ప్రధాని నరేంద్ర మోడీనే, లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తున్న చంద్రబాబుకి, ఒక పార్టీ ప్రెసిడెంట్ అయిన అమిత్ షా ఒక లెక్కా ? అబద్ధాలు ఆడుతూ, విష ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులకి, డాక్యుమెంట్ లు, వీడియోలుతో సహా చూపిస్తున్నా, బీజేపీ నాయకులకు ఒక్క ముక్క కూడా అర్ధం కావటం లేదు. చివరకు బీజేపీ ప్రెసిడెంట్ అమిత్ షా కూడా, అబద్ధాలు ఆడుతూ, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అమరావతి నిర్మాణానికి సంబధించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు UCలు ఇవ్వలేదని, మీడియా ముంది చూపించిన UCలు సెల్ఫ్ డిక్లేర్డ్ UCలు అని, అవి చెల్లవు అంటూ, అమిత్ షా అబద్ధాలు ప్రచారం చేసారు. ఢిల్లీలో, మోడీ నాలుగేళ్ల పరిపాలన పై ప్రెస్ మీట్ లో, విలేకరులు అడిగిన ప్రశ్నకు , ఇలా సమాధానం ఇచ్చారు. అయితే ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది.

amitshah 29052018 2

అమరావతికి అన్ని UCలు, ఇవ్వాల్సిన ఫార్మటులోనే ఇచ్చామని, 1500 కోట్లు కేంద్రం ఇస్తే, ఆ డబ్బులు మొత్తానికి పనులు చేసామని, వాటికి UC లు కూడా కేంద్రానికి ఇచ్చామని చెప్పారు. అయితే అమిత్ షా సెల్ఫ్ డిక్లేర్డ్ UCలు అని, అవి చెల్లవు అంటూ చెప్తున్న విషయం పై కూడా, డాక్యుమెంట్ లు చూపించి మరీ, అమిత్ షా ఆడిన అబద్ధాలు ఎండగట్టారు. ఈ UCలు అన్నీ నీతి అయోగ్ ఆమోదించిందని, దానికి సంబందించిన లెటర్ బయట పెట్టారు. నీతి అయోగ్ ఆ లెటర్ లో రాసిన ప్రకారం, ఈ UCలు అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయని సర్టిఫై చేసింది. అంతే కాదు, ఇప్పటికే నిధులు ఖర్చు పెట్టి, UCలు సక్రమంగా ఇచ్చారు కాబట్టి, అమరావతి ఇంకా నిధులు ఇవ్వాలని, నీతి అయోగ్ కేంద్రానికి నివేదించింది.

amitshah 29052018 3

ఇంత స్పష్టంగా డాక్యుమెంట్ లు ఉంటే, అమిత్ షా మాత్రం, అబద్ధాలు ఆడుతున్నారు. అయినా ఒక ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు, నీతి అయోగ్ సర్టిఫై చేస్తుంది కాని, అమిత్ షా అనే ఒక పార్టీ నాయకుడు సర్టిఫై చెయ్యాలా అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇదే విషయం పై మహానాడులో కూడా, తెలుగుదేశం ఎండగట్టింది. మంత్రి సుజయకృష్ణ అన్ని విషయాలు అక్కడ ఉన్న వారి ముందు ఉంచారు. యూసీలు ఇచ్చినా బీపీఆర్‌లు పంపినా కేంద్రం ఏమాత్రం స్పందించలేదని ఆయన స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం, నరేగ నిధులకు సంబంధించిన యూసీల వివరాలపై మంత్రి మహానాడులో ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రం పంపిన యూసీల వివరాలు అందినట్లు కేంద్రం పంపిన లేఖలు, నిధుల విడుదలపై నీతి అయోగ్ సిఫార్స్ లేఖలను ఆయన ప్రదర్శించారు. రాజధాని కోసం అన్ని కబుర్లు చెప్పిన కేంద్రం కేవలం రూ. 1500 కోట్లే ఇచ్చిందని మంత్రి తెలిపారు. మొత్తం 8 డాక్యుమెంట్లపై మంత్రి మహానాడులో ప్రదర్శించారు.

వైకాపా అధినేత జగన్‌కు తన తాత రాజారెడ్డి లక్షణాలే వచ్చాయని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. విజయవాడలో జరుగుతున్న మహానాడులో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎవరి మాట వినేవారుకాదని, ఆయనకు అన్నీ తన తాత రాజారెడ్డి బుద్ధులే వచ్చాయని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. విజయసాయి రెడ్డి ద్వారా రాయబారం పంపి తనను వైసీపీలోకి ఆహ్వానించారని, కానీ తనకు జగన్ దగ్గర ఊడిగం చేయడం నచ్చక వెళ్లలేదని జేసీ అన్నారు. టికెట్ ఇస్తాం.. వైసీపీలోకి రావాలని జగన్‌ కోరారని, పార్టీలోకి వస్తే ఎన్ని డబ్బులు ఇస్తావని విజయసాయిరెడ్డి అడిగారని.. తాను ఎందుకు మీకు కప్పం చెల్లించాలన్నానని ఎంపీ జేసీ ప్రశ్నించానని తెలిపారు.

jc diwkar 29052018 2

తనతో పెట్టుకుంటే జగన్‌ చరిత్ర మొత్తం బయటపెడతానంటూ.. 40 ఏళ్ల చరిత్రను జేసీ చెప్పుకొచ్చారు. జగన్‌లో రాజారెడ్డి క్రూరత్వం ఉందని ఆయన అన్నారు. స్కెచ్‌ వైఎస్‌ వేసేవారని, రాజారెడ్ది అమలు చేసేవారని జేసీ తెలిపారు. వైఎస్‌ను మంత్రిని చేసేందుకు రాజారెడ్డి చేయని పనులు లేవని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో జగన్‌ దగ్గర రూ. వెయ్యి కోట్ల హార్డ్‌ క్యాష్‌ ఉందని జేసీ పేర్కొన్నారు. ఎప్పుడూ చంపాలని, కొయ్యాలి, నరకాలని మాట్లాడతారని, వాళ్లు చేసిన పనుల వల్ల రెడ్లపై ప్రజల్లో అసహనం పెరిగిందని జేసీ వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం ఉన్న..అనంతపురం జిల్లా ఇప్పుడు కోనసీమగా మారిందని జేసీ సంతోషం వ్యక్తం చేశారు. కియా వచ్చాక అనంత జిల్లా రూపురేఖలు మారిపోయాయని, ఎవరికైనా అనుమానాలు ఉంటే అనంత జిల్లాకు వచ్చి చూడండని జేసీ ఆహ్వానించారు.

jc diwkar 29052018 3

బ్రహ్మసముద్రం ప్రాజెక్టు పూర్తయితే అనంత కోనసీమను మించిపోతుందని, అనంతపురంలో రైతులు ఎకరాకు లక్ష రూపాయిలు సంపాదిస్తున్నారని దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఎకరాకు నీళ్లు రావాలి.. ఏపీ సౌభ్యాగ్యంగా ఉండాలని, రాష్ట్రంలో యాచకులు ఉండొద్దని చంద్రబాబు ఆశపడతారని జేసీ పేర్కొన్నారు. జగన్‌ వస్తే రాష్ట్రానికి భవిష్యత్‌ ఉండదన్నారు. చంద్రబాబు పక్కన ఎవరు ఉన్నది... జగన్‌ పక్కన ఎవరు ఉన్నది ఒక్కసారి చూడాలని అన్నారు. జగన్‌ పక్కన పీకలు కోసే మంగళి కృష్ణ లాంటి వారు ఉన్నారని, చంద్రబాబు పక్కన ఉన్నవారు ఆయన మాట వింటారని, జగన్‌ పక్కన ఉన్నవారు ఆయన మాట వినరని జేసీ వ్యాఖ్యానించారు.

అవినీతి పోలీస్‌ డీఎస్పీ హరిప్రసాద్‌ ఇంట్లో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆయన భార్య పేరి ట ఉన్న ఆస్తుల పత్రాలు దొరకడానికి సంబంధించి ఏసీబీ చేపట్టిన విచారణకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, రెండో సారి కూడా డుమ్మా కొట్టారు.. ఇప్పటికే ఒకసారి విచారణకు డుమ్మా కొట్టిన ఆళ్ల, ఈసారి కూడా తన బదులు, ఏసీబీ ఎదుటకు, ఆళ్ల తరపు లాయర్లనే హాజరుపరిచారు. శస్త్ర చికిత్స కారణంగా ఎమ్మెల్యే ఆర్కే హాజరుకాలేకపోయారని ఏసీబీకి లాయర్లు వివరణ ఇచ్చారు. పోయిన మంగళవారం మొదటి సారి విచారణకు హాజరు కావాల్సి ఉంది.. అయితే, ఆళ్ల మంగళవారం గైర్హాజరయ్యారు. ‘మా క్లయింట్‌కు ఆరోగ్యం బాగలేదు.. ఆయన తరపున మేం వచ్చాం.. రెండు వారాలు గడువు కావాలి’ అని ఆయన తరపున న్యాయవాదులు ఏసీబీని కోరారు.

rk 29052018 2

‘రెండు వారాలు సాధ్యం కాదు.. ఒక వారం ఇస్తాం.. 29న తప్పనిసరిగా హాజరవ్వాలి’ అని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ రోజు కూడా లాయర్లు వచ్చి, మా క్లయింట్‌కు ఆరోగ్యం ఇంకా కుదుట పాడలేదు అని చెప్పారు. రాజధాని ప్రాంతంలో అత్యంత అవినీతిపరుడిగా ఆరోపణలున్న పోలీసు అధికారి దుర్గాప్రసాద్‌పై గతేడాది జనవరిలో ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఏసీబీకి ఫిర్యాదులు అందడంతో ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ సెంట్రల్‌ ఇన్వెస్టిగేటివ్‌ యూనిట్‌ (సీఐయూ)ను రంగంలోకి దించారు. దర్యాప్తులో భాగంగా తుళ్లూరు ప్రాంతంలో కొన్ని స్థిరాస్తులు ఇతరుల పేర్లతో ఉన్నట్లు బయటపడింది. ఆరా తీయగా డీఎస్పీ బినామీల్లో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భార్య ఉన్నట్లు తేలింది.

rk 29052018 3

ఎమ్మెల్యే భార్య పేరుతో ఉన్న ఆస్తుల పత్రాలు డీఎస్పీ ఇంట్లో లభించడంతో ఏసీబీ అధికారులు ఆయనకు నోటీసు ఇచ్చారు. ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్న అవినీతిపరులకు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు అండగా నిలుస్తున్నారని ఈ సంఘటనలు చూస్తే తెలుస్తుంది. క్రికెట్‌ బెట్టింగ్‌లతో జనాన్ని కొల్లగొడుతోన్న బుకీలకు నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అండగా నిలిచారని ఆ జిల్లా ఎస్పీ ఇచ్చిన నివేదిక ఇటీవల సంచలనం సృష్టించింది. నిన్న అనంతపురం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్న కుమారుడు కాంట్రాక్టరును డబ్బు కోసం కిడ్నాప్‌ చేయడం.. తాజాగా ఏసీబీ కేసు దర్యాప్తులో గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాత్ర వెలుగులోకి వచ్చాయి.

టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా రమణదీక్షితులు తరహాలో తయారయ్యామని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతా కలసి భజన చేయటం మినహా వాస్తవాలను సీఎం దృష్టికి తీసుకురాలేకపోతున్నారని స్పష్టం చేశారు. మహానాడు వేదిక పై మాట్లాడిన జేసీ పార్టీలో లోటుపాట్లను చంద్రబాబు ఎదుటే తూర్పారబట్టారు. జన్మభూమి కమిటీలు చాలా ఇబ్బందికరంగా మారాయని టీడీపీ అధినేతకు వివరించారు. దాదాపు గంటసేపు మహానాడు వేదికపై ప్రసంగించిన జేసీ.. వివిధ అంశాలపై ఆవేశపూరితంగా మాట్లాడారు. అదే సమయంలో ముఖ్యమంత్రి తన టెలికాన్ఫరెన్సులను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

jc 29052018 2

రాష్ట్రంలో ఏ ఉద్యోగితో మాట్లాడినా టెలికాన్ఫరెన్సులో ఉన్నామంటూ మాట్లాడుతున్నారని.. వారిక ప్రజలకు ఏం అందుబాటులో ఉంటారని హితవు పలికారు. చాలా మంది నేతలు మిమ్మల్ని పొగిడి పాడు చేస్తున్నారంటూ పరోక్షంగా చంద్రబాబుకు నేతలు చేస్తున్న వ్యవహరాలను వివరించే ప్రయత్నం చేశారు. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇక జాతీయ రాజకీయాల్లో ప్రధాన మంత్రిగా సేవలందించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. లోకేష్ ను ముఖ్యమంత్రిగా చేస్తే తప్పేమిటంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ను సోనియాగాంధీ ధ్వంసం చేశారని.. అదే తరహాలో బీజేపీ ని కూడా నరేంద్ర మోదీ స్వయంగా నాశనం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

jc 29052018 3

ఈ పరిస్థితుల్లో స్వయంగా చంద్రబాబే మోదీకి ఓటేయమని చెప్పినా ఏ ఒక్కరూ ఓటు వేయరని తేల్చి చెప్పారు. జగన్‌ తీరు పట్ల ఆయన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎంతగానో బాధపడేవారు. ఎవరి మాటా వినని తత్వం జగన్‌ది. వైకాపాలో చేరాలని నాకు జగన్‌ రాయబారం పంపాడు. నీకు ఎన్ని సీట్లు కావాలన్నా ఇస్తామని విజయసాయిరెడ్డి నా వద్దకు వచ్చారు. కానీ జగన్‌ సంగతి తెలిసిన నేను దాన్ని తిరస్కరించాను. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ భూస్థాపితం అయింది. చంద్రబాబుకు ఉన్నంత దూరదృష్టి మరెవరికీ లేదని అన్నారు. దేశం బాగుపడాలంటే చంద్రబాబు ప్రధానమంత్రి కావాలి. రాష్ట్రానికి ఇన్నాళ్లు ముఖ్యమంత్రిగా చేశారు... ఆయన సేవలు దేశానికి అవసరం. నరేంద్రమోదీ ప్రధానిగా ఉన్నంతవరకు ప్రత్యేక హోదా రాదు. ఈ విషయం నాలుగేళ్ల క్రితమే నేను చెప్పా. చంద్రబాబు దయతోనే ఏపీలో భాజపాకు కొన్ని సీట్లయినా వచ్చాయిని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read