చంద్రబాబు ఒక సీక్రెట్ సర్వే చేపిస్తున్నారు.. దీని కోసం గూఢచార శాఖ రంగంలోకి దిగింది.. ఒక పక్క ఐవీఆర్‌ఎస్‌ సర్వేలు జరుగుతూ ఉన్నా, స్వయంగా గ్రౌండ్ లెవెల్ సర్వే ఒకటి చేపిస్తున్నారు చంద్రబాబు. ప్రజల మూడ్ ఎలా ఉంది ? ప్రభుత్వం పై ఎలాంటి అబిప్రాయం ఉంది ? లోపాలు ఏంటి ? జగన్ వైపు ఎంత మంది వెళ్తున్నారు ? పవన్ ప్రభావం ఉంటుందా ? తదితర విషయాలను తెలుసుకుని పక్కా లెక్కకు వచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. బూత్‌ల వారీ కొందరిని ఎంపిక చేసి, వారి సెల్‌నెంబర్‌లను ఇచ్చి వారి నుంచే సర్వే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలని నిర్దేశించింది. దీంతో రంగంలోకి దిగిన గూఢచార శాఖ సిబ్బంది ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించారు. అందుకు అనుగుణంగా నియోకవర్గాల వారీ సంపూర్ణ నివేదికలు కూడా సిద్ధమవుతున్నాయి.

cbn 27052018 2

మొన్నటి దాక ఐవీఆర్‌ఎస్‌ సర్వేల్లో, పార్టీ వ్యవహారాలపై ఐవీఆర్‌ఎస్‌ సర్వేలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల వారీ గుర్తించిన పార్టీ నాయకులు, సీనియర్‌ కార్యకర్తల ద్వారా ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ శ్రేణుల అభిప్రాయాలను తెలుసుకునేందు కు ఇటీవల ఆయన సర్వేలు చేయించారు. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం పకడ్బందీగా ఒక సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడవుతోంది. ప్రజాభిప్రాయ సేకరణ సర్వేల, వారి ఎంపిక విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. అన్ని సామాజిక వర్గాలు, అన్ని వయస్సుల వారు అలాగే అన్ని రంగాలకు చెందిన వారు ఉండే విధంగా ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది. ఆ యా నియోజకవర్గాల వారీ పార్టీ ఎమ్మెల్యే, ఇన్‌చార్జి పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని స్పష్టంగా గమనించాలని సూచించినట్లు తెలిసింది. అలాగే ఆ నియోజకవర్గంలో ప్రత్యర్థి పక్షం పరిస్థితి, నాయకులపై ఉన్న అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

cbn 27052018 3

దీంతో గూఢచార శాఖ సిబ్బంది ఆయా నియోజకవర్గాల వారీ ప్రజల మొగ్గు టీడీపీకి ఏ స్థాయిలో ఉంది, వైసీపీకి ఎంత ఉంది? జనసేన ప్రభావం ఉండబోతుం దా? తదితర అంశాలను క్రోడీకరిస్తూ నివేదికలు తయారు చేస్తున్నట్లు తెలిసింది. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నివేదికలు ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. ఈ సర్వేని అత్యంత రహస్యంగా నిర్వహిస్తుండగా, వివిధ రూపాల్లో క్రమేపీ వ్యవహారం బయటకు పొక్కింది. టిడిపి నాయకుల దృష్టికి కూడా వెళ్లింది. దీంతో వారు అవ్వక్కయ్యారు. చంద్రబాబు ఎంతో పకడ్బందీగా సర్వే చేపిస్తున్నారని తెలుసుకుని, ఆ సర్వే సమాచారం తెలుసుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ సర్వేని బట్టే తరువాత ఎన్నికల్లో టికెట్లు తదితర అంశాలు ముడిపడి ఉండటంతో, ఈ సర్వే ఫలితాల పై అందరికీ ఆసక్తి నెలకొంది..

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా విభజించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. టీడీపీ మహానాడులో చంద్రబాబు ప్రారంభోన్యాసం చేశారు. పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. విభజన హామీలు నేరవేర్చమంటే, మన రాష్ట్రం పై ఇంత కుట్ర చేస్తున్నారని చెప్పారు. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆభరణాల అంశంలో కొనసాగుతున్న వివాదం వెనుక భాజపా కుట్ర ఉందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు భాజపా తెరవెనుకు కుట్ర పన్నుతోందన్నారు. తిరుమల ఆలయాన్ని పురావస్తు శాఖ ద్వారా స్వాధీనం చేసుకునేందుకు కేంద్రం ప్రయత్నించిందని... ప్రజా వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గి నాలుక కరుచుకుందని తెలిపారు. తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే ఎవరైనా మట్టి కరవాల్సిందేనని అన్నారు.

cbn 27052018 2

బీజేపీ ప్రభుత్వంలో మాటలు ఎక్కువ.. పనులు తక్కువ అని వ్యాఖ్యానించారు. మోదీ ప్రచార ప్రధానమంత్రి మాత్రమే అని ఎద్దేవా చేశారు. మోదీ పథకాలతో ఎవరైనా బాగుపడ్డారా అని ప్రశ్నించారు. నోట్ల రద్దుతో బ్యాంకింగ్‌ వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోనే నోట్ల రద్దుకు మద్దతు పలికామని, కానీ ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. బ్యాంకుల చుట్టూ తిరిగే దౌర్భాగ్యం దాపురించిందని చంద్రబాబు అన్నారు. జీఎస్టీతో సామాన్యుడిపై భారం పడిందన్నారు. ప్రధాని మోదీ చర్యలతో పాలన గాడి తప్పిందని విరుచుకుపడ్డారు.

cbn 27052018 3

దేశంలో బీజేపీ కలుషిత రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు చేస్తూ ఆడియో టేపుల ద్వారా అడ్డంగా దొరికిపోయారని విమర్శించారు. విలువల గురించి బీజేపీ చెప్పడం హాస్యాస్పదమన్నారు. తమిళనాడులో శశికళకు పట్టిన గతి పడుతుందని విపక్షనేతకు భయమని... అందుకే హోదా ఇవ్వాల్సిన కేంద్రాన్ని వదిలి టీడీపీపై విమర్శలు చేస్తున్నారని జగన్‌పై చంద్రబాబు విరుచుకుపడ్డారు. దిగజారి పోయి, తిరుమల పై కుట్రలు పన్నుతున్నారని, వెంకన్న జోలికి వస్తే ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారని హెచ్చరించారు. వెంకన్న స్వామితో పెట్టుకున్నవారు ఎవరూ బాగుపడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెదేపా రాజకీయ ప్రయోజనాలకే ఎన్డీయే నుండి వెళ్లిపోయిందంటూ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి యనమల రామ కృష్ణుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లా డుతూ ఎన్డీయే నుండి టిడిపి బయటకు రావడానికి కారణం రాజకీయ ప్రయోజ నాలకంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్య మని, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి నిరస నగానే ఎన్డీయేలోని భాగస్వామ్యాన్ని కాదనుకున్నామని ఆయన స్పష్టం చేశారు. తప్పు తమవైపు ఎక్కడ ఉంటుందో అని టిడిపిపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. విభజన అనం తరం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడానికి, రాష్ట్ర అభివృ ద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎన్డీయేలో భాగస్వామిగా చేరాం.

amitshah 27052018 2

ఈ విషయం ఎన్డీయే కూటమిలోని అన్ని పార్టీల నేతలకూ తెలి సిందేనని.. బిజెపి జాతీయ అధ్యక్షుడి హోదాలో మీకు తెలియ కపోయవడం ఏమిటని మంత్రి యనమల ఎద్దేవా చేశారు. నాలుగు సంవత్సరాలు రాష్ట్రానికి మొండి చెయ్యి చూపించి రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి ఏవిధమైన సహకారం అం దించకపోగా, టిడిపీని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టాలనే దురుద్దేశంతో బీజేపీ పనిచేసిందని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్లు రాజకీయాల నుండి రాష్ట్రా న్ని కాపాడటానికి రాష్ట్ర ప్రజలకు పోరాటం ద్వారా న్యాయం చెయ్యాలనే ఉద్దేశంతోనే ఎన్డీయే నుండి బయటకు వచ్చామని మంత్రి స్పష్టం చేశారు. చంద్రబాబు రాజకీయ చరిత్రతో పోలిస్తే అమిత్‌షా రాజకీయ చరిత్ర చాలా చిన్నది.. అమిత్‌షా మోడీ, రాజకీయాల్లో కి రానప్పుడే టీడీపీ నేషనల్‌ ఫ్రంట్‌ను స్థాపించి ఆరోజే కేంద్రంలో ఉన్న కాం గ్రెస్‌ను ఓడించి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత టీడీపీది, ముఖ్యమంత్రిదే అన్నా రు.

amitshah 27052018 3

అలాగే వాజ్‌పేయి ప్రభుత్వానికి టిడిపి వెన్నుదన్నుగా ఉన్న విషయం అమిత్‌షా గుర్తుంచుకోవాలని సూచించారు. వాజ్‌ పేయ్‌, ఎన్‌.కే.అద్వానీ ఉన్నప్పుడు నైతిక విలువలు పాటిం చారు, కానీ ఇప్పుడు మోడీ, అమిత్‌షాల జంట బీహార్‌, కర్ణా టక, గోవా, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో అనైతిక ఆలోచ నలతో రాజకీయ స్వార్థంతో పనిచేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఎన్డీయే నుండి బయటకు వచ్చిన వెంటనే దేశ రాజకీయాల్లో మార్పు రావడం, కర్ణాటక వేదికగా చేసుకొని ప్రాంతీయపార్టీలు ఒక్కటవ్వడంతో బీజేపీ పార్టీ వెన్నులో వణుకు ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. మోడీ పరిపాలన బలహీన వర్గాలవారికి రైతాంగానికి ఉపయోగంగా లేవు. ఏటియంల్లో వంద రూపా యలు దొరకని పరిస్థితి మోడీ ప్రభుత్వమే కారణమన్నారు. మోడీ పాలనలో ఆర్థిక వ్యవహారాలు ఛిన్నాభిన్నం అవ్వడమే కాకుండా ఆర్థికాభివృద్ధి పడిపోయిం దని గుర్తుచేశారు. అందుకే ఈ మధ్య వస్తున్న సర్వేల్లో మోడి రేటు విపరీతంగా పడి పోయిందని, ప్రజల్లో బీజేపీపై తీవ్రమైన వ్యతిరేకత ఉండటం వల్ల కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం కల్ల అన్నారు. ఎన్డీయేలో భాగమైన శివసేన పార్టీని బీజేపీ ఇబ్బందులు పెట్టిన సంగతిని దేశ ప్రజలు మర్చిపోరన్నారు.

గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామరావు నేతృత్వంలో 1986లో విజయవాడ వేదికగా నేషనల్ ఫ్రంట్ అంకురార్పణ జరిగిన నేపథ్యంలో, మరోసారి ఇదే వేదికగా జరుగుతున్న మహానాడు ప్రాధాన్యత సంతరించుకుంది. అన్ని ప్రాంతీయ పార్టీలను, జాతీయ రాజకీయ పార్టీలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఆనాడు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన తెలుగుదేశం, మరోసారి ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ వేదిక ఒక కొత్త ఫ్రంట్ కు అంకుర్పారణ కానుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్లకు ప్రత్యామన్యాయంగా మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే యోచనలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఉన్నారు. తాజాగా జరిగిన తెలంగాణ మహానాడులో జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ప్రకటన సరికొత్త చర్చకు దారితీయడమే కాకుండా, జాతీయ రాజకీయాలపై ఒక స్పష్టత వచ్చింది.

cbn 27052018 2

గతంలో విజయవాడ నుంచి జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ చక్రం తిప్పగా, ఆదే స్పూర్తితో చంద్రబాబునాయడు మరోసారి జాతీయ రాజకీయాల్లో తనదైన శైలిలో కీలక పాత్రపోషించడానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. గతంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి వాజీపేయి, దేవగౌడలను ప్రధాన మంత్రులు చేసిన అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు, మరోసారి తన సత్తాను చాటుకునే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కేంద్రంలో బీజీపీ మరోసారి అధికారంలోకి రాకుండా చూసేందుకు దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. భాజపాను ఏకాకిని చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశకు అండగా నిలుస్తారనే భావంతో భాజపాతో జతకట్టిన చంద్రబాబుకు చివరకు ఆశభంగమే ఎదురైంది.

cbn 27052018 3

విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల అమలు విషయంలో తాత్సారం చేయడంతో పాటు, రాష్ట్రానికి రావాల్సిన న్యాయబద్దమైన నిధుల విడుదలలో కూడా కేంద్ర మొండి వైఖరి వ్యవహరిస్తుందంటూ ఇప్పటికే బిజెపి ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. నాలుగేళ్లగా విభజన చట్టంలో పొందుపరిచన అంశాలను అమలు చేయాలని కోరుతూ 20 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా ప్రధాని మోడీ పెడచెవిన పెట్టారు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి బాసటగా నిలుస్తామని చెప్పి, మోసం చేయడమే కాకుండా తెదేపా పై ఎదురుదాడికి తెగబడటంతో ఎన్డీఏ నుంచి బయటకు రావడమే కాకుండా, మిత్రబంధాన్ని సైతం వదులుకున్నారు. ఆనాటి నుంచి రాష్ట్రాల హక్కులు, నిధుల విషయంలో స్వరాన్ని పెంచడంతో పాటు కేంద్రం పై విమర్శనాస్త్రాలను సంధిస్తువస్తున్నారు.

అయితే నాలుగేళ్లు గడిచిన మిత్ర ధర్మం పాటించని భాజపాపై తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో రాష్ట్రంలో ధర్మపోరాట దీక్షలు చేపట్టడంతో పాటు సభలు నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ వస్తున్నారు. మరోవైపు తాజాగా జరిగిన కర్నాటక ఎన్నికల్లో సైతం అక్కడ సిరపడిన తెలుగువారిని బీజేపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చి, జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీశారు. అక్కడి తెలుగువారు కూడా సానుకూలంగా స్పందించి బీజేపీ అభ్యర్థులను మట్టికరిపించి ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయం పై తమ నిరసనను వ్యక్తం చేశారు. దీంతో అన్ని ప్రాంతీయ పార్టీల దృష్టి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పై పడింది. దీనిని ఒక అవకాశంగా భావించిన చంద్రబాబు వారందరిని ఒకే వేదిక పై తీసుకువచ్చే పనిలో నిమగ్నమయ్యారు. కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి,తృణముల్ పార్టీ అధినేత మమతబేనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్తో ఈ దిశగా చర్చలు కూడా జరిపారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న మహానాడులో జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరించాల్సిన తీరు పై సవివరంగా చర్చించనున్నారు. దీనికి సంబంధించి పార్టీ భవిష్యత్ కార్యాచరణను చంద్రబాబునాయుడు ఆ మహానాడు వేదికగా ప్రకటించనున్నారు. దీంతో జాతీయ రాజకీయాల్లో మరోసారి తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించనున్నదనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది.

Advertisements

Latest Articles

Most Read