ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ముసలం చోటుచేసుకుంది. కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించడంతో సోము వీర్రాజు అలక పాన్పు ఎక్కారు. దీంతో ఇవాళ ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్నా, ఎవరికీ అందుబాటులోకి రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడటానికి ప్రయత్నం చేసినా, వీర్రాజు అందుబాటులో లేడనే సమాచారం వచ్చింది. మరోవైపు సాయంకాలం వరకూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పిన సోమువీర్రాజు వర్గం రాత్రి 8 గంటల సమయంలో తమ పదవులకు రాజీనామాలు చేసింది. సోము వీర్రాజుకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వనందుకు నిరసనగానే రాజీనామాలు చేసి వాటిని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు, ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌కు పంపినట్టు తెలిపారు.
అయితే మొదట నుంచీ పార్టీలో ఉన్న తనను కాదని రాష్ట్ర విభజన తర్వాత పార్టీలో చేరిన కన్నాకు పదవి ఇవ్వడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు వర్గీయుల సమాచారం. అవసరం అయితే కొత్త పార్టీ కూడా పెడతానని వీర్రాజు అంటున్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు. అవసరం ఉన్నా, లేకపోయినా, మొదటి నుంచి చంద్రబాబుని అమ్మనా బూతులు తిడుతూ వచ్చానని, అనవసరంగా అటు చంద్రబాబుకి చెడు అయ్యాను, ఇటు బీజేపీకి అక్కరలేకుండా పోయాను అని వీర్రాజు బాధ పడుతున్నారని ఆయాన అనుచరులు అంటున్నారు. నేను కన్నా లక్ష్మీనారాయణ పాటి చేయ్యానా అంటూ బాధ పడుతున్నారు అంట..
మరో వైపు శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించకపోతే తాము బీజేపీకి రాజీనామా చేస్తామని తూర్పు, గోదావరి జిల్లాలకు చెందిన పలువురు నేతలు ప్రకటించారు. ఇప్పటికే రాజమండ్రి అర్బన్ బీజేపీ అధ్యక్షుడు బొమ్ముల దత్తు రాజీనామా చేయగా ఆయన బాటలో బీజేపీ రాజమండ్రి అర్భన్ కార్యవర్గం ఉన్నట్లు సమాచారం. అలాగే ఉభయగోదావరి జిల్లాలకు చెందిన పలువురు బీజేపీ నేతలు కూడా సోము వీర్రాజును పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించకపోతే రాజీనామా చేస్తామని ప్రకటించారు. అయితే, ఈ విషయం పై ఢిల్లీ పెద్దలు ఆందోళన చెందుతున్నారని తెలుస్తుంది. మన పార్టీకి ఏపిలో ఉన్నదే, ఒక 10 మంది నాయకులు, వాళ్ళు కూడా రాజీనామా చేసి పొతే, చంద్రబాబుకి చుక్కలు ఎలా చూపించాలి అని ఆలోచనలో పడ్డారని తెలుస్తుంది. మరి వీర్రాజు లైన్ లోకి రాగానే, అమిత్ షా ఎలా సముదాయిస్తారో చూడాలి...