దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. అయితే ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. వందకుపైగా సీట్లతో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీకి దగ్గరలో నిలిచిపోయింది. ఇక అధికార కాంగ్రెస్‌ 70కిపైగా సీట్లతో రెండోస్థానంలో ఉంది. హంగ్‌ దిశగా సాగుతున్న కన్నడ రాజకీయాల్లో 35కుపైగా సీట్లతో జేడీఎస్‌ కింగ్‌ మేకర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో జేడీఎస్‌కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ప్రస్తుతం కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారిన పరిస్థితుల్లో ఆ రాష్ట్ర గవర్నర్‌పైనే అందరి దృష్టి ఉంది. గవర్నర్‌ వాజుభాయి వాలా నిర్ణయం కీలకం కానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీని ఆహ్వానిస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

amitshah 1502018 2

గుజరాత్‌ మాజీ భాజపా నేత అయిన వాజుభాయి వాలా ‌ 2002లో నరేంద్ర మోదీ కోసం తన నియోజకవర్గాన్ని వదులుకున్నారు. అనంతరం గుజరాత్‌లో మోదీ ప్రభుత్వంలో వాజుభాయి ఆర్థిక శాఖమంత్రిగా బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ఈ నేపధ్యంలో అమిత్ షా తన యాక్షన్ ప్లాన్‌ను మొదలుపెట్టారు. ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక బీజేపీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన కేంద్ర మంత్రి ప్రకాష్‌జవదేకర్‌తో అమిత్ షా సమావేశమయ్యారు. అంతేకాదు, జేడీ(ఎస్) తరపున గెలిచిన 10మంది ఎమ్మెల్యేలతో అమిత్ షా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. అంతేకాదు, ప్రకాష్ జవదేకర్, ధర్మేంద్ర ప్రధాన్, జేపీ నడ్డాలను బెంగళూరుకు పంపించి.. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అన్ని అవకాశాలపై ఎప్పటికప్పుడు సంప్రదించాల్సిందిగా అమిత్ షా ఆదేశించారు.

amitshah 1502018 3

అయితే కాంగ్రెస్, జేడీఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇరు పార్టీల నేతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే గవర్నర్ అపాయింట్‌మెంట్ దొరక్క పోవడంతో దీనిపై క్లారిటీ రాలేదు. కాగా ప్రభుత్వ ఏర్పాటు గురించి రాష్ట్ర గవర్నర్‌ను కాంగ్రెస్ పార్టీ అపాయింట్‌మెంట్ కోరగా చుక్కెదురైంది. ఆ వెంటనే బీజేపీ నేతలు గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరడంతో రాజకీయ సమీకరనలు మారనున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని గత ఎన్నికల పరిణామాలే చెబుతున్నాయి. అయితే సీఎం పదవి జేడీఎస్‌కేనని ప్రకటించిన కాంగ్రెస్‌కు కలిసి వస్తుందా లేదా చూడాలి.

కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. కన్నడ ఓటర్లు ఏ రాజకీయ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడంతో ఎన్నికల ఫలితాలు హంగ్‌ దిశగా పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కన్నడ రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. ఇప్పటివరకూ విడుదలైన ఫలితాల ప్రకారం భాజపా అతి పెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ రెండో స్థానంలో ఉంది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్‌ పాత్ర అత్యంత కీలకంగా మారనుంది. సాధారణ మెజార్టీకి కొద్ది స్థానాల దూరంలోనే భాజపా నిలిచిపోయిన నేపథ్యంలో కర్ణాటకలో ఏ పార్టీ అధికారం చేపడుతుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

devagowada 15052018 2

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. జేడీఎస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు జేడీఎస్‌ అగ్రనేతలతో మంతనాలు జరిపింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఇరు పార్టీల నేతలు ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి కోరనున్నారు. గవర్నర్‌ నిర్ణయమే కీలకంగా మారనుంది. జేడీఎస్‌ నేత కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్‌ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. జేడీఎస్‌కు బయటి నుంచి మద్దతిచ్చే దిశగా కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో జేడీఎస్ అధ్యక్షుడు దేవగౌడతో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఫోన్లో మాట్లాడినట్లుగా తెలియవచ్చింది.

devagowada 15052018 3

ఈ నేపధ్యంలో రెండు పార్టీల నేతలు గవర్నర్‌ను కలిసేందుకు వెళ్ళగా, గవర్నర్ అపాయింట్‌మెంట్ దక్కలేదని తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రతినిథి వర్గం గవర్నర్‌ విజుభాయ్ వాలాను కలిసేందుకు ప్రయత్నించింది. జీ పరమేశ్వర నేతృత్వంలోని ఈ బృందానికి గవర్నర్ అనుమతి ఇవ్వలేనట్లు తెలుస్తోంది. దీంతో ఈ బృందం తిరిగి వెనుకకు వచ్చేసినట్లు సమాచారం. మరో పక్క, ఇప్పటికీ బీజేపీ, అధికారంలోకి వచ్చేది మేమే అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పటం, ఆశ్చర్యం కలిగిస్తుంది.. మరే బీజేపీ నేతలు, కాంగ్రెస్ నుంచి చీలుస్తారా, జేడీఎస్ నుంచి చీలుస్తారా అనేది చూడాల్సి ఉంది... మొత్తానికి, ఈ ఎపిసోడ్ అయ్యేదాకా, గవర్నర్ కీలకం కానున్నారు.. కొంత మంది గవర్నర్లు లాగా కేంద్రం చెప్పినట్టు ఆడతారా, స్వతంత్రంగా పని చేస్తారా అనేది చూడాలి..

ప్రత్యేక హోదా, లోటు భర్తీ, పోలవరం నిర్మాణం, రైల్వే జోన్ ఏర్పాటు, గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ-పెట్రో కెమికల్ కాంప్లెక్స్, అమరావతి నిర్మాణం, జాతీయ విద్యాసంస్థల ఏర్పాటు, దుగరాజుపట్నం పోర్టు, శాసనసభ సీట్ల పెంపు, కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖపట్నం-విజయవాడల్లో మెట్రో రైలు, అమరావతికి రైలు-రహదారి అనుసంధానం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సాయం, పొరుగు రాష్ట్రం నుంచి విద్యుత్ బకాయిల వసూళ్లు, షెడ్యూల్ సంస్థల విభజన, గ్రేహౌండ్ సెంటర్ ఏర్పాటు ఇలా ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014’లో పేర్కొన్న 18 అంశాలపై, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, మన రాష్ట్రాన్ని మోసం చేసింది.

bjp vicotry 15052018 2

పైగా మాకు న్యాయం చెయ్యండి అంటే, మీకు లక్ష కోట్లు ఇచ్చేసాం అని, మీరు UC లు ఇవ్వలేదు అని, మీరు మయసభ కట్టుకుంటారా అని, మీకు మా కేంద్రమే దిక్కు అని, ఇలా ఎన్నో చేసారు.. చివరకు, ఫిబ్రవరి 9న వెనుకబడిన ప్రాంతాలకి, కేంద్రం 350 కోట్లు ఇచ్చింది... ఇది తెలుసుకున్న ప్రధాని కార్యాలయం, ఫిబ్రవరి 15న RBIతో చెప్పి, వేసిన డబ్బులు వెనక్కు తీసుకున్నారు... ఇది నిజంగా ఎంత దౌర్భాగ్యం తెలియచేసే సంఘటన... డబ్బులు మన ఎకౌంటు లో వేసి, ప్రధాని వద్దు అన్నారని మళ్ళీ వెనక్కు తీసేసుకున్నారు అంటే, వీరు ఎలాంటి వారో అర్ధమవుతుంది... వీరి కక్ష ఇలా ఉంటుంది...

bjp vicotry 15052018 3

ఇలాంటి పనుల వల్ల కడుపు మండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, వీళ్ళు చేస్తున్న అరాచాకం చూసి, కర్ణాటక ఎన్నికల్లో, మనకు ద్రోహం చేసిన వారిని ఓడించండి అని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.. కాని, కారణం ఏదైనా అక్కడ బీజేపీ గెలిచింది. ఇదే కర్ణాటకకు వెళ్లి, కెసిఆర్ కూడా, జేడీఎస్ కు వోట్ వెయ్యండి అని పిలుపు ఇచ్చి వచ్చడు... కాని, ఇక్కడ వైసిపీ, జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, చంద్రబాబును తిడుతూ, బీజేపీ గెలుపుతో సంబరాలు చేసుకుంటున్నారు... మన రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీని ఓడించమన్న చంద్రబాబుని ఎగతాళి చేస్తూ, అదే పిలుపు ఇచ్చిన కెసిఆర్ ను మాత్రం ఒక్క మాట కూడా అనటం లేదు.. రేపు చంద్రబాబు, ఏదన్నా ఉగ్రావాద సంస్థను బ్యాన్ చెయ్యమని పిలుపు ఇచ్చి, అదే ఉగ్రవాద సంస్థ మారణ హోమం సృష్టిస్తే, చంద్రబాబుకు తగిన శాస్తి జరిగింది అంటారేమో, ఈ వైసిపీ, జనసేన అభిమానులు... చంద్రబాబు మీద ఉన్న కోపంతో, రాష్ట్ర నాశనం కోరుకో మాకండి రా అయ్యా.. దమ్ము ఉంటే మోడీతో పోరాడి, రాష్ట్రానికి రావల్సినివి సాధించండి...

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. క్లియర్ మెజారిటీ వస్తుంది అనుకున్న బీజేపీకి సీట్లు తగ్గటంతో, రసపట్టులో పడింది. మ్యాజిక్ ఫిగర్ కు బీజేపీ దూరం అవుతుండగా, ఆ స్థానాలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. అరగంట క్రితం 117 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న బీజేపీ నుంచి ఇప్పుడు మూడు స్థానాలు కాంగ్రెస్ ఆధిక్యతలోకి, ఒక స్థానం జేడీఎస్ ఆధిక్యతలోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం బీజేపీ 106 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ ఆధిక్యత 74 స్థానాలకు పెరిగింది. జేడీఎస్ 40, ఇతరులు రెండు చోట్ల ముందంజలో ఉన్నారు.

karatnaka 15052018

మ్యాజిక్ ఫిగర్ అయిన 112 స్థానాలకు ఏ పార్టీ చేరుకోకపోతే, కన్నడ రాజకీయం మరింత రసకందాయంలో పడుతుంది. బీజేపీకి ఎక్కువ స్థానాల్లో ఆధిక్యత వచ్చినప్పటికీ... కాంగ్రెస్ తో పోల్చితే ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం మాత్రం తక్కువే. కాంగ్రెస్ కు 38.1 శాతం ఓట్లు వస్తే, బీజేపీకి కేవలం 36.7 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. కాంగ్రెస్ పై బీజేపీ గెలిచిన స్థానాల్లో ఆ పార్టీ స్వల్ప మెజార్టీని మాత్రమే సాధించడం దీనికి కారణం. మరోవైపు, బీజేపీపై కాంగ్రెస్ గెల్చిన స్థానాల్లో మార్జిన్ ఎక్కువగా ఉంది.

karatnaka 15052018

ఈ నేపథ్యంలో, రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. ఈ తరుణంలో బెంగళూరులో జేడీఎస్, కాంగ్రెస్ నేతలు సమావేశం అయ్యారు. ఎన్నికల ఫలితాలపై వారు చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని జేడీఎస్ కు కాంగ్రెస్ నేతలు స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నేపధ్యంలో, కాంగ్రెస్, జేడీఎస్ కలిసి గవర్నర్ దగ్గరకి వెళ్లి, ప్రభుత్వం ఏర్పాటుకు పిలవవలిసిందిగా కోరనున్నాయి... మరో పక్క, బీజేపీ ఈ పరిణామం పై స్పందించింది.. దీనికి విరుగుడు ఉందని, మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా, మేమే ప్రభుత్వం ఫార్మ్ చేస్తాం అంటున్నాయి...

Advertisements

Latest Articles

Most Read