తిరుమల సహా, మిగతా ఆలయాలును పురావస్తుశాఖ ద్వారా, కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంటాయని వచ్చిన వార్తల నేపధ్యంలో, రాష్ట్రంలో ఒకేసారి అలజడి రేగింది.. ఈ ఉత్తర్వులు చూసి అందరూ ఆశ్చర్యపోయారు.. మోడీ, మన రాష్ట్రం పై ఇలా కక్ష తీర్చుకుంటున్నారని, ఇది చాలా తప్పని, వెంకన్నతో పెట్టుకోవద్దు అని, అలా పెట్టుకున్న వాళ్ళు ఏమైయ్యారో తెలుసుకోవాలని, ప్రజలు శాపనార్ధాలు పెట్టారు... ఈ ఉత్తర్వులు వచ్చిన అరగంటలోనే వెంకన్న తన పవర్ చూపించారు.. కేవలం అరగంటలో, కేంద్రం వెనక్కు తగ్గింది.. సమాచార లోపంతో ఉత్తర్వులు జారీ చేశామని.. ఈవో సింఘాల్ కు వివరణ ఇచ్చిన పురావస్తు శాఖ. ఆ వెంటనే ఆ ఆదేశాలు వెనక్కు తీసుకుంటున్నామని, మరో ఉత్తరం పంపించింది..

ttd 05052018

"With reference to the above cited subject, this is to inform you that the letter issued inadvertently has been withdrawn and hence may be treated as cacnelled" ఇది ఆ లెటర్ సారంశం... మరో పక్క ఈ విషయం రాగానే, తిరుమలలోని ఆలయాలను పురావస్తుశాఖకు అప్పగించాలనే ఆలోచన టీటీడీకి లేదని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. అసలు ఇలాంటి ఉత్తర్వులు ఏంటి అని, గట్టిగా పురావస్తు శాఖ అధికారులని అడిగారు.. దీంతో, ఈ లేఖ రాష్ట్రం పెను ప్రకంపనలు రేపటం, ప్రజల్లో తీవ్ర ఆగ్రహం రావటంతో, వెనక్కు తాగ్గుతున్నట్టు మరో లెటర్ రాసారు.

ttd 05052018

అయితే ఒక్కసారి ఈ ఆలోచన వస్తే, ఎప్పటికైనా కేంద్రం ఈ విషయం పై మళ్ళీ రాష్ట్రం మీదకు వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం, టిటిడి ఎట్టి పరిస్థితిలోను, కేంద్రానికి ఆ అవకాసం ఇవ్వ కూడదు అని అంటున్నారు.. ప్రస్తుతం ప్రజా ఆగ్రహం చూసి వెనక్కు తగ్గారని, తిరుపతి పై వీరు కన్ను పడింది అని, జాగ్రత్తగా ఉండాలని, స్వామీజీలు కూడా అంటున్నారు. అయినా వారు రాసిన ఉత్తరంలో చాలా స్పష్టంగా కుట్ర దాగి ఉంటే, మళ్ళీ సమాచార లోపం అని చెప్పటం సిగ్గు చేటు అని అంటున్నారు... ఇది రాష్ట్రాన్ని కబళించే కుట్రలో ఒక భాగం అని, ఇలాంటి పరిస్థితులు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యాలని అంటున్నారు.. అయినా వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా, వెంకన్నకు ఏమి చెయ్యాలో తెలియదా ? ఆయనే చూసుకుంటాడు..

కలియుగ వైకుంఠం, తిరుమల శ్రీవారి సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా హామీ ఇచ్చి మాట తప్పారు. ఇప్పుడు శ్రీవారి ఆలయన్నే తమ ఆధీనంలోకి తీసుకుందామని అనుకుంటున్నారు. దీనికి బీజం వేసింది, మన స్వామి వారి మనకు కాకుండా చేసే ప్రయత్నం చేసింది, అప్పటి టిటిడి ఈఓ, ఐవైఆర్ కృష్ణా రావు... అవును, ఇప్పుడు రాష్ట్రం పై అనేక కుట్రలు, అమరావతి పై విషం చిమ్ముతున్న, ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణా రావు... పవన్, జగన్, నెత్తిన పెట్టుకున్న ఐవైఆర్ కృష్ణా రావు... ఇదే ఐవైఆర్ కృష్ణా రావు, 2011లో, కేంద్ర పురావస్తుశాఖ వారికి ఉత్తరాలు రాసి, తిరుపతిని తీసుకోవాలని ప్రతిపాదించారు.. రాష్ట్రానికి తిరుమల అవసరం లేదని, కేంద్రం ఆధీనంలో ఉంచుకోవాలని, ప్రతిపాదించారు.. అయితే, అప్పటిలో టిటిడి బోర్డ్ ఆ ప్రతిపాదన ఉపసంహరించుకున్నది.

iyr 05052018 1

ఇప్పుడు ఈ మతోన్మాదులు సొంత, మతం వారిని కూడా వదలకుండా ఇలాంటి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఐవైఆర్ లాంటి వారి అప్పటి మాటలు నమ్మి, కేంద్రం తిరుమలను తమ ఆధీనంలోకి తీసుకొంటానికి పన్నాగం పన్నింది.. ఆలయాలన్నింటినీ రక్షిత కట్టడాల పరిధిలో చేర్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. పురావస్తుశాఖ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేస్తోంది. ఆయా దేవాలయాలను సందర్శించి ఫొటోలు తీసుకునేందుకు.. కేంద్ర పురావస్తు శాఖ అధికారులకు సహకరించాలని రాష్ట్రానికి కేంద్రం లేఖ పంపింది... తిరుమలను కేంద్ర పరిధిలోకి తీసుకోవటానికి ఇది మొదటి అడుగు.

iyr 05052018 1

త్వరలో పురావస్తు శాఖ అధికారులు తిరుమలను సందర్శించనున్నారు. టీటీడీ నుంచి జాబితా అందిన తర్వాత కేంద్ర అధికారులు సందర్శించే అవకాశం ఉంది. ఈ తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తిరుమలలోని ఆలయాలను కేంద్ర పురావస్తు శాఖ స్వాధీనం చేసుకుంటే ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదు. ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని కేంద్రం తీసుకునే అవకాశం ఉంది. టీటీడీ బోర్డు మెంబర్లను నామినేట్ చేసే అధికారం కూడా రాష్ట్రానికి లేకుండా పోతుంది. అంటే టీటీడీ మొత్తం కేంద్ర చేతుల్లోకి పోతుంది. ఇది ఐవైఆర్ అప్పుడు నాటిన బీజం, ఇప్పుడు కేంద్రానికి ఆయుధం అయ్యింది... ఇలాంటి ఐవైఆర్ ను నెత్తిన పెట్టుకుంటున్న పవన్, జగన్, ఒకసారి ఆలోచించాలి... ఇది అప్పట్లో టైమ్స్ అఫ్ ఇండియా లో కూడా వచ్చిన కధనం https://timesofindia.indiatimes.com/india/Involving-ASI-for-shrines-upkeep-only-TTD/articleshow/7429330.cms

తిరుమలలోని దేవాలయాలన్నింటినీ కబ్జా చేయడానికి కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. తిరుమలలో టిటిడి పరిధిలో ఉన్న ఆలయాలన్నింటినీ పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకోవాలని కేంద్రం యోచిస్తున్నది. తిరుమలలో ఉన్న ఆలయాలను, వాటి చరిత్రను పరిశీలించిన కేంద్ర పురావస్తు శాఖ వాటిని పూర్వకాలంలో నిర్మించినవిగా గుర్తించింది. తిరుమలలోని ఆలయాలు, భవనాల వివరాలు అందించాలని పురావస్తు శాఖ టిటిడికి లేఖ రాసింది. ఢిల్లి కేంద్ర కార్యాలయం ఆదేశాలతో రాష్ట్ర పురావస్తు శాఖకు సమాచారం ఇచ్చారు. తిరుమలలో పురాతన కట్టడాలకు రక్షణ కరువైందని, పురాతన కట్టడాలు తొలగించి, కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని పలు ఫిర్యాదులు వచ్చినట్లు కేంద్ర పురావస్తు శాఖ, ఒక సాకుగా చూపించి, ఈ కుట్రకు తెర లేపింది.

tiruamal 05052018 2

కేంద్ర పురావస్తు శాఖ అధికారులు తిరుమలను సందర్శించనున్నారు. టిటిడినుంచి కట్టడాల జాబితా అందిన తరువాత అధికారులు తిరుమలను సందర్శించే అవకాశం ఉంది. పరిశీలన అనంతరం దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తిరుమలలోని ఆలయాలను కేంద్ర పురావస్తు శాఖ స్వాధీనం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఆ ఆలయాలపై ఎలాంటి అధికారం ఉండదు. ఆలయాలకు వచ్చే ఆదాయాన్ని కేంద్రం తీసుకునే అవకాశముంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్లను నామినేట్‌ చేసే అధికారం కూడా రాష్ట్రానికి లేకుండా పోతుంది. ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ లోని, స్వామిజీలు మండిపడుతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం పై కక్ష సాధింపుగా భావిస్తున్నారు..

tiruamal 05052018 3

మా తిరుపతి పై నీ పెత్తనం ఏమిటి మోడి అంటూ ఆందోళనకు సిద్దమవుతున్నారు.. తీవ్ర పర్యవసానాలు వుంటాయని ప్రజలు హెచ్చరిక చేస్తున్నారు... మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయాం.. మద్రాసు పోయినా తిరుమల ఉందని సంతోషించాం.హైదరాబాద్ పోయింది.తిరుమల ఉందని ఊపిరి నిలుపుకున్నాము.తిరుమల జోలికి రావద్దు. తిరుమల మాదే, ఏడుకొండలు మావే ! వెంకటేశ్వరుడు మా దేవుడే !! ఇందులో ఎలాంటి డౌటు లేదు. అనవసర ప్రయాసలు మానుకోండి!! అసలే ఆంధ్రులు అసంతృప్తి చూసి వెంకన్న ఆగ్రహంతో ఉన్నాడు. పొరపాటు జరిగిందో ఇక మీకు శంకరిగిరి మాన్యాలే గతి !!

చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం దాకా, అవినీతి బాగా ఎక్కువ ఉండేది. ఇది చంద్రాబాబు మార్క్ పాలన కాదు అని చాలా మందికి అసంతృప్తి ఉండేది... చంద్రబాబు కూడా ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు... ప్రభుత్వ అధికారులకి ఏమి కావలి అంటే ఇది ఇస్తున్నారు... భారీగా జీతాలు పెరిగినా ఉద్యోగుల్లో అవినీతి మాత్రం తగ్గలేదు... చంద్రబాబు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, ఉద్యోగులు లెక్క చేయలేదు... దీంతో చంద్రబాబు దీని మీద ఫోకస్ చేశారు... ఎలా అయినా ఈ లంచాల అవినీతిని అరికట్టటానికి ప్రణాలికలు సిద్ధం చేశారు... దాదాపు యుద్ధం ప్రకటించారు.. సమర్థవంతుడైన అధికారిగా పేరున్న ఆర్పీ ఠాకూర్‌ను ఏసీబీ చీఫ్‌గా నియమించారు. దీంతో పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్న ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ ఏసీబీ అధికారులను ఉరుకులు పెట్టించారు.

acb 05052018

ఇప్పుడు తాజాగా, ఏకంగా ఒక ఐఏఎస్ కు చెక్ పెట్టాలని, ఏసీబీకు సీఎం ఆదేశించటం చూస్తుంటే, అవినీతి పై చంద్రబాబు ఎంత ఖటినంగా ఉన్నారో అర్ధమవుతుంది. గ్రూప్‌ వన్‌ అధికారిగా ప్రభుత్వోద్యోగంలో చేరారు. పదోన్నతి ద్వారా ఐఏఎస్‌ హోదాని పొందారు. పలు జిల్లాలలో కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. మొన్నటివరకూ ఎంతో కీలకమైన పౌరసరఫరాల శాఖలో పనిచేశారు. ఈ క్రమంలో ఆయన సాగించిన అవినీతి లీలలపై గట్టి ఆధారాలు ప్రభుత్వానికి అందాయి. దీంతో ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వకుండా సర్కారీ పెద్దలు ఆయనను వెయిటింగ్‌లో పెట్టారు. 2015 జూన్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ ఆయన ఏపీ పౌరసరఫరాల శాఖలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఆయన హయాంలో ఆ శాఖలో దాదాపు వేల కోట్ల రూపాయల కొనుగోళ్లు జరిగాయి. ప్రభుత్వం సేకరించే కందిపప్పు, పంచదార, బియ్యంతోపాటు సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "చంద్రన్న సంక్రాంతి కానుక'', "చంద్రన్న రంజాన్‌ తోఫా'', "చంద్రన్న క్రిస్మస్‌ కానుక''ల కోసం సదరు కొనుగోళ్లు చేశారు. వీటి కొనుగోళ్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శకి పలు ఫిర్యాదులు అందాయి. వీటిపై ఇంటెలిజెన్స్‌ విభాగం ద్వారా ప్రభుత్వం సమాచారం సేకరించింది. సదరు డైనోసార్‌గారు ఆయా పథకాల పేరు చెప్పి అందినకాడికి మింగేశారని వెల్లడైంది.

acb 05052018

ఎడాపెడా దోచేసిన ఈ డైనోసార్‌ సంగతి తెలుసుకున్న వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైంది. నిఘావర్గాలతో పూర్తి సమాచారం రప్పించుకుందట. మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌ అయ్యారట. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించేందుకు అనేక సాంకేతిక పద్ధతులను అమలులోకి తెస్తుంటే... మరోవైపు ఒక అధికారి ఈ స్థాయిలో అవినీతికి పాల్పడటం ఏమిటని ఆయన ఆగ్రహించారట. అంతేకాదు- సదరు అధికారి లీలలపై దర్యాప్తు చేయమని అవినీతి నిరోధకశాఖ అధికారులను సీఎం ఆదేశించారట. ఏసీబీకి కూడా తగిన ఆధారాలు సంపాదించదట. వారి విచారణలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయట. ఇక ముఖ్యమంత్రి ఆదేశమే తరువాయి.. ఏసీబీ అధికారులు ఎప్పుడైనా రంగంలోకి దిగి ఆయన కథ కంచికి చేరుస్తారని ప్రభుత్వ వ‌ర్గాలు అంటున్నాయి.

Advertisements

Latest Articles

Most Read