ తెలుగుదేశం పార్టీ ఫూల్ స్టాప్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ రోజు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ చాలా తెలివిగా వ్యవహరించి, వైసీపీ చేసిన ఫేక్ ప్రచారాన్ని, వాళ్ళతోనే ఫేక్ ప్రచారం అని అసెంబ్లీ రికార్డుల్లో ఎక్కేలా చేసి, సక్సెస్ అయ్యింది.

buggana 10032022 2

ఈ రోజు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ, అనేక ప్రశ్నలు వేసింది. అయితే వైసీపీ తెలివిగా, కేవలం రెండు ప్రశ్నలకు మాత్రమే, సభలో సమాధానం ఇచ్చి, ప్రశ్నోత్తరాల సమయం మొత్తం, సాగదీసింది. మిగతా ప్రశ్నలను రాత పూర్వకంగా ఇచ్చి అవి వీడియో లేకుండా చూసుకుంది. అయితే లిఖిత పూర్వకంగా ఇచ్చిన దాంట్లో, టిడిపి అడిగిన ఈ ప్రశ్న కూడా ఉంది. గతంలో ఒకే సామాజికవర్గానికి పోస్టింగ్ లు వచ్చాయి అనే ప్రచారం ఉంది, అందులో వాస్తవం ఉందా, వివరాలు చెప్పండి అంటూ ప్రశ్న అడగగా, అందులో వాస్తవం లేదు, ఒక సామాజికవర్గానికి నాటి చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వలేదు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కూడా అందులో ఉన్నారు అంటూ, వైసీపీ ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఇదే విషయం టిడిపి సభలో నిలదీయటంతో, వైసీపీ అవాక్కయింది. వెంటనే గోల చేయటం, స్పీకర్ మైక్ కట్ చేయటం, టాపిక్ డైవెర్ట్ చేయటం వెంట వెంటనే జరిగిపోయాయి. ఎలా ఫేక్ చేస్తారు అనే దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఇలా ఫేక్ చేసింది, ఇప్పుడు సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి సీటులో ఉన్న వ్యక్తే.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధన సమస్య నిరుద్యోగ సమస్య. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి, రెండు తెలుగు రాష్ట్రాల్లో, నిరుద్యోగ యువత అసహనంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో గత చంద్రబాబు హాయంలో అనే ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చాయి. రెండు సార్లు డీఎస్సీ కూడా వచ్చింది. ఇక ప్రైవేటు ఉద్యోగాలు అయితే లక్షల్లో వచ్చాయని, జగన్ ప్రభుత్వమే అసెంబ్లీలో ఒప్పుకుంది. అయినా సరే నిరుద్యోగ యువత అప్పట్లో చంద్రబాబు మీద ఆగ్రహంగా ఉండేది. ఆ సందర్భంలో జగన్ మోహన్ రెడ్డి వారిని రెచ్చగొట్టారు. నేను అధికారంలోకి రాగానే 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని అన్నారు. ప్రతి జనవరి 1న జాబ్ క్యాలండర్ అన్నారు. అలాగే ప్రతి కాంట్రాక్టు ఉద్యోగస్తుడిని రెగ్యులర్ చేస్తానని అన్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, అనేక హామీలు ఇచ్చి, నిరుద్యోగ యువతను మంచి చేసుకున్నారు జగన్. తరువాత ఎన్నికల్లో గెలిచారు. ఇప్పటికి మూడు జనవరి 1లు వెళ్ళాయి కానీ, జాబ్ క్యాలండర్ అనేది మాత్రం రాలేదు. మధ్యలో ఒక జాబ్ క్యాలండర్ అని ఉత్తుత్తి జాబ్ క్యాలండర్ ఒకటి వదిలారు. దాని పైన పెద్ద ఎత్తున ఆందోళన చేసారు యువత. అందులో కేవలం 36 గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి. ఇక కేవలం వందల్లోనే పోలీస్ ఉద్యోగాలు ఉన్నాయి.

kcr 10032022 2

టీచర్ ఉద్యోగాల సంగతి ఊసే లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఊసురోమంటున్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి మాత్రం, తాను ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చానని, ఇది దేశంలోనే ఎవరూ చేయలేదని, గర్వంగా చెప్పుకుంటున్నా అని అన్నారు. ఆ ఆరు లక్షల ఉద్యోగాలు ఏంటి అంటే, వాలంటీర్ ఉద్యోగాలు, బియ్యం వ్యాన్ డ్రైవర్ ఉద్యోగాలు, మద్యం షాపుల్లో ఉద్యోగాలు, ఆర్టీసీని ప్రభుత్వంలో తీసుకున్నాం కాబట్టి, ఆ ఉద్యోగాలు, ఇలా మొత్తం మాయ చేసి పెట్టారు. అప్పటి నుంచి జగన్ పై యువత ఆగ్రహంగా ఉంది. ఈ క్రమంలోనే, పుండు మీద కారంలో, కేసీఆర్ 90 వేల ఉద్యోగాలను నోటిఫై చేస్తున్నట్టు అసెంబ్లీలో చెప్పారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేసేసారు. దీంతో ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పైన ఆ ఒత్తిడి వస్తుంది. జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చి కూడా, మూడేళ్ళు అయిపోతున్నా, ఏమి చేయటం లేదని, ఆగ్రహం వ్యక్తం చేస్తుంది యువత. మరి కేసీఆర్ దెబ్బకు, విలవిలాడుతున్న జగన్.. నెక్స్ట్ ఏమి చేస్తారు అనేది చూడాలి మరి.

ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, రాష్ట్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ పైన, నిప్పులు చెరిగింది. చెల్లింపులో ఆలస్యం పైన, చీఫ్ సెక్రటరీని కోర్టుకు రావాలని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా కోర్టుకు వచ్చిన చీఫ్ సెక్రటరీతో పాటుగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు వాయించి పడేసింది. బిల్లులు చెల్లింపులో జాప్యం పైన విచారణ జరుగుతూ ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు పై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చీఫ్ సెక్రటరీని హైకోర్టు ప్రశ్నిస్తూ, మీరు త్వరలో రిటైర్డ్ అవ్వబోతున్నారు కదా, ఎక్కడ స్థిరపడాలని ప్లాన్ చేసారు అంటూ, హైకోర్టు ఆయన్ను ప్రశ్నించింది. దానికి సమాధానం ఇచ్చిన చీఫ్ సెక్రటరీ, తాను హైదరాబాద్ తో పాటుగా, ఇతర మెట్రో నగరాల పేర్లు చెప్పి, అక్కడ స్థిరపడాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. దీనికి స్పందించిన హైకోర్టు, మీతో పాటు చాలా మంది ఉన్నతాధికారులు అలాగే కోరుకుంటున్నారు అని, అయితే హైకోర్టు జడ్జిగా, ఇక్కడ రాష్ట్ర పౌరుడిగా నేను, అలాగే ఇక్కడ ప్రజలు, చివరి దాకా ఇక్కడే ఉండాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన రాష్ట్రంలో చాలా ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. చిన్న చిన్న అవసరాలు కూడా రాష్ట్రంలో తీరని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. మౌళిక అంశమైన వైద్యం కూడా, ఇక్కడ దక్కటం లేదని అన్నారు.

hc 10032022 2

వైద్యం కావాలి అంటే పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారని, పెద్ద పెద్ద అధికారులు, ఆర్ధికంగా బలంగా ఉన్న వాళ్ళు హైదరాబాద్ వెళ్లి వైద్యం చేపించుకుంటున్నారని, మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. కరోనా సమయంలో చూసాం కదా, హైదరాబాద్ కు అంబులెన్స్ లు బారులు తీరాయి, చివరకు అక్కడ ప్రభుత్వం మన అంబులెన్స్ లను రావటానికి ఒప్పుకోక పోవటంతో, వివాదం ఏర్పడింది, అని గుర్తు చేసారు. నిన్న హైదరాబాద్ మన రాజధాని అని చెప్పిన వారు అప్పుడు ఏమయ్యారు, అంబులెన్స్ లు కూడా అనుమతి ఇవ్వక పోతే ఏమి చేసారు అంటూ, బొత్సా వ్యాఖ్యల పైన పరోక్షంగా స్పందించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సరైన సలహాలు ఇవ్వకే ఇలాంటి పరిస్థితి వచ్చిందని అన్నారు. ప్రభుత్వ పెద్దలు, అధికారులు సరైన సలహాలు ఇచ్చి, ప్రభుత్వాన్ని మంచి దారిలో నడిపించాలని హైకోర్ట్ పేర్కొంది. అయితే గత రెండు రోజులుగా హైదరాబాద్ రాజధాని అంటూ బొత్సా చేసిన వ్యాఖ్యల పై, హైకోర్టు పరోక్షంగా చురకలు అంటించింది.

Advertisements

Latest Articles

Most Read