రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా మరో వినూత్న పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వ్యవసాయాన్ని లాభదాయకం చేసేందుకు గ్రిడ్ అనుసంధానిత సౌర పంపుసెట్లు అందించడంతోపాటు ఆదాయాన్ని సమకూర్చే సౌర సిరి పథకాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమయ్యింది. ఈ సౌర పంపుసెట్లతో రైతులు పంటల సాగుకు ఉచితంగా విద్యుత్‌ను వాడుకోవచ్చు. అంతేగాకుండా మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా ఏడాదికి 5 నుంచి 10 వేల రూపాయలు సమకూర్చుకోవచ్చు. రైతులు ఏడాదిలో 200 రోజులు సౌర పంపుసెట్లను వినియోగించుకున్నా... మిగిలిన 165 రోజులూ గ్రిడ్‌కు విద్యుత్‌ను విక్రయించుకోవచ్చు. ఈ పథకాన్ని తొలుత పైలట్ ప్రాజెక్టుగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఒక్కో పంపుసెట్‌కు రూ.3.5 లక్షల చొప్పున రూ.2625 కోట్లతో 75 వేల సౌర పంపుసెట్లను అందజేయాలని భావిస్తోంది. ప్రపంచబ్యాంకు, పీఎఫ్సీ, ఐఆర్‌ఈడీఏ, నాబార్డు వంటి సంస్థల సహకారంతో ఈ ప్రాజెక్టులో డిస్కంలు ప్రాథమికంగా పెట్టుబడి పెట్టనున్నాయి. ఈ పథకం అమలుపై రియల్‌టైం గవర్నెన్స్ ద్వారా సౌర పంపుసెట్లు, ఇంధన సామర్థ్య పంపుసెట్లు అందుకున్న 25 వేల మంది రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు . ఈ పంపుసెట్లు ఇంధన వినియోగాన్ని 30 శాతం తగ్గించడంతోపాటు 15 శాతం ఎక్కువగా నీటిని తోడుతాయని తెలిపారు. తద్వారా 45 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవడంతో ఏటా రూ.20 కోట్ల మేరకు లబ్ధి కలుగుతుందని అంచనా వేశారు.
కొత్త పథకం వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవం వస్తుంది . . కరువు పరిస్థితుల్లో సౌర విద్యుత్‌ను పూర్తిగా విద్యుత్ సంస్థలకు విక్రయించడం ద్వారా రైతులకు ఏడాదికి 12 నుంచి 15 వేల రూపాయల ఆదాయం సమకూరేలా !! దీనివల్ల విద్యుత్ సంస్థలకు పంపిణీ, సరఫరా నష్టాలు తగ్గి రూ.300 కోట్లు ఆదా అవుతుంది !! రాష్ట్రంలో ఇప్పటికే 9.62 లక్షల హెచ్‌వీడీఎస్ పంపు సెట్లను రైతులకు సమకూర్చారు , ఫలితంగా మోటార్లు కాలిపోవడం, పంపిణీ నష్టాలు కూడా తగ్గాయి . ఉచిత విద్యుత్ రూపంలో ప్రభుత్వం ఏటా ఒక్కో రైతుపై రూ.30 వేలు వెచ్చిస్తోంది . ఈ నేపథ్యంలో పంపుల తయారీదారులు, డిస్కంలు, బీమా కంపెనీలు, సౌర పంపుసెట్ల డెవలపర్లు తదితర అన్ని వర్గాల ప్రతినిధులతో ఈ నెల 22న సమావేశంఅవుతారు!!