తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేక కేసుకు సంబంధించి, పరిణామాలు వేగంగా జరిగిపోతున్నాయి. సిబిఐ ఎంక్వయిరీ మొదలు పెట్టిన తరువాత, అనేక విషయాలు బయటకు పడ్డాయి. ఇప్పటి వరకు సిబిఐ , అయుదు మందిని సిబిఐ నిందితులుగా గుర్తించింది. అయితే ఇప్పుడు సాక్ష్యులు ఇచ్చిన సమాచారంతో, మొత్తం వేళ్ళు అన్నీ కూడా అవినాష్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి. దస్తగిరి అప్రూవర్ గా మారిన తరువాత, అనేక విషయాలు బయటకు వచ్చాయి. అందులో ప్రధానంగా వైఎస్ కుటుంబ సభ్యులు చెప్పిన విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అందరి స్టేట్మెంట్లలో ముగ్గిరి పేర్లు మాత్రం కామన్ గా ఉన్నాయి. వారే వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి. ప్రతి ఒక్కరూ వరుసగా ఇచిన ప్రతి స్టేట్మెంట్ లో, అవినాష్ రెడ్డి పేరు ఉంది. ఇక ఈ రోజు వైఎస్ వివేక కుమార్తె , సునీత సిబిఐకు ఇచ్చిన స్టేట్మెంట్ బయటకు వచ్చింది. ఇందులో జగన్ మోహన్ రెడ్డి, భారతి రెడ్డి వైఖరి పై కూడా ఆవిడ చెప్పిన విషయాలు సంచలనంగా మారాయి. ఆ రోజు జగన్ మాటలు ఆశ్చర్యానికి గురి చేసాయని, ఆమె తెలిపారు. ఒకానొక సందర్భంలో తన భర్త పైనే ఆరోపణలు చేసారని, ఆమె సిబిఐకి తెలిపింది. అలాగే భారతి రెడ్డి వైఖరి పై కూడా ఆమె సిబిఐకి తెలిపింది.

avinash 28022022 2

అవినాష్ రెడ్డి పేరు గురించి జగన్ చెప్తూ, సిబిఐ విచారణ కోరితే, జగన్ స్పందిస్తూ, అవినాష్ రెడ్డి పై సిబిఐ కేసు పెడితే ఏమి అవుతుంది, బీజేపీలో చేరతాడు, నా విషయానికి వస్తే, ఇప్పటికే 11 కేసులు ఉన్నాయి, ఇది 12వ కేసు అవుతుంది అంటూ, జగన్ స్పందించిన తీరు గురించి, సునీత చెప్పారు. ఇలా వైఎస్ సునీత ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తూ ఉండగా, ఇప్పుడు వైఎస్ సునీత, మరో సంచలనానికి తెర లేపారు. ఈ రోజు వైఎస్ సునీత, లోక్‍సభ స్పీకర్ ఓంబిర్లాకు ఒక లేఖ రాసారు. వివేక కేసులో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని, ఆమె స్పీకర్ కు తెలిపారు. వివేక కేసులో అవినాష్ రెడ్డి పాత్ర గురించి తేల్చాలి అంటూ, విచారణ చేయాలి అంటూ, స్పీకర్ కు సునితా రెడ్డి చెప్పారు. సిబిఐకి, సునీత ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఆ లేఖకు జత పరిచి, స్పీకర్ కు పంపించారు. అలాగే సిబిఐకి, వేరే నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ లను కూడా, ఆమె జత పరిచారు. మొత్తం మీద, త్వరలోనే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాసం కల్పిస్తుంది.

వైఎస్ వివేక కేసు ఎంత సంచలనం అయ్యిందో అందరికీ తెలిసిందే. సరిగ్గా ఎన్నికల ముందు, ఈ కేసు జగన్ మోహన్ రెడ్డి ఉపయోగ పడింది. ఏకంగా ఎన్నికల క్యంపైన్ మొత్తం దీని చుట్టూ తిప్పే ప్లాన్ చేసారు. మొత్తానికి ఇది చంద్రబాబు చేపించాడు అని చెప్పటంలో సక్సెస్ అయ్యారు. అయితే ఆ కుటుంబంలో, ఆ ప్రాంతంలో మాత్రం, అందరికీ జరిగిన విషయం మొత్తం తెలుసు. ఇప్పుడు సిబిఐ ఎంక్వయిరీ రావటం,మొత్తం విషయం బయట పడటంతో, ఒక్కో సంచలన విషయం బయట పడుతుంది. వైఎస్ సునీత సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ లో సంచలన విషయాలు బయట పడ్డాయి. మరీ ముఖ్యంగా జగన్ విషయం పై సునీత చెప్పిన వ్యాఖ్యలు, అందరినీ షాక్ కు గురి చేసాయి. సునీత సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ లోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. ఆ రోజు నాన్న చనిపోయాడని జగన్ మోహన్ రెడ్డికి,భారతికి ఫోన్ చేసాను, వాళ్ళు చాలా తేలికగా తీసుకుని, అవునా అంటూ చాలా సింపుల్ గా స్పందించటం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే తరువాత జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు నాకు ఆశ్చర్యానికి గురి చేసింది. సిబిఐ వికాహ్రణ అడిగితే, సిబిఐ విచారణ చేస్తే ఏమి అవుతుంది, అవినాష్ రెడ్డి బీజేపీలో చేరతాడు, నాకు 11 కేసులు కాస్త, 12 అవుతాయి, అంతకు మించి ఏమి అవుతుంది అంటూ జగన్ మాట్లాడారు.

sunitha 28022022 2

నాకు కొంత మంది మీద అనుమానం ఉందని, జగన్ కు చెప్తే, వాళ్ళని ఎందుకు అనుమానిస్తావ్, మీ భర్తే చంపించాడు ఏమో ఎవరికి తెలుసు అని జగన్ చెప్పాడు. అనుమానితుల జాబితాలో, భారతి రెడ్డి తండ్రి ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో పనిచేసే కాంపౌండర్‌ ఉదయ్‌కుమార్‌రెడ్డి పేరు చేర్చితే, జగన్ ఇంత ఎత్తున ఎగిరాడు. అతను మా తండ్రి చనిపోయిన రోజు సంబరాలు చేసుకోటానికి, బాణసంచా కొనుగోలు చేసాడని వార్తలు వస్తే, వాడిని ఎందుకు వెనకేసుకుని వచ్చాడో అర్ధం కాలేదు. మొదటి నుంచి భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డికి లోపల మా తండ్రి అంటే పడదు, బయటకు మాత్రం స్నేహం నటించేవారు. నా తండ్రి చావుని, జగన్ ఎన్నికల్లో వాడుకున్నారు. జగన్ సియం అయిన తరువాత, చంపింది ఎవరో కనుక్కుని శిక్ష వేయమని, జగన్, సజ్జల, సవాంగ్ దగ్గర ప్రాధేయపడ్డాడు. సజ్జల దగ్గర అనేక సార్లు సిబిఐ విచారణ కోసం పట్టుబడితే, అది జగన్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందని అన్నారు. గుండె పోటు అని సాక్షిలో కొన్ని గంటల పాటు నడపటం చూసి ఆశ్చర్య పోయాను.

ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయటంలో వైసీపీ దిట్ట. ఇప్పటికే అనేక ఫేక్ ఆరోపణలు చేసి, ఫేక్ పనులు చేసి, అడ్డంగా దొరికినా వైసీపీ బుద్ధి మాత్రం మారటం లేదు. ఈ ఫేక్ చేయటంలో, కళ్ళ ముందు ఉన్న ఉదాహరణ, వివేక ఘటన. చంద్రబాబు చేపించాడు అంటూ ఫుల్ పేజి వార్తలు రాసి ఎలా ప్రచారం చేసారో, ఇప్పుడు సిబిఐ విచారణలో ఎవరి పేర్లు బయటకు వస్తున్నాయో చూస్తున్నాం. ఇలా ఫేక్ చేయటానికి అలవాటు పడిన వైసీపీ, ఇప్పుడు యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్ లో తెలుగు వారి ఇబ్బందులను అడ్రెస్ చేస్తున్న చంద్రబాబు ప్రయత్నాన్ని కూడా ఫేక్ చేసేంత దిగజారి ప్రవర్తిస్తుంది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చంద్రబాబు రంగంలోకి దిగారు. అక్కడ చిక్కుకున్న తెలుగు వారితో మాట్లాడుతున్నారు. వారి సమస్యలు ఏమిటో అడిగి తెలుసుకుంటున్నారు. ఆ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకుని వచ్చి, వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అవసరమైన సహాయం, అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ వాళ్ళతో కలిసి చేస్తున్నారు. చేతనైన సహాయం చేస్తూ, తన వంతు పాత్ర పోహిస్తున్నారు. సహజంగా అధికారంలో ఉన్న జగన్ మొహన్ రెడ్డి ఏమి చేస్తున్నారు అనే ప్రశ్న వస్తుంది, దానికి ఏమి సమాధానం చెప్పాలో తెలియక వైసీపీ ఫేక్ చేయటం మొదలు పెట్టింది.

ukraine 27022022 2

చంద్రబాబు వీడియోలు, పది సెకండ్లు, 20 సెకండ్లు కట్ చేసి, అక్కడ విషయం ఏమిటో చెప్పకుండా, అసంబద్ధంగా ఉన్న చంద్రబాబు మాటలను ఫేక్ చేసారు. అక్కడి వారు, తమకు వేరే ప్రదేశానికి వెళ్ళటానికి ఇబ్బందిగా ఉందని, మధ్యంలో బ్రిడ్జిలు పేల్చేసారని, ఎలాగైనా సహాయం చేయాలని చంద్రబాబుని కోరారు. దీనికి చంద్రబాబు, గూగుల్ మ్యాప్స్ ద్వారా ఎన్ని పేల్చేసారో చూసి, దాని ప్రకారం, ఏ రూట్ లో వేళ్ళలో ప్లాన్ చేయాలని, వారికి సహాయం చేయాలని ఆదేశించారు. అయితే "గూగుల్ మ్యాప్స్ ద్వారా ఎన్ని పేల్చేసారో చూద్దాం" అనే మాటలు వరుకే కట్ చేసి, ఎన్ని బాంబులు పడ్డాయో చూద్దాం అని చంద్రబాబు చెప్పారు అంటూ, ఆయన్ను హేళన చేస్తూ, వైసీపీ ఫేక్ చేసింది. దీనికి తెలుగుదేశం పార్టీ పూర్తి వీడియో పెట్టి, చంద్రబాబు గారు మాట్లాడింది, బ్రిడ్జిలు ఎన్ని కూల్చారో అని అంటే, వైసీపీ ఇలా ఫేక్ చేస్తుందని, చివరకు యుద్ధం జరుగుతున్న సందర్భంలో కూడా, ఇలా ఫేక్ చేయటం ఏమిటి అంటూ, వైసీపీకి కౌంటర్ ఇచ్చింది టిడిపి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార దుర్వినియోగం అనేది ఈ మధ్య సర్వ సాధారణం అయిపోయింది. రూల్స్ అనేవి కేవలం ప్రతిపక్షాలకు మాత్రమే అని, అధికార పక్షం ఏమి చేసినా ఏమి ఉండదు అనే విధంగా వ్యవస్థలు పని చేస్తున్నాయి. మంత్రి అప్పలరాజు పోలీసులను నెట్టేసి, తిట్టినా కేసు ఉండదు, పార్ధసారధి గు* పగల గొడతా అని చెప్పినా కేసులు ఉండవు, ఇలా ఎన్నో సంఘటనలు. టిడిపి నేతలు కుయ్యి కయ్యి మంటే మాత్రం కేసులు, అరెస్టులు హంగామా. ఇది కేవలం అధికార పార్టీ నేతలే కాదు, కొంత మంది అధికారులు కూడా అత్యుత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇందులో మొదటి వరసులో ఉంటారు సిఐడి చీఫ్ సునీల్ కుమార్. ఆయన పైన ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేసాయి. సిఐడి అన్నిట్లో దూరటం, ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయటం, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్ట్ చేయటం, చివరకు సొంత పార్టీ ఎంపీ పైన థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించటం, ఇలా అనేక ఆరోపణలు సిఐడి చీఫ్ సునీల్ కుమార్ పైన ఉన్నాయి. దీనికి తోడు ఆయన క్రీస్టియన్ సంస్థతో చేస్తున్న పనుల పై కూడా, అనేక ఆరోపణలు, కేంద్రం ఎంక్వయిరీ చేయమని చెప్పటం, ఇలా అనేక ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సిఐడి చీఫ్ పై, సొంత మామ ఫిర్యాదు చేయటం వార్తల్లో అంశంగా మారింది.

sunil 27022022 2

వ్యక్తిగత కక్షకు కూడా ఆయన తన అధికారాన్ని ఉపయోగిస్తున్నారని, ఆయన పైన ఎంక్వయిరీ చేయాలి అంటూ, సిఐడి సునీల్ కుమార్ మామ, హైకోర్టులో ఫిర్యాదు చేసారు. తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని, కుటుంబ సభ్యుల పైన ఫేక్ కేసులు పెడుతూ ఇబ్బందులు పెడుతున్నారని, ఆయన పైన విజిలెన్స్ కానీ, సిబిఐ ఎంక్వయిరీ కానీ చేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. సునీల్ కుమార్ భార్య, ఆయన పైన గ్రుహ హింస కేసు పెట్టిందని, అప్పటి నుంచి సునీల్ కుమార్ తమను వేధిస్తున్నారు అంటూ ఆయన ఫిర్యాదు చేసారు. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ సోదరిని, సిఐడి చీఫ్ సునీల్ కుమార్ పెళ్లి చేసుకున్నారు. అయితే తరువాత గొడవలు రావటంతో, ఆమె సునీల్ కుమార్ పై కేసు పెట్టారు. అప్పటి నుంచి సునీల్ కుమార్, ఆ కుటుంబం పైన అక్రమ కేసు పెట్టటం, నోటీసులు ఇవ్వటం, అరెస్ట్ లు చేయటం వంటివి చేస్తున్నారని, తన అధికారాన్ని, వ్యక్తిగత కక్ష తీర్చుకోవటానికి, ఉపయోగిస్తూ ఇబ్బంది పెడుతున్నారు అంటూ, హైకోర్టులో ఫిర్యాదు చేసారు.

Advertisements

Latest Articles

Most Read