వైఎస్ వివేక కేసు ఎంత సంచలనం అయ్యిందో అందరికీ తెలిసిందే. సరిగ్గా ఎన్నికల ముందు, ఈ కేసు జగన్ మోహన్ రెడ్డి ఉపయోగ పడింది. ఏకంగా ఎన్నికల క్యంపైన్ మొత్తం దీని చుట్టూ తిప్పే ప్లాన్ చేసారు. మొత్తానికి ఇది చంద్రబాబు చేపించాడు అని చెప్పటంలో సక్సెస్ అయ్యారు. అయితే ఆ కుటుంబంలో, ఆ ప్రాంతంలో మాత్రం, అందరికీ జరిగిన విషయం మొత్తం తెలుసు. ఇప్పుడు సిబిఐ ఎంక్వయిరీ రావటం,మొత్తం విషయం బయట పడటంతో, ఒక్కో సంచలన విషయం బయట పడుతుంది. వైఎస్ సునీత సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ లో సంచలన విషయాలు బయట పడ్డాయి. మరీ ముఖ్యంగా జగన్ విషయం పై సునీత చెప్పిన వ్యాఖ్యలు, అందరినీ షాక్ కు గురి చేసాయి. సునీత సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ లోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. ఆ రోజు నాన్న చనిపోయాడని జగన్ మోహన్ రెడ్డికి,భారతికి ఫోన్ చేసాను, వాళ్ళు చాలా తేలికగా తీసుకుని, అవునా అంటూ చాలా సింపుల్ గా స్పందించటం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే తరువాత జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు నాకు ఆశ్చర్యానికి గురి చేసింది. సిబిఐ వికాహ్రణ అడిగితే, సిబిఐ విచారణ చేస్తే ఏమి అవుతుంది, అవినాష్ రెడ్డి బీజేపీలో చేరతాడు, నాకు 11 కేసులు కాస్త, 12 అవుతాయి, అంతకు మించి ఏమి అవుతుంది అంటూ జగన్ మాట్లాడారు.
నాకు కొంత మంది మీద అనుమానం ఉందని, జగన్ కు చెప్తే, వాళ్ళని ఎందుకు అనుమానిస్తావ్, మీ భర్తే చంపించాడు ఏమో ఎవరికి తెలుసు అని జగన్ చెప్పాడు. అనుమానితుల జాబితాలో, భారతి రెడ్డి తండ్రి ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో పనిచేసే కాంపౌండర్ ఉదయ్‌కుమార్‌రెడ్డి పేరు చేర్చితే, జగన్ ఇంత ఎత్తున ఎగిరాడు. అతను మా తండ్రి చనిపోయిన రోజు సంబరాలు చేసుకోటానికి, బాణసంచా కొనుగోలు చేసాడని వార్తలు వస్తే, వాడిని ఎందుకు వెనకేసుకుని వచ్చాడో అర్ధం కాలేదు. మొదటి నుంచి భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డికి లోపల మా తండ్రి అంటే పడదు, బయటకు మాత్రం స్నేహం నటించేవారు. నా తండ్రి చావుని, జగన్ ఎన్నికల్లో వాడుకున్నారు. జగన్ సియం అయిన తరువాత, చంపింది ఎవరో కనుక్కుని శిక్ష వేయమని, జగన్, సజ్జల, సవాంగ్ దగ్గర ప్రాధేయపడ్డాడు. సజ్జల దగ్గర అనేక సార్లు సిబిఐ విచారణ కోసం పట్టుబడితే, అది జగన్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందని అన్నారు. గుండె పోటు అని సాక్షిలో కొన్ని గంటల పాటు నడపటం చూసి ఆశ్చర్య పోయాను.